Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, July 28, 2014

భ్రమ - తెలుగు నాటిక

భ్రమ - తెలుగు నాటిక 


ఉదయం పది అయ్యింది, కాలేజ్ లేదు. ఏదో బంద్. శరత్ ఫేస్ బుక్ లో కూచుని లైక్ లు కొడుతున్నాడు. కంప్యుటర్ లో పాటలు పెట్టి వింటూనే తన ఫేవరేట్ హీరో బొమ్మ లోడ్ చేస్తున్నాడు. చదువుకుంటున్నాడు గానీ ఇంగ్లిష్ లో గానీ తెలుగులో గానీ ఎ భాషలోనీ రాయలేడు, చదవడం విషయానికి వస్తే, క్లాస్స్ సబ్జెక్ట్స్ అదీ పరీక్షల ముందు తప్ప ఎప్పుడు చదవడు. లోకజ్ఞానం లేదు, అది వాడికీ తెలుసు, తల్లిదండ్రులకీ తెలుసు. సబ్జెక్ట్ నాలెజ్ విషయానికొస్తే ఎగ్జామ్స్ లో మార్కులోస్తాయి. తెలుగు సినెమా  పాటలు విని పులకరించిపోతాడు. "పెదవే  పలికిన మాటల్లోన   తీయని  మాటే  అమ్మ" ఈమాటలు  వింటున్నప్పుడు  అమ్మ అనే  మాటపై మనకే  పేటెంట్ హక్కులు ఉన్నట్లు, అమ్మ  మనం  సాధించిన వింత, కనిపెట్టిన విశేషం లా అనిపిస్తుంది. ఇంతలో వేణు వచ్చాడు.
శరత్ : రారా మావా మద్యానం మూవీకి వెళదామా?
వేణు : వద్దురా మొన్నేచూసాం కదరా!
శరత్ : పర్లేదురా మా ఫేవరేట్ హీరో సినీమా ఎన్ని సార్లు చూసినా తక్కువే!
వేణు : కానీ నేను ఒక్క సారి కంటే ఎక్కువ చూడలేను, అబ్బ ఇందాకటినించి అదే పాట .. కొంచెం ఆపరా.
శరత్ : అమ్మ అంటే ఏమనుకున్నావురా, ఉండు అమ్మ గురించి ఒక పోస్ట్ పెడదాము. ఇలా వచ్చి కూచో.
చూడరా నేను ఏమి టైప్ చేస్తున్నానో అమ్మ అనే రెండు అక్షరాలు రాసేను  అంతే చుట్టూ చీమలు.” పోస్ట్ చేసాడు.
వేణు :  ఇది టూ మచ్ రా.
శరత్ : అదేరా మన గొప్పతనం. అమ్మ అనే పదానికి అర్ధం తెలుసా ఇంగ్లిష్ వాడికి. మనవిరా ప్రేమలంటే తల్లిబిడ్డ అనుబంధం తెలుగుతెర మీదే చూడాలిరా!
వేణు : అవునురా,ఇప్పుడు ఫేస్ బుక్ లోకి కూడా ప్రాకుతున్నాది, అది సరే గానీ టేబుల్ మీద ఉన్న పేపర్ చూసావా?
శరత్ : తెలుసురా బడిపిల్లల బస్ ని రైల్ గుద్దేసింది అంతేకదా!
వేణు : అది కాదురా ఇక్కడ ఈ కిందన చూడు " ఆడపిల్లని చెత్త కుప్పలో పారేసిన తల్లి."
ఆ పక్కన చూడు " తల్లిని గొంతునులిమి చంపిన కొడుకు" ఇప్పుడు చెప్పరా.
శరత్ : అంటే ఏదో ఒక్క వార్త పట్టుకొని..
వేణు : ఒక్క వార్తే రా రోజుకి ఒక్కటే, వారానికి ఏడు సార్లే చూస్తున్నాం ఇలాంటి వార్తలు. 
తల్లిబిడ్డ అనుబంధం తెర  ఉంటె సరిపోదు రా, నిజ జీవితంలో ఉండాలి.
ఎవరో పోస్ట్ "ఇద్దరికీ మాత్రమె సరిపోయే భోజనం ఉండి మూడో వ్యక్తి వస్తే నాకు ఆకలిగా లేదు అనే వ్యక్తే అమ్మ"
శరత్ : చూసావా. లైక్ ల వర్షం. తనుకూడా లైక్ కొట్టేడు.
ఇదేమి శాడిజం రా? హోటల్ కి వెళ్లి ఏదైనా తెస్తే  అందరూ తినొచ్చు , లేకపోతే వంటచేసి అందరూ తినవచ్చు.  అమ్మను పస్తు ఉంచాల్సిన అవసరం ఏముంది?
శరత్ : అది కాదురా! అమ్మ త్యాగాల పుట్ట.
వేణు : ఏం ఆత్యాగం ఇంకెవరూ చేయకూడదా అమ్మే చేయాలా?
శరత్ : అమ్మ సెంటిమెంట్నిమనం కాదనలేము కదా. అందుకే అమ్మని అంత  గౌరవిస్తున్నాము. 
అంత మంచి కల్చర్ రా!
అవునురా, దేవుడిని , తండ్రిని గురువుని జోకేర్లలాగా చూబిస్తే మాత్రం  తప్పేముంది.
ఇంతలో  ఉదయ్ వచ్చాడు. " ఎంటిరా మాట్లాడుకుంటున్నారా? పోట్లాడు కుంటున్నారా?
శరత్ :  అమ్మ అనేమాట సృష్టిలోనే అత్యంతతీయనైనది. 
సృష్టి అంత అమ్మలోంచే వచ్చింది. 
అమ్మను మించిన దైవములెదు.
ఉదయ్ : అన్నీ దైవమెరా, తండ్రి, గురువు, చదువు అన్నీ దైవమెరా. ఇంతకీ విషయం ఏమిటి?
శరత్ :  అమ్మని చాలా హైలైట్ చేస్త్రారు సినిమా వాళ్ళు అది వీడికి టూ మచ్ గా కనిపిస్తోంది. 
అమ్మగురించి ఒక పంచ్ డైలాగ్ పోస్ట్ చేసాను అదీ కూడా వీడికి నచ్చలేదు.
ఉదయ్ :  సినిమాలో స్త్రీలని గౌరవించే హీరో కి నిజంగా స్త్రీల పట్ల ఎంత  గౌరవం ఉన్నదిసంస్కృతి సంప్రదాయాల  పట్ల  ఎంత గౌరవం ఉంది? ఉంటె అర్ధనగ్న ఉన్న స్త్రీలతో విదేశాల్లో రోడ్లమీద చిన్డులేస్తాడా? చెవికి పోగులు పెట్టుకుని జుట్టుకి యెర్ర రంగు వేసుకుని, భారతీయ సంగీతాన్ని బ్రస్టు పట్టిస్తూ, తెలుగు పదాలని విరిచేస్తూ, ఇంగ్లిష్ లా  పలుకుతూ, తెలుగువాణిని ఇంగ్లీష్ బాణీ గా చేసి డాన్సు చేస్తాడాఏ దేశ మేగిన ఎందుకాలిడినా .. అని అన్న కవి మాటలు గుర్తులేవా ?
శరత్ :   అలా అన్నడా? ఎవరాకవి ?
ఉదయ్ : సినిమాలు తగ్గించి కాస్త పుస్తకాలు చదువు.

No comments:

Post a Comment