Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, July 30, 2014

రూపాయి డాలర్ వాగ్వివాదం

రూ: నాది భారత్

డా: హ హ్హ హ్హ.

రూ : ఇండియా అంటావ్, కానీ నా భాష నాకుంది. నా కల్చర్ నాకుంది.

డా: హ హ్హ హ్హ. నీదీ నాదీ ఒకే కల్చర్

 అదే మనీ కల్చర్. అన్నింటా ఆధిక్యం నాదే.

రూ: అందుకుంటా నిన్ను త్వరలో.

డా:  నన్ను అందు కుంటావా! నా  మొకాల్లైనా దాటేవా?

 నన్నందు కోవాలంటే అరవై  రెట్లు పెరగాలి, నాలా పెరగాలి

యుద్ద విమానాలు, రాకెట్లు, శాటిలైట్లు సంతరించుకోవాలి, కంప్యూటర్లు తో పని చేసుకోవాలి,

మొబైల్స్ తో ఆడుకోవాలి, నీ సంగీతం చెరిపేయాలి

నీ పద్దతులను వెనక్కి నెట్టి నాపద్దతులను నెత్తిపై పెట్టి

నీ యువతను నడిపించాలి, వారంతా నాలాకనిపించాలి

వేషం, భాష, ఆట పాట అంతా ఒకటే లక్ష్యం నావైపే నీ పయనం...

రూ: స్వయం సమృద్ధి సాధిస్తాం, విజయం సాధిస్తాం

డా: హ హ్హ హ్హ.  ఎలా? నీయువకులు శక్తి యుక్తులు నాకే ధారబోస్తారు.

రూ: యువతను మళ్ళిస్తా, విజయం సాధిస్తా

యువత: రాక్, షేక్ , బ్రేక్ ..

రూ: మన నాట్యం మన సంగీతం  మరిచారా!

యువత: షిట్, షిట్, షిట్.

రూ: మన భాషను, మన పద్దుతులు పాటించండి.

యువత: షిట్, షిట్, షిట్.

రూ: కనీసం నా ఇంట్లో ఉండండి.

యువత:  నీ పేద ఇంట్లో మేము ఉండం. మేము పోతున్నాం  టాటా.. చీరియో.. బై బై

రూ: బై బై , ఛీ ఛీ నేను కూడా మారిపోతున్నానేమిటి!


No comments:

Post a Comment