Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, June 13, 2019

మంగళగిరి సింగదొర -పాట- పూలబాల

ప్రభవిల్లు నీ ప్రభలు గన  వత్తురు  జలజల ప్రవహిం చి ప్రజలు  నిత్యము సింగదొర నరసింగదొర
నూఱారు వెతలు నిర్వేదింతురు ఫ్రణమిల్లి  అరనర సురవర సింగదొర నరసింగదొర.
వెలిపొలమున  ఆరప  నెక్కి ఇల తలమును, వియత్తలము నొక్క తీరు నరయు
పెను త్రాత కు కరతలములు జోడించి స్వరమును రెట్టించి పలికెద జే జే లు  నీకు  సింగదొర నరసింగదొర














మాపతి, శ్రీపతి ,శ్రీహరి సింగదొర నరసింగదొర పేరేదైనను నిరతిన జేరి నారు ధరజనులు
అధిపతి, దళపతి  మంగళాచలపతి, తోతాద్రి శిఖరాదిపతి,  పేరేదైనను నిరతిన గొలిచినారు జనులు
భవదూర వీక్షణ సింగదొర నరసింగదొర నీ కరుణా వీక్షణము భవమోక్షణము సింగదొర నరసింగదొర

ముగ్గురు  స్వాములు కొలువైన క్షేత్రం   తోతాద్రి ప్రాచీన ధామం మంగళ గిరి ప్రస్తుత  నామం
లక్కిమి మిక్కిలి శ్రీ హరి కొరకై తలచిన తలము మంగళాచలము ఇది మంగళ నిలయం

శిఖరాగ్రాన 'గండాల స్వామీ ' కొండ మధ్యలో నిండైన స్వామి , పానకాల నరసింహ స్వామి' దిగువ సన్నిధిన  పాండవాగ్రజ ధర్మజ ప్రతిష్ట, ద్రఢిష్ఠ  లక్ష్మీనరసింహ స్వామి, నీ  ఉత్తుంగ గోపురము  తలపించు ధరణీధరము 
ద్వాపర నుండి కలియుగము వరకు ఈ చరితము కడు చారుతరము.

స్ధంభోధ్బవ, నీ చూపే బ్రహ్మోత్సవం, పాల్గుణశుధ్ధ ఫౌర్ణమి రోజు కళ్యాణోత్సవం ,దివ్యరధోత్సవం, బ్రహ్మోత్సవం !!

2 comments: