ముంబయ్ : జుహుబీచ్ స్టార్ ప్లాజా. సమయము ఉదయము 9. 00 గంటలు
రోహిత్ : ఆషా ! ఎన్ని సార్లు చెప్పాలే మేడంకి సోడా తెమ్మని
ఆషా : ఎన్ని సార్లు చెప్పేవు, ఒక్కసారే కదా చెప్పేవు, టిఫిన్లు రెడీ చెయ్యద్దా? మళ్లి గెస్టులు వస్తే అన్నీ రెడీగాఉండాలని అరుస్తావు. ఒసేయ్ అంటున్నావేంటి, మాటలు తిన్నగా రాని!
రోహిత్ : నోరు బాగానే లేస్తోందే ! నిన్ను ఇంకా ఆడదానివని జాలి తలచి ఉండనిచ్చాను ఆ మాగ్బూల్ గాడిని పంపించి నప్పుడే నిన్ను కూడా పంపించి వలసింది.
సోడా ఇచ్చి వస్తూ ఆషా : వంటకి నీకు సులభంగా మరొకత్తి దొరకలేదు అందుకు ఉంచేవు, నామీద జాలితో కాదు. నీ కాకలి తప్ప జాలెక్కడుంది?
రోహిత్ : కరక్ట్ గా కేచ్ చేసేవే. మరి అదిగూడ తీర్చేయవే, నీ జీతం పెంచేలాచేస్తాను
ఆషా : థు ! దరిద్రుడా రోహిత్ : ఏయ్
ఆషా: ఒరేయ్ రోహిత్ నీకు పుణ్యముంటాది లకుమమ్మని నాశనం చేయకురా.
ఉదయాన్నే పెట్టించేసేవు దుకాణం. నేను పెట్టించడమేంటి నాన్సెన్స్, మొన్న బోటిల్ లేటయితే నన్నే కొట్టింది, అప్పటి నుంచి ఫుల్ బొట్టిల్స్ ఇంటి నిండా పెడుతున్నాను. అయినా ఎప్పటికప్పుడు నీచేతులో ఎంతో కొంత పెడుతోంది కదా ఇంకా ఎందుకే ఏడుస్తావు ? క్రెడిట్ కార్డు నాకే ఇచ్చేసింది. గోకడం , స్టాక్ తేడం , మేడం గొంతు తడపడం.
ఆషా: గొంతు తడపడం కాదు గొంతు కొయ్యడం , నువ్వు ఆ కాశ్యప్ కలిసి ముంచేస్తున్నారు. తనకి సినిమాలు వచ్చినా రాకపోయినా మనకి అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తోంది. ఆమె ఆమె బాగు కోరాలి కదా మనం. ఈలోపున కొత్తగా పని లో చేరిన అబ్బాయి వచ్చాడు.
ఆషా: రా రా చిన్న రాజా ఏంటి ఇంత ఆలీసం?
చి. రా : బస్సు దొరకలేదక్కా!
రోహిత్: బస్సు దొరకక పోతే టేక్సీ కట్టించుకు రావలసింది, రాస్కెల్ ఇంకొకసారి ఆలస్యంగా వస్తే జీతం కత్తిరిస్తాను. (ఆశా కిసుక్కున నవ్వింది.) తెలుసే నువ్వెందుకు నవ్వేవో. నేను జీతం కత్తిరించినా మేడం ఒప్పుకోదు, అన్నీ తెలిసి నప్పుడు తిన్నగా టైంకి వచ్చి తెగలడండి. పైగా వీడిని చిన్న రాజా అని పిలవాలట. చిన్న అని పిలిస్తే సరిపోదట.
చి. రా : నాపేరు చిన్నరాజా కొప్పం పూర్తి పేరుతో పిలవలేనన్నారు సరే. కనీసం చిన్నరాజా అనైనా పిలవండి. రోహిత్ : నీయబ్బ చిన్నాయే నీకెక్కువరా. లకుమ "రోహిత్ , రోహిత్ శుభే శుభే క్యా జగడా హో రహా హాయ్ ముఝే శాంతీ ఛాహీయే శాంతీ!" రోహిత్ "హాఁ మేడం మై లాతా హుమ్"
" మేడం కి శాంతి కావాలంటే తెస్తున్నాను అని వెళుతున్నాడు " చి.రా ఆషా నవ్వుకొనిరి
రోహిత్ కశ్యప్ వచ్చుచుండగా చూసి “ఇంకే శాంతి! వీడొచ్చాడంటే బుర్ర తినేస్తాడు!”
***
కశ్యప్: మార్నింగ్ బేబీ. లకుమ: ఏంటి ఇలా వచ్చావు?
కశ్యప్: హైదరాబాదులో ఉండేటప్పుడు నేను ఎక్కడికైనా వెళితే ఎప్పుడొస్తావు అని అడిగేదానివి ఇప్పుడు “ఏంటి ఇలా వచ్చావు” అంటున్నావు. "అది హైద్రాబాద్ ఇది ముంబయ్ , అయినా నేను ముంబై వచ్చినప్పటినుంచి మనం కలిసి ఉండటం లేదు కదా నీకు తీరికున్నపుడు వస్తున్నావు." "ఆ పండిత్ గాడు నిన్ను బాగా ట్రైన్ చేసాడు."
"విషయం ఏంటో చెప్పు" “కన్నా ప్రొడక్షన్స్ కొత్త ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు. అందులో కొత్త పిట్ట కోసం చూస్తున్నారు.” “అయితే,” “నువ్వు ఆరోల్ చేస్తే బాగుంటాదని” నీకు ఖన్నా ప్రొడక్షన్స్కి సమ్మందం ఏంటి? నువ్వు అందులో డైరెక్టరా, అసిస్టెంట్ డైరెక్టరా? కనీసం మేనేజర్ వి కూడా కాదు.
నాది పూరి జగన్నాద్, రాజమౌళి రేంజ్ తెలుగులో పెద్ద డైరెక్టర్ని నన్ను మేనేజర్ తో పోలుస్తావా?
లకుమ: థౌజండ్ వర్డ్స్ ను “అత్తారింటికి దారేది” గా, సహారా ను “కలేజా” గా, రైజ్ ను “జులాయి” గా వన్స్ అపానే టైం ఇన్ మెక్సికో ను “అతడు” గా టెన్ థింగ్స్ ఐ హెట్ అబౌట్ యు ను “నువ్వే నువ్వే” గా తీసిన రాజ మౌళి ప్రతిభ ను నువ్వే చాటవలె. ఇంక పూరి జగన్నాద్ అన్నచో.. పవనుడి భజజతో పైకొచ్చినాడు. అతడి గురించా నాకు చెప్పుచున్నావు మొన్ననే అతడు ఆంగ్ల చిత్రము ఐ బాయ్ ని కాపీ చేసి దొరికినాడు.
కశ్యప్: నీకు తెలుగులో అవకాశములు అడుగంటినవి అది తెలుసుకొనుము.
లకుమ: నాకంటే ముందే నీకు అడుగంటినివి, నీవొక పరాన్నజీవివి, నాకవకాశములు లేకున్ననూ ఎన్నడూ ఇతరుల పై ఆదారపడి జీవించలేదు. నీ కాలం ముగిసి చాలా కాలమయినది , పోవోయీ బడాయి, అది నీవు డైరెక్టరు అనునది నాటి మాట. తెలుగు చిత్ర పరిశ్రమ నందు నీకంటే అద్భుత చిత్రములు తెరకెక్కించి కీర్తి కెక్కిన మేటి దర్శకులు నేడెందరో కలరు. వారెవ్వరూ నిన్ను చూచుటకైననూ ఇష్టపడరు. నీవు దర్శకుడివా నన్ను తార్చి బ్రతుకు కుంటెనకాడివా?
కశ్యప్: ఆ పండిట్ గాడు నిన్ను చెడ దొబ్బేడు? నీ భాషనీ చెడ దొబ్బేడు , షిట్ షిట్ ఏంటీ తెలుగు?
లకుమ: పండిత్ ను పల్లెత్తు మాటన్నచో సహించునది లేదు. అపురూప గుణ నిధి అతడు. నౌ గెట్ అవుట్ విత్ యువర్ షిట్ అండ్ నెవర్ షో యువర్ పేస్ అగైన్.
***
నీలఖంటుడు విషమును గొంతులో నిలిపినట్టు మీనాక్షి దుఃఖమును కడుపులో దాచుకొని పియానో వద్ద కూర్చొని ఫిలిం స్కోర్ వ్రాయుచుండెను. పక్కనే అనేక సంగీత పరికరములు కలవు వాటిమధ్య ఆర్కెస్ట్రేటరు కూర్చొని యు న్నారు . పక్క గదిలో సోఫాలో నిద్రించు చున్నయమునకు ప్రఫుల్ల ఫోన్ చేయుటతో మెలుకువ వచ్చెను. అమ్మా ఒంటి గంట దాటినది. నేడు రెండు విడతలు ( సెషన్స్ ) రికార్డింగు చేసిన పిమ్మట విమానాశ్రయమునకు పోవుటతో ఎంత అలసినావు, ... యమున మీనాక్షిని సమీపించెను. ఇంకనూ నీవెందుకు మేలుకొని యుంటివి ఇంటికి పొమ్మని చెప్పిన వినవు కదా , ఇట్లు స్టూడియో లో దేకుచున్న నీ ఆరోగ్యమేమగును. అని వ్రాయుచున్న పెన్సిల్ , స్టాఫ్ ( అడ్డగా గీతలు కొట్టిన కాగితము ) ను పక్కన పడవేసి యమునను పక్క గదిలోకి తీసుకుపోయి , ఈ సారి లేచి వచ్చినచో చూడుము అని గద్దించి మరల పియానో వద్దకు పోయెను.
యమున సోఫా పై పడుకొని ఫోను కంపించిన ప్రతి సారి నిలిపి వేయుచున్నది, మూడు సార్లు కంపించిన పిదప చరవాణి నిలిచి పోయెను. రాఘవుని తలచినచో మగవారి పై అసహ్యము కలుగును , ప్రఫుల్లను తలచినచో ఏవగింపు కలుగును అగస్త్యను తల చినచో మీనాక్షి గుర్తుకు వచ్చుటచే మెదడు స్తంభించును. ఏ భావము కలుగునో చెప్పుట కష్టము. అతడిని. ఛీ అనుటకు నోరు రాకున్నది. తల్లి మంచితనము తనయుని కాపాడు చున్నది. పురుషుల చేయి తాకినా చిద్రమానసమందు రుధిర మోడుచున్నది. పెద్దామె అమ్మ పనిచేయుచుండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును అని మరల తలుపు వద్దకు పోయి, కొద్దిగా తలుపు తీసి తొంగి చూచెను. మీనాక్షి ఫిలిం స్టూడియోలో ఆర్కెస్ట్రేటర్ తో కలసి ఇంకనూ పనిచేయుచున్నది
ఆర్కెస్ట్రేటర్ సీతారాం : సంగీతకారులున్న ఇంకనూ బాగుండెడిది
మీనాక్షి : ఈ సమయమందు మీరుండుటయే గొప్ప , సంగీతకారులను రేపు పది గంటలకు రప్పించెదము. రేపు రెండు సెషన్స్ చేయవలెను. కో ఆర్డినేటర్ కి చెప్పిన అతడు సంగీత కారులను చూసుకొనును .
సీతారాం : ఇంకనూ పెన్సిల్ తో స్టాఫ్ పై వ్రాయుచున్నారు మీరు డిజిటల్ కంపోజి షన్ సాఫ్ట్వేర్ వాడినచో మరింత సులభముగా పని చేయగలరు
అతడట్లు ముగించిన కొద్దీ సేపటికి మీనాక్షి " ఫిలిం స్కోర్ రచన అంతయూ పూర్తి అయినది, ఫిలిం డైరెక్టర్ గారు ఇచ్చిన టెంప్ ట్రాక్స్ , కూడా ఫిలిం స్కోర్ రచన లో జతపరిచినాను.”
స్పాటింగ్ ఈ సాయకాలమే చేసి, ఈ రాత్రి మూడు గంటల వ్యవధిలో స్కోర్ పూర్తి చేయుటా!!! అని అతడు అచ్చట మూర్ఛగిల్లెను. కొలది సేపటికి తేరుకొని “అమ్మ సెలవు రేపు కలుసు కొందుము” అనుచూ బయలు దేరెను.
యమున పిల్లివలె వచ్చి మీనాక్షి పక్కనే నిలిచి ఫ్లాస్క్ నందు తేనీరు గ్లాసులో పోసి మీనాక్షి కిచ్చెను. మీనాక్షి యమునను కోప్పడ ప్రయత్నించిననూ కోపము రాకుండెను అది చూచి యమునా నవ్వేను , మీనాక్షి కూడా నవ్వెను. ఇద్దరూ తేనీరు త్రాగుచుండిరి
అమ్మా స్వరకర్తకు ఫిలిం స్కోర్ వ్రాయుటకు పట్టు సమయము ఎంత?
రెండు వారాలు నుండి మూడు నెలల దాకా సమయము పట్టును.
నీవు మూడు గంటల్లో ఫిలిం స్కోర్ వ్రాసినచో గిన్నిస్ నందు ఎక్కించవలెను అని అరిచెను.
ఉష్ మెల్లగా , అట్లు అరచిన అమర్యాదగా యుండును. అని అ నుచున్న మీనాక్షి
హఠాత్తుగా ఆగిపోయెను , యమున కి విషయము అర్ధమయినది " ఈమెకు అగస్త్యుడు గుర్తుకువచ్చిన మరల మనసు చెడును " అని తలచి స్కోర్ కాగితములు తన చేతిలోకి తీసుకొనెను. “అమ్మ ఈ సంకేతములకు అర్ధమేమి , వీటినెట్లు అర్ధము చేసుకొనవలెను?” ఈ ఐదు గీతాల కాగితమును స్టాఫ్ అందురు వీటి మధ్య నాలుగు ఖాళీలు కలవు. ట్రెబల్ క్లెఫ్ , బాస్ క్లెఫ్ అని రెండు ముఖ్యమైన క్లెఫ్ లు కలవు, పియానో , కీ బోర్డు , సెక్సా ఫోన్ , వైలన్ , ఫ్లూట్ వంటి అన్ని ఎక్కువ పిచ్చ్ గల పరికరములు కు సంకేతములను ఇచ్చట వ్రాయుదురు. ఈ లైన్ల మధ్య ఖాళీలకు పేర్లు కలవు అవి ఈ జీ బీ డీ ఎఫ్. స్పేస్( లైన్ల మధ్య ఖాళీ )సూచించుటకు ఈ ఖాళీలలో పేస్ FACE అను అక్షరములు వాడవలెను.
పావు నోటు, అర నోటు పూర్తి నోటు నో ట్ వాల్యూస్ సిగ్నేచర్. మీనాక్షి అట్లు చెప్పుకు పోవు చుండ గా మీనాక్షి నిత్యమూ చూచు మీనాక్షి వలే కాక కొత్తగా కనిపించెను. కొలది సమయము తరువాత “అమ్మ ఇంటికి పోయెదము చాలకు ని పిలవనా ?”
మీనాక్షి “విమానాశ్రయము నుండి వచ్చుచూ మననిచ్చట వదిలి అతడింటికి పోయినాడు, అతడిని ఇప్పుడు పిలిచి ఇబ్బంది పెట్టుట పాపము. నా కింకనూ సౌండ్ ట్రాక్ స్వర కల్పన పని కలదు.” అనె ను. “ఇప్పుడే కదా పూర్తయినదని చెప్పితివి!” అని యమున తెల్ల బోయెను.
“పూర్తి అయినది ఫిలిం స్కోర్ మాత్రమే, పూర్తి చేయవలసినది ఫిలిం సౌండ్ ట్రాక్ అనగా పాటలకు సంగీతము. ఈ రాత్రి నాకు శివరాత్రే” అనుచున్న మీనాక్షిని యమున గుండెలకు హత్తుకొనెను. “నిత్యమూ నీ ఇంట నుండుటచే ఒక అసాధారణ సంగీతరాణి వన్న విషయము మరిచి ప్రవ ర్తించు చుందును. రోజుకొక సినిమా సంగీతము కూర్చుట అనిన అబ్బురమే. ఇట్టి సంఘటనలు నీ స్తాయిని స్ఫురణకు తెచ్చును. నీ ఇంట ఉండుట ఎంత అదృష్టముమో కదా !
“ఇంటనుండుటయా , చంక నెక్కి ! ముందు చంక దిగుము.”
“ఊహు .. నాకు ఇప్పుడిప్పుడే చిత్ర సంగీతము పై అవగాహనా కలుగు చున్నది. నాకు కూడా నీ అడుగు జాడలలో నడవవలెనని కోరిక కలుగుచున్నది. మొదట సంగీతకారిణి అవ్వవలెనని హాస్య మునకు అన్న మాటలే నేడు బలమైన కోరికగా రూపుదిద్దుకొనుచున్నవి. నాకు సంగీత ము నేర్పుటకు వప్పుకొన్నచో చంక దిగెదను.”
ఎవరైనా గురువుని ఇట్లు… అని మీనాక్షి అనుచుండగానే యమునా ఆమె కౌగిలి వీడి కాళ్లకు నమ స్కరించెను. మీ నాక్షి ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తు కొని " నీ స్థానమిచ్చట " అనెను. “ఇట్లు చిటికలో సంగీతము సమకూర్చుచున్నయెడల బాలీవుడ్ ఏమి హాలీ వుడ్ కూడా నిన్ను వీడదు”
నీ నమ్మకము దర్శక నిర్మాతలకు కలిగిన నాడు ఇంతకంటే వేగముగా సంగీతము (ఫిల్మ్ స్కోర్) సమకూరును. ఇంత కంటే వేగముగానా? యమునకు అయోమయముగా నున్నది.
మీనాక్షి పెదవులు విచ్చినవి, పిచ్చిపిల్ల అను మాటలు వినిపించినవి. పియానో వద్ద కూర్చొన్న మీనాక్షి వేళ్ళు పియానో మెట్లపై నర్తించుచుండెను " అభం శుభం తెలియని పిచ్చి పిల్ల .. అది చెరువులో ఈదుతున్న చేపపిల్ల అను స్వరాలు పలికించుచుండగా యమున ఆమె ప్రక్కన మరొ క చిన్న బల్లపై కూర్చొని ఆమె మెత్తని భుజముపై చుబుకమునుంచి చెంపకు చెంప నానించి ఆస్వరములందు కరుగు చుండగా
మీనాక్షి “స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క E.T. ఎక్స్ట్రా-టెరెస్ట్రియల్, జాన్ విలియమ్స్ సంగీతానికి సరిపోయేలా సవరించబడింది. స్పీల్బర్గ్ విలియమ్స్కు సంగీతంతో పూర్తి స్వేచ్ఛను ఇచ్చెను. చిత్రం లేకనే క్యూ ను రికార్డ్ చేయమని కోరాడు; సంగీతానికి సరిపోయేలా స్పీల్బర్గ్ ఆ సన్నివేశాన్ని తిరిగి సవరించెను.
నిజమా సంగీతమును బట్టి చిత్రమును కత్తిరించుటా నమ్మలేకున్నాను!
“నమ్మలేని నిజాలే అద్భుతాలు”
“రేపు కేరళ పోవుటకు వీలు లేకుండుటచే ఎల్లుండి వచ్చుచున్నానని నా గొంతుపై కూర్చొన్నమళయాళ మాంత్రికునకు తెలుపుము” ఇద్దరూ చాలా సేపు నవ్వుకొనిరి. పిదప యమునా నిద్రలోకి జారుట , మీనాక్షి పాటలకు స్వరములల్లుట తో తెల్లవారినది.
నీ బతుకు బల్లిపాడులో తెల్లారిపోతాదే. నా పార్వతిని ఎత్తుకెళ్ళి నా పెళ్లి చెడగొడతావే. ఈ రాత్రంతా నీకు శివ రాత్రే.
అన్నవెనక్కి చూడకున్న రోడ్డు చూసి నడుపన్నా. విశాఖపట్నంలో నే పనిపూర్తి చేద్దామంటే వినకుండా ఈ మారుతీ వేన్ లో అంతదూరం తీసికెళుతున్నావ్.
ఓరి పిచ్చివాడా! లాడ్జీలు క్షేమము కాదు, నేడు ఆధాకార్డులు , ఫోటోలు కూడా అడుగు చున్నారు, మనకెంతమాత్రమూ కుదరదు. పిల్ల అందము చూచినా నోరూరుచున్నచో వేనులోనే పని కానిమ్ము .
వద్దన్నా దీని కాళ్లకు చేతులకు కట్లు నోటిలో గుడ్డ ఉన్నంతవరకే మనకు క్షేమము , విప్పినచో ఏమగునో మరచితివా?
ఆమ్మో! గుర్తు కు వచ్చిన వణుకు పుట్టుచున్నది, ఇద్దరిపై పడి తుని లో ఎట్లు కొట్టిన్దిరా. దీన్నిఏట్లో మరల బంధించి తిమి. మన వారు నలుగురు ఉండగా, బల్లిపాడునందే దీని పని పట్టవలెను.
దీనికి కొంచము నోట్లో విష్కీ పోసినచో మేలు కదా , అట్లే చేసెదము కానీ బల్లిపాడు పోయిన తరువాత మాత్రమే. మార్గ మధ్యమున దీనిని తాకుట క్షేమము కాదు.
Nearly 100 people are reading each episode but only one is responding. This is the height of jealousy. I am thinking of sending the further episodes to the mail ids of the readers who want to read. Those who want to read.
ReplyDeleteఅరుణ తార ఇద్దరు బిడ్డలు ఇబ్బంది లోనే ఉన్నారు.వారెట్లు బయటపడెదరు?.
ReplyDeleteThese stories has all the instruments. They are Mind for thinking, heart for feelings and pen for writings.
ReplyDeleteThe stories have all the instruments.... Thank you for your response please keep giving your feedback
Delete