Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, January 24, 2021

Bharatavarsha 118

ముంబాయ్ అంధేరి వెస్ట్ వర్మ నివాసం : వర్మ తలుపు తీసి లకుమను చూసి “కమాన్ బేబీ కూర్చో” అని సోఫాలో కూర్చోబెట్టి ,“నీకీ మోడన్ డ్రెస్సులు బాగా నప్పుతాయి,  బికినిలో  ఇంకా బాగుంటావు ,  కమాన్ ఒక స్మాల్ పుచ్చుకో! 

లకుమ "ఇంత ఉదయాన్నే..." "ఏ ఉదయం తాగకూడదా ?! నాకు ఆ పట్టింపులేవీలేవు ఉదయానే పూజ , తీర్థం" 



  

పూజ చేస్తారా మీరు! అని లకుమ నమ్మ లేనట్టు చూడగానే వర్మ కిసుక్కున నవ్వి మహిమా అని పిలిచాడు పడక గది లోంచి ఓ పాతికేళ్ల చిన్నది చిన్న దుస్తులలో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో అతడి ప్రక్కన కూర్చుంటుం డగా వర్మ ఆమెను తన ఒళ్ళో కి లాక్కొని ముద్దాడుతూ లకుమ పెదాలను చూపుటి వేలితో తాకాడు " పూజ చేసిం ది దీనితోనే " అని వెకిలిగా నవ్వాడు. “సరే నేను మళ్ళీవస్తాను ఇది సరైన సమయం కాదనుకుంటాను”  

అదేంటి రాక రాక వచ్చి వెళ్లి పోతానంటావేంటి, నువ్వెప్పుడొచ్చినా నేను ఇలాగే ఉంటాను

ఈలోగా టీవీ వాళ్ళు వచ్చారు ఛాయా గ్రాహకుడు అతడి సహాయకుడు, ఒక జర్నలిస్ట్. 

 జర్నలిస్ట్ “ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అనుకున్నాం కదా సార్ ఇంటికి రమ్మన్నారు” 

వర్మ “గుర్తుంది , ఎందుకు కంగారు పడుతున్నారు!” 

జర్నలిస్ట్ “ఏంలేదు సార్ , మీరు ప్రయివేట్ గా ఉన్నారు కదా, కాస్సేపు పైన వైట్ చేస్తాము” 

వర్మ “ఇదే నా పర్సనల్ లైఫ్  అభ్యంతరము లేక పొతే నువ్వు షూట్ చేసుకోవచ్చు” , మహిమ " నన్ను కెమెరాలో చూపవద్దు” అని కెమెరా వెనుకకు పోయికూర్చొనెను. 

లకుమా, మహిమ చిన్న దుస్తులతో ఉన్నది కాబట్టి మహిమ కెమెరా వెనుకకు పోయింది, నీకు ఆ అవసరం లేదు , నువ్వు నా కొత్త హీరోయిన్ అని పరిచయం చేస్తాను, కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకొని , వియార్ రెడీ అన్నాడు. 

ఛాయాగ్రాహకుడు కెమెరా ప్రారంభించాడు జర్నలిస్ట్ మైక్ పట్టుకుని " తెలుగు చిత్ర రంగంలో పెను మలుపు, సెక్స్  వైలెన్స్ల కలగలుపు;   శవం , పంతం, పిశాచం, నీ పెళ్ళాన్నిలేపేయ్.  వంటి  సంచలన చిత్రాల  దర్శకుడు వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పక తప్పదు , ఈ రోజు వర్మ గారి లైఫ్ కెరీర్ కొత్తసినిమాలు గురించి మాట్లాడుకుందాం,  నమస్తే వర్మగారు సినిమాపిచ్చి ఛానల్ కి స్వాగతం 

మీ సినిమాపిచ్చి ఛానల్ నాకు పేరు బాగా నచ్చింది, మొన్న ఎవరో మదపిచ్చి ఛానల్ అని వచ్చారు  అది  కూడా బాగా నచ్చింది . ఎందువలన అన్న   ఆంధ్రప్రదేశ్ ని కమ్ముకొని కుమ్ముచున్నవి  ఈ రెండు పిచ్చి లే!  

థాంక్ యూ, మీ డైలీ రొటీన్  ఏంటి? ఎన్ని గంటలకు లేస్తారు ? అంటే లేవగానే ఏంచేస్తారు? 

లేవడానికి ఒక  టైమేమీ ఉండదు. పడుకోడం బట్టి ఉంటుంది . 

సరే ఎన్ని  గంటలకు పడుకుంటారు, అది పక్క న ఉండే అమ్మాయిని బట్టి ఉంటుంది. 

మరీ ఇంత  ఓపెన్ గా చెప్తారని అనుకోలేదు. ఇంతకీ లేవగానే ఏంచేస్తారు ?

ఒక బ్లు ఫిలిం చూస్తాను. “ఈ రోజు కూడా చూసారా?” 

ఇంకా లేదు, ఇప్పుడే లేచాను, నాకు లేచింది , ఇప్పుడు నాకొకర్తి కావాలి 

ఛాయా గ్రాహకుడు టీవీరిపోర్టర్  ఖంగు తిన్నారు. లకుమ అతడి పక్కనుంచి లేచిపోయింది “ఏంటిదంతా!” ఆవేశంగా అరిచింది. “టెన్షన్ పడకండి మేడమ్ ఇది లైవ్ కాదుకదా ఎడిట్ చేసేయవచ్చు. "నో డిలీట్ చేయండి నేను కూడా ఇంటర్వ్యూ లో ఉండను." అని  వెనక్కి పోయి కూర్చుంది” కానీ ఇంటర్వ్యూ అదే విధంగా  కొనసాగింది. 

చెప్పండి వర్మగారు ఎప్పుడూ కొత్త హీరోయిన్స్ను పరిచయం చేస్తుంటారు కదా, లకుమగారితో కొత్తచిత్రం తీస్తు న్నారా?  వర్మ మాట్లాడలేదు లకుమవైపే చూస్తున్నాడు.ప్లాన్  చేస్తున్నాము, చూడాలి.  అన్నాడు ఎట్టకేలకు నవ్వుతూ

లకుమ గారిని సినిమా పిచ్చి ఛానల్ ప్రేక్షకులు కొత్త హీరోయిన్ అనుకోవచ్చా!

ముందే నేననుకోవాలికదా అన్నాడు వర్మ " మీరేమనుకుంటున్నారు అన్నాడు జర్నలిస్ట్

కొత్త గర్ల్ ఫ్రెండ్  -  అను కుంటున్నాను. ఇలాగే తెంపరి తనంతో అసభ్యంగా మాట్లాడుతూ వర్మ సమాధానాలు ఇస్తు న్నాడు. ఇంటర్వ్యూ అరగంట కొనసాగిన తరువాత ముగిసే సమయానికి “పోర్నోగ్రఫీ చూడడం మంచిది కాదని అంటారు పోర్నోగ్రఫీ మీద మీ అభిప్రాయం?” అని అడిగాడు జర్నలిస్ట్   

పోర్నోగ్రఫీ యువతీ యువకు లందరికీ నిత్య జీవితంలో భాగంకావాలి. పోర్న్ స్టార్ అనే వృత్తిని మనం గౌరవించగలగాలి. నేటి తరం అమ్మాయిలు ఫోర్నస్టార్స్ అవ్వాలని లక్ష్యం ఏర్పరుచుకుంటారు.

హీరోయిన్ గా ఈ మధ్యనే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి గ్యాప్ వచ్చి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న  లకుమ గారికి మంచి బ్రేక్ రావాలని, ఆంధ్ర ప్రేక్షకులు వర్మగార్ని మదపిచ్చి , సినిమాపిచ్చిని (చానెల్స్) మరింత ఆదరించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్  
                                             ***
ముంబయ్ జుహు బీచ్ స్టార్ ప్లాజా: లకుమ పడక గది తలుపు మూసి ఉంది. గదిలోంచి జాజ్ సంగీతం వినవస్తోంది.  లకుమ చిన్న మినీ వేసుకొని పైన చిన్న టాప్ వేసుకొని నాట్యం చేస్తున్నది. రోహిత్ తలుపు కొట్టాడు సమాధానం లేకపోవుటచే  తలుపు తెరచి లోదుస్తుల్లో ఉన్న లకుమను చూసి గుటకలు వేసెను . లకుమ పక్కన మంచం మీద ఉన్న తువ్వాలు కప్పుకొని "మానెర్లెస్ ఫెల్లో తలుపు తీసేవరకు ఆగలేవా  అని విరుచుకు పడెను  " రోహిత్ వెంటనే గదిబైటకు వెళ్లి మొఖం చాటేసెను . లకుమ మొహం మాత్రం బైట పెట్టి, క్యా హై ? క్యా చాహియే? అని అడిగెను . “చాయ్ వాయ్ కుచ్” అని రోహిత్ అంటుండగానే “ఆగలే ఐసా నహి హోనాచాహీయే” దబ్ మని రోహిత్ ముఖంమీద తలుపు మూసుకొన్నది .
పండిట్ పక్కనే కనిపించగానే రోహిత్ మొహం ఎర్రబారేను. పండిట్ జి ఆప్ సీదా అందర్  చలీయేనా ఇద్దరు క్యోన్ ఇంతిజార్ కరతే హో అంటున్న రోహిత్ మనసు గ్రహించిన పండిట్ ఐసా భర్తమీజీ మై కభీ నహీ కారూన్గా   అని పండిట్ లకుమ బెడ్ రూమ్ తలుపు దగ్గర ఆగి తలుపు కొట్టి    "నిన్న ఒక ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ గారిని కలిసాను, మీ అభ్యాసం పూర్తి చేసుకొన్న పిదప మాట్లాడవలెను. నేను బయట వేచియుందును. పండిట్ గొంతు వినగానే తలుపు తెరుచుకొనెను. చెయ్యి పట్టి పండిట్ ని లోపలికి లాగెను.

పరుపు పై   కూర్చోండ బెట్టి నా నాట్యము ఎట్లున్నది  అనిలకుమ అడుగగా ,  నాట్యము గూర్చి   నేను అంత బాగా చెప్పజాలను కానీ మీరు వర్మ కలిసినారని అర్థమైనది , నేను నిన్నరాజశ్రీ ప్రొడక్షన్స్ డైరెక్టర్ గారినిని కలిసాను. రాజశ్రీ అనగా కళా చిత్రములు నిర్మించు సంస్థ , ప్రపంచ ప్రఖ్యాతి కెక్కిన తారాచంద్ బారజాత్య కదూ? అని లకుమ అడుగగా నిజమే కానీ ఆయన కాలము చేయుటచే ఆ సంస్థను అతడి మనవడు సూరజ్ చూచుచున్నారు. ఆయన అధ్యక్షుడే కాక , రచయితా  మరియు సంస్థ అధిపతి కూడా. అతడు తీయబోవు చిత్రమందు హీరోయిన్ చెల్లి పాత్ర మీకు ఇవ్వవలెనని చూచుచున్నాడు, వర్మవంటి వాడు కాదు. వర్మకు అతడికి హస్తి మశకాంతరము కలదు. “ఈ చెల్లి పాత్రలు నేను చేయజాలను, అయిననూ నేను వర్మను కలసినట్లు నీకెట్లు తెలియును?” పండిట్ మందహాసము చేసెను.
లకుమ: అమానుషముగా అవమానకరముగా  నున్న అతని ప్రవర్తనా సరళి మరియు అచ్చట జరిగిన దంతయూ చెప్పిన పిదప  "ఒక గొప్ప దర్శకుడు అట్లుండునని చెప్పినచో ఎవ్వరూ నమ్మ జాలరు."  

అతడు గొప్పదర్శకుడని ఎవరు చెప్పినారు ఒక కొకారి, అనాకారి.  యూట్యూబ్ వీడియోలతో చెండాలమును విక్రయించు వ్యర్ధ జీవి,  అతడు ఇప్పుడు అసలు దర్శకుడేకాదు, మానసిక రోగి.  ఒక్కరోజులోనే అతడి వీడియోలు లక్షలాది మంది చూచుచున్నంత కాలము అతడి సంపాదనకు డోకా లేదు.  ప్రజల వెర్రితనంతో ఆడుకొనుట అతడికి వెన్నతో పెట్టిన విద్య.  అతడు తీయు చెత్త సినిమాలు ప్రజలు చూచుట ఎన్నడో మానివేసినారు, వరుస నష్టములు చవి చూచిననూ తన నక్క జిత్తులతో ప్రజలను రెచ్చగొట్టి  చెత్త చిత్రములకు కూడా ఉచిత ప్రచారముచు  కల్పిం  కొనును.   తీసిన కథలే అటూ ఇటూ తీయుచూ.అడిగినచో ఏదో చిన్నతత్వ మీమాంస ల న డ్డుపెట్టుకొని తప్పించుకొను చుండును. గట్టిగా అడిగినచో చూచినచో చూడవలెను లేకున్నచో లేదు నేనూ నా నిర్మాతా చల్లగా ఉండగా మధ్యలో మీకేల బాధ అని ఎదురు  దిగును. 

మీరు నమ్మని నిజమేమనగా ఆడవారి శరీరము కొరకు మాత్రమే చిత్ర రంగమందు న్నవారిలో ప్రముఖులు   సంజయ్ భాయ్, వినోద్, వర్మ.  మీరు ఆ వర్మ చిత్రమందు చేయుటకు వీలు లేదు, “కానీ నేను ఒప్పందములపై సంతకం చేసి చెక్కు కూడా తీసు కొంటిని మాట ఇచ్చి వెనుకకు పోవుట వల్లని పని, వర్మ చిత్రములలో చేసిన మంచి భవిష్యత్ ఉండునని అనేకులు చెప్పినారు, కానీ వామ్ప్ రోల్ ఇచ్చుటచే నామనసుకు కూడా కష్టముగా నున్నది. మిమల్ని అటువంటి పాత్రలలో చూడలేను. "ఆ పాత్ర చేయవలదు  వర్మ చిత్రములలో వామప్ రోల్ అనినా దిగజారుటే."
పండిట్ చెంప చెళ్లు మనెను.  పండిట్మౌనముగా నిష్క్రమించెను.

4 comments:

  1. Please read 116. 117 again also read and enjoy this episode, then give me your review, thanks

    ReplyDelete
  2. 116 వ భాగంలో ఒకే సారి మూడు దృశ్యాలను వర్ణించారు.లకుమ గృహములో దృశ్యం, మీనాక్షి గృహములో దృశ్యం, గౌడ సోదరుల చేతిలో చిక్కుకున్న సుందరి.116, 118 భాగాల్లో లకుమ సినీ జీవితాన్ని, సినిమా ప్రపంచ
    వాస్తవాలను, వ్యక్తులు మనస్తత్వాలను, ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు చూపించారు. 118 వ భాగం సంస్కృతంతో మొదలు పెట్టటం అద్భుత ప్రయోగం.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. లకుమ జీవితం కడకు ఏమాతుంది ? సుందరి ఎలా బైట పడుతుంది? మీనాక్షి బ్రతిమాలితే సుందరి పెళ్లికి ఎప్పు వప్పు కుంటుందా? నందిని విదిషవర్షలది త్రికోణ ప్రేమా? అది ఎలా ముగుస్తుంది?ఇంకా అనేక ప్రశ్నలకు అందమైన సమాధానాలు దొరికే వరకూ తీపి అనుభవాలతో మధుర గానాలను వింటూ పాత్రలతో బంధాలను నెమరవేసుకుంటూ ముందుకి సాగండి

    ReplyDelete