టాటా ఇండికా టాక్సీ ఇండియా గేట్ వద్ద నున్న నార్త్ అవెన్యూ లో ప్రవేశించెను. " అయ్యయ్యో ఈ డొక్కు టేక్సీ దొరికెనే ! " అని కృష్ణన్ మూఁల్గెను. టేక్సీ అరుణతార భవనము ముందు ఆగెను . అది చూచి , "హమ్మయ్య వచ్చి చేరినాము " అని మీనాక్షి సంబరపడెను. మీనాక్షి దిగి గేటువద్దనున్న రక్షక సిబ్బందిని "మంత్రి గారున్నారా అని అడిగెను?" వారు అరుణతారగారు ఇచ్చట లేరని, కేంద్రమంత్రుల కు నివాసములు వేరే కలవని అచ్చటకు పోయిన కలవవచ్చునని చెప్పి ఆమె ఎహ్ ఆర్ డీ మినిష్టర్ అని భావించి తప్పు చిరునామా ఇచ్చినారు. అందువలన సఫ్దర్గంజ్ మార్గమం దున్న మానవ వనరుల శాఖా మంత్రి భవనమునకు పోయినారు. తప్పు తెలుసుకొన్న మీనాక్షి చరవాణి యందు తారతో మాటలాడుటకు ప్రయత్నించుచుండగా కలువకుండుటచే కంగారు పడుచుండెను. యమున గ్రామీణభివృద్దిశాఖా మంత్రి అని అంతర్జాలమందు ప్రయత్నించగా 3 కృష్ణ మీనన్ మార్గమని చిరునామా దొరికెను. టేక్సీ వెనుకకు మళ్లెను.
ఇప్పుడు మనము ఎచ్చటకు పోవుచున్నాము అని కృష్ణన్ అడుగగా, యమున " సెన్సార్ బోర్డు చైర్మన్ " ఇంటికి పోవుచున్నాము. అని చెప్పగా మీనాక్షి " మీకు భవిష్యత్ లో ఎంతో అవసరముండును కదా ఒక సారి కలిసినచో మీ భవిష్యత్ మారి పోవును ." అని చెప్పగా కృష్ణన్ కి రోమాంచితముఁయ్యెను. ఆనంద భాష్పములు రాలు చుండ "నాకొరకు ఎంత శ్రమ తీసుకొనుచున్నావు మీనా! అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని "ఇక ఈ దర్శకునికి నీవే మార్గ దర్శకునివి" అని ఆ చేతిపై ముద్దులు పెట్టుచుండెను.
ఎయిమ్స్ ఆసుపత్రి , సఫ్ దర్ గంజ్ విమానాశ్రయము , లో డి గార్డెన్ , ప్రధానమంత్రి నివాస ప్రదేశమైన, లోక్ కళ్యాణ్ మార్గమును దాటుకొని పోవుచుండగా కృష్ణన్ కు అద్భుత సృజనాత్మక భావనలు మేలుకొనుచుండెను. "ప్రపంచము బిత్తరపోవు దర్శకత్వము స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు కనీ విని ఎరుగని నూతన చిత్రములను ఆవిష్కరించి చూపెదను. " అని ఆవేశపూరితముగా అనుచుండగా యమున " అన్నంతపనీ చేతురెమో అట్లు చేసిన మీరు దర్శకుడే కాక దార్శనికుడు అని కూడా అందురు. " అనెను. మీనాక్షి చరవాణిలో అరుణకొరకు ప్రయత్నించుచుండెను, కానీ ఫలితము లేకుండెను. వాహనము గాంధీ స్మృ తి దాటి కృష్ణ మీనన్ మార్గ్ నందు ప్రవేశించి మూడు సంఖ్య గల భవనము ముందు ఆగెను.
ఒక డజను మంది పోలీసులు బారికేడ్లు వద్ద కాపలా కాయుచున్నారు. మీనాక్షికి చరవాణి కలువకున్నది. పోలీసులు ఎంత వేడిననూ లోపలి పోనీయకున్నారు. చేయునది లేక పరిస్థితిని ఒక అధికారికి వివరించెను. అతడు " గ్రామీణ అభివృద్ధి, భూవనరుల శాఖ సెక్రటరీలతో , రహదార్లు , వ్యవసాయము , సాంకేతిక శాఖల ఉన్నత సిబ్బంది తో జాతీయ కార్యాచరణ పై సమావేశము జరుగుచున్నది. మీరు వేచి యుండక తప్పదు అని చెప్పగా మీనాక్షికి దుఃఖము ముంచుకొచ్చెను. వర్షుడు ఇచ్చిన పాత చిరునామా పట్టుకొని కృష్ణన్ ను వెంట పెట్టుకొని వచ్చి నందుకు తనను తాను నిందించుకొనెను. యమున టేక్సీకి డబ్బిచ్చి పంపుచుండగా కృష్ణన్ "అరుణతార, గ్రామీణశాఖా మాత్యులు" అను నామఫలకమును చూచి ఖంగు తినెను. టేక్సీ వెడలెను. మీనాక్షి రహదారిపై మిగిలెను.
రహదారిపై నిలచిన మీనాక్షి "దైవమే దిక్కని భావించి మనసులో ప్రార్ధించుచుండెను." కృష్ణన్ వడివడిగా అడుగులు వేయుచూ మందికి సాగుచుండెను.అరుణతార మెరుపువలె గేటువద్ద ప్రత్యక్షమయ్యెను. పోలీసుబారికేడ్లు దాటుకొని పరుగు పరుగున వచ్చుచుండగా, ఉన్నత స్థాయి అధికారులు ఆమె వెంట రక్షక కవచమువలె వెంట పడుచుండిరి. అందిరినీ కనుసైగతో వెనుకకు పంపించిననూ నల్లదుస్తులు ధరించి ఆయుధములు ధరించిన పఠాలము మాత్రము వెనుదిరగక ఆమె చుట్టూ యుండిరి. మీనాక్షి కళ్ళు వర్షించుచుండెను. ఆమెకు అరుణతార ఆకాశము నుండి ఊడిపడ్డ ఉల్కవలె తోచెను. అరుణతార మీనాక్షి యమునల చేతులను రెండు చేతులతో పట్టుకొని, ముందుకి సాగుతున్న వ్యక్తిని తేరిపార చూచుచుండ , కనుసైగ చేయకున్ననూ , కమాండోస్ పరుగు పరుగున పోయి కృష్ణను అటకాయించిరి. కృష్ణన్ వెనుతిరిగి చూచెను, అరుణతార బిత్తర పోయెను.
యమున పరుగు పరుగున పోయి మామయ్యగారు రండి అని చేతిని పట్టి లాగుచుండెను.
"అది మినిస్టర్ అయిన నీకు గొప్ప కావచ్చు నాకు వరుగునదేమియునూ లేదు" అని అనుచుండగా అక్కడ ఒక తెలుగు అధికారి " ఏమది ?" అని గద్దించుటతో స్వరము మార్చి "చూడమ్మా మినిస్టర్ గారి వద్దకు వద్దకు తీసుకుపోవుచున్నట్టుగా నాకు చెప్పలేదు, నేను పోవుచున్నాను" అని అనుచుండగా మీనాక్షి తారతో "నాశక్తి అంతయూ ఉడిగిపోయినది నీవు స్వీకరింతునన్న బహుమతి ఇదిగో !" అని (మీనాక్షి) అక్కడే కూలబడెను. అరుణ తార పోయి కృష్ణన్ చేతిని అందుకొనెను.
యమున మదిలోఅవ్యక్త మధురరాగమెదో ఉదయించి వెచ్చని ప్రవాహమై మేనంతయూ మేఘమై అలుముకొనెను. పలురాగములు పలికించుస్వరాణి నేడు నిశ్శబ్ద రాగమును పలికించుచున్నది, అది ప్రేమ వర్షమై కురియుచుండ యమున కనులముందు నిలచిన మీనాక్షి క్రక్రమముగా పెరుగుచూ మేరు పర్వతపరిమాణము చేరుకొనగాయమున ఆ పర్వతము ముందు యమున పిపీలకము వలె అనుభూతిచెందుచూ " ప్రేమతో నిండారు రాగము రాగము...నిస్వార్థ నిర్యాణమున జనియించు వెలుగు వెలుగు. నిండు మనసుతో జీవించు జీవి జీవి." అని తలంచుచూ దేవతామూర్తివలే వెలుగుచున్న మీనాక్షిని చేష్టలుడిగి చూచుచుండెను.
***
మీనాక్షి కళ్ళు తెరచి చూడగా మెత్తటి పరుపు పై శీతల వాయువులు తాకుచుండ. మీనాక్షి చుట్టూ కలియజూసెను . అరుణ తార పళ్ల రసము అందించుచూ " ఇప్పుడెట్లున్నది ?" అని అడిగెను , మీనాక్షి ఎదో చెప్పబోవుచుండగా అరుణ "గతవారం నుండి విశ్రాంతి మరచి నీవు పడుశ్రమంతయూ నాకు తెలిసినది " అనగా మీనాక్షి యమున వైపు కృతజ్ఞగా చూసేను. " “సమావేశము ముగిసెనా ? బావగారు ఎక్కడ ?" అని అడిగెను.
" అవన్నీ ఇప్పుడెందుకు విశ్రాన్తి తీసుకొనుము " అని అరుణతార అనగా మీనాక్షి మొఖంలో యాతన స్పష్టముగా కనిపించెను. "ఆయన వెళ్లి పోయినాడా ?" అని భాదాతప్త హృదయముతో అడుగు చుండగా " ప్రక్కగదిలో నున్నారు " అని తార బదులు పలికెను .
ఇంతలో ప్రక్కగది తలుపు తెరుచుకొనెను. కృష్ణన్ ప్రవేశించెను . "భర్త అంటే గౌరవం లేని వ్యక్తి , నా పని మీద నమ్మకం లేని వ్యక్తి , కన్నకూతురిని గాలికొదిలేసిన వ్యక్తి ఈ రోజు పదవిలో ఉందని తన ముందు చేతులు కట్టుకొని నిలబడనా? ఇలా చూడు మీనా , ఆ యాం సారీ మీనాక్షిగారు మీకు మాట ఇచ్చినందుకు కాదు మీరు పడ్డ శ్రమ కి విలువ ఇచ్చి లోపలి వచ్చాను !" అని మీనాక్షి తో ఉద్విగ్నముగా బ్రద్దలగుచున్న కృష్ణన్ ని చూసి మీనాక్షి మందహాసము చేసెను.
యమున " భర్త అంటే గౌరవం లేదని రంకెలు వేయుచున్నావే , గౌరవముండబట్టే నీ చేతినందుకొని లోపలకి తీసుకొ చ్చెను, మీనాక్షి అమ్మ శ్రమకి విలువ ఇచ్చి తాను ఇప్పుడు కూడా మాట్లాడక మౌనముగా నున్నది , మాట్లాడుట చేతకాక అనుకొనుచున్నావా ? కూతురిని గాలికొదిలేసినదని ఆక్షేపించువాడవు నీవా? కూతురి గురించి నాకు అన్ని విషయములు చెప్పినది. అన్ని ఏర్పాట్లు చేయుచూ నీడవలె ఆమెను అనుసరించుచున్నది. ఏమి మగవాడి వయ్యా! పెళ్ళాము మనసు అర్ధము చేసుకోలేని వాడివి ప్రేక్షకుల మనసు అర్ధము చేసుకొని చిత్రములు నిర్మించ బయలు దేరు చున్నావు. నీలాటి భర్తలవల్లే భార్యలు జీవత్సవముల వలే బ్రతుకుచున్నారు, వయసొచ్చినది ఎందుకూ! " అని ఉతికి ఆరేసిన పిదప ప్రక్క గదిలోకి పోయి తలుపు వేసుకొనెను.
మీనాక్షి అయ్యో యమున అనుచూ తలుపు దగ్గరకు పోయెను, తార తలుపు తట్టగా స్పందన లేకుండెను. కృష్ణన్ "అమ్మ యమునా నీకొక నిజము తెలపవలెను తలుపు తియ్యమ్మా" అని పిలవగా తలుపు తెరుచుకొనెను. తప్పు నాదేయని ఎప్పుడో తెలిసిననూ, అరుణను చూడవలెనని అనిపించిననూ , ప్రేమను తెలపవలెనని అనిపించిననూ , అహంకారము వలే కనిపించు సిగ్గుతో నా అంతట నేను అరుణను కలవలేకపోతిని. మీరు ఇరువురూ మా సఖ్యత కొరకు సిగ్గు విడిచి, ఎంత పరితపించి మమ్మల్ని ఒకటి జేసినారు. అని మీనాక్షికి తప్పులు క్షమించమని నమ స్కరించెను .
నాకించ్చిన మాట నిలబెట్టుకుని దంపతులు ఇరువురు నేనిచ్చిన బహుమతులు శ్వీకరించుట చాలా ఆనందముగా యున్నది అరుణ చేతిని వీడనని నాకు మాట ఇవ్వవలెనని కృష్ణన్ ని మీనాక్షి అడుగుచుండగా యమున "అత్తయ్య చేయి పట్టుకున్నప్పుడు మామయ్యగారి కళ్ళలో మెరుపు చూసినాను. అత్తయ్య అందము చూచి మామయ్యగారు అప్పుడే పడిపోయినారు. నిజము ఒప్పుకొనవలెనని ఉడికించసాగెను. కొంత సేపు తప్పించు కొనుటకు చూసిననూ, మొఖమునందు సిగ్గు స్పష్టముగా కనిపించుటతో తప్పించుకొనుట కుదిరినది కాదు. మీనాక్షి "ఏది బావగారి చేతిని ఎట్లు గ్రహించితివి ? నేను చూడనే లేదు మరొకసారి పాణిగ్రహణము చేయమని మీనాక్షి కోరగా ,యమున పొరగా తార భర్త చేతిని మరల అందుకొనెను. అతడు తారను రెప్పవేయక చూచుచుండ తార సిగ్గు పడు చుండెను. అతడు మెల్లగా దరిచేరి ఆమెను ఘాడ పరిష్వంగమందు ముంచెత్తెను. ఇచ్చట మనముండరాదనుచు యమున మీనాక్షి ని పక్క గదిలోనికి కొనిపోయెను.
ప్రతీ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు రాస్తున్నారు.
ReplyDelete119 లో యమున ప్రమాదాన్ని నిరోధించే సంఘటన చదివాక ఎలా అనిపించింది ? 120 వ భాగం చదువుతున్నప్ప్పుడు యమున పై మీకు ఎటువంటి భావాలు కలిగాయి? మీనాక్షి పై ఎటువంటి భావాలు కలిగాయి ?
Deleteఅరుణ తారను ఆమె భర్తను కలపడానికి మీనాక్షి పడ్డ తపన
ReplyDeleteఆచూకి దొరక్క పడ్డ ప్రయాస ఆసక్తిగా ఉంది.యమున మీనాక్షికి కడుపున పుట్టని బిడ్డ.మీనాక్షి, యమునా ఇద్దరిదీ నయానో, భయానో ఇతరులకు సహాయం చేసే గుణమే.