Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, April 23, 2021

మహాకవి

ముందుమాట

జ్ఞానశూన్యత పై తిరుగుబాటు నా ప్రతిఘాత విప్లవం అందుకే ఈ ముందుమాట చాలా ముఖ్యమైనది. నాలెజ్ రేవలూషన్ నిజమైన మార్పుని తేగలదు. ఎన్నో యుద్దాలు గెలిచినా కొన్ని దేశాలు ఇప్పటికీ వేల సంవత్సరాలనుంచి కొట్టుకుంటూనే ఉన్నాయి. ఎవడినో తంతే మార్పు రాదు. ప్రజలు జ్ఞానం ద్వారా మారాలి అనేదే నా కాన్సెప్ట్. రాక్షసులు రాజకీయాల్లో కంటే రోడ్ల మీదే ఎక్కువుంటారు.

విప్లవమంటే మనుషులను మేల్కొల్పడం రెచ్చగొట్టడం కాదు. మనుషుల కళ్ళు తెరిపించే జ్ఞానం. నలుగురు నక్సలైట్లకు ఊతమిచ్చే కేకలు , పెట్టుబడిదారులకు పెట్టే మంటలు కాదు. విప్లవం అంటే బాహ్యంగా చెలరేగే మంటలు కాదు. అంతరంగంలో చెలరేగే మంటలు. పాత కాలం తుప్పు పట్టిన విప్లవానికి కాలం చెల్లింది. అందుకే నేను ప్రతిఘాత విప్లవం అనే పేరుతొ వ్రాసాను. " ఏది విప్లవం?" లో ఈ విషయం స్పష్టంగా వ్రాసాను.


నేను 23 రోజులల్లో 40 కవితలు రాసాను. 2021 ఏప్రిల్ 23న మొదలుపెట్టి మే16 నపూర్తి చేసాను.

1. నేను 

నిశిరాత్రి నేస్తాన్ని భృంగారి గీతాన్ని
నైస్పృహ్య వనవహ్ని రిపుఘాతినీ
భవభూతి  గీతాన్ని చక్రవాతాన్ని 
అనిల ప్రతాపాన్ని  త్రేతాగ్ని రూపాన్ని 
చండ  ప్రచండాన్నిడమరుకా నాదాన్ని  
త్రిపురారి ఫాలనేత్రాన్ని  వేద తురాగాన్ని
కల్కి ఖడ్గాన్ని పరమాణు అస్త్రాన్ని 
నేనే బహుభాషా విశ్వరూపాన్ని 
నాపదాలు  ప్రళయ పర్జన్య నస్వనాలు 
నాపద్యాలు విఘటిత ఝట విఘన ఘన విన్యాసాలు 
నా భావ  ఉత్సేక  ప్రాగ్భావాలు అభబ్బాగమన  ప్రేరకాలు
నా గీతాలు  నిర్నిద్ర  రుద్ర  విప్లవ  రావాలు

2. నువ్వు

 

నీలి నింగి నిప్పు కురుస్తుందని 
మేఘాలు పెళ పెళ లాడే దాకా తెలియదు
మేఘాలలో విధ్యుత్ ఉందని  రాపాడే దాకా  తెలియదు
మెరుపులు తళ తళ లాడే దాకా తెలియదు.

నీ మాటల్లో  విధ్యుత్ ఉందని  తెలియదు
నా మనసుని  అవి రాపాడే  దాకా తెలియదు.
ఎర్రని మంటలు రేపే దాకా తెలియదు.
ధరణిని బట్టి భగ  భగ  మండే దాకా తెలియదు

నీ మనసు తెలుపని కోపం ఎరుపని.  
నీ మాట కఱుకని అదే ముడిసరుకని
నా కవిత ఎరుపని  రాసేదాకా తెలియదు


నీ గంభీర సంభాషణలు గర్జించు గడేరాలని
గాండ్రించు వ్యాఘ్రాలని బుసకొట్టు భుజంగాలని
ప్రవర కవితార్ఘ్యాలని ప్రవరించు మహార్ఘ్యాలని 
ప్రజ్ఞాన ప్రవరణాలని రచనా ప్రేరకాలని తెలియనే  తెలియదు
సాహిత్య నీలాకాశంలో నువ్వో మబ్బు నేనో మబ్బు  



 3.విప్లవం 


ఎవడ్రా  ఎవడ్రా ఎర్ర జెండా  

అంటే  విప్లవమన్నది

ఎవడ్రా  ఎవడ్రా విప్లవమంటే 

తిరుగుబాటన్నది ?

విప్లవమంటే జెండా కాదురా  అజెండా  

అజ్ఞానాన్ని చెండాడే తెల్లజెండా 

విజ్ఞానాన్ని పంచడమేరా  విప్లవం 

విప్లవమంటే డబ్బున్నవాడి మీద 

తిరగబడడమే అని చెప్పే సన్నాసులకి 

సలాం చేసే గులాము అవ్వకు 

ఎవడ్రా,  ఎవడ్రా ఎర్ర జెండా  

అంటే  విప్లవమన్నది

ఎవడ్రా, ఎవడ్రా విప్లవమంటే 

ఎర్ర రంగన్నది

రంగు లేనిదే విప్లవం

రాసి ఉన్నది కోసు లేనిది విప్లవం 

జ్ఞామార్గమే విప్లవం 

తన్ని లాకునేది కాదురా విప్లవం 

చదివి సాధించుకునేది విప్లవం 

జ్ఞానం లేని విప్లవం శవం!!! 


4.ఎర్రకవులెక్కడరా?


సంప్రదాయం చట్టుబండలని
ఎర్ర జెండా పట్టుకోమని
వేపవద్దని కరివేపవద్దని 
జట్లు కట్టి చెట్లు కొట్టి
పొగ గొట్టాలలో ప్రగతి ఉందని
ఉన్నదంతా కూలదోసి
తుర్రుమన్న ఎర్రకవులు
ఎక్కడ రా  నేడెక్కడరా?
వేదమొద్దని పూజలొద్దని
పువ్వులొద్దని గాజులొద్దని
రాముడొద్దని కృష్ణుడొద్దని
గోమాత వద్దని గొబ్బెమ్మలొద్దని
ఉన్నదంతా కూలదోసి 
తుర్రుమన్న ఎర్రకవులు
ఎక్కడ రా  నేడెక్కడరా?
కేకలో కవితలో తెలియని రాతలతో
అభ్యుదయమని నమ్మించి  అడవిబాట పట్టించి ,
నరజాతికి నవమార్గమని నరనరాలలో నింపేసి
అడవిలో దింపేసి  యెర్ర జెండా చేతికిచ్చి
తుర్రుమన్న ఎర్రకవులెక్కడ రా? ఎక్కడ రా?  


5. గమ్యం 

సృజనాత్మక ప్రపంచంలో ఎక్కడోయ్ నీ చోటు?
రసాస్వాదనలో నీకు ఎందుకోయ్ అంతలోటు ?
కవిప్రపంచం కైలాసవాసం  రసజ్ఞులకాలవాలం
విమలమయూక రేఖా చుంబితం రసప్రపంచం
 జ్ఞాన ప్రపంచం తలుపులు తెరిచే ఉన్నాయి
ప్రవేశించు అభియుక్తుడవై అనువక్తుడవై 
 సంజ్ఞానవిజ్ఞానప్రజ్ఞానాలు పలకరిస్తాయి
మానవాళి గమ్యం కారాదు విద్వేష పూరితం 
 జ్ఞాన రాగ విరాగ భరితం కావాలి నీ జీవితం 


6.యువకులు

లక్ష్యషుప్త  సంస్కారవర్జిత

జీవులు జీవన్మృతులు  

జ్ఞాన సూన్యులు నటకులు వీరికి మాన్యులు  

నటులను కొలుచు యువకులు 

ఆత్మ వినాశన కారులు  

సకటాసురులు లోక సంచారులు 

దుర్భల మానసులు భోగాను రక్తులు 

 కామ పీడితులు మధ్య ప్రియులు

విద్యావిరక్తులు అబల బంధకులు 

చీకటి గుయ్యారాలు నేటి యువత 

అంధకార బంధురము యువత భవిత 


7.పెద్దలు

చదువు మనకొద్దు
మన రాజకీయాలకి  లేదు హద్దు  
ఏడీ  నేడేం చదివేవనడిగే  పెద్ద ?
పాలిటిక్స్ తో పళ్ళు తోంకుని 
సినిమాతో స్నానం చేసుకుని 
రాజకీయబురద జల్లుకుని 
అమ్మానాన్న అత్తమావా 
కొడుకు కోడలు కథలు అల్లుకుని 
చీకట్లో చెమ్మచెక్క  లాడుకునే  పెద్దలు 
నిష్ప్రయోజకులను తయారుచేసే గెద్దలు.

 

8. అధోగతి 


 పెద్దలు చేసిన యువకుల్లారా 
యువకుల్లా వేషాలేసే పెద్దలారా 
బుద్ధిలేని పెద్దల్లారా కనండి యువకుల తీరు
చదువుతున్నప్పుడు మార్కులతో వెలిగిపోతారు              
సినిమాలన్నా సోకులన్నాముందుకి తోసుకుపోతారు
అక్షరం ముక్క రాకుండా డిగ్రీలతో మిగిలి పోతారు  
వారి అధోగతికి కారణమెవ్వరు

 

9.వెలుగుతో కడుగు

 అజ్ఞానం గజంలా నిన్ను మట్టేస్తే
మట్టిలో గజం లోతు దిగిపోతావు
జ్ఞానం కోర కుంటే అజ్ఞానం కోరేస్తుంది
కక్షకట్టి శిక్షిస్తుంది కక్షలోంచి విసిరేస్తుంది
నిన్ను నిట్ట నిలువునా చీరేస్తుంది
 ఆపై నువ్వు పట్టు చీరేసిన పాతచీరేసినా
పాతరేస్తుందినీ వాడిన దేహాన్ని అద్దంలో చూసి
 నీ వాడని జ్ఞానం నవ్వుతోంది
నీమనసు అడుగునున్న నిజాన్నడుగు
గజం బద్దతో బద్దలు కొట్టమని చెపుతుంది
కానీ నిజాన్ని కానీ విలువ లేకుండా
కుండలో పారేసావు భూమిలో పాతేసావు
పారేసి తీసి వెలుగుతో కడుగు
నీ మనసు మాట విను వినకుండా
కాలితో తొక్కావో తొక్కాలా కాలిపోతావు

 

10.నెత్తుటి మడుగుల కత్తుల యుద్ధం 


జాతుల మధ్య భీకర సమరం 
నెత్తుటి మడుగుల కత్తుల యుద్ధం 
నరాలు తెంపే  కిరాయి సైన్యం 
మతం మత్తులో మిత్రుడెవ్వరో 
శత్రువెవ్వరో తెలిసీ తెలియని 
జాతుల మధ్య భీకర సమరం 
నాయకులే ప్రతినాయకులై 
రాక్షసులను వేలుపులుగాచూపే
నెత్తుటి మడుగుల కత్తుల యుద్ధం  
దర్శకులే దర్పకులై విష సర్పలై 
వెండి తెరలపై మొండి మొలలతో 
కళ్ళకు రంగులు చూపిస్తూ 
బుద్ధికి గంటలు కట్టే యుద్ధం
దొంగ సారా తో మొదలెట్టి 
రియల్ ఎస్టేట్ లో అడుగెట్టి  
ఎం ఎల్ లై  మంత్రులై 
చెరువులు కొండలు దోచే యుద్ధం 
నమ్మిన న్యాయం అమ్మకమయ్యే 
నెత్తుటి మడుగుల కత్తుల యుద్ధం 

 

11.మానవ సంబంధాలు 

 

గూట్లోనోగూగుల్ నో దొరికేవి కావు 
సందుల్లో గొందుల్లోసంతల్లో సత్రాలలో 
ఆత్రంగా నేత్రాలు చిట్లించి వెదికితే దొరకవు
అచ్చంగా స్వచ్ఛమైన  సేవ చేస్తే   
ఆర్ద్రమైన గుండెల్లో మధురానుభూతులుగా
 మిగులుతాయి  మానవ సంబంధాలు
డబ్బుతో కొలిచేవి కావు డబ్బిచ్చి కొనేవి కావు 
నటిస్తే నిలిచేవికావు  నిలుపుకుంటే నిలిచి 
నిలబెట్టే స్తంబాలు చేజారితే చిదిగే అద్దాలు 
మానవ సంబంధాలు 

 

 12.కవిత


అందంగా అర్థవంతంగా ఆమూలాగ్రంగా 
సరైన పదాలతో   ప్రభావవంతగా చెప్పేది, 
గుట్టు విప్పేది, గుండెను తట్టేది కవిత. 
కాటుక పెట్టుకుని విలాసవంతంగా
నవ్వే కన్నెపిల్ల మాత్రమే కాదు
తల్లిలా మెత్తగా మందలించేది , 
తండ్రిలా గట్టిగా దండించేది మనసున్నవారిని
మాల వేసి వరించేది కవిత


13.బహుపరాక్


నమ్మకాన్ని అమ్మేసే నటుడు 
మనుషుల నేమార్చు యముడు
ఆత్మని మార్చిన  వ్యగ్రుఁడు
నిర్బంధ ధర్మ రిపుడు
మాతృ గర్భకోశ క్లేశకుడు
ధర్మ వాచ్య దూరుడు 
నిర్ద్వంద ధర్మధ్వజుడు
అమ్మనే అమ్మేసే ఘనుడు
రాజకీయాల్లో కొచ్చాడు 
బహుపరాక్ బహుపరాక్ 


14. మృగాళ్ల ఆయుధాలు

 హృదయానికి పగలగొట్టు రాళ్లు
చెవులకి గుచ్చుకునే  ముళ్ళు
సంస్కారాన్ని నరికే కత్తులు 
నిశ్శబ్ద తుపాకులు బూతులు
బూతులు మృగాళ్ల  ఆయుధాలు
బూతులు కత్తుల్లా  తిప్పితే
నీ ప్రత్యర్డుతుల కుత్తుకలు
తెగవుతెగేవి స్త్రీల తెగవులు 
కృశించేవి  శృంగార తలపులు
నశించేవి వారి నవ్వులు
మగాళ్ళకి వారు తీయరు తలుపులు
బూతులు తుపాకుల్లా పేలిస్తే
ప్రత్యర్ధులు పిట్టల్లా రాలరు
తూటాల్లా  పేలతారుమధ్యలో
మన స్త్రీలు అదురుతారు.
సమాజాన్ని చూసి బెదరుతారు
కత్తులు దాచేయ్తుపాకీ పారెయ్
 చేతులు చాలవా బూతులు మాట్లాడే
వాళ్ళ మూతులు పగలగొట్టడానికి.   
మగజాతిని చీదరించేలాకాక
ఆదరించేలా సుకుమారుడవై
సంభాషించరా స్త్రీలను నిజంగా
గౌరవించరా!!


15. ప్రజలు

 మమకారంతో మాతృ భాషని మట్టుబెట్టి 
ఉన్నత విలువలతో వోట్లమ్ముకుని
ఉచితాలకి ఎగబడి అవినీతిలో దిగబడి 
ఆక్సిజన్ కావాలని రంకెలేస్తున్నావు 
న్యాయం కావాలని ఎందుకు అడిగవు?
నీ గోడమీద చూసుకో నాన్న 
నాలుగు లైక్స్ వచ్చేలా నువ్వు రాసిన 
వెకిలి మాటలు నిన్ను వెక్కిరిస్తున్నాయి 
నువ్వు చెప్పి చెప్పి ఆచరించని  ధర్మం 
నువ్వు చెప్పకుండా ఆచరించే అధర్మం  
నువ్వు రాస్తున్న శుష్క  నీతి వాక్యాలు 
నిప్పులా నీమీద కురుస్తున్నాయి 
కరోనా వేరియంట్ల రూపంలో కరుస్తున్నాయి


16. నువ్వెవడివి?


నీ బ్రతుకే విద్వేషాగ్ని గుండం.  ద్వేషాగ్ని దగ్దం!
జగన్ మోదీ  లేదా మరోడు 
ఎవడో ఒకడిపై  నిత్యం ఎందుకు కక్కుతావు విషం?
అవినీతికి మూలం నువ్వని తెలిసి తెలిసి
అవినీతి ఘోరం అంటూ నిత్యం కోడై కూస్తావు 
నీలాటి లక్ష కోళ్ళుకూడాతోడేళ్ళకు కావు సవాళ్ళు
నీలాటి లక్షకోళ్ళు కూసినా లక్ష్యపెట్టవు తోడేళ్ళు 
మందతో చేరి ఎందుకు నిత్యం రువ్వుతావు రాళ్ళు?
రువ్వుడు కూలివాఎక్కడుంది కాశ్మీరీ రాళ్ళ రువ్వుడు
కూలికీ,  ఆంధ్రా రాళ్ళ రువ్వుడు కూలీకి రవ్వంత భేదం?

 

17. కనిపించని స్మశానం

సంపాదనకే పదవులు పదవులలో వెధవలు 
ప్రజాతంత్రమున  ప్రజలు ప్రథములు
వారేన్ద్రీ  వృక్ష భక్షకులు వారే అధములు 
పరాన్న భుక్కులు 
వోట్లమ్ముకునే వెధవన్నర వెధవలు 
మన సమాజం సుష్కించిన వనం
కనిపించని స్మశానం


18.యుగాస్టార్ 

ఎవడిచ్చాడు  మెగాస్టార్?
ఎవడిచ్చాడు మహాత్మా
ఎలావచ్చింది మహాకవి?
ఎక్కడివీ  భుజకీర్తులు?  
ఎవరిచ్చారీ  బిరుదులు?
 అన్నీ తగిలింపులే గా !
నిజమేగా  నెహ్రూ కూడా అంతేగా !
 తగిలించుకుంటే తప్పులేదుగా!
అందుకే శక్తి కొద్ది నువ్వు  మెగా స్టార్
యుక్తి కొద్దీ  నేను యుగాస్టార్ 

 

19. కవి

యతి ప్రాసలతో ప్రయాసపడి రాస్తే మిగిలేది 
ఆయాసమే తప్ప ఆనందం కాదు
రాస్తే నీకోసం రాసుకో ఎవరికోసమో రాస్తే
గుండెకోతే,  ఛాతీపై వాతే  
నీకు రక్తం కారుతున్నా ఎవరికీ అశ్రువులు కూడా 
కారవు. అందుకే ఎవరికోసమో రాయకు.
రాసినా ఎవడో చదవాలని చూడకు.
చదివినా వాళ్ళ మనసు విప్పాలని కోరకు.


20. విద్య లేని పేదలు 

విద్య లేని నిరుపేదలు
బుర్రలేని గొర్రెలు బరిలో నిలిచే బర్రెలు 
మనచేతికి చిక్కిన పావులు
తెరపై ఆడే బొమ్మలు  చూసి 
దాసోహమనే వాజెమ్మలు
నక్కలని నాయకులని 
ప్రచారం చేసే కుక్కలు
విద్య లేని నిరుపేదలు
పుర్రెలు తప్ప బుర్రలేని 
చదవలేని దద్దమ్మలు 
రూకలు ఇస్తే కర్రలు పట్టుకు 
బరిలో నిలిచే బర్రెలు
విద్య లేని నిరుపేదలు
ఆత్మాభిమాన మెరుగని నిర్భాగ్యులు 
మతం మార్చే త్రాష్టులు 
పేదలే మన ధనం పేదలే మనకు వరం   
అందుకే భారతాన పేదలు అజరామరం


21. అయ్యో తమ్ముడూ


 అయ్యో తమ్ముడూ ఎంతపనిచేసావ్
వాడేదో సినిమాల్లో సోగ్గా కనిపించాడని
వాడికి తొకై కూర్చున్నావా
వాడే వేరొకడికి తోక 
వాడికి తొకై కూర్చున్నావా
అయ్యో తమ్ముడూ ఎంతపనిచేసావ్
కళ్ళకి నచ్చితే కాళ్ళమీద పడిపోయావ్
గురువుకి చెయ్యెత్తి ఎప్పుడూ మొక్కవే
బుర్ర ఇంకా పనిచేస్తోందా తమ్ముడు?

 

22.అవివక్షితము


పని పని పని నీకెంతసేపూ 
పని ఎంతచేసినా తరగని పని 
అది కనిపెట్టి జీవించడమే నీ పని 
లేకుంటే  నీ పని పట్టడమే నా పని
పనికి మాలిన పనిలో పడితే శని 
నా  కవితా శరత్ చంద్రికలు కని
సుకుమార సుందర బందుర  
కుందుర పదములు పారాడు ధుని 
యని విని, పని పని అనడమే శని 
మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినా 
సగటు జీవికి కవితా పుష్పం  ఇచ్చినా 
చేసేదొకటే . . .. అవివక్షితము

 

23.వంచితులు

చితికిన బ్రతుకులు కోరేదేమిటి
దక్కని వారము చిక్కని స్వాంతము 
పరాజిత ప్రాణుల గమ్యమేమిటి?
ధిషణ వృద్ధి   లక్ష్య సిద్ధి 
పీడిత ప్రజల గమ్యము ఏది?
నిర్వేశము నిర్వేదము


24. గద్దఱి, గరాసు దుర్జనులారా 

ఘోటక కర్కోటక దుర్మతులారా 
మైకు ప్రార్ధనల ఫేరవులారా 
ఇసుకాసురులారా భూబకాసురులారా
కరములు సాచి కరోనా పిలుస్తోంది  
గజ్జె కట్టి  కరాళ నృత్యం చేస్తోంది 
మహిషము పై లోహపు గంటల మోత
ఎంత  ఏడ్చినా తప్పదు బ్రహ్మ రాత 
విలువలుకు వలువలు ఎంత ఊడ్చావో  
నీతి  నీవలన నెంత  వల వలా  ఏడ్చిందో 
ధరలోని  ధర్మమెంత నెత్తు రోడ్చొందో 
దర్మము మరిచిన జాతి ఎలారా
భూమికి  చెదలు పట్టనేలరా
 అశ్శ రభ  శరభ ఆడుకుంటోది 
 అశ్శరభ  అశ్శరభ సరభసిల్లండి  
కొక్కొకొ కొక్కొకొ పరుగులెత్తండి 
మరుజన్మలోనైన మంచిగా బతకండి 

 

 25.ముష్టి నీతి


పురుషాధిక్యతతతో నీతిని పాతేసి
యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
అంటూనే ఇతిహాసాల ఇనప గొలుసులతో  
గ్రంథాల మోకు  తాళ్లతో సారస్వత  జాలంలో
సారసాక్షి స్వారసిక సరసాభిలాషను
భూస్థాపితం చేసి ఆనక ముష్టి నీతికి
ఆడదానితో  జేజేలు కొట్టిస్తున్నారు

 

 26. బానిసత్వం


చేపకి ఎరలా మనిషికి మతం
ఎర కి  చిక్కావంటే
ఆపై తెలియదు పుణ్యం పాపం
వంట పడితే మతతత్వం 
తనకే తెలియదు తన బానిసత్వం  
ఫీజు లేని లాయర్లులా తయారయ్యి 
వాదిస్తారు అర్ధ జ్ఞానంతో 
తీర్పులిచ్చేస్తారు జడ్జీల్లా
నామతం గొప్పది, మిగితావారు ?

 

27.యతి ప్రాసలేవి?


అయ్యో అయ్యో యతి ప్రాసలేవి ?
అందమేది నీ కవిత్వంలో?
యతి ప్రాసలతో చేస్తే చదివడానికి ఎక్కుళ్ళు
పద్దతిగా చెపితే ఎవడు విన్నాడు గనుక 
అందంగా రాస్తే ఎవడికి అర్ధం అయ్యింది గనుక 
మనిషి మనిషులా ఎప్పుడు బతికేడు గనుక 
బలం ఉంటే కాళ్ళు మొక్కుతాడు.


28. జగతి కి వెలుగు 

ఋషులు చేసినది, సురులు చేసినది 
శృంగారము, నరులుచేస్తే పెద్ద వ్యభిచారము.
అగ్ని దేవుడు చెరిచె అంగీరసుని భార్యని
పుత్రునే కన్నది శ్రద్ద - అతడే బృహస్పతి.
బృహస్పతి పెండ్లాడే అందాల తారను   
ఇంద్రుడు వంచించే గౌతముని భార్యని 
రావణుడు రేపు జేసె కాబోయే  కోడల్ని
  తార మోహించె మగని శిష్యుడిని  
శిష్యుడే చంద్రుడు -భలే వన్నెకాడు 
లేపు కెళ్ళి  గురుపత్ని తారని కడుపుచేసే   
బిడ్డని కన్నది తార బిడ్డ పేరే బుధ గ్రహము
బృహస్పతి అన్న ఉతథ్యుడుధర్మబద్ధుడు
అతని భార్య మమత  అందాల రాసి 
మరిది బృహస్పతికి  మమత పై కన్ను పడెను  
వారిద్దరూ పక్క పంచుకొనగా ఆమె 
భరద్వాజుడను కొడుకును కనెను
బృహస్పతి కొడుకు కుశధ్వజుడు 
అతడి కూతురు వేదవతి గొప్ప అందగత్తె
 శంబురాజు ఆమెను పెండ్లియాడ 
 ఆమె తల్లి తండ్రులనడగ వారు వలదన
మంట రేగి శంబుడు వారిని చంపివేసె
రావణుడు వేదవతిని రేపు జేసె  
అనసూయ మొగుడు అత్రి మహర్షి 
అవివాహితైన అనసూయ ఒక నాడు 
స్నానమాడుచుండగా అత్రి ముని చూసే 
కంటి చూపు తోనే కడుపు చేయ ఆమె 
పండంటి బిడ్డను ప్రసవించెను  
అతడే మన దత్తాత్రేయ స్వామి
కామము పాలించె మునులనైనా దేవతలనైనా
విశ్వామిత్రుడైన మేనకకి తలఒగ్గ లేదా
చదవలేని వారలకు నా కవిత వెలుగు 
నిజము తెలుసుకొన్న జగతి వెలుగు 

 

29. XXX సంస్కారవంతమైన కవిత 


XXX కొడుక్కి కారుంది ఇల్లుంది 
తెల్ల రేషన్ కార్డుంది 
మతాన్ని తన్ని పార XXX  
కులాన్ని అట్టేపెట్టుకున్నాడు
కులం మీద రిజర్వేషన్లు XXX
కుటుంబం అంతా మంచి జాబులు XXX
ఓట్లన్నీ అమ్ముకు XXX
ఉచితాలన్నీ XXX  మరిగి 
పాతమతం మీద XX కక్కుతుంటాడు 
వీడి నడ్డి విరగ  XXX   డానికి 
వస్తోంది ఒక నవసమాజం 
చదువు సంజా , సిగ్గు లజ్జ 
చీము నెత్తురు ఉన్న సమాజం 
అందాకా మనకి సంస్కారమే శరణ్యం 

 

 30. విజ్ఞానం నా వాకిలి


 సంవత్సరాలు వెళ్లిపోతున్నాయ్ చేతులూపుతూ
 వెలుతుర్లో ఆడుతున్నావ్ చీకటి క్రీడలు
 వెళుతున్నా వ్ వెలుతురున్న చీకటిలోకి
కాల సర్పం కౌగిట్లోకి అర్ధంకాని జ్ఞానం లోకి అర్ధ జ్ఞానంలోకి
 జిజ్ఞాస జీవం పోసుకునే లోపే అజ్ఞానాన్నిఅంటించుకుని
వెళుతున్నావ్ వెలుతురున్న చీకటిలోకి
 కాల సర్పం కౌగిట్లోకి అర్ధంకాని జ్ఞానంలోకి
 మూర్ఖ ప్రపంచం లో ములిగి
మొద్దు నిద్దరపోయే ముసలియువకుడా పో !
  జగం నాది యుగం నాది
 నిష్క్రియా ముష్కరుడా ఫో !!
 నా విశ్వమంతా జ్ఞానమయం
 భాష నా శ్వాస, వాంగ్మయం నా ఉనికి
విజ్ఞానం నా వాకిలి.

 

31.ద్వధ్వం 


 తలచేది వేరు కోరేది వేరు 
చెప్పేది వేరు చేసేది వేరు 
అత్యాశ మన తీరు 
తలచేది మన బాగు
కోరేది మన సుఖం 
చెప్పేది లోక కళ్యాణం 
చేసేది అతి స్వార్ధం 
మన బతుకంతా ద్వధ్వం 

 

32.వన్నెలు


 తొక్కేయ్ తొక్కెయ్ విద్యని తొక్కెయ్
మట్టేయ్ మట్టేయ్ కవులను మట్టేయ్
 పట్టేయ్ పట్టేయ్ పిట్టను పట్టేయ్
 యాభై ,అరవై, డెబ్భై వయసెంతైనా
 ఆడదాని బొమ్మ చూసావంటే
 కొట్టేయ్ కొట్టేయ్ జేజేలు కొట్టేయ్
చూసేయ్ చూసేయ్ సినిమాలు చూసేయ్
 కత్తుల కోతలు బాంబుల మోతలు
 బూతుల రాతలు మెచ్చేయ్ మెచ్చేయ్
తప్పుడు పనులు తప్పే కాదని చెప్పేయ్
చెప్పేయ్ మంచిని తొక్కెయ్
తెలుగు జాతికి వన్నెలు దిద్దెయ్
 

 33. అశోకచక్రం


 జండాలో జవలేదేం?
అవినీతి భరతం పట్టి
స్వధర్మానికి పట్టంగట్టి చట్టం తేదేం?
సమానతకు శ్రీకారం చుట్టి
కులమత రహిత భారత
సృష్టికి పూనుకోదేం?
అశోకచక్రం విష్ణుచక్రమై రాదేం?
అక్రమార్కులను అణిచివేయగా
వక్రమార్గులను నరికివేయగా
 విక్రమ మందిరాదేం?

 పాలకుడు ధర్మ పరి రక్షణ చేపట్టాలి . అతడు అశక్తుఁడు, దుర్బలుడైనప్పుడే మౌనం పాటిస్తాడు.                  
అప్పుడే ప్రజలు తిరుగుబాటు దారులుగా  మారి  కులం మతం పేరుతో  కొట్టుకు ఛస్తుంటారు.


34. ఫిలాసఫీ


 రమణ మహర్షి, ఓషో
అందరూ అర్థమైపోయారు
నీకు నువ్వే అర్థం అవ్వలేదు
నీకెక్కినది ఫిలాసఫీయా?
సెలిబ్రిటీ క్రేజా?
అంతకన్నగొప్పోడున్నా
వాడికి పేరు లేకపోతే
నీకు వాడు గుండుసున్న
అదిగో వచ్చాడు యమరాజు
దులుపుతాడు నీ బూజు
కనిపిస్తోందా కరోనా పాశం
ఇప్పుడే చూపాలి నీ ధైర్యం
జీవితం క్షణభంగురం అని
ఆత్మా దేహం అని ఆటలాడి
దేహాంతం వేళ దేహీ అని
ఆక్సిజన్ అడుక్కుంటావేం?

 

 35. ఉమ్మడి స్వాతంత్రం 


 నువ్వు కష్టపడకుండా నీకు దక్కిన ఫలం  
ఎందరో  ప్రాణ త్యాగాల వరం మన స్వాతంత్రం  
అనుకుంటున్న వెర్రి వాడా కళ్ళు తెరువు
చూడుపిప్పర్మెంట్లా మన పెద్దలు 
దాన్నెప్పుడో చప్పరించేసారు 
పక్కవాడికి పెళ్ళయితే  నీకు పెళ్లయినట్టు కాదు 
పక్కవాడు  పరీక్ష పాసైతే నువ్వు పాసయినట్టు కాదు 
దేశానికి స్వతంత్రం వస్తే  నీకు వచ్చేసినట్టు కాదు 
చీకట్లో నిన్నెవరైనా దోస్తే నిన్ను చూసి నీ శత్రువు 
పట్టపగలే కత్తి  దూస్తే  నీభూమి నెవరో కబ్జా చేస్తే
నిన్ను మోసగించినది బలవంతుడో ధనవంతుడో 
నీ న్యాయం  ఎంత పనిచేస్తుందో తెలుస్తుంది
ఉమ్మడి స్వాతంత్రాన్ని నమ్ముకుంటావో 
 నీ స్వాతంత్రం కోసం నువ్వే పోరాడి
 గెలుచు  కుంటావో తేల్చుకో 

 

36.మార్గదర్శకులు

నేడు సినీ దర్శకులు, దర్శకులు కాదు
యువతకి జీవిత మార్గదర్శకులు 
వారి ఫిలాసఫీ యువతకు రక్తం
వారి విచ్చలవిడి నీతులు
సన్నాసులకి సూక్తులు
ఫకీరులకి పరమాన్నాలు
కోట్లకొద్దీ నోట్లు నోట్లో చుక్క
పక్కలో చుక్క డబ్బుకి ఆశపడి
డప్పుకొట్టే బ్రోతల్ మీడియా
జనాల అజ్ఞానం వాడికి కొండంత బలం
అందుకే విచ్చలవిడి నీతులు చెప్తున్నారు
బుర్రలేని వాడికి అందరూ మేధావులే
 


37.జ్ఞానం

మనకు కాలో కాలేయమో చెడిపోతే
ఇంకొకరిది  తీసుకుంటాం . జ్ఞానం తీసుకోవాలంటే ...
అహంకారం పెరిగి  ప్రతిఘటిస్తాం
జ్ఞానం అంటేనే పంచేది. నీది నాది లేనిది జ్ఞానం
పుడుతూనే మనకి కావలిసిన  జ్ఞానం మనం తీసుకు రాలేం
ఒక దీపం తో ఇంకొక దీపం వెలిగించాలి.
 ఇంకొకరి జ్ఞానం మన పాలిట వరం అయ్యింది
మెడిసన్ , ఇంజినీరింగ్ డిగ్రీ గా  మారింది
మనకి బ్రతుకుతెరువు చూపింది.
విజ్ఞానాన్ని తీసుకుంటాం  దానికి డిగ్రీలు ఉన్నాయి కనుక
బ్రతకాలంటే అవి తప్పవు కనుక  డబ్బిచ్చి కొనుక్కుంటాం
కాదు వాడే మనకి అంటకడతాడు.   
దాంతో మనకి విజ్ఞానం , ఆత్మజ్ఞానం అన్నీ  వచ్చేసాయనుకుని
స్వజ్ఞానం  ఇంకితజ్ఞానం కూడా లేక అజ్ఞానంలో పడి అలమటిస్తాం.


38.అయ్యో తాతా!

 అయ్యో తాతా! ఏమని చెప్పను నా రాత
కావాలని  పాపివై పై కాకివై , కడకు విగత జీవుడవై 
పరలోకం లో ఎలాఉన్నావో
మేము మాత్రం నీ పుణ్యమా అని చల్లగా ఉన్నాము
వాడెవడో పావలా ఇచ్చాడని 
నువ్వు దిసమొలతో ఐసు గడ్డ మీద కూర్చున్నావు
మానాన్నని  కూచోబెట్టేవు, నాకు కూడా తప్పింది కాదు
చల్లగా గడిచిపోతుంది అన్నావు. నువ్వు పావలా పట్టుకుపోయావ్
నీదరిద్రం లో మేంకొట్టుకుపోయాం అయినా నువ్వు చెప్పినట్టు చల్లగా 
ఉన్నాం ఇంటిల్లిపాది ఐసు గెడ్డల మీద చల్లగా ఉన్నాం. ఆమెన్!!! 


బ్రా  (కట్టులో నిజం  


భాషని చూస్తే వాడికి(మనస్సులేవదు   
బ్ర (తుకు)మీదే వాడి చూపు            
జ్ఞానాన్ని ఇస్తే వాడికి (హృదయంచలించదు
 చీకటే  వాడి పాడై (వెలుగు                                 
 వాడే వాడైన  ( ) పుంసకుడు.


39. రెండు గోడలు 

  ఇంట్లో రెండు గోడలు 
ఏభావాలు లేని బీటలు వారిన ఏటవాలు  గోడలు
 ఎదురెదురుగా ఉన్నా ఎప్పుడూ కలుసుకోని గోడలు
ఏభావాలు లేని  ఎదురెదురు గోడలు  
రెండు నీడలునీడ తగిలినా
కీడనుకునే రెండు గోడలపైన 
 ఆనుకొన్న చిన్న మేడ,                 
 దాన్ని కొంతమంది ఇల్లు అన్నారు 
కొంతమంది కుటుంబం అన్నారు 
కలిసుండడం మన సంప్రదాయం అన్నారు
ఊరూరా ఎన్నున్నాయో మొండి గోడలు


40. అలుపెరుగని సాధన

మండుతున్న గదిలో మరణ యాతన
పారుతున్న నదిలో ఎదురీత యాతన
అహోరాత్రులు శోధన అలుపెరుగని సాధన
ఓ రచయిత నీ రక్త నాళ్ళల్లో రక్త పీడన 
రాయిలా ఉన్న ప్రజలకోసం రాయి
అక్షరాలు భగభగ మండేలా, నమ్మితే  
నువ్వే నల్ల సూర్యుడు మండేల