Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, October 12, 2021

సుప్రభాతం - ఒక మంచి నవల

ముత్యాల్లాంటి  మనుషులు,  మకరందం లాంటి మనసులు, బంగారంలాంటి  గుణగణాలున్న పాత్రలు ఈ సుప్రభాత సాహిత్య వనంలో అడుగడుగునా కనిపిస్తాయి. స్నేహసుమ శోభిత వనంలో జ్ఞానభూషణాలంకృత  శిల్పం  సుప్రభాతం. 

భిన్న సంస్కృతులు సంప్రదాయాలు నుంచి వచ్చిన ఐదుగురు మగువలు- రాజస్థాన్ మగువ మనాలిని, బెంగాలీ భామ కైరవి, మిజో పుత్తడిబొమ్మ మాఫుయి, మథురా నగరి ముద్దుగుమ్మ దేవకి, ఆంద్ర ఆడపడుచు మేఘన.  అనుకోని సంఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులుఎడతెగని ఉత్కంఠ (సస్పెన్స్) చివరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. పిల్లతెమ్మెరలు వీస్తుండగా సున్నితమైన హాస్యం హరివిల్లులా ఆవిష్కృతం అవుతుంటుంది. అడపా దడపా మదన మేఘాలు కమ్మి  శృంగార వర్షంలా కురుస్తూనేవుంటుంది


సంప్రదాయాన్ని కట్టుబాట్లను పుణికిపుచ్చుకున్న రాజస్థాన్ మగువ మనాలిని. దైవభక్తి క్రమశిక్షణకు మారుపేరైన మనాలిని లో ప్రవహించేది రక్తం కాదు మానవత్వం. స్వార్ధాన్ని సవాలు చేసే సేవా తత్పరత నిండిన కర్పూరం మనాలిని. మగవాళ్ళ చూపు కూడా ఓర్వనిమనాలిని చేయిఅనుకోకుండా, సూదంటు  రాయిలాటి మగాడి చేతిలో చిక్కి లక్కలా కరిగిపోతుంది. అంతే ఆమెలో జడత్వం కర్పూరంలా ఆవిరయిపోతుంది.  

 ప్రేమని కొట్లో కొనుక్కుని వాడిపారేసే వస్తువుల జాబితాలో చేర్చేసిన బెంగాలీ భామ కైరవి  ప్రేమ అనే దీపం చూసి దగ్గరకు పోయి దీపపు పురుగులా అతుక్కుని వెనక్కు రాలేక పోతుంది.  శిశిరంలో  మగ్గుతూ కగ్గిన మిజో పుత్తడి బొమ్మ మాఫుయి జీవితంలో కొత్తకళ వస్తుంది. మంజ్యోత్  అనే గండు  కోకిల  కూస్తుంది.

మాఫుయి జీవితంలో ప్రేమ పలుకుతుంది. వసంతం  వెల్లివిరుస్తుంది.  

తానూ పెళ్లి చేసుకోవచ్చు అని తోచని మథురా నగరి మధ్యవయసు ముద్దుగుమ్మ దేవకి. పెళ్లి ఊసెత్తగానే  వెన్ను చలితో వణికి,  మనసు సిగ్గుతో ముడుచుకుపోయే ఈ  కోమలిని అనూహ్యంగా  వలచిన వాడే  వెతుక్కుంటూ వచ్చి ఎదురుపడతాడు. తుకారాంని  విమానం ఇంటి కొచ్చి  స్వర్గలోకానికి తీసుకుపో యినట్టు అతడే ఆమెను ఐశ్వర్య పల్లకిలో  ప్రేమలోకంలోకి తీసుకుపోతాడు. 

ఆంద్ర ఆడపడుచు మేఘన గుండెలోతు కొలవడం  నాసా కి కూడా సాధ్యం కాదు.  అగాథం లో ఉన్నట్టు కనిపించి ఆకాశం అంత్తు ఎదిగిన, మేఘన తన జీవితాన్నలిమిన మేఘాలని చీల్చుకుని సూర్యుడిలా కొత్తజీవితానికి సుప్రభాతం పలుకుతుంది.  ప్రణయం శరణం గచ్చామి. 

3 comments:

  1. సుప్రభాతం చాలా చక్కటి నవల.
    ప్రతి పాత్ర ఎంతో ఔచిత్యం,
    ఉదారత్వం, స్నేహం, సరళత్వం లాంటి ఎన్నో అద్భుత లక్షణాలు కలిగి ఉంటుంది.
    తెలుగులో వ్రాసినది కూడా త్వరలో పబ్లిష్ చేయాలి.

    ReplyDelete
  2. New life telugulo rasinanduku chala santosham.Telgulo paatralani car inch a vidhanam bharatavarsha paatralanu gurtu chestundi

    ReplyDelete
    Replies
    1. It's the language effect that reminds you of Bharatavarsha. Thank you.

      Delete