తే. కారె జనహితు లెల్లరు ఘన కార్య
శీలు రేతమ కీర్తిని శిరము( దాల్చి
జనరె వెలుగిచ్చి కారణ జన్ము లేమి
లెక్క సేయక సాగురే ఱేండ్లు గారె
నిన్న వేదికపై గురువుగారి జీవితాన్ని పాటరూపంలో శ్రోతలకు వినిపించాను
ఎవ్వడురా ఎవ్వడురా ఎవ్వడురా ఇతడెవ్వడురా
జిలిబిలి పలుకుల రాయడురా బోయను మించిన బోయడురా
ప్రేమతో పిలిచినా ఓయనురా ఏ సాయము కోరిన చేయునురా
ప్రజాక్షేత్రమున పార్థుడురా దాటి గల ధనుర్ధారుడురా
విలక్షణ అక్షర యోధుడురా ధర్మ సమర్ధన నాథుడురా
దుష్టమర్ధన యోధుడురా సాధుడురా రణధీరుడురా కృష్ణుడురా కృతార్థుడురా.
ఎక్కడరా ఎక్కడరా ఎక్కడివాడిత డెక్కడరా చక్కనివాడితడిక్కడరా?
వాడపల్లి తలిదండ్రులురా వాదములందుదిట్టమురా
కొత్తపల్లివారల్లుడురా కొదకుగొనని ఘన కొట్టమురా
సురంగపురమున జనియించి తరంగమల్లె పయనించి
ప్రసారమాధ్యమ కాంతులలో ప్రపంచమంతా ప్రసరించి
కర్మయోధుడై జర్మను వెల్ల లో మేధోశక్తి తో వెలుగొంది
కాస్కోయంచు మాస్కోయంచున మేథావులనే మెప్పించి
తేజరిల్లిన యోధుడురా విలక్షణ అక్షర యోధుడురా
ఆరుఅడుగులా అర్కుడు రా, శ్రీదేవి కిప్రాణనాథుడురా
జెమిని జ్యోతుల ప్రభలను దాటి ఆంద్ర జ్యోతిలో అడుగిడెరా
అడుగు అడుగునా పెరిగెనురా ఆదిత్యునివలె ఎదిగెనురా
ఆంధ్రఖ్యాతిగా వెలువడెరా జితకాశుడురా జయశీలుడురా
ఎచ్చట ఎచ్చట ఎచ్చట నుండును వెచ్చనివాడిత డెచ్చట నుండును?
రాచ హార్మ్యముల కొలువుండడురా రాచకార్యములు నెరుపునురా
జనహృదయంలో నిలిచుండి జనగృహములలో కొలువుండి తేడావస్తే జగమొండి
కోటినేత్రముల ఆత్రముగా నిత్యము అతడిని చూచుచుండగా
పొసగని చర్చల విసుగు మాటల లొ ధన ధన ధన ధన ధనుర్బాణములు
గుప్పించి మారుతి యై బడి కుప్పించి నటరాజై నర్తించి విస్ఫులింగములు గుప్పించు.
ఖగరాజు జోడితడు తొగరాజు తోడితడు కరిరాజు ఉరువితడు
రాజాధిరాజితడు చండకరుడు, చండభుడు అనిందితుడు విదితుఁడు.
ఎవ్వడురా ఎవ్వడురా ఎవ్వడురా ఇతడెవ్వడురా
జిలిబిలి పలుకుల రాయడురా బోయను మించిన బోయడురా
ప్రేమతో పిలిచినా ఓయనురా ఏ సాయము కోరిన చేయునురా
Congratulations and many more happy returns of the day to Krishnam Raju sir
ReplyDeleteThank you. Your greetings will be conveyed.
ReplyDeleteVery good article about KrishnamRaju
ReplyDeleteకారెజనహితు లెల్లరు కనఘన కార్య
ReplyDeleteశీలు రేతమ కీర్తిని శిరమున దాల్చి
కాంతు లీనుచు సాగరె కారణ జన్ము
లేమి యులెక్క సేయరు రేరాజు ల్వారె