యుద్ధం ద్వారా ఒక దేశాన్ని సంపదని కొల్లగొట్టడం, స్త్రీలను చెరపట్టడం చెడగొట్టడం మామూలే. ప్రపంచ చరిత్ర నిండా ఇప్పటికీ యుద్దాలు రక్తం మరకలు కనిపిస్తాయి. యుద్ధం అంటే రక్తపాతమే. ఐతే యుద్ధం లేకుండా ఒక్క చుక్క రక్తం చిందకుండా ఒక జాతిని లొంగ దీసుకోడం బానిసలను చేసుకోడం చాలా తెలివైనపని అదే ఒక జాతి జ్ఞాన సంపదని కొల్లగొట్టడం మేథా విహీనులుగా చేసి కాళ్ళ దగ్గర పడేసుకోడం. జ్ఞాన సంపదను కొల్లగొడితే ఏం జరుగుతుంది? మనిషి మెదడును స్తంబింపజేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కళ్ళు లేని వాళ్ళైనా ప్రతిభావంతులుగా కీర్తి కెక్కినవారిని మనం చూసాం. కళ్ళు లేని గుడ్డివారిలో కూడా గొప్పవారిని చూసాం. మెదడు లేని గొప్పవారిని చూసామా ? అదీ జ్ఞానం ప్రాముఖ్యత
1190లలో ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ ఖిల్జీ నేతృత్వంలోని ఆక్రమణదారుల దోపిడీ దళం విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. ఖిల్జీ ఆశ్రమాన్ని పడగొట్టాడు, సన్యాసులను చంపడమేకాక విలువైన లైబ్రరీని తగలబెట్టాడు. నలంద లో చాలా తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. వందల వేల ( బహుశా మిలియన్లు కూడా) విశ్వవిద్యాలయం పూర్తిగా మూడు నెలల పాటు మండింది. బ్రిటిష్ వాడిది ఇంకాతెలివైన పధ్ధతి
అంటే ప్రాచీన గ్రంధాలలో ఉండే జ్ఞానం అంతా నాశనమవుతుంది.
విదేశీ శక్తులకు కావలసింది అదే. జ్ఞానం అంటే కళ్ళు. కళ్ళు పీకేసి గుడ్డి వాళ్ళను చేయడం. తరువాత ఇంగ్లిష్ నేర్చుకుంటే నే ఉద్యోగాలు వస్తాయి అని నమ్మించి , ఉద్యోగాలపేరుతో గింజలు పడేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసుకోడం. తరువాత ఈ గుడ్డివాళ్ళ పిల్లలకి కళ్ళున్నా తమ సంస్కృతి అంటూ ఏమీ లేకుండా ఫేషన్ల పేరుతో మోజు సృష్టించి సంస్కృతిని కూడా లాగేయడం. తత్ ఫలితమే ఇంగ్లిష్ ట్యూన్స్ కి పొసగని తెలుగు బూతు మాటలు, ఇంగ్లిష్ పద్ధతిలో పుట్టిన రోజులు, ఇంకా చెప్పాలంటే మన జీవన విధానాన్నే మార్చేశాడు. వాడి తెలివితేటలు అలాంటివి. ఒక్క మాట సృష్టిస్తాడు. ఆ మాట (గ్లోబలైజేషన్ ) అనగానే దెబ్బకి నువ్వు గుడ్డలు ఊడదీసుకుని వాడి వెంట పరిగెత్తాల్సిందే.
ఆఫ్రికన్ కవి "పియానో మరియు డ్రమ్స్" అనే పద్యం లో ఆఫ్రికన్ సంస్కృతిని పాశ్చాత్య సంగీతం ఎలా దోచేస్తోందో , ప్రపంచీకరణ పేరుతో ఇంగ్లిష్ వాడు ఎంత గందరగోళాన్ని సృష్టించాడో స్పష్టంగా వ్రాసాడు . ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదురా బాబోయ్
భారతీయ బాషలని సంస్కృతాన్ని తొక్కేసి, తెలుగు, కన్నడ వంటి బాషలని ఎందుకు పనికి రాని బాషలని ప్రచారం చేసి , ఇంగ్లిష్ లో నే చదువుకోవాలని చెప్పేడు. మరి ఇప్పటికీ అదే నమ్ముతు న్నాం కదా ! తెలుగుతల్లి నోరెత్తితే నోటిమీద తంతున్నాం. మన ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో తెలుగులో మాట్లాడితే నోటిమీద తంతారు. అందుకే అన్నాను ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదని. అవును తెలుగుని పూజకు పనికి రాని పువ్వుని నమ్మించాడు. వాడిమాట నమ్మి చదువుకు పనికిరాద ని అవతల పారేసిన ఘనులం మనం.
పూర్తిగా చంపకుండా లేటిన్ భాషకు పట్టిన గతే మన భారతీయ భాషలకీ పట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ప్రస్తుతం లాటిన్ మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు కనుక అది మృత భాషే. కానీ ఎక్సటింక్ట్ అంటే కనుమరుగైపోయిన బాష కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు మెడిసన్ , సైన్స్ , న్యాయ శాస్త్రాలలో గ్రీక్ లాటిన్ పదాలు ఇప్పటికీ కోకొల్లలు. అంటే మనభాషలు ఉంటాయి కానీ ఇంగ్లిష్ వాడికి పనికొచ్చేలా ఉంటాయి.