భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉపాధ్యాయులు అనేక విషయాలు చెబుతూ ఉంటారు పిల్లలు కూడా ఆయన గురించి అనేక విషయాలు చెబుతూ ఉంటారు ఆయన మీద ఎక్కడా లేని ప్రేమ అభిమానంచూపిస్తారు.
నేను ఇక్కడ మైసూర్ యూనివర్సిటీలోని హ్యుమానిటీస్ డిపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి క్లాస్ రూమ్‌లో నా భార్య వరలక్ష్మితో కలిసి చిరు సత్కారం అందుకున్నాను. మైసూర్ యూనివర్సిటీ కి ఫారిన్ లాంగ్వేజెస్ సెమినార్ నిమిత్తం వెళ్లిన నాకు చిరు సత్కారం జరిగింది. ఈ చిరు సత్కారమే నాకు ఘన సత్కారం
ఒక ఊరు పేరు లేని ఒక చిన్న నటి కానీ నటుడు కానీ ఒక బట్టల షాపు ఓపెనింగ్ చేయడానికి వస్తే వాళ్ల మీద జనాలు ఎగబడిపోవడం వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అలా పండితులను కలవడానికి ఎప్పుడైతే తహతహలాడుతూ ముందుకు వస్తుందో అప్పుడే మన అభివృద్ధి చెందినట్లు భావించుకోవాలి అప్పుడే మన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు భావించుకోవాలి. ఆయనే బతికి ఉంటే నిజజీవితంలో ఆయన్ని కలవాలని ఎంతమంది కోరుకుంటారు? అలా కోరుకునే వారిలో ఆయన పనిచేసిన యూనివర్సిటీకి ఆయన కూర్చుని కూర్చి దగ్గరికి ఎంతమంది వెళ్లగలుగుతారు?
సరే అందరికీ అదృష్టం ఉండకపోవచ్చు కానీ నాకు అదృష్టం ఉంది నేను నిజమైన అదృష్టవంతుణ్ణి అని భావిస్తున్నాను. తత్వశాస్త్ర ప్రొఫెసర్. డేనియల్ గారిచే గౌరవించబడటం గొప్ప సన్మానం.