Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, October 2, 2024

తెలుగు వారి ఆధునికతకు అద్దం పట్టే కథలు

కాంటర్బరీ టేల్స్ జెఫ్రీ షాజర్ చేసిన కథల ప్రయోగం, 24 కథల సంకలనం. లండన్కు 90 మైళ్ళ దూరంలో ఉన్న సేంట్ థామస్ బెకెట్ (కాంటర్బరీ చర్చి)కు వెళ్లే 31 మంది తీర్ధ యాత్రికులు లండన్ లో టాబార్డ్ సత్రంలో బసచేస్తారు. కాలక్షేపం కోసం అందరూ కథలు చెప్పాలని జెఫ్రీ షాజర్ ఒక కథల పోటీ పెడతాడు. నెగ్గిన వారికి బహుమతిగా తిరుగు ప్రయాణంలో ఉచితభోజనం లభిస్తుంది. ముప్పది మంది తీర్ధయాత్రీకులు ఒక్కొక్కరు నాలుగు కథలు ( వెళ్ళు నప్పుడు రెండు, వచ్చునప్పుడు రెండు) చెపుతారని భావించి 120 కథలు సంకలనం చేయవచ్చని అనుకొంటాడు. కానీ 24 కథలో లభిస్తాయి. ఇది కాంటర్బరీ కథల వెనుక కథ .

                   

24 కాంటర్బరీ కథల వెనుక కథ తో పాటుగా 24 కథలు చెప్పిన పూలబాల. తిరుపతిలో విమానం గాల్లోకి లేచి విజయవాడలో దిగే సరికి అలాంటి 24 కథలు మన సంస్కృతి కి అద్దం పట్టే కథలు ముగించడం అద్భుతం. ఒక పూర్తి కథ మీకోసం.


- ఏక్ దిన్ కా హంగామా -

ఉగాది వెళ్లిన మరుసటి రోజు నేను హాల్ లో సోఫా లో కూచుని పేపర్ చదువుకుంటున్నాను. టింగ్. టింగ్ .. కాలింగ్ బెల్ మోగింది. పేపర్ పక్కన పడేసి తలుపు తీశాను. ఎవరో తల్లి కూతురు లా ఉన్నారు. తల్లి చీర కట్టుకుంది పిల్ల పంజాబీ డ్రెస్ వేసుకుంది " ఇకాడ , ఇలెఅయ్ మై నా వేకంట్ గా ఉన్నాయా ?" అర్ధం కాలేదు ఏం కావాలి? అన్నాను. అద్కాదండి. ఇకాడ ఐ మీన్ టూ లెట్ బొడ్ ఉంద్కడా? ఇల్లు ఏమైనా అదేకు దొర్కుతుందా? అర్ధమయ్యింది ఈ అమ్మాయి తెలుగుని ఖూని చేసేస్తున్నాది. లోపాలాకి రండి, "ఛి ఛి తన మాటలు నాకొచ్చేస్తున్నాయి ఏంటి?" అనుకున్నాను మనసులో . పక్క ఫ్లాట్ ఖాళి గా ఉంది మేము ఓనర్స్ కాదు. కానీ కీస్ మాదగ్గరే ఉన్నాయ్. కూచోండి. అన్నాను. ఇల్లు చూబించాను.

చాలా బాగుందమ్మా, ఇది మా అమ్మాయి అంజలి పూర్తి పేరు దుర్గాంజలి. అంది తల్లి. అమ్మా ఏంటమ్మా ఏడుపుమొహం పెట్టింది అంజలి. అర్ధం కానట్టు చూసాను. అంతేనమ్మ, దుర్గ అనే పేరు చెప్పడం ఇష్టం ఉండదు. అంజలి అని చెప్పాలి, అంది తల్లి మమ్మీ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. కాదు కాదు అమ్మాయి పేరు ఏంజెల్ . ఇంట్లో అలానే పిలుస్తాం. అని సర్దుతుంది తల్లి కూతురు శాంతించింది.

మరుసటి వారం ఏంజెల్ మా అపార్ట్ మెంట్ లోకి వచ్చేసింది. తండ్రి ఆర్ టీ సి లో కండక్టర్, పేరు మారుతి, ఏంజెల్ వాళ్ళ అమ్మగారి పేరు మాలతి. మారుతి, మాలతి ఎంతబాగా నప్పాయో అన్నాను. మరుసటి రోజు అంజలి వచ్చింది " రేపు నా బాత్ డే , ఈవినింగ్ పాటీ కి తప్పక రావాలి" అంది. తెలుగు మాట్లాడే పద్ధతి కొంచం ఇబ్బందిగా ఉన్నా సద్దుకు పోవాలి అనుకున్నాను."అలాగే" అన్నాను. మరుసటి రోజు సాయం కాలం ఏంజెల్ ఉంటున్న పక్క ఫ్లాట్ కి పార్టీ కి వెళ్ళాను. పార్టీ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు.

ఏంజెల్ జీన్స్ వేసుకుని టీ షర్టు వేసుకుంది. మా అపార్ట్ మెంట్ లో అమ్మాయిలంతా ఇంచు మించు అలానే వచ్చారు. వాళ్ళంతా డాన్స్, సాంగ్స్ బాగా హడావిడి చేసారు. ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు. అంతా వెళ్లి పోయాక. కేక్ మీద పేరు లేదని కేండిల్స్ బాగోలోవని ఏంజెల్ తలిదండ్రు లపై యుద్ధం చేసింది అలా అంజలి ఇంట్లో క్షమించాలి ఏంజెల్ ఇంట్లో చాలా పార్టీలు ,గెట్ టుగెదర్ లు జరిగేయి. అదే ఇంగ్లిష్ప ద్ధతి. మాట, కట్టు, ఆట పాట. మా అపార్ట్మెంట్ అంతా ఇదే కల్చర్ అనే కంటే ఊరంతా ఇంచుమించుగా ఇదే కల్చర్. ఇలా చాలా కాలం గడిచింది. నాకు ఇదంతా అలవాటయిపోయింది.
ఆ రోజు ఒక అద్భుతం చూసాను. అపార్ట్మెంట్ ముందు రంగు రంగుల ముగ్గులు. ఆ ముగ్గులని పువ్వులతో అలంకరిస్తూ 16 అణాల తెలుగు అమ్మాయిలా ఏంజెల్. నమ్మలేకపోయాను. నిత్యం తలుపు లేసుకుని ఖైదీల్లా ఉండే మా అపార్ట్మెంట్ వాళ్ళు మామిడాకుల తోరణాలు కట్టి, మామిడి కాయలు, ఉగాది పచ్చడి గిన్నె, పళ్ళేలలో పెట్టి. తలుపులు బార్లా తెరిచి కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. అంతా అయోమయంగా ఉంది నాకు. పక్కకి తలతిప్పి చూడగానే కరెంట్ షాక్ తగిలినట్టయ్యింది పక్కనే టీ వీ కెమెరాతో బృందం.
మా అమ్మ వద్దన్నా లేచి ముగ్గులు వేస్తుంది రోజూ. అంది అంజలి తల్లి. అప్పుడు నాకు అంతకంటే తట్టుకోలేని దృశ్యం కనిపించింది. ఆ ఆస్కార్ నటన చూసి తట్టుకోలేకపోతున్నాను అప్పుడు నాకు 16 అణాల తెలుగు అమ్మయిల బృందం లంగా ఓణీలలొ కనిపించింది. వీ ళ్లెవరబ్బా ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నాను, " ఉగాది శుభాకాంక్షలు" అంటూ పంచె కట్టులో (నేనెప్పుడూ పంచె కట్టులో ఉంటాను) ఉన్న నన్ను అందరూ చుట్టుముట్టారు. వాళ్ళు అంతా మా అపార్ట్ మెంట్ అమ్మాయిలే. నిత్యం జీన్స్ వేసుకుని "ఎకాడ , ఏందుకు, వాల్లు, వీల్లు," అంటూ తిరిగే వాళ్ళే. అప్పుడు విడింది మబ్బు. ఈ రోజు టీ వీ ప్రోగ్రాం ఉంది. ఉగాది స్పెషల్. టీ వీ ప్రోగ్రాం కోసం ఈ హడావిడి. వీళ్ళ కల్చర్, వీళ్ళ సంప్రదాయాలు.. ఏక దిన్ క సుల్తాన్ కథ గుర్తొచ్చింది.

------------------------------------ ఫాల్స్ ప్రెస్టేజ్ - చిన్న కథ - పూలబాల

మన ఇంటి దగ్గరలోనే భాస్కర్ రావు గారి బడి ఉంది చిన్నబ్బాయిని అందులో వేయచ్చుకదమ్మ అంది తిరుపతమ్మ. వెళ్ళబోతూ. "ఎక్కడే ?"అంది పక్కింటి కామేశ్వరితో బాతాఖానీ లో కూర్చున్న కృష్ణవేణి . ఇక్కడేనమ్మ ఆంజనేయుడి గుడికాడ. ఈ సందులో బడెల్లి పోతే రెండు నిమిసాల్లో ఎల్లిపోవచ్చు. అంది తిరుపతమ్మ. కృష్ణవేణి కి అర్థమైంది. అది పేదవాళ్ల బడి. అవును ఇప్పుడు మేం పేదవాలమే కదా అనుకుంది మనసులో సమాధానం చెప్పేలోపలే అమ్మా అంట్లన్నీ కడిగేసి అక్కడే ఎట్టేసినాను. ఎల్లొత్తాను. అని వెళ్ళిపోతున్నాది "రేపొస్తావా !" అనడిగింది కృష్ణవేణి . "ఏటమ్మా రెండు రోజుల నుంచి ఇలా అడుగుతున్నారు?" వెనక్కి తిరిగి అడిగింది తిరుపతమ్మ "ఏం లేదు లేవే నువ్వెళ్లు" అంది కృష్ణవేణి. తిరుపతమ్మ వెళ్ళిపోయింది. అబ్బ తల బద్దలైపోతుంది అంది కామేశ్వరి కృష్ణవేణి వంటగదిలోకి వెళ్లి కామేశ్వరి కి టీ పెట్టి తీసుకొచ్చింది. కామేశ్వరి టీ తాగి మరో గంట కూర్చుని అసుకు కొట్టి గోపాల కృష్ణ వచ్చేక లేచింది. చూడు ఆ పనిదాని మాట విని చిన్నవాడిని ఆ చెట్టు కింద బడిలో వేస్తే పరువు పోతుంది. కృష్ణవేణి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది దాని కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. తెలుసా ? నేను చెప్పాల్సింది చెప్పేను. అని వెళ్ళిపోయింది కామేశ్వరి.

కృష్ణవేణి పడక గదిలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి ఏవండీ హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం దొరికిందా ? లేదు కృష్ణా నా రాత బాగోలేదు. మూడు నెలలుగా తిరుగుతున్నా సరైన ఉద్యోగం దొరకట్లేదు. ఉద్యోగం దొరక్కపోయినా అప్పైనా దొరికిందా ? పిల్లవాడిని బడిలో వేయకుండా ఎంతకాలం వాయిదా వేస్తారు? మెల్లగా అంది కృష్ణవేణి. మీ రాత కాదండీ బాగోనిది నారాత. ఇంటి అద్దె కోసంనిన్న ఇంటాయన వచ్చారు . మీరు హైదరాబాదు వెళ్లారని చెప్పాను. ఇంటి అద్దె అయినా కట్టాలిగా అంది. కృష్ణవేణి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అబ్బబ్బా ఇంటి రాగానే డబ్బు డాబు అని నా ప్రాణం తీయకు. దాచుకున్న డబ్బంతా ఇంటి ఖర్చులకి ఇన్స్టాల్మెంట్స్ కే చాలడం లేదు ఇంకా ఆ ఇంటద్దె ఎక్కడి నుండి తెచ్చేది ? ఆ ఫ్రిడ్జ్ లేదా టీ వీ ఎదో ఒకటి అమ్మేద్దాం. ఫ్రిడ్జ్ లేదా టీ వీ వాషింగ్ మెషీన్ అన్నే ఇంస్టాల్ మెంట్స్ లో నే ఉన్నాయి. అయినా వాటిని అమ్మితే మన పరువు పోదూ ! అంది .
అబ్బా బ్బా ఇక్క నిమిషం నీ కాకి గోల ఆపి నాకు కాఫీ ఇస్తావా ? కాఫీ పొడి అయిపోయిందండీ. బేలగా అంది కృష్ణవేణి . కామేశ్వరి తాగేసిందా ? నా ప్రాణానికి అదొకత్తె దాపురించింది. కన్నీళ్లా ఫై మంచి నీళ్ళైనా తెగలెయ్యి అన్నాడు గోపాలకృష్ణ. వాటర్ ఫిల్టర్ పనిచేయట్లేదు మామూలు నీళ్ల్లు ఇవ్వనా అడిగింది కృష్ణవేణి. ఛీ ఈ ఇంటికి శని దాపురించింది అన్నాడు గోపాల కృష్ణ. ఏవండీ ఇంటాయన ఆంజనేయులు వచ్చారు ముందరి గదిలో ఉన్నారు. అంది కృష్ణవేణి మంచినీళ్లు అందిస్తూ. గోపాల కృష్ణ గడగడా మంచినీళ్లు తాగేసి గ్లాసు భార్య చేతికిస్తూ వీడు నాచేత ఎలా మంచినీళ్లు తాగించేస్తున్నాడో చూడవే ! అని ఖాళీ గ్లాసు భార్య చేతికిచ్చి ముందరిగది లోకి వెళ్ళాడు.
నమస్కారం అద్దె రెండురోజుల్లో ఇచ్చేస్తానండీ అంటూ ముందరి గదిలోకి వచ్చిన గోపాల కృష్ణతో ఆంజనేయులు "అందుకోసం రాలేదయ్యా. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు అని తెలిసింది మాబావ మరిది కంపెనీలో మన ఇంటి దగ్గరలోనే ఒక ఉద్యోగం ఉంది. కాకపొతే సాఫ్ట్ వేర్ జాబ్ కాదు, చేస్తావా? "అన్నాడు. ఒక్క సారి గోపాల కృష్ణ ముఖం వెలిగింది. ఏపని అన్నాడు ? గోపాలకృష్ణ . "చేసేది గుమస్తా ఉద్యోగమే కానీ పోస్ట్ పేరు ఆఫీస్ మేనేజర్." అన్నాడు ఆంజనేయులు. "చెప్పుకోడానికి బాగుంది." అనుకుని "జీతం ఎంతిస్తారు?" అన్నాడు. "అట్టే ఎక్కువ ఇచ్చుకోలేడు ప్రస్తుతానికి పది వేలిస్తాడు." అన్నాడు ఇంటి యజమాని. అప్పుడే మంచినీళ్ల గ్లాసుతో వచ్చిన కృష్ణవేణి వైపు చూసాడు ఒప్పుకోమని సైగ చేసింది. సరే అన్నాడు గోపాల కృష్ణ. ఆంజనేయులు మంచి నీళ్లు తాగి బైటకెళ్ళాడు. పైన ఎదురు చూస్తున్న బావ మరిది బండి స్టార్ట్ చేసాడు. "బావా మూడు నెలల నుంచి ఇంటి అద్దె కట్టనివాడికి ఉజ్జోగం ఇప్పిస్తున్నావంటే ఎంత గొప్పవాడివి బావా !" అన్నాడు. "బండి పోనీయ్ అసలు విషయం చెప్తాను అన్నాడు ఆంజనేయులు. బండి కొంచెం దూరం పోయిన తరువాత " తన్నినా వీడి దగ్గర పైసారాలదు. వీడికి ఉజ్జోగం ఇప్పించింది నా అద్దె కోసం. నా అద్దె విరుపుకోగా మిగితా జీతమే వీడికి తెలిసిందా " అన్నాడు. "అంటే ఇక పై నీకు నెలనెలా నేనే అద్దె కట్టాలన్నమాట. గోపాలకృష్ణ ని చూస్తే జాలేస్తున్నది." అన్నాడు బావమరిది. "నేను ఈపని చేయకపోతే నన్ను చూసి జాలిపడి ఉండేవాడివి. ఇంత ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటే జీవితాలు ఇలాగే ఉంటాయి. స్థోమత లేకున్నా అప్పులు చేసి ఖరీదైన వస్తువులతో షో చేయాలనుకునే వాళ్లకి ఇప్పటికైనాబుద్ధి రావాలి. "అన్నాడు ఆంజనేయులు. "వస్తుందంటావా ?" అన్నాడు బావమరిది.

***
తలుపు చప్పుడైతే తీసి చూసింది కృష్ణవేణి. ఎదురుగా కామేశ్వరి. రారా కూర్చో అంది కృష్ణవేణి. ఇద్దరూ ముందరి గదిలో కూర్చున్నారు. ఏంటి శుభవార్త ఏమైనా ఉందా ముఖం వెలిగిపోతోంది అంది కామేశ్వరి. "తిరుపతమ్మా రెండు కాఫీలు తే" అరిచింది కృష్ణవేణి. దాంతో సగం అర్ధమైపోయింది కామేశ్వరి కి. "పిల్లాడిని ఎక్కడ వేశావు?" అంది ఇంకెక్కడ వేస్తాను.. ఆ కార్పోరేట్ స్కూల్ లోనే. నిన్నే జాయిన్ చేసేసాను." "భాస్కర్ రావు గారి బడిలో వేయలేకపోయారా? పిల్లల్ని ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు." అంది తిరుపతమ్మ కాఫీ ఇస్తూ. మేనేజర్ గారి అబ్బాయిని అంత చిన్నబడిలో ఎలా చేరుస్తామే. పోయి పని చూసుకో. " అంది కృష్ణవేణి. తిరుపతమ్మ వెళ్ళిపోయింది.

నీ మొగుడు ఉజ్జోగంలో జేరి మూడురోజులే కదా అయ్యింది మరి.. ? అంది కామేశ్వరి. ఓ ! అదా బజాజ్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నాము." అంది కృష్ణవేణి నవ్వుతూ అంతేలే మేమూ అంతే ఇల్లు తాకట్టు పెట్టి పిల్లలని అమెరికా పంపిస్తున్నాము. మా హోదాకు తగ్గట్టుగా మేమూ ఉండాలి కదా. అంది కామేశ్వరి.



--------------------------------------------------"ఫోటో"  చిన్న కథ - పూలబాల



తెలుగు వారి ఆధునికత - సంప్రదాయాలు 
.
విమానంలో చెప్పిన 24 కథలలో  2 వ కథ 
ఇంటివద్దే అలంకరించిన పెద్ద గదిలో   సశేష్ తన 15 వ పుట్టిన రోజు జరుపుకుంటు న్నాడు. సాయం కాలం 6 గంటలు అయ్యింది.  స్నేహితులు ఒకరొకరుగా వస్తున్నారు.   స్టీరియోలో ఇంగ్లీష్ సంగీతం అందరినీ అలరిస్తోంది. కొద్దిమంది దగ్గర బంధువులు స్నేహితులు వచ్చారు.  " అన్నయ్యకు డబ్బులిచ్చేశారు  స్నేహితులతో జాలీగా  ఎంజాయ్ చేసాడు నాకు మాత్రం ఇలా చిన్న పిల్లల్లా  ఇంటిదగ్గర.." అని గొడవ చేస్తున్న చిన్న కొడుకు  తో  "నువ్వు చిన్న పిల్లాడివే కదరా"  అంది సంధ్య  ఆ మాట సశేష్ కి నచ్చలేదు. ముఖం ఇట్టే  పెట్టేడు సశేష్.     వాడికి వీసా వచ్చి వాడు విదేశాలు వెళ్లిపోతున్నాడు ... అన్నాడు సంతోష్.  నాన్న అమ్మ  "నేను కూడా విదేశాలు వెళ్లిపోతాను."

 అలాగే  వచ్చే సంవత్సరం నువ్వు కూడా అలాగే  అన్నయ్య లాగే జరుపుకుందువు గాని. ఇప్పుడు చూడు తాతయ్య , అమ్మమ్మ , మావయ్య అందరూ వచ్చారు కదా వాళ్ళతో జరుపుకో. చూడు అందరూ వచ్చేసారు అంది  సంధ్య.  సశేష్ లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. 
  
అలంకరించిన పెద్ద గదిలో కొవ్వత్తులు ఆర్పి కేక్  కోసి అందరికీ పంచాడు  సశేష్.  హేపీ బర్తడే  టు యూ  అని అనేక గొంతులు  పాడాయి. ఒక్కొక్కరూ సశేష్ కి బహుమతులు అందించి వెళ్లి పోయారు స్నేహితులంతా వెళ్లిపోయాక కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు. సశేష్  తల్లి సంధ్య   తాతగారు  నీకు ఎం గిఫ్ట్ తెచ్చారో  చూడు అంది  సశేష్ తో.  ఫోటో యేగా తరవాత చూస్తానులే అమ్మమ్మా అన్నాడు  సశేష్.  చూడరా తాతగారు ముందే  చూడాలి  సశేష్  తండ్రి  సంతోష్.  

నీకు గత ఏడాదిలాటి పంచెకట్టు ఫోటో కాదు. పరుపుకింద పెట్టాల్సిన అవసరం రాదు అంది అమ్మమ్మ . సశేష్ ఫోటో పై చుట్టిన కాగితాన్ని విప్పి సూట్ తో ఉన్న తన ఫోటో చూసి మురిసి పోతూంటే  అమ్మమ్మ పరుపు కింద  మనవడు పెట్టేసిన ఫోటో తీసి చూసి మురిసిపోతోంది.  పంచ కట్టులో ఎంత బాగున్నాడో అంది అమ్మమ్మ. సశేష్ పరుగు పరుగున ముందరి గదిలోకి  వెళ్లి సూట్ తో ఉన్న తన ఫోటోని గోడకున్న మేకుకి తగిలించాడు. 

వస్త్రధారణ మన సంస్కృతి లో చాలా ముఖ్య భాగం కానీ మన వాళ్ళు సూట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం అందరికీ చూపుతున్నారు. పంచె కట్టుకున్న ఫోటో లు మాత్రం పరుపులకింద మంచాల కింద దాచుకుంటున్నారు. అంది అమ్మమ్మ. అయ్యో పిచ్చి అమ్మ వీడే కాదు ఈ రోజుల్లో అందరూ అంతే.  వీడు ఇంకా నయం ఆ ఫోటోని పరుపుకింద పెట్టేడు. పెద్దాడైతే చెత్తకుప్పలో పడేసాడు.  అని నవ్వుతుంటే అమ్మమ్మ పేలవంగా నవ్వుతోంది.  తాతగారి కళ్లనుంచి కన్నీటి చుక్కలు రాలి పడుతున్నాయి. మన సంప్రదాయాలు ఎప్పుడో  అటకెక్కేశాయి  అత్తయ్య అయినా భాషే పోయాక వస్త్రధారణ ఒక లెక్కా అన్నాడు సంతోష్.



తిరుపతి లడ్డు చిన్న కథ పూలబాల
ఆహా ఇదీ నేటి భక్తి - ఆధునిక భక్తి
.
ఉదయం 10. గంటలు అవుతోంది. అపార్టుమెంట్లో మగవాళ్లందరూ అందరూ ఆఫీసులకి పిల్లలు బళ్ళకి వెళ్ళిపోయాక కుసుమ గారు ప్రసాదం అంటూ లోపలి వచ్చింది కళ. కళగారా ఏంటి సంగతి " తిరుపతి ప్రసాదం" అంది కళ్ళు చక్రాల్లా తిప్పుకుంటూ కళ. తిరుపతి వెళ్ళారా ? ఎప్పుడెళ్లారు అంది కుసుమ. మొన్న , మూడురోజులు అక్కడే ఉన్నాము కాణిపాకం వేదాద్రి అన్నీ చూసుకుని వచ్చాము అని లడ్డు పొట్లం చేతిలో పెట్టింది. అబ్బో మూడు రోజులే! దర్శనం బాగా జరిగిందా? అంది కుసుమ "బాగా రద్దీ గా ఉంది. చాలా పెద్ద క్యూ ఉంది." అని కళ. చెపుతుండగానే "సర్వ దర్శనమా? ఐతే పది గంటలు పడుతుంది. అందుకే మావారు ఎప్పుడూ స్పెషల్ దర్శనం తీసుకుంటారు. 3 గంటల్లో అయిపోతుంది." అంది పక్కింటి పార్వతి. లడ్డు ఇచ్చింది కళ "మూడు గంటలే! మేము వెళ్తే 3 నిమిషాల్లో అయిపోతుంది . మావారు వి ఐ పీ పాస్ తెస్తారు. మాకు రెడ్కార్పెట్ వెల్కమ్. అంది కిందింటి కామాక్షి లోపలకి వస్తూ.

కళ ఆమెకూ ప్రసాదం ఇచ్చింది. ప్రసాదం తీసుకున్న కామాక్షి "నన్ను అడగకపోయావా వి.ఐ.పి పాస్ ఇప్పించేదాన్ని. కాటేజీలో హాయిగా ఉండేదానివి." అంది. ఆ మరే అంది కళ మరుక్షణం పక్కకువంగి పార్వతి చెవిలో " దీనికి పలుకుబడి ఎంతుందో తెలీదు కానీ వెధవ బడాయి చాలా ఉంది." అంది "అవునవును" అంది పార్వతి కళ్ళతోనే. "కామాక్షి ది చీరల వ్యాపారం తనకి సర్కిల్ ఎక్కువ అందరికీ అలా ఉండొద్దూ!" అని కామాక్షిని మెప్పుచేసింది కుసుమ. "దాని(కామాక్షి) దగ్గర చీరలు తీసుకుని 6 నెలలైనా డబ్బులివ్వలేదు. మరి తందానా తానా అనక తప్పదు కదా!" అనుకుంది కళ మనసులో. పైకి మాత్రం "దేవుడి దగ్గరకి వెళ్లేటప్పుడు అందరూ ఒకటే. సామాన్య దర్శనం వల్లే పుణ్యం వస్తుంది తెలుసా? "అంది.

"పుణ్యం కాదు ఆయాసం వస్తుంది." అంది కామాక్షి. అందరూ నవ్వారు. కళకి కాలింది. కామాక్షి చేతిలో సంచి నుంచి చీరలు తీసింది. "అదేంటి చీరలు పట్టుకొచ్చేసావు? ఆశ్చర్యం నటిస్తూ అంది కళ. "మరేంచేయను కొత్తచీరలొచ్చాయి చూడడానికి రమ్మంటే ఎవ్వరూ రాకపోతిరి." అంది కామాక్షి. "ఇదెప్పటినుంచి అంది కళ. "ఏంటి? " అంది కామాక్షి "చీరలు ఇలా ఇళ్లకు తేవడం" వివరించింది పార్వతి. అందరూ నవ్వేరు. లక్ష రూపాయల చీటీ లో చేరలేదని అక్కసు దీని మొహం మండా అని మనసులో తిట్టుకుంది కళ. పార్వతిది చీటీల వ్యాపారం. అప్పుడే పనిమనిషి కోటమ్మ వచ్చింది. ఎవే ఈ రోజు ఆలస్యంగా వచ్చావు , ఇంకా నేనే తోవేసుకుందామని అనుకుంటున్నాను. అంది కుసుమ.

రెండో ఫ్లోర్ లో ఆయమ్మికాడ ఆలీసమైపోనాది అంది కోటమ్మ "సరే సరే నిన్న ఇల్లు తడిగుడ్డ పెట్టలేదు ఈ రోజు పెట్టాలి ముందు అంట్లు తోమేసేయ్ అంది కుసుమ. వంటగదిలోకి వెళ్లేముందు కోటమ్మ కళ చేతిలో లడ్డులు చూసి "ఎమ్మా తిరుపతి పెసాదం ఒట్టుకొచ్చావా అంది . కోటమ్మ అలా అనగానే "ఇదిగోనే!" అని ఒక లడ్డు ముక్క చిదిపి కోటమ్మకిచ్చి " కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకో !" అంది. కోటమ్మ కళ్ళకి ఆదుకోలేదు సరికదా ఉదాసీనంగా తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కోటమ్మ అంట్లు తోముతున్నంతసేపూ పార్వతి, కుసుమ, కళ లొడ లొడా మాట్లాడుకున్నారు. కానీ కోటమ్మ తడిగుడ్డ పెట్టేటప్పటికీ కళ పార్వతి వెళ్లిపోయారు. కుసుమ ఒక్కతే ఉంది. ఏంటే మతం మారేవా లడ్డు కళ్ళకి అడ్డుకోకుండా మరీ అంత అయిష్టంగా నోట్లోవేసుకున్నావు. అంది కోటమ్మతో "నానేటి మతం మారనేదమ్మ " అంది కోటమ్మ

మరి తిరుపతి లడ్డు ... అని కుసుమ అంటుండగా "ఊరుకో యమ్మా అదేం తిరుపతి లడ్డు! ఈవిడేం(కళ ) మనిషి! ఎక్కడ కొంటాదో తెలీదు కానీ ఇవి తిరుపతి లడ్లు కావమ్మా. ఒక వేళ అది సరైన లడ్డూ అయినా ఈవిడ సరైన మనిషి కాదు. ఈవిడ తిరుపతి లడ్డులనిపంచే వంకతో ఈ పేటలో ఇంటింటికీ తిరుగుతాది అదంతా ఒక వ్యాపారం సులువు అమ్మా !" అంది కోటమ్మ . "అందేంటే కళ గారిని అలా అంటావు. కామాక్షి పార్వతి అలాచేస్తారు. ఎందుకంటే పార్వతి ది చీటిల వ్యాపారం కామాక్షిది చీరలవ్యాపారం. వాళ్ళు చేస్తారాపని. తిరుపతి లడ్డుని ఆడ్డుపెట్టుకుని మాటలు కలుపుతారు. కళగారికి ఎం అవసరం ? ఆవిడకి ఎంవ్యాపారంలేదే." అంది కుసుమ "ఆవిడది రియల్ ఎస్టేట్ వ్యాపారమమ్మా నీకు తెలీదా?"అంది కోటమ్మ "మరి నాకెప్పుడూ చెప్పలేదు"అంది కుసుమ ఆశ్చర్యంగా .

నిన్ను ఒగ్గేసింది. నన్ను ఎందుకొదిలేసింది నామీద అంత ప్రేమ ఏంటో?" కోటమ్మ నేరుగా సమాధానం చెప్పలేక "ఏటో మాయాదారిగోల లడ్డుమీద యాపారాలేటో అంది కోటమ్మ వగస్తూ. లడ్డుమీద రాజకీయాలే నడుస్తున్నాయి వ్యాపారాలు నడవ్వా. అవునే యమ్మ ఆదీనిజమే అనిపెద్దగా నవ్వేసింది కోటమ్మ అమ్మ అంతా యాపారామె నమ్మా అందరికీ ఇంటికాడ కూడా యాపారాలే. ఈ ఆడవాళ్లు రకరకాల యాపారాలు చేసి అందరి నెత్తిమీద చెయ్యి ఏసేస్తున్నారు. అంది కుసుమా. నిజవమ్మా నువ్వు సెప్పింది నిజం నువ్వొక్కత్తివే ఏ యాపారం చేయడంలేదు. మంచి పని చేస్తన్నావమ్మా సక్కగా సీరలు తీసుకుంటావు (డబ్బులు కట్టవు ) చీటీలు పాడుకుంటావు ( డబ్బులు కట్టవు ) సక్కగా వాడుకుంటావమ్మా. అందుకే నీ కాడెవ్వరూ ఏటి కొనమని అడగరు నోరెత్తరు." కోటమ్మ చెప్పుకుంటూ పోతోంది. కుసుమకి వత్తి కాలిపోయింది.

No comments:

Post a Comment