Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, October 2, 2024

ప్రజల వింత సైకాలజీ - PRIME 9 లో పూలబాల

ప్రజల వింత సైకాలజీ తెలిసిస్తే ఆశ్చర్యపోతారు.

.పది వేల మంది జనాభాలో అడిగినా ఒక్కరూ తోడు రారు
రోడ్డులో గుంతలు పూడిస్తే ఎక్కువమంది అసలు పట్టించుకోరు రోడ్డులో గుంతలు పూడిస్తే ఎందుకు ముఖం తిప్పేస్తారో తెలుసా ? దేవుడు భజన , అన్నదానం వీటికి మోజెక్కువ .రాత్రి 12 దాకా మైకు పెట్టి భజన చేసి ఊరంతటినీ పీడిస్తూ అది పుణ్య అనుకుంటారు. రోడ్ల పై గోతులు తీసి షామియానా లు కట్టి అన్నదానం చేస్తే అది కూడా పుణ్యమే.
ఇది నిజమా అనుకోవచ్చు కానీ నిజమే. ప్రజా సేవ చేస్తే మొదట అనుమానిస్తారు. వీడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు. అనుకుంటారు ఇది నిజం. నేను రోడ్లు బాగుచేస్తున్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నారు ? మీకేం సంబంధం అని అడిగినవాళ్లే ఎక్కువ. కొంత మంది " ఆ గుంతలు అలాగే వదిలేయండి ప్రజలకి బుద్ది రావాలి ఎవరికి ఓట్లేస్తే రోడ్లు బాగు పడతాయో ప్రజలకి తెలిసి రావాలి. మీ కెందుకీ బాధ." అన్నారు . నేను స్వచ్చంద సేవ చేస్తున్నాను రాజకీయాలతో ముడి పెట్టకండి అంటే వినరే. రోడ్లకి సేవచేసినా తెలుగుకి సేవచేసినా తక్కువ గా చూస్తారు. మాతృబాష దినోతవాసం జరుపుదామని ఊరి పెద్దలని అడిగితె నవ్వి ఊరు కున్నారు. పది వేల మంది జనాభాలో అడిగినా ఒక్కరూ చిన్న సాయం కూడా చేయరు . మంచి పని చేస్తే మానసికంగా కృంగదీసేవారే ఎక్కువ ఎవరేమను కున్నా పట్టించుకోకూడద నుకున్నా తరువాతే ఈ పని మొదలెట్టాను. మనజీవితమంతా సేవలో లేకున్నా మనజీవితంలో ఒక్కరోజైనా సేవ ఉండాలి. అన్నారు పూలబాల

No comments:

Post a Comment