జీన్-పాల్ సార్త్ర ఫ్రెంచ్ తత్వవేత్త, నాటక , నవలా రచయిత, స్క్రీన్ రైటర్, రాజకీయ కార్యకర్త, జీవితచరిత్రకారుడు, సాహిత్య విమర్శకుడు. ఇతనిని 20వ శతాబ్దపు ఫ్రెంచ్ తత్వశాస్త్రం, మార్క్సిజం లో ప్రముఖ వ్యక్తిగా పరిగణిస్తారు. సార్త్ర తత్వశాస్త్రంలో అస్తిత్వవాదం ( ఫినామెనాలజి) కి సంబంధించి కీలక వ్యక్తులలో ఒకరు.
జీన్-పాల్ సార్త్ర 1905 లో పారిస్ లో ఫ్రెంచ్ నావికాదళ అధికారి జీన్-బాప్టిస్ట్ అన్నె-మేరీలకు ఏకైక సంతానంగా జన్మించాడు. సార్త్రకి రెండు సంవత్సరాల వయస్సులో అతని తండ్రి అనారోగ్యంతో మరణించాడు. అన్నే-మేరీ మెయుడాన్ లోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లి, అక్కడ ఆమె తన తండ్రి చార్లెస్ ష్విట్జర్ సహాయంతో సార్త్ర ను పెంచింది, ఆమె సార్త్రకి చాలా చిన్న వయస్సులోనే శాస్త్రీయ సాహిత్యానికి పరిచయం చేసింది. ఎకోల్ నార్మల్ లో జేరినప్పటి మొదటి నుండి, సార్త్రే అల్లరి వాడుగా ఉన్నాడు, చిలిపి చేష్టలు చేసేవాడు.
1927లో, ఇతను జార్జెస్ కాంగుయిల్హెమ్తో కలిసి పాఠశాల రెవ్యూలో గీసిన అతని సైనిక వ్యతిరేక వ్యంగ్య కార్టూన్, ముఖ్యంగా ఆ పాఠశాల అధికారి గుస్టావ్ లాన్సన్ను కలచివేసింది. అదే సంవత్సరంలో, తన సహచరులు నిజాన్, లారౌటిస్, బెయిల్లౌ, హెర్లాండ్లతో కలిసి, చార్లెస్ లిండ్బర్గ్ విజయవంతమైన న్యూయార్క్ సిటీ-పారిస్ విమానాన్ని అనుసరించి అతను ఒక చిలిపి చేష్టను మీడియా వాళ్ళను పిలిచి నిర్వహించాడు. లిండ్బర్గ్ కు ఎకోల్ గౌరవ పట్టా ఇవ్వబోతోంది అని మీడియా కు చెప్పాడు. లు పతి పారిసియన్ సహా అనేక వార్తాపత్రికలు మే 25న ఈ కార్యక్రమాన్ని ప్రకటించాయి. పాత్రికేయులు, ప్రేక్షకులతో సహా వేలాది మంది, వారు చూస్తున్నది లిండ్బర్గ్ మాదిరిగా కనిపించే ఒక స్టంట్ అని తెలియక వచ్చారు. ఈ సంఘటన లాన్సన్ రాజీనామా చేయడానికి దారితీసింది.
ఆయన రచనలు సామాజిక శాస్త్రం, సాహిత్య అధ్యయనాలను ప్రభావితం చేశాయి. 1964లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్నాడు. అయితే దానిని తిరస్కరించడానికి ప్రయత్నించాడు. తాను ఎప్పుడూ అధికారిక గౌరవాలను తిరస్కరించానని, "ఒక రచయిత తనను తాను ఒక సంస్థగా మార్చుకోకూడదు" అని చెప్పాడు.
సార్త్రకి తోటి అస్తిత్వవాది, తత్వవేత్త, స్త్రీవాది సిమోన్ ద బువా (Simone de Beauvoir) తో బహిరంగ సంబంధం ఉండేది. సార్త్ర, ఇంకా దిబువా కలిసి సాంస్కృతిక సామాజిక ఆచార వ్యవహారాలను సవాలు చేశారు,
ఈ ఇతివృత్తం అతని ప్రధాన తాత్విక రచన 'బీయింగ్ అండ్ నథింగ్నెస్'
No comments:
Post a Comment