సరస్వతీ శతకం - పూలబాల
.
బహుభాషా కోవిదుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే మాతృభాషా శిరోమణి బిరుదాంకితుడు పూలబాల 2025 లో వంద కంద పద్యాలతో అందంగా దేవిని వర్ణన చేస్తూ సరస్వతి శతకాన్ని రాశారు.
తరగని యక్షర లక్షలు పేర్మితొ బ్రహ్మస తినాకు పెరగ మనిచ్చెన్
వరముగ వివేక మిచ్చెను వెఱవక రచనల నుజేయ వేడుక నిచ్చెన్
అంటూ కృతజ్ఞతలతో ప్రారంభించి...

జాపితి కరములు నీకడ జూపుము నీదయ నొసంగి శుభమగు విద్యన్
చూపుము తోవను ముందుకు దీపుర మగుకను లతోడ దీపము నీవై
అంటూవిద్యనిమ్మని మార్గ దర్శనం చేయమని ప్రార్థించారు.
తెల్లని హంసను ఎక్కిన చల్లని మాతను తలంచి చక్కటి విద్యన్ ఉల్లము నిండగ నిమ్మని అల్లన వేడెద చదువుల నన్నియు నిచ్చున్. అంటూ ముత్యాలవంటి పదాలు మాలగా కూర్చి సరస్వతిని అలంకరించారు పూలబాల. దేవి అనుగ్రహం కోరి సకల విద్యలనిమ్మని ప్రార్థించే పద్యాలు సాహిత్య సౌందర్యం తో శ్రవణానందం కలిగే విధంగా మనసుని ఉర్రూతలూపే విధంగా రచించారు.
విశ్వకిరణ శక్తి జనితగా సరస్వతిని వర్ణించారు, విశ్వమునీవేవిద్యకు అని భాగవత మెవరు పాడిన రాగము లందుప లుకుస్వ రసుధల్ నీవే భగవత్ గీతయు భారత భాగవ తమునందుజూడ భావము నీవే అని సకల చరాచర సృష్టికి మూలం సరస్వతే అని ప్రతి పద్యం గుర్తుండిపోయేలా రాశారు.
.
బహుళ గ్రంథ కర్త రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన పూలబాల "వెంకటాధిప సూక్తం" " శ్రీకాళహస్తీశ్వర శతకం " ( ధూర్జటి రాసినది కాదు ) వంటి భక్తి గ్రంథాలు కూడా రాశారు.
పూలబాల రాసిన సరస్వతీ శతకంలో పద్యాలని ఇలా విభజించారు
మొదటి 20 పద్యాలు అనుగ్రహం కోరి ప్రార్ధించే పద్యాలు
20 నుంచి 30 వరకు పద్యాలు అనుగ్రహం పొందినట్టు
31 నుంచి 50 వరకు భక్తి పారవశ్యం తెలియజేసే పద్యాలు
51 నుంచి 60 విన్నపాలు తెలియజేసే పద్యాలు
61 నుండి 75 వరకు తెలుగు భాషని కాపాడమని శరణ పద్యాలు
76 నుండి 80 వరకు "శుద్ధ కవితా పుష్పాలు"
81 నుండి 85 "విద్యకి స్తుతి"
86 నుండి 100 వరకు "అంకితం"
ఇలా 8 భాగాలుగా విభజించి వంద పద్యాలు రాసారు
శతకం అంటే వంద పద్యాలని అందరికీ తెలిసినదే.

No comments:
Post a Comment