Monday, January 26, 2026

"ఇది ఒక మంచి పుస్తకం" పల్నాడు జిల్లా S.P.

 "విప్లవం అంటే గన్ కాదు పెన్ " ....పూలబాల మహాకవి 

"ఇది ఒక మంచి పుస్తకం"  పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ 

 

విప్లవ కవిత్వం అంటూ విరసం తో ప్రారంభించిపీపుల్స్ వార్ గ్రూప్ను స్థాపించడం తమ బిడ్డలను అమెరికా పంపి, అమాయకులని రెచ్చగొట్టి అడవుల్లోకి పంపించడంఅర్బన్ నక్సల్స్ తరతరాలుగా చేస్తూ వచ్చారు 

1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో స్థానిక భూస్వాములు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ నాయకుల నాయకత్వంలో సాయుధ రైతు తిరుగుబాటుతో నక్సలిజం ప్రారంభమైందిమావో జెడాంగ్ బోధనల నుండి ప్రేరణ పొందిన  ఉద్యమం "ప్రజా యుద్ధంద్వారా రాష్ట్రాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది.

విప్లవ రచనలు చేసిన వరవరరావు మావోయిస్టు సంబంధాలు కలిగి కోరేగాం కేసులో 2018 లో UAPA చట్టం క్రింద అరెస్ట్ అయిన మావోయిస్టు నాయకుడు.   కె.జి. సత్యమూర్తి సిపిఐ పీపుల్స్ వార్ పార్టీ స్థాపకుడు విప్లవ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ కవితలు రాసేవాడు వాటిని వరవరరావు తన పత్రికలో ముద్రించేవాడు. సత్యమూర్తి నక్సల్బరీ ఉద్యమంతో ప్రభావితమై కె. సీతారామయ్యతో కలిసి 1968లో పీపుల్స్ వార్ గ్రూప్ను స్థాపించారుప్రభుత్వాన్ని పడగొట్టే ఒక టూల్ విప్లవంఅన్యాయం పై తిరుగుబాటు ప్రజా ప్రయోజనాలు ఒక ముసుగు

విప్లవమంటే ఆయుధాలు కాదు అడవులు కాదు. చేతిలో పెన్ ఉన్నంతవరకే అది విప్లవం. మనిషి ప్రజలలో ఉన్నంతవరకే అది విప్లవం. మనిషి చేతిలోకి గన్ వచ్చాకమనిషి ప్రజల నొదిలి అడవిలోకి పోయి చెట్ల చాటున నక్కేక విప్లవం చచ్చిపో తుంది.  

నిజమైన విప్లవం పోలాండ్ విప్లవం

పొలిటిషన్ గా మారిన ఎలెక్ట్రిషియన్ లెచ్ వాలెసా. పోలాండ్కు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పాలనను అంతం చేయడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించాడు.

నిజమైన విప్లవం పోలాండ్ విప్లవం . గాన్ పట్టకుండా అడవుల్లోకి పారిపోకుండా, ప్రజా మద్దత్తు ను కూడగొట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించిన విప్లవం. నిజమైన ప్రజా విప్లవం 


No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...