Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, February 19, 2015

The Rape - One Act play


ద రేప్- తెలుగు నాటిక 


పాత్రలు : Five Men and a Woman

గోల్డ్ బిస్కట్ Man with a gold biscuit in his neck. 
వైన్ బాటిల్ Man with a wine bottle in hand.
నైఫ్ Man with a knife in his hand
బ్లాక్ కోట్ Man wearing black coat.
పోలిటిషన్ కేప్ Man wearing politician's cap.
బుక్ Woman carrying a book.

స్టేజ్ : ఒక చీకటి రాత్రి ఒక ఆరుబయట ప్రదేశం. ఆకాశం మేఘావ్రుత్తమై ఉంది.

సీన్: ఐదుగురు మగవారు ఒక స్త్రీ దర్శన మిస్తారు.

1. మొదటి మగ వాడి మెడలో బంగారు బిస్కట్ బంగారు చైన్ కి వేల్లాడుతుంటుంది.
2. రెండవ మగవాడు పూటుగా తాగి ఉంటాడు. వాడి చేతులో బాటిల్ ఉంటుంది.
3. మూడవ మగాడు తారు డ్రమ్ము లా నల్లగా , పెద్ద మీసాలతో, మొఖం నిండా స్పోటకం మచ్చలతొ భయంకరంగా ఉన్నాడు వాడి చేతులో కత్తి ఉంటుంది.
4. నాలుగవ మగవాడు నల్ల కొటువేసుకుని సన్నగా ఉంటాడు.
5. ఐదవ మగవాడు మిగితానలుగురినీ కలిపితే ఎంత ఉంటారో అంత లావుగా తెగబలిసి ఉంటాడు. దేశాన్ని దిగమింగిన అనుభవం ముఖం లో, తాచు పాము కళ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది.
ఆ దుష్టుల మధ్య ఒక సుకుమార స్త్రీ కాంతివంతమైన శరీరంతో, మొఖాన్న గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఆమె చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉంటుంది.
గోల్డ్ బిస్కట్ : నా కంటే గొప్ప వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఉండడానికి వీల్లేదు. అదంతే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, మనిషి నా చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడు లేని భూమి నేను లేని మనిషి ఒక్కటే. ఇప్పుడు నేను బంగారం బిస్కట్ రూపం లో ఉన్నారు. నాకు భగవంతుడికి మల్లె అనేక రూపాలు ఉనాయి. నేను ఆయన లగే సర్వాంతర యామిని. గట్టిగా మాట్లాడితే దేవుడు కూడా నా లోనే ఉన్నాడు. ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ! నన్ను డబ్బు అంటారు లెండి. అందరూ నాకు వంగి సలాం చేయాల్సిందే నన్ను భుజాలమీద మోయాల్సిందే
వైన్ బాటిల్: షటప్!! బ్లాడి గోల్డ్ బిస్కట్, నా నోరు ఎవ్వరూ నొక్క లేరు. నేను గొంతులోకి పొతే మాటలు తన్నుకుంటూ వచ్చేస్తాయి అంతే. గొప్ప గొప్ప పనులు చేసే ముందు తరువాతా అంతెందుకు మంచికి చెడ్డకి, సుఖానికి దుఖానికి ముందు వెనుక అన్నిటికీ మనిషి నన్నే ఆశ్రయిస్తాడు. నాపేరు విస్కీ. నా పవర్ ఏంటో తెలీకుండా మాట్లాడుతున్నావు.


బ్లాక్ కోట్ : కట్టిపెట్టండి మీ ప్రేలాపన, డబ్బు ఉండి తాగి తప్పులు చేసిన వాళ్ళు ఎంతో మంది జైళ్ళ లో మగ్గుతున్నారు. వాళ్లకు బెయిల్ రావాలంటే డబ్బు ఒక్కటీ చాలదు వాగుడు ఒక్కటీ చాలదు. ఆర్గ్యుమెంట్, లా పాయింట్ తెలియాలి. నల్లకోటు పవర్ ఏంటో తెలుసుకోండి.అందరి భుజాలు ఎక్కే అర్హత నాకుంది, మీ అందరూ నన్ను మోయాల్సిందే అదే న్యాయం.
ఏయ్ నల్లకోటు నువ్వు పని చేసేది నాకోసమే ఆ సంగతి మర్చిపోకు. న్యాయం కోసం కాదు. అది మర్చిపొకు.
ఖద్దరు టోపీ ని మీ అందిరికీ పెద్ద అన్నని నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను అని మర్చి పోయి వాదులాదుకున్తున్నారు. నేను మర్డర్ చేసినా నా మీద కేసు లేదు, తీర్పు లెదు. చూడు నల్ల కోటు .. నువ్వు ఎలా నడవాలో, ఎం చేయాలో చేయకూడదో , ఇంతెందుకు నిన్ని తయారు చేయడం, రద్దు చేయడం కూడా చేసేది నెనె. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నెనె. నన్ను ఎవ్వడైనా మోయల్సిందే. అందరి నెత్తిన ఎక్కేది నేనే. నేనే రాజకీయాన్ని.
పుస్తకం లో పుటలు రెపరెప లాడాయి. పుస్తకం నిశ్శబ్దం గా ఉంది.
పుస్తకం ఎందుకంత నిశ్శబ్దం గా ఉంది? అడిగింది నల్లకొటు. ఎందుకంత నిక్కు నీకు? ఏముందని?
నన్ను నేను ఎవరి తోనూ పోల్చుకోను , నేను స్త్రీని , సరస్వతి తో పోలుస్తారు. నేను గౌరవించ దగ్గ దానిని.
బంగారం బిస్కట్ : ఒరేయ్ నన్ను ఎవడ్డైనా మోయందిరా.
కత్తి : కత్తి గుండెల్లో దిగుతాది నాకొడక ఎవరా నన్ను మోయ్యమనేది
వైన్ బాటిల్ : ఒరయ్ నేను తాగి ఉన్నాను, నడవలేకున్నాను నన్ను కూడా మోయండిరా!
ఎరా నీకు మళ్ళీ చెప్పాలా? కత్తి చూపించాడు
నల్ల కోటు : మోయండ్రా నన్ను నేను నడవను. అటు ఇటు చూ సాడు నల్ల కోటు.
అమ్మో నువ్వు డబ్బున్నోడివి, అమ్మో రౌడీ మారాజువి నువ్వు వద్దు. ఒసేయ్ నువ్వు రావే.
పిల్ల బాగుందిరా. నాక్కావాలి. అన్నాడు కత్తి
బంగారం బిస్కట్: నీకు ఎంత కావాలో చెప్పు నిన్ను నేను ఉంచుకుంటాను, సరస్వతి చెయ్య పట్టుకున్నాడు.
నాక్కావాలి! నాక్కావాలి!! నాక్కావాలి!!! అందరూ ఎగబడ్డారు.


అదిరిపోయింది సరస్వతి. బెదురు చూపులతో లేడిపిల్లలా పరిగెత్తింది.
డబ్బు, రాజకీయం, రౌడీయిజం చుట్టుముట్టాయి. నల్లకోటు నవ్వుతూ చోద్యం చూస్తోంది.


గింజుకుంది సరస్వతి. అక్కడ సరస్వతిని కాపాడే వారెవరూ లేరు. సరస్వతి కి వలువలు వలిచారు సామూహిక మానభంగం జరిగిన్ది.



 తరువాత కత్తి పోటు కడుపులో దిగింది. విస్కీ సీసా లోంచి విస్కీ సరస్వతిని తడిపింది. టోపీ సిగారాట్ వెలిగించుకుని, అగ్గిపుల్ల సరస్వతి (పుస్తకం) మీద విసిరేసింది.
పుస్తకం తగలడిపోతోంది. ఆకాసంలో పెద్ద ఉరుములు, ఉండుండి పిడుగులు . చెవులు దద్దరిల్లి పోతున్నాయి. వాన మొదలయింది మెల్లగా. అప్పటికే పుస్తకం అంతా కాలిపోయి చివరి పీజీ మిగిలింది. అందరిలో కంగారు భూమి స్వల్పంగా కంపించింది. ఎం చేద్దాం? ఎం చేద్దాం ? అరుపులు .
బంగారం బిస్కట్: అందరం చేట్టుకిన్డకి పరిగెడదాం.


పుస్తకం: వద్దు అందరూ ఆరు బయటే ఉండండి చెట్టు కింద ప్రమాదం బలహీన స్వరంతో చెప్పింది పుస్తకం. తరువార్త ఆఖరి పేజి కూడా కాలి పొయిన్ది. ఆమె మాట ఎవరూ వినిపించుకోలేదు .
బంగారం బిస్కట్టు చెట్టు కిందకి పరుగెడుతోంది. రండి వాడిని అనుసరిద్దాం.అంది కత్తి. డబ్బున్న వాడిని అందరూ అనుసరించారు. అందరూ చెట్టు కిందకి చెరారు. అప్పుడే ఒక బలమైన పిడుగు పడింది చెట్టు మీద.


No comments:

Post a Comment