Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, May 16, 2015

అయ్యో ! గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి మారుతీ రావు గారు విశేష ప్రతిభా వంతులు. ఆయన ప్రతిభ కు అనే క వర్ణాలు. ఒక నటుడు, నటుడుని మించిన రచయిత, రేడియో కళాకారుడు,  కవి ఆ కవిని మించిన మాతృభాషా ప్రేమికుడు. కానీ ఇవేవీ అతనిలో దేశభక్తి కి సాటి రావు. నటుడు, రచయిత, కవి వగైరా అతనికి దుస్తులు ఆభరణాలు అయితే దేశభక్తి అతనికి కిరీటం లాంటిది. ఆ కిరీట ప్రభావం వల్ల ఆయన నాకు ఎప్పుడూ ఆకాశం అంత ఎత్తు కనిపిస్తూ ఉంటారు.  అయితే ఆకాశం అంత ఎత్తు ఎదిగిన అనేక బచ్చికానీ మంద తో ఆకాసంలో కూడా  ట్రాఫిక్ ఎక్కువయిపోయింది. ఆ  ట్రాఫిక్ లో సినిమా వాళ్ళు,  కట్టుడు పని తో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకుని ఎదిగిపోయిన అనేకులు ఉన్నారు. 

 గొల్లపూడి మారుతీ రావు గారికి ఇతరులకి తేడా ఏంటంటే ఎంత  ఎత్తుకెదిగినా దేశ పటాన్ని, దేశ పథాన్ని నెత్తి మీద పెట్టుకుని దేశానికి  ఒదిగి ఎదగడం.  దేవుడినే కమెడియన్ గా చేసుకునే నేటితరం హీరోలు దేశాన్ని కాలితో తొక్కి పైకి ఎదిగే, వీధి కుక్కల్లాంటి హీరోలు , కులం, కుటుంబం అంటే కర్రల సాయంతో నడిచే అవిటివాల్లు. దేవుడు, మతం దేశం ఇవేవీ కనిపించవు వాళ్లకి, ఎందుకంటే వాళ్లకి ఇవేవీ  వీళ్ళకు  శిరో దార్యం కాదు, ఇవన్నీ వాళ్ళ  బూటు కింద ఉంటాయి. వీళ్ళకంటే  నీచులైన రాజకీయ నాయకులు ఉన్నంత  కాలమూ   కారు తో మట్టి చంపి , కేసులన్నీ  మాపి మన్ను చేసుకోగలవు   అనేక నేరాలు చేసి కోర్టులకి దొరక్కుండా గొప్పవాడిగా చలామణి అవ్వగలరు . ఇది తెలియక కాదు కానీ మారుతీరావు గారు, మాత్రు భాషని వంటి పట్టించుకుని  దేశ భక్తిని తలకి ఎక్కించుకుని బాధపడుతుంటారు . ఇలా

ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. అయితే మన మాతృవందనం 'వందేమాతరం' కానీ, జాతీయగీతం 'జనగణమన' కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన 'ఆనందమఠ్' నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం.

ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం 'అధినాయకుని' ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి 'అధినాయకి' అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట 'తవ సింహాసన పాషే' అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. 'జయ జయ రాజేశ్వర' అంటారు మరొకచోట.

చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: 'నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా'. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- 'మాకొద్దీ తెల్లదొరతనమూ' రాసిన కవి. 'అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!“ ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా! అంటారు ఆయన అమాయకంగా లేదు ?

అయ్యో సార్ , గొల్లపూడి గారూ అక్కడే ఉండిపోయారా! ప్రజలు అంతా డవలప్ అయిపోయారు సార్, జీన్స్ వేసుకుని, మొబైల్స్ పట్టుకుని హీరోల్లా ఎక్ష్చెంజ్  మేళాలో  నల్లోడి రక్తం ఇచ్చి  తెల్లోడి ఉచ్చ తెచ్చుకునేలా ఉన్నారు.  ఐమేక్స్ సినిమాలో  నీచుల పాదధూళి కోసం డబ్బులు పట్టుకుని క్యూ లలో నిలబడుతున్నారు , తన మతాన్ని , ధర్మాన్ని కాల రాసే , విలువలకి వలువలోలిచి  నీచుల్ని చూసి తరిద్దామని గంగివేర్రులు ఎత్తుతున్నారు. 

Tuesday, May 5, 2015

మర్యాదస్తుడు - చిన్న కథ - పూలబాల


 గోపాలం: అక్క అక్కా  తలుపు కొడుతూ 
కమల : ఆ వచ్చా వచ్చా .. ఎరా తమ్ముడూ నువ్వా ! ఎలాఉన్నావు (తలుపు తీస్తూ) 
 గోపాలం:  బాగున్నాను కమలక్కా 
అత్తయ్య: బాబూ  గోపాలం బాగున్నావా  ఇదేనా రావడం ఏలూరు నుంచి రా .. రా 
 గోపాలం: ఇదే రావడం అత్తయ్యగారూ  ఇప్పుడే  బస్సుకొచ్చాను ఎండలు మండిపోతున్నాయి   
కమల : రా రా లోపలకి రా  తమ్ముడు ఇలా సోఫాలో కూర్చో  ఇదిగో మంచినీళ్లు తాగు . 
మంచినీళ్లు ఇస్తుంది కమల  
కొత్తిల్లు ఎలా ఉంది అక్క నీరు గాలి బాగున్నాయా ?
అన్నీ బాగున్నాయిరా 
 గోపాలం:  బావగారు లేరా ?
కమల :  ఉన్నారు పడుకున్నారు ఆదివారం మధ్యాహ్నం కదా లేపుతాను ఉండు . 
 గోపాలం: వద్దక్కా పడుకొనే తొందరేంలేదు 
కమల : సరే టీ  పెడ తానుండు 
ఏవోయ్ గోపాలం  ఎప్పుడు రావడం 
ఇప్పుడే వచ్చాను బావా  ఏంటి పడుకోలేదా  ?
కాస్సేపు పడుకునే లేచాను లేవోయ్ 
కొత్తిల్లు కొత్త కాలనీ ఎలా ఉంది బావ జీవితం?
చాలా చిరాగా ఉంది . ఇల్లు బాగోలేదా నీరు గాలి అన్ని బాగున్నాయి అని చెప్పేదే అక్క  
అన్నే ఉన్న అల్లుడినోట్లో శని ఉన్నట్టు   నీరు గాలి బాగున్నా ప్రశాంతతే లేదు ?
ఏం  అక్కా గొడవలాడుకుంటున్నారా?
ఛీ ఆప్రశాంతత కాదోయ్ 
వీధిలో కుఱ్ఱవాళ్ల ప్రవర్తన బాగోలేదు  అదిగో వింటున్నావు కదా ఎంత పెద్ద హార్న్ కొడుతున్నాడో  వీధి అంత  ఖాళీ గా ఉంది కదా అంత  హారన్  ఎందుకు చెప్పు?
   ఓహ్ దానిగురించా వదిలేయ్ బావా 
ఎలా వదిలేస్తాం చెప్పు ప్రశాంతతని ఉదయాన్నే మన కాంపౌండ్ వాల్ బయట నిలబడి పూలు కోస్తున్నా పక్కనుంచే ఎవడో పెద్ద హార్న్ కొట్టుకుంటూ వెళుతున్నాడు. ఇంకా తెల్లవారలేదు , అంత పెద్ద హార్న్ కొట్టుకుంటూ ఎందుకు వెళుతున్నావని అడిగితే, ఎకసెక్కంగా మాట్లాడుతున్నాడు. 

పెద్దదాన్ని నేను చెపితే కూడా ముసలిదానివి నీకేంటి సమాధానం చెప్పేది అంటున్నారు.  
ఈ  కుర్రాళ్ళకి పెద్ద్డలంటే బొత్తిగా మర్యాదలేకుండాపోయింది. 
సమాజం అన్న గౌరం లేదు. వాళ్ళ  ఫేషన్లు వాళ్ళ షోకులు సినిమాలే తప్ప ఎవ్వరినీ పట్టించుకునే స్థితిలో లేరు 

ఏంటయ్యా జనార్ధన్, ధనాధన్ మనిపించక పోయావా ? కుర్రాళ్ళు అంటావేంటి, నువ్వేదో ముసలోడిలాగా! అన్నాడు 
ధనాధన్ మనిపించడమా, అంటే ? నేను కామ్ గోయింగ్. తెలుసు కదా. 

నువ్వు  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే లాభం లేదు. రఫ్ గా ఉండాలి రౌడీలా ఉండాలి 
నేనుమర్యాదస్తుడిని  మర్యాదస్తుడిలా  ఉంటాను 

అబ్బ బావా నీతో వచ్చిన చిక్కే ఇది , ఈ రోజుల్లో  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే మర్యాద ఇవ్వరు. మొన్న  దీపావళి నాడు నీ ఇంటి ముందు.... నీ మీదే ఔ ట్లు పేల్చేశారు   అదే పక్కింట్లో శ్రీదేవి మొగుడు ఉన్నాడు, 
ఎవరు ఆ మటన్ కొట్టు అతనా ? అన్నాడు 
 అతనే, అతడి తో ఎవరైనా పరాచికాలు ఆడగలరా ?


వాడు ఉత్త రౌడీ . వాడి తో మాట్లాడడానికే అందరూ భయపడతారు.
వాడి ముందు అందరూ తిన్నగా మాట్లాడతారు కదా! 
అంటే నేను రౌడీ లా ఉండాలా? రౌడి లా ఉండాలా? అప్పుడు ఇస్తారా మర్యాద? 
కొద్దిరోజులు నీ గెటప్ మర్చి చూడు నీకే తెలుస్తుంది .
ఒరేయ్ పిచ్చి మాటలూ నువ్వు . ఆయన అలాటి పనులు ఏవీ చెయలెరు  
అలాటి పనులు అంటే ? అన్నాడు 
 నీ సలహాకి ఒక నమస్కారం. 
 కంగారు పడకు బావా నువ్వు అలాంటివి ఏమే చేయక్కరలేదు. జస్ట్ , నటిస్తే చాలు. 
ఒరేయ్ చుట్టుపక్కల పరువుగా ఉన్నాం. మాపరువు తీయకురా . 

అక్కా , ఈరోజుల్లో పరువు పరువు అని ప్రాకులాడేవాళ్ళకి  మర్యాద ఇవ్వరయ్యా ఎంత మంది 
రౌడీలకు మర్యాద ఇవ్వటం లేదా మనం. 
నువ్వు వంద చెప్పు వెయ్యి చెప్పు  నేను ఇందుకు ఒప్పుకోను 
సరే అక్కా. (అని అప్పటికి వదిలేసాడు ధనుంజయ్.)
భోజనాలకి లేవండి 

                                                                          ***



కీ మంటూ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు 
ఖాళీ రోడ్డు మీద ఊరకనే హారన్  ఎందుకయ్యా
పక్కనే వచ్చి నిలిచింది ఒక బండి పక్కింటి అబ్బాయిని బైటకు రమ్మని హారం కొడుతున్నాడు . 
ఏవయ్య అలా చాలాసేపు హర కొట్టకపోతే వెళ్లి పిలవచ్చుకదా 
ఆడే వస్తాడు ఇప్పుడు బండి దిగి నేను లోపాలకి వెళ్ళాలా ?
అబ్బా చెపులు  నొప్పెడుతున్నాయయ్యా ?

పక్కింటి అబ్బాయి  ఒర్ వస్తున్నాను ఉండరా అని అరిచాడు 
కాస్సేపట్లో ఆ అబ్బాయి బైటి కి  వచ్చాడు  ఇద్దరూ బండి పై  వెళ్లిపోయారు.

అమ్మయ్య పోయారు ప్రశాంతంగా ఉంది . 

సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెపుతారా ? 
అడ్రస్ అడిగే తప్పుడు కూడా సిగరెట్  ఎందుకు ? సిగరెట్ ఆపవయ్యా ?
 ఈ డ్రస్ ఎక్కడో చూడండిసార్ 
రెండిళ్ళు దాటాక కుడిచేతివైపు సందులో ఉంటుంది 
ఛీ ఒక మర్యాదలేదు సిగరెట్ నామీదే ఊదుతున్నాడు  


                                                                  ****

బావా నువ్వు కాలేజీలో నాటకాలు వేసేవాడివి కదా ? ఇప్పుడు పూర్తిగా వదిలేసావా నాటకాలు. 
  
ఆసక్తి పోయిందా?

ఆసక్తి బోలెడుంది అవకాశాలే లేవు. 

మంచి షార్ట్ ఫిలిం తీస్తున్నాము చేస్తావా? 

అన్నాడు. తప్పకుండా? ఏంటి కధ? నా పాత్ర ఏంటి ? నీ పాత్రే , అంటే మద్య తరగతి జంటిల్మన్ రోల్. వెరీ గుడ్ , అన్నాడు జనార్ధన్. కాకపొతే షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. మరి నా ఆఫీసు, ఆదివారాలు , ఇతర సెలవ దినాలు..

ఓ సరే . అన్నాడు జనార్ధన్. కాకపొతే  నీది   కాస్త  విప్లవాత్మక  పాత్ర. అంటే , అన్నాడు జనార్ధన్. అన్యాయాన్ని ఎదిరించే పాత్ర. ఓ అది నాకిష్టమే గా.. అన్నాడు సరే బావా స్క్రిప్ట్ ఇస్తాను షూటింగ్ రెండురోజుల్లో. అన్నాడు ధనుంజయ్. సాయంకాలం 5 అయ్యింది జనార్ధన్ కి సీన్ వివరిస్తున్నాడు ధనుంజయ్. షూటింగ్ మన ఇంటి ముందే. రౌడీ కి బుడ్డి చెప్పే పాత్ర నీది , నువ్వు కూడా తాగుతావు.  అదిగో అతడే రౌడీ మొన్న నువ్వు కలిసిన వ్యక్తే..సరే  కేమెర ఏది? అన్నాడు. అబ్బా అదంతా నేను చూసుకుంటాను లేవయ్యా. తను వచ్చేస్తునాడు , ఉమ్, రంగంలోకి దిగు.

అటుగా వస్తున్న రౌడీ తో గొడవ పెట్టుకున్నాడు. "నేను తాగి ఉన్నాను తెలుసా?" అన్నాడు రౌడీ. "అలాగా? ఇదిగోరా  రోజూ ఈ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్ కి ఎందుకు వెళుతున్నాను. ఇందులో లంచ్ ఉంటుందని అందరూ అనుకుంటారు కనీ.."  అంటూ బ్యాగ్ లోంచి బాటిల్ తీసి గడగడ తాగేసి సీసా పక్కన పడేసాడు. "ఒరేయ్ నీ ... " తిట్టాడు రౌడీ. అంతకన్నా దారుణం గా తిట్టాడు జనార్ధన్. చుట్టుపక్కలవాళ్ళు అంతా మేడలెక్కి ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిట్టు కుంటూ పెద్దగా  అరచుకుంటూ గొడవ గొడవ చేస్తున్నారు. జనార్ధన్ అద్బుతంగా నటిస్తున్నాడు. పచ్చి తాగుబోతు మేక వన్నె పులి అనే భావన అందరిలో కలిగింది. రౌడీ చాకు తీసాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తాగి పారేసిన బాటిల్ తీసాడు జనార్ధన్. సీసాని గోడకేసి కొట్టి " ఒరేయ్ నీ ... ఒక వినలేని తిట్టు తిట్టి పగిలిన సీసాతో రౌడీ పై దాడి చేసాడు. రౌడీని ఒక్క పోటు పొడిచాడు. చట్టు పక్కల వాళ్ళు అంటా హడిలిపోయారు. కొంతమంది ఇళ్ళలోకి పోయి తలుపులేసుకున్నారు.  రౌడీ కి రక్తం కారుతున్నాది. పొట్ట లోకి దిగిపోయింది సీస పెంకు. కొంత మంది రౌడీ కి సాయం చేయడానికి ముందుకొచ్చారు. రౌడీ వాళ్ళని గుర్రుగా చూసి,  హేండ్ టూ హేండ్   ఎవాడైనా సరే , అంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తుడడంతో వాళ్ళుకూడా వెళ్ళిపోయారు. కాస్సేపట్లో ఎవరో వచ్చి రౌడీని మోసుకుని తీసుకు పోయారు. వీధి వీదంతా ఆశ్చర్యం తో ఉండి పోయింది.

మరుసటి రోజు పోలీసులు జనార్ధన్ ఇంటికి వచ్చారు. జీప్ ఎక్క నని జనార్ధన్ గొడవ చేసాడు. మా బావకు  కార్ ఉంది కారు లో వస్తాడు అని ధనుంజయ్ కూడా వాదించాడు. మళ్ళీ  ఇంకో సీన్ .. వీదంతటికీ .

మరుసటి రోజు లాయర్ వచ్చాడు. జనార్ధన్  వీధిలో నిలబడి పెద్దగా లాయర్ తో మాట్లాడు తున్నాడు, ధనుంజయ్ కెమెరా పట్టుకుని షూట్ చేస్తున్నాడు. అది ఎందుకో  ఆ వీధిలో వాళ్లకి ఏమి అర్ధం కాలేదు. ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. నాలుగు రోజులు గడవగానే కొంతమంది కార్మికులు ప్లకార్డ్స్ పట్టుకుని జనార్ధన్  డౌన్ డౌన్ అని అరవటం ప్రారంభించేరు. చుట్టూ పక్కలవాళ్ళు వాళ్ళని చుట్టూ ముట్టేరు. జనార్ధన్ మాత్రమూ వాళ్ళని చూసి లోపాలకి వెళ్లి పోయాడు.  ఒక బట్ట తల మనిషి మరొక పెద్దావిడతో అంటున్నాడు " పచ్చి రౌడీ లా తయారయాడు , రోజూ గొడవలే అన్నాడు. మనకెందుకులే బాబు అనవసరమైన గొడవలు, వెనకాతల వాళ్ళావిడ ఉంది , విందంటే గొడవలు. మళ్ళీ దీపావళి వచ్చింది, జనార్ధన్ ఇంటి ముందు ఎవరూ ఔట్లు పెల్చలేదు. రోజూ బైక్ మీద గట్టి గా హార్న్ కొట్టే అబ్బాయి రూటే మార్చేశాడు.