Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, May 16, 2015

అయ్యో ! గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి మారుతీ రావు గారు విశేష ప్రతిభా వంతులు. ఆయన ప్రతిభ కు అనే క వర్ణాలు. ఒక నటుడు, నటుడుని మించిన రచయిత, రేడియో కళాకారుడు,  కవి ఆ కవిని మించిన మాతృభాషా ప్రేమికుడు. కానీ ఇవేవీ అతనిలో దేశభక్తి కి సాటి రావు. నటుడు, రచయిత, కవి వగైరా అతనికి దుస్తులు ఆభరణాలు అయితే దేశభక్తి అతనికి కిరీటం లాంటిది. ఆ కిరీట ప్రభావం వల్ల ఆయన నాకు ఎప్పుడూ ఆకాశం అంత ఎత్తు కనిపిస్తూ ఉంటారు.  అయితే ఆకాశం అంత ఎత్తు ఎదిగిన అనేక బచ్చికానీ మంద తో ఆకాసంలో కూడా  ట్రాఫిక్ ఎక్కువయిపోయింది. ఆ  ట్రాఫిక్ లో సినిమా వాళ్ళు,  కట్టుడు పని తో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకుని ఎదిగిపోయిన అనేకులు ఉన్నారు. 

 గొల్లపూడి మారుతీ రావు గారికి ఇతరులకి తేడా ఏంటంటే ఎంత  ఎత్తుకెదిగినా దేశ పటాన్ని, దేశ పథాన్ని నెత్తి మీద పెట్టుకుని దేశానికి  ఒదిగి ఎదగడం.  దేవుడినే కమెడియన్ గా చేసుకునే నేటితరం హీరోలు దేశాన్ని కాలితో తొక్కి పైకి ఎదిగే, వీధి కుక్కల్లాంటి హీరోలు , కులం, కుటుంబం అంటే కర్రల సాయంతో నడిచే అవిటివాల్లు. దేవుడు, మతం దేశం ఇవేవీ కనిపించవు వాళ్లకి, ఎందుకంటే వాళ్లకి ఇవేవీ  వీళ్ళకు  శిరో దార్యం కాదు, ఇవన్నీ వాళ్ళ  బూటు కింద ఉంటాయి. వీళ్ళకంటే  నీచులైన రాజకీయ నాయకులు ఉన్నంత  కాలమూ   కారు తో మట్టి చంపి , కేసులన్నీ  మాపి మన్ను చేసుకోగలవు   అనేక నేరాలు చేసి కోర్టులకి దొరక్కుండా గొప్పవాడిగా చలామణి అవ్వగలరు . ఇది తెలియక కాదు కానీ మారుతీరావు గారు, మాత్రు భాషని వంటి పట్టించుకుని  దేశ భక్తిని తలకి ఎక్కించుకుని బాధపడుతుంటారు . ఇలా

ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. అయితే మన మాతృవందనం 'వందేమాతరం' కానీ, జాతీయగీతం 'జనగణమన' కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన 'ఆనందమఠ్' నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం.

ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం 'అధినాయకుని' ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి 'అధినాయకి' అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట 'తవ సింహాసన పాషే' అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. 'జయ జయ రాజేశ్వర' అంటారు మరొకచోట.

చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: 'నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా'. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- 'మాకొద్దీ తెల్లదొరతనమూ' రాసిన కవి. 'అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!“ ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా! అంటారు ఆయన అమాయకంగా లేదు ?

అయ్యో సార్ , గొల్లపూడి గారూ అక్కడే ఉండిపోయారా! ప్రజలు అంతా డవలప్ అయిపోయారు సార్, జీన్స్ వేసుకుని, మొబైల్స్ పట్టుకుని హీరోల్లా ఎక్ష్చెంజ్  మేళాలో  నల్లోడి రక్తం ఇచ్చి  తెల్లోడి ఉచ్చ తెచ్చుకునేలా ఉన్నారు.  ఐమేక్స్ సినిమాలో  నీచుల పాదధూళి కోసం డబ్బులు పట్టుకుని క్యూ లలో నిలబడుతున్నారు , తన మతాన్ని , ధర్మాన్ని కాల రాసే , విలువలకి వలువలోలిచి  నీచుల్ని చూసి తరిద్దామని గంగివేర్రులు ఎత్తుతున్నారు. 

3 comments:

  1. నిజానికి ఇవేవీ మాకు తెలియదు అని చెప్పటానికి సిగ్గు పడుతున్నాం.

    ReplyDelete
  2. నిజానికి ఇవేవీ మాకు తెలియదు అని చెప్పటానికి సిగ్గు పడుతున్నాం.

    ReplyDelete
  3. Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు

    ReplyDelete