Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, May 5, 2015

మర్యాదస్తుడు - చిన్న కథ - పూలబాల

ఛీ ఛీ బొత్తిగా మర్యాదలేకుండా పోయింది ఈ కుర్రాళ్ళకి! అన్నాడు జనార్ధన్.  జనార్ధన్ మద్య వయస్కుడు.
ఏవండి , ఏమయ్యింది? అంది కమల. ఏంలేదు, మన కాంపౌండ్ వాల్ బయట నిలబడి పూలు కోస్తున్నానా, పక్కనుంచే ఎవడో పెద్ద హార్న్ కొట్టుకుంటూ వెళుతున్నాడు. ఇంకా తెల్లవారలేదు , అంత పెద్ద హార్న్ కొట్టుకుంటూ ఎందుకు వెళుతున్నావని అడిగితే, ఎకసెక్కంగా మాట్లాడుతున్నాడుచూడు, అన్నాడు జనార్ధన్.
ఎవరు, ఆ నాలుగో ఇంట్లో కుర్రడేనా? అంది కమల. ఏంటయ్యా జనార్ధన్, ధనాధన్ మనిపించక పోయావా ? కుర్రాళ్ళు అంటావేంటి, నువ్వేదో ముసలోడిలాగా! అన్నాడు ధనుంజయ్.  ధనుంజయ్ కమలతమ్ముడు, జనార్ధన్ బావ మరిది. చుట్టపు చూపుగా వచ్చాడు. ధనాధన్ మనిపించడమా, అంటే ? నేను కామ్ గోయింగ్. తెలుసు కదా. నువ్వు  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే లాభం లేదు. నేను మర్యాదస్తుడిలా కనిపించనా? అన్నాడు. అబ్బ బావా నీతో వచ్చిన చిక్కే ఇది , ఈ రోజుల్లో  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే మర్యాద ఇవ్వరు. గత దీపావళి నాడు నీ ఇంటి ముందు నీ కార్ దగ్గర ఔట్లు కాలుస్తుంటే భాద పడ్డావు, ఎంచేయగలిగేవ్? పక్కింట్లో శ్రీదేవి మొగుడు ఉన్నాడు, ఎవరు ఆ మటన్ కొట్టు అతనా ? అన్నాడు జనర్ధన్. అవును అతనే, అన్నాడు.

వాడు ఉత్త రౌడీ . వాడి తో మాట్లాడడానికే అందరూ భయపడతారు.
భయపడతారో, బెంగ పడతారో, వాడి ముందు అందరూ తిన్నగా మాట్లాడతారు కదా! అంటే నేను రౌడీ లా ఉండాలా? రౌడి లా ఉండాలా? అప్పుడు ఇస్తారా మర్యాద? కొద్దిరోజులు నీ గెటప్ మర్చి చూడు నీకే తెలుస్తుంది .ఒరేయ్ పిచ్చి మాటలూ నువ్వు . ఆయన అలాటి పనులు ఏవీ చెయలెరు.అంది కమల  అలాటి పనులు అంటే ? అన్నాడు అంటీ తాగుడు వాగుడు, లాంటివి. నావల్ల కాదు తాగుడు, నీ సలహాకి ఒక నమస్కారం. అన్నాడు జనార్ధన్. కంగారు పడకు బావా నువ్వు అలాంటివి ఏమే చేయక్కరలేదు. జస్ట్ , నటిస్తే చాలు. ఒరేయ్ చుట్టుపక్కల పరువుగా ఉన్నాం. మాపరువు తీయకురా . అంది కమల. అక్కా, ఈరోజుల్లో పరువు ఉన్న రాజకీయ నాయకుడుని ఒక్కడిని చూబించు, ఎం వాళ్ళందరికీ మర్యాద ఇవ్వటం లేదా మనం. అన్నాడు ధనుంజయ్. నువ్వు వంద చెప్పు వెయ్యి చెప్పు  నేను ఇందుకు ఒప్పుకోను అని తెగేసి చెప్పేసింది కమల. సరే అక్కా. అని అప్పటికి వదిలేసాడు ధనుంజయ్.

మద్యానం భోజనాలు అయ్యాక సరదాగా కబురులు చెప్పుకుంటున్నారు. బావా నువ్వు కాలేజీలో నాటకాలు వేసేవాడివి కదా ? ఇప్పుడు పూర్తిగా వదిలేసావా నాటకాలు. అవును అన్నాడు జనార్ధన్.  ఆసక్తి పోయిందా అన్నాడు ధనుంజయ్. ఆసక్తి బోలెడుంది అవకాశాలే లేవు అన్నాడు జనార్ధన్. మంచి షార్ట్ ఫిలిం తీస్తున్నాము చేస్తావా? అన్నాడు. తప్పకుండా? ఏంటి కధ? నా పాత్ర ఏంటి ? నీ పాత్రే , అంటే మద్య తరగతి జంటిల్మన్ రోల్. వెరీ గుడ్ , అన్నాడు జనార్ధన్. కాకపొతే షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. మరి నా ఆఫీసు, ఆదివారాలు , ఇతర సెలవ దినాలు..

ఓ సరే . అన్నాడు జనార్ధన్. కాకపొతే  నీది   కాస్త  విప్లవాత్మక  పాత్ర. అంటే , అన్నాడు జనార్ధన్. అన్యాయాన్ని ఎదిరించే పాత్ర. ఓ అది నాకిష్టమే గా.. అన్నాడు సరే బావా స్క్రిప్ట్ ఇస్తాను షూటింగ్ రెండురోజుల్లో. అన్నాడు ధనుంజయ్. సాయంకాలం 5 అయ్యింది జనార్ధన్ కి సీన్ వివరిస్తున్నాడు ధనుంజయ్. షూటింగ్ మన ఇంటి ముందే. రౌడీ కి బుడ్డి చెప్పే పాత్ర నీది , నువ్వు కూడా తాగుతావు.  అదిగో అతడే రౌడీ మొన్న నువ్వు కలిసిన వ్యక్తే..సరే  కేమెర ఏది? అన్నాడు. అబ్బా అదంతా నేను చూసుకుంటాను లేవయ్యా. తను వచ్చేస్తునాడు , ఉమ్, రంగంలోకి దిగు.

అటుగా వస్తున్న రౌడీ తో గొడవ పెట్టుకున్నాడు. "నేను తాగి ఉన్నాను తెలుసా?" అన్నాడు రౌడీ. "అలాగా? ఇదిగోరా  రోజూ ఈ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్ కి ఎందుకు వెళుతున్నాను. ఇందులో లంచ్ ఉంటుందని అందరూ అనుకుంటారు కనీ.."  అంటూ బ్యాగ్ లోంచి బాటిల్ తీసి గడగడ తాగేసి సీసా పక్కన పడేసాడు. "ఒరేయ్ నీ ... " తిట్టాడు రౌడీ. అంతకన్నా దారుణం గా తిట్టాడు జనార్ధన్. చుట్టుపక్కలవాళ్ళు అంతా మేడలెక్కి ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిట్టు కుంటూ పెద్దగా  అరచుకుంటూ గొడవ గొడవ చేస్తున్నారు. జనార్ధన్ అద్బుతంగా నటిస్తున్నాడు. పచ్చి తాగుబోతు మేక వన్నె పులి అనే భావన అందరిలో కలిగింది. రౌడీ చాకు తీసాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తాగి పారేసిన బాటిల్ తీసాడు జనార్ధన్. సీసాని గోడకేసి కొట్టి " ఒరేయ్ నీ ... ఒక వినలేని తిట్టు తిట్టి పగిలిన సీసాతో రౌడీ పై దాడి చేసాడు. రౌడీని ఒక్క పోటు పొడిచాడు. చట్టు పక్కల వాళ్ళు అంటా హడిలిపోయారు. కొంతమంది ఇళ్ళలోకి పోయి తలుపులేసుకున్నారు.  రౌడీ కి రక్తం కారుతున్నాది. పొట్ట లోకి దిగిపోయింది సీస పెంకు. కొంత మంది రౌడీ కి సాయం చేయడానికి ముందుకొచ్చారు. రౌడీ వాళ్ళని గుర్రుగా చూసి,  హేండ్ టూ హేండ్   ఎవాడైనా సరే , అంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తుడడంతో వాళ్ళుకూడా వెళ్ళిపోయారు. కాస్సేపట్లో ఎవరో వచ్చి రౌడీని మోసుకుని తీసుకు పోయారు. వీధి వీదంతా ఆశ్చర్యం తో ఉండి పోయింది.

మరుసటి రోజు పోలీసులు జనార్ధన్ ఇంటికి వచ్చారు. జీప్ ఎక్క నని జనార్ధన్ గొడవ చేసాడు. మా బావకు  కార్ ఉంది కారు లో వస్తాడు అని ధనుంజయ్ కూడా వాదించాడు. మళ్ళీ  ఇంకో సీన్ .. వీదంతటికీ .

మరుసటి రోజు లాయర్ వచ్చాడు. జనార్ధన్  వీధిలో నిలబడి పెద్దగా లాయర్ తో మాట్లాడు తున్నాడు, ధనుంజయ్ కెమెరా పట్టుకుని షూట్ చేస్తున్నాడు. అది ఎందుకో  ఆ వీధిలో వాళ్లకి ఏమి అర్ధం కాలేదు. ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. నాలుగు రోజులు గడవగానే కొంతమంది కార్మికులు ప్లకార్డ్స్ పట్టుకుని జనార్ధన్  డౌన్ డౌన్ అని అరవటం ప్రారంభించేరు. చుట్టూ పక్కలవాళ్ళు వాళ్ళని చుట్టూ ముట్టేరు. జనార్ధన్ మాత్రమూ వాళ్ళని చూసి లోపాలకి వెళ్లి పోయాడు.  ఒక బట్ట తల మనిషి మరొక పెద్దావిడతో అంటున్నాడు " పచ్చి రౌడీ లా తయారయాడు , రోజూ గొడవలే అన్నాడు. మనకెందుకులే బాబు అనవసరమైన గొడవలు, వెనకాతల వాళ్ళావిడ ఉంది , విందంటే గొడవలు. మళ్ళీ దీపావళి వచ్చింది, జనార్ధన్ ఇంటి ముందు ఎవరూ ఔట్లు పెల్చలేదు. రోజూ బైక్ మీద గట్టి గా హార్న్ కొట్టే అబ్బాయి రూటే మార్చేశాడు.  

No comments:

Post a Comment