Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 15, 2015

పరోల్ మీద పెళ్లి



మేడ మీద ఉంది వెళ్లమ్మా అంది, వేసంగిని చూసిన రామలక్ష్మి. రాస్తున్న కాగితాలలోంచి ఒక్క క్షణం తల ఎత్తి. ఒక చిరునవ్వు గ్రీటింగ్ విసిరి, రెండే రెండు ముక్కలు " మెడ మీద ఉంది వెళ్లమ్మా" అని మళ్ళీ ఉస్త్ర పక్షి లా కాగితాల్లో తల దూర్చింది. మెడ మీద కుర్చీలో కూర్చుని కవితలు చదువుతోంది సివంగి."ఏంటి కలల్లో విహరిస్తున్నావా? " అంది వేసంగి. కాదు కవితల్లో విహరిస్తున్నాను, కాదు ..కాదు విరహిస్తున్నాను.  

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అంటే? మీ నాన్న కవి, మీ అమ్మ రచయిత్రి, నువ్వు అదే బాటలో నడుస్తున్నావు కదా." “ఇంతకీ మీ నాన్న ఇంట్లో లేనట్టున్నాడు.” “నాన్నకవి సమ్మేళనానికి వెళ్ళాడు.” కిసుక్కున నవ్వింది వేసంగి.  వీకెండ్స్ లో  కె ఎఫ్ సి లో తిని ... అంటూ మధ్యలోనే ఆపేసింది వేసంగి.  ఏం? నువ్వు నడవటం లేదా మీ అమ్మ నాన్న బాటలో? అవును నడుస్తున్నాను. నేను కూడా మా నాన్న లాగే అమెరికా వెళతాను. ఇంతకీ, ముహూర్తాలు పెట్టేసారని ఉత్తరం రాసావు. మీ మద్య ఏమైనా సాగుతోందా? ఫోన్ చేస్తున్నాడా, లేదా నీ లాగే ఉత్తరాలేనాఅమ్మ తల్లీ నీ ఉత్తరాలు చూసి  నవ్వుతున్నారు అంతా, చక్కగా మెయిల్ పెట్టచ్చుకదే!? ఆయనకు మాట్లాడ దానికి కుదరదుట. అయినా కలం కాయితం తో రాస్తే నవ్వేది ఎవరు? " ఎవరా నా స్నేహితులు." అంది వేసంగి. 
 ముహూర్తాలు పెట్టుకున్నాక కబురు లేదు కాకరకాయ లేదు. అంది వేసంగి.   అంటే అంతకముందు కబుర్లు ఉండేవి అనా నీ ఉద్దేశం ? అడిగింది సివంగి.  ఆయన పరిస్థితి అర్ధం చేసుకున్నాకే నాకు కూడా మనశ్శాంతి కుదిరింది. అని ముక్తాయించిన్ది. ఇంతకీ ఫోటో ఏదైనా ఉంటె చూపిస్తావా? చూసి తరిస్తాను. అయ్యో అడగలేదు. ఛీ అడగడం ఏంటి దరిద్రంగా! ఎప్పుడైనా కలిసినపుడు తీసుకోవలసింది. కలవడమా, ఇంకా నయం! ఫోన్లో కూడా మాట్లాడడానికి తీరికుండదు ఆయనకీ.  అంత బిజీ గా ఉండేవాడు పెళ్లి చూపులకి ఎలావచ్చాడో ? ఎలాగో వచ్చాడు.  అంత బిజీ గా ఉంటాడా? బిజీ కాదె బందీ. బందీ అంటే? ఇదే మాట నాన్నని అడిగితె అదంతే ఆటను ఒక ఖైదీ అని నాన్న చెప్పారు. 

" ఇంతకీ పెళ్ళికి రాగలడా ?" నవ్వింది వేసంగి ." చాల్లే సంతోషించాం గానీ!" కసిరింది సివంగి. " ఇప్పుడు సంతోషం గానే ఉంటుందమ్మా, పెళ్ళయిన తరువాత కాపురం చేయడానికి  కుదరకపోతే అప్పుడు కూడా సంతోషంగానే ఉంటావా అని!"  కానీ నాన్న ఆయన్ని ఆదర్శ  భావాలు , విశాల దృక్పధం ఉన్నాయని నాకు సమగ్గా సరిపోతాడని చెప్పారు." ఉ , ఉ " మూతి విరిచింది వేసంగి. చూడు తల్లీ మీ నాన్న గొప్ప కవి కావచ్చు, మీ అమ్మ రచయిత్రి కావచ్చు, విశాల హ్బావాలు ఉండనూ వచ్చు, కానీ ఈ దాగుడు మూతల పెళ్ళిళ్ళు ఏంటి? ఇంతకీ ఎం వెలగ బెడుతునాడు? ఉరిమింది వేసంగి." ఎవరు?" అమాయకగా అడిగింది సివంగి. చిర్రెత్తుకొంచ్చిన్ది వేసంగికి " నీ మొగుడు" అంది కసిగా. " నీకు తెలుసుకదే నాన్నగారు అన్నీ శ్లేష,   అలంకార బద్దంగా మాట్లాడతారు.

 " ఎయ్ షటప్ , నీకేమైనా పిచ్చా ఖైదీ ని చేసుకోడానికి, ఛందో బద్దంగా మాట్లాడడానికి మీ ఫెమలీ అంతటికి ఓపిక ఉందేమోగానీ నాకులేదు"  అంది వేసంగి. అంతలో వచ్చారు మేడమీదకి రామలక్ష్మి, రామానుజం దంపతులు. సివంగి కి  కాబోయే భర్తను  పరోల్ మీద బైటకు తీసుకురావాలి ప్రస్తుతానికి ఖైదీ.  పెళ్ళికి పరోల్ దొరుకుతుంది అంది రామలక్ష్మి. ఇదేం సమ్మందం రా బాబు! అంది వేసంగి. “ అవునమ్మా, అహ్ హ  హ  ఊహల  ఊచలు వెనక , అక్షర రక్షక బటుల కాపలాలో ఖైదీ అమ్మా. అతను కూడా రచయితే అహ్ హ  హ ” నవ్వుతూ అన్నాడు రామానుజం. “అయినా సరే పొద్దు గూకులా రాతేనా”  మీ అమ్మ అమెరిక కంపనీ, మీ నాన్న యు కె కంపని కి రాత్రీ పగలు చేయడంలేదా చాకిరి.   ఈ  సారి అందరూ నవ్వారు. 

No comments:

Post a Comment