Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, March 12, 2015

అవిభక్త కవలలు - హాస్య కథ

కాశిపతి నర్సీపట్నం అడ్డ రోడ్డు దగ్గర బస్సు  దిగి రిక్షా కోసం చూసాడు. రఘుపతి ఇల్లు మూడు మైళ్ళు ఉంటుంది. ఎక్సప్రేస్ బస్సు వెళ్ళదు. విలేజ్  సర్వీస్ అంత తొందరగా దొరకదు. ఇదివరకు ఎక్కువగా  రిక్షాలే ఉండేవి. ఇప్పుడు రిక్షాలు బాగా తగ్గి పోయాయి. ఎక్కడ చూసినా ఆటోలే. బాబూ రిక్షా రమ్మంటారాఒక ముసలాయన రిక్షా ముందు నిలిపాడు. అరవై పై మాటే అయినా రిక్షా లాగుతునాడంటే .. ప్చ్ బేరమాడ  దలుచుకోలేదు. ఎక్కి కూర్చున్నాడు. అయ్యాగారూ, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు రిక్షా ఆయన సాహేబుపేట. రిక్షా కదిలింది.

రఘుపతి గురించి వాకాబు చేసాడు. రఘుపతి నీకు తెలుసా? అడిగారు కాశీపతి. ఆయన గురించి తెలీనోడు ఎవడండి. గుడి దగ్గరే  ఆయన ఇల్లు. ఎప్పుడూ నా రిచ్చా ఎక్కుతాడు బాబు, ఆటోలు ఎక్కడు. అవును అన్నాడు కాశీపతి , వాడిదంతా పాత పద్ధతి, సెల్ ఫోన్ వాడదు, పల్లెటూరు వదలడు, రిటైర్ అయినతరువాత వ్యవసాయం చూసుకుంటూ అడ్డరోడ్డు దగ్గర సెటిలయ్యాడు. కొత్త రోడ్డు మీద రిక్షా మెత్తగా సాగిపోతున్నాది. రోడ్డుకి ఇరువైపులా పొలాలు, పచ్చని చెట్లు. ప్రాణం లేచోస్తున్నాది.  ఈ మద్దిన కొడుకు పిల్లలని తీసుకొని వచ్చాడు బాబూ. వేసవి సెలవలు కదా పిల్లల్ని ఇక్కడ వొదిలేసి ఎల్లాడు. ఓహో అయితే మనవలతో ఆడుకుంటున్నా డన్నమాట. ఇక్కడే బాబూ దిగండి. ఆ ఎదురుగా కనిపించేదే ఇల్లు. డబ్బిచ్చి రిక్షని పంపించేసి ఒక్కాసారి పరీక్షగా చూసాడు ఇంటిని. ఇంటిముందు విశాలమైన ఆవరణ. ఇంటి ముందు అందమైన తోట. ఇంటి చుటూ ఫెన్సింగ్. ఫెన్సింగ్ తలుపు తీసుకుని లోపాలకి అడుగు పెట్టాడు.   

టక్..టక్.. తలుపు కొట్టాడు. తలుపుతీసి రండి అంకుల్ అన్నారు ఇద్దరు పిల్లలు. అంకుల్ కాదు  తాతగారూ అనాలి. మీ తాత లేడా? అన్నాడు. తాతగారూ నానమ్మ గుడికి వెళ్ళారు. కూర్చోండి తాతగారూ అని ఇద్దరూ కలిసి కుర్చీ తీసుకొస్తున్నారు. పిల్లలూ మీ పేర్లు ఏంటి? వంశీకృష్ణ. ఓ హో వంశి, కృష్ణ. మంచి పెర్లు. ఒకే పేరు తాతగారు.  ప్లాస్టిక్ కుర్చీని ఇద్దరు లాగడం ఎందుకు? మేము ఇద్దరం కాదు తాతగారూ. పిల్లలో ఏదో తేడా గమనించాడు  ఇప్పుడు అర్ధమయ్యింది. మేమిద్దరం ఇలా కలిసే పుట్టాము. పదేళ్లనుంచి ఇలా అన్ని పనులు కలిసే చేస్తున్నాము. ఆశ్చర్య పోయాడు ఎక్కడో విన్నాను, కానీ  ఈమధ్య కాలం లో ఇలాంటివి ఎప్పుడూ వినలెదు. కూచోండి తాతగారూ , తీరికగా ఆశ్చర్య పోదురు..  అని కుర్చీ వేసారు.

 ఎదురుగా పెదా టీ వీ ఉన్ది. “మమ్మల్ని అవిభక్త కవలలు అంటారు మంచినీళ్ళు తీసుకోండి” ఇద్దరూ కలిసి వెళ్లి తెచ్చి ఇచ్చారు. ఇద్దరూ కలిసి టేబుల్ మీద ఉన్న రిమోట్ తో తీ వీ ఆన్ చేసారు. అబ్బాయిలు మరి పడుకునే టప్పుడు మీకు ఇబ్బంది ఉండదా. సీ. డీ . అనుకుంటాను చారులత తెలుగు సినిమా. ఇప్పుడెందుకు అనబోయాను. చూడండి తాతగారూ మీకు ఒక ఐడియా వస్తుంది. అంటూ కొంచం కొంచం ఫార్వార్డ్ చేస్తూ అక్కడ అక్కడ ముఖ్యమైన ఘట్టాలు చూపించారు. బుర్ర తిరిగిపోతోంది." సినిమా కూడా ఇదే కాన్సెప్ట్." అప్రయత్నంగా మాటలు బయటకి వచ్చేసాయి. చిన్న తేడా ఉంది తాతగారూ, చారులత అక్కచెల్లిల్లు, ఒకేసారి పుడితే అక్కచేల్లిల్లు అనరు తాతగారూ. అవును అవును  ఆడపిల్లలు. ఇదే తప్పే తాతగారూ. ఇంకేం అనాలోయ్. చారులత ఆడ  వంశి కృష్ణ  మగ అనాలి. గుడ్డొచ్చి  పిల్లనెక్కి రించడం అంటే ఇదే కాబోలు. మనవలు తాటకి భాష నేర్పడం. అన్నాడు కాశీపతి. 

సినిమా ఒక షాక్ అయితే, ఎదురుగా ఉన్న పిల్లలు మరో షాక్, ఇందులోనే భాష దిద్దుబాటు. విచిత్ర మానసిక పరిస్థితి లో పడ్డాడు. కంగారూ, ఆశ్చర్యం , చిరాకు అనీ కలిసి మనసుని మెలి తిప్పుతున్నాయి. నెమ్మది తాతగారూ నెమ్మది మీకు కొత్త కదా అలాగే ఉంటుంది. ఈ పిల్లలేన్టిరా బాబూ. వెళ్ళు పిల్లలా పిడుగులా. నా మనసులో మాటలను పసిగట్టి మరీ సమాధానాలు చెప్పేస్తున్నారు. ఇంకో గ్లాసు మంచినీళ్ళు ఇమ్మంటారా తాతగారూ. అన్నాడు వంశీకృష్ణ. ఇంతలో తలుపు శబ్దం అయ్యింది.

అమ్మో తాతగారు నానమ్మ వచ్చేసారు. వంశి కృష్ణ విడిపోయి పెరటి నుచి  చెరో దిక్కుకి పారిపొయారు. కాశీపతి కి తల దిమ్మెక్కి పొయిన్ది. ఎదురుగా స్నేహితుడు రఘుపతి ." ఒరేయ్ రఘుపతి  భూమి గుండ్రముగా ఉండునా లేక గుండ్రముగా తిరుగునా ?" అంటూ నేలమీద పడిపోయాడు. మల్లె మా వెధవాయిలు అవిభక్త కవలలు నాటకం ఆడారా? రఘుపతి భార్య కాశీపతి మొఖాన నీళ్ళు కొట్టింది." కాస్త  నీరు తాగండి అన్నయ్యగారు!" అంది. " నామోఖన్న కాస్త కాఫీ కొట్టమ్మా"  అన్నాడు కాశీపతి.  అవునులే మా వాళ్ళు షాకులు ఇచ్చే టప్పుడు నీళ్ళు కూడా ఇస్తారు. అంచేత కాఫీ తాగితే గానీ తెరుకోలేవు.

 కాశీపతి  కాఫీ తాగి కప్పు కింద పెట్టె లోపు పెరటిలోనుంచి వంశి కృష్ణ లని వెంట పెట్టుకొచ్చాడు రఘుపతి. తాతగారిని ఆటపట్టిస్తారా. సారీ చెప్పండి భాడవల్లారా అని వారి చెవులు మెలిపెట్టాడు రఘుపతి. సారీ తాతగారూ బిక్క మొహాలు వేసారు పిల్లలు. ఇలారండి పిల్లలు అవిభక్త కవలలు లా ఎలా అటుక్కున్నారు రా? ఓ అదా, ఇలా అంటూ ఇద్దరి చొక్కాలకు నడుం దగ్గర ఉన్న పెద్ద కన్నలను చూపి , వాటిలోంచి చేతులు దూర్చి ఒకరి నడుము మరొకరు పట్టుకున్నారు." మళ్ళీ అవిభక్త కవలలం అయిపోయాము " అన్నారు.      
- poolabala      


No comments:

Post a Comment