Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, June 3, 2018

Spanish Civil war


హిట్లర్ పేరు విననివారు ఉండరు. ఫ్రాన్సిస్కో  ఫ్రాంకో పేరు విన్నారావీళ్లిద్దరికీ ఏంటి సంబంధం?
బెనితో ముస్సోలిని పేరు విన్నావా ? విని ఉండవచ్చు .  నెపోలియం బోనపార్త్ పేరు వినేవుంటావు



ఇంతకీ వీళ్ళ అందరిగురంచి మనకెందుకు అనిపిస్తున్నాదా? నిజమే ఇది ప్రపంచ చరిత్ర . ఇదంతా చదివితే మన బుర్ర వేడెక్కిపోదూ!    ఏదో ఒక చెత్త సినిమా పెట్టుకు కూర్చుంటే కాలక్షేపం అయిపోతోంది.  మన యువత టైం పాస్ కె చూస్తోంది తప్ప చదవడానికి ఎక్కడ చూస్తోంది?

స్పానిష్  సివిల్ వార్ : 

1936 నుంచి 1939 వరకు  బందో  రేపుబ్లికేనో అనే రిపబ్లికన్  లోయలిస్ట్ వర్గానికి,  నేషనలిస్ట్   వర్గానికి మధ్య జరిగిన పోరు  స్పానిష్ సివిల్ వార్. నేషనలిస్ట్ వర్గాన్ని నడిపించింది ఆర్మీ జనరల్  ఫ్రాన్సిస్కో ఫ్రాంకో. ప్రజలని రెచ్చగొట్టి, ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ మాన్యుయెల్ అజాన్యా ప్రభుత్వం పైన ఆర్మీతో తిరుగుబాటు చేసాడు.  Nazi Germany and Fascist Italy *  సహాయంతో ప్రజాస్వామ్య  ప్రభుత్వాన్ని కూలద్రోశాడు. తిరుగుబాటు ఎక్కడ మొదలైనా పొరుగుదేశాలు ప్రవేశించడం మామూలే కదా. చాలాదేశాల్లో తిరుగుబాటు చేయించేవే అవి. నీ చదువుని పాడు చేసినదీ  మన దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నావే విదేశీ శక్తులే. 

ఏప్రిల్ 1 1939 న స్పానిష్ సివిల్ వార్ ముగిసింది. నేషనలిస్ట్ ట్రూప్స్ ఆఖరి మిలట్రీ లక్ష్యాన్ని ముట్టడించడం తో దేశం నేషనలిస్ట్ ట్రూప్స్ హస్త  గతం అయ్యిందని  ఫ్యాన్సిస్కో ఫ్రాంకో  బ్యూనోస్ ఏరిస్  రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా తెలిపాడు. స్పానిష్  డిక్టేటర్  గా  పేరు పొందిన  ఫ్రాన్సిస్కో 1939 నుంచి  1975 లో చనిపోయేదాకా రక్తపాతంద్వారా  చిక్కించుకున్న  స్పెయిన్  ని  పరిపాలించాడు.   



1940 లో , ఫ్రాంకో  తన  ఫెల్లో డిక్టేటర్ హిట్లర్ ని  దక్షిణ ఫ్రాన్స్లో కలుసుకున్నారు, రెండో ప్రపంచ యుద్ధంలో చేరడానికి స్పెయిన్ అవకాశాన్ని చర్చించారు.  యుద్ధంలో పాల్గొనడానికి స్పెయిన్ యొక్క పరిస్థితులను చర్చిస్తూ ఏడు గంటలు గడిపారు, ఫ్రాంకో జిబ్రాల్టర్ ను  యుద్ధం    తరువాత   స్పెయిన్ కి అప్పగించాలని, ఆ యుద్ధ సమయంలో ఆహరం చమురు తో సహా అన్నీ సరఫరాలు  జెర్మనీ  చూసుకోవాలని  డిమాండ్   చేసాడు. స్పెయిన్ దక్షిణ భాగంలో ఉన్న బ్రిటిష్ భూభాగం జిబ్రాల్టర్  గురించి  ఆ రెండు దేశాలమధ్య చాలాకాలంగా గొడవ నడుస్తోంది. పాక్  కాశ్మీర్  ను కోరి నట్టుగా    ఫ్రాంకో జిబ్రాల్టర్ ను  కోరాడు.   కానీ ఫ్రాంకో చాలా డిమాండ్స్ చేస్తున్నట్లు హిట్లర్ భావించినందున వారి కలయిక  ఫలించ లేదు.

 క్వీన్  ఎలిజబెత్   జిబ్రాల్టర్  ని  1954 లో సందర్శించగా   ఫ్రాంకో అది అవమానంగా భావించి చాలా  రెస్ట్రిక్షన్స్ అమలుజరిపాడు .1960 లో  యునైటెడ్  నేషన్స్ న్యాయంగా జిబ్రాల్టర్ స్పెయిన్ కి చెందాలని  సావర్నిటీ క్లెయిమ్  చేసాడు  ఆ క్లెయిమ్ ని తిరస్కరించాగానే  1969 లో బ్రిటిష్ బోర్డుర్ ను మూసివేశారు.

స్పానిష్  లోకల్ టైం ను జర్మన్ టైం కి సరిచేయటం, ప్రాంతీయ భాషల్ని రద్దుచేయడం , స్పానిష్ లోనే విద్యానా భోదన, ఆఫీస్ కార్యక్రమాలు జరగాలని ఆదేశించిన ఫ్రాంకో జాతీయ భావాన్నే నిలిపాడు. ప్రాంతీయ తత్వాన్ని తెచ్చి దేశాన్ని ముక్కలు చేయలేదు   ప్రపంచం లో రెండవ అతిపెద్ద ఆర్ధిక శక్తిగా స్పెయిన్ ను నిలిపాడు .

 ఫ్రాంకో కుమార్తె కార్మెన్,  ఆమె భర్త  స్పెయిన్ లో మొదటి హార్ట్ ట్రాంస్ప్లాట్ (1968 లో) చేసిన హార్ట్ సర్జన్   Cristóbal Martínez. స్పానిష్ లో ఎర్నో అంటే అల్లుడు. పెళ్లితరవాత అతను ఎర్నిసిమో  Yernísimo (అల్లుడుగారు) అని పేరు తెచ్చుకు న్నాడు. వారికి 7 గురు పిల్లలు. క్రిస్టియన్ బెర్నార్డ్ ప్రపంచపు తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్  ఎర్నిసిమో కి మంచి మిత్రుడు   ఫ్రాంకో ఎలాంటి వాడయినా, దేశంలో ఐక్యత కోసమే పరితపించారు. Franco es un gran militar que aplazó su boda para ir a luchar...అంటే యుద్ధం కోసం ఫ్రాంకో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు .కానీ నేటితరం రాజకీయనాయకుల్లా తన కూతురు, అల్లుడిని ఇతర బంధువర్గానికి పదవులు కట్టబెట్టలేదు, కులగజ్జి ని ప్రోత్సహించలేదు. ఫ్రాంకో వీరందరికంటే మెరుగు. మన రాజకీయనాయకులతో ఎవరినీ పోల్చకూడదు,  ప్రజాస్వామ్యం ముసుగులో నిలువునా దోచుకునే గూండాలు మన రాజకీయ నాయకులు.


2 comments:

  1. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో జాతీయ వాదాన్ని ఇప్పటి రాజకీయ కుతంత్రాలకు చక్కగా వివరణ ఇచ్చారు

    ReplyDelete