మెదడు లౌకికం హృదయం అలౌకికం,
నేడు హృదయానికి మెదడు నుంచి సెలవు .
హృదయం ఆనందానికి నెలవు
వెలిగే అక్షరాలు చీకట్లో, కవిత్వమై
క్షణాలు నర్తించె ఆధరాలపై ధరహాసమై
ఎగసే హృదయము తురంగమై
సాగె ఆనంద ఆకాశంలో పవనమై
గత స్మృతులు కురిసే వర్షమై .
గుర్తుకొస్తోంది వర్షం కురిసిన రాత్రి.
గుట్టుగా పిట్టల పై రాళ్లు రువ్వే పిల్లగా!
నా మనసు కొలనులోకి రాయి విసిరావు,
కొలనులో వృత్తాలు వ్యాపించినట్లు నాలో
ఆలోచనాతరంగాలను వ్యాపింపజేశావు.
నింగి నుంచి నీటిపూలు రాలుతుండగా
మెరుపులా మెరిసావు వర్షం కురిసిన రాత్రి
వద్దన్నా పెదాలపై ముద్దర వేసి నిద్దర లేకుండా
చేసావు , నీటి ఎద్దడి లో వరద సద్దడి
వరద వెల్లువలో ఊరంతా కొట్టుపోయాక
నేనేమీ పట్టుకుపోలేక మండుటెండలో
వంటరిగా నిలుచున్నానిద్దుర రాని
నా హృదయం వేచి ఉంది వానకోసం
ఎందుకంటే వానోస్తే నువ్వు వస్తావుగా
ఆకాశం భూమి కలుస్తాయి గా
Good write up
ReplyDelete