Saturday, August 10, 2019

రాత్రి మాట్లాడింది తుంపర లో - కవిత - పూలబాల

రాత్రి మాట్లాడింది తుంపర లో   చినుకులు జీవాహుతి
చేసుకుంటున్న క్షణాల్లో, ప్రపంచాన్ని తడిపి, మనసులని తడిమి
రాత్రి మాట్లాడింది తుంపర లో,   బహిర్‌ ప్రపంచం లో చినుకులుకు రగిలి
తనువు, మానసిక ప్రపంచం లోకి వివక్షకు వణికి మనసు,
మూకలకు భీతిల్లి వలపును శుషుప్తికి ఆహుతి చేయ
రాత్రి మాట్లాడింది తుంపర లో














వివశత్వాన్ని  వీడలేక వయసు పొగిలింది మనసు పొరల్లో
 క్షణికమైన దివ్యానుభూతి స్ఫురించి రక్తనాళ సంస్పందన కలిగింది
పరవశత్వంతో పరి చుంబన స్వనాలాపనకు  రసధుని పొంగి
 ఇంద్రియాల్లో ప్రసరించింది, రగిలింది తనువు,  ఘాడ  నిట్టూర్పు
 సమాధిలో  మూల్గింది మనసు,  అంతః ప్రచండ ఝంఝా ప్రభంజనం లో
  రాత్రి మాట్లాడింది తుంపర లో


 హేతువు తీతువు  కూతల్లో జంకి  ప్రేమ భౌతిక ప్రేరణను,
మానసికమని  బొంకి   వలపు  తలవంచుకునే తరుణం లో
 తనువులను జేర్చి మనసులను కూర్చి రాత్రి మాట్లాడింది తుంపర లో.

2 comments:

  1. రాత్రి మాట్లాడింది తుంపరలో...అంతః ప్రపంచంలోకి జ్ఞాన చక్షువులతో

    ReplyDelete

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...