Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 20, 2019

పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు - పూలబాల

పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
వనములో తిరిగిరి వానల్లో ఆడిరి
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
సెట్ల సుట్టూ తిరిగి పాటాలు పాడి
ఆవాల సేలల్లో పచ్చపూలన్నీ
యమునా తటిమీద సాధూ జనమంతా
క్రిష్నయ్య కొరకు ఎదురుజూడెంగా  
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
వనములో తిరిగిరి వానల్లో ఆడిరి
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
సెట్ల సుట్టూ తిరిగి పాటాలు పాడి
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులుII

నిల్వటద్దము ముందు నిలుచోగా రాధ
మంచి మరబాము దెచ్చి చెంచు జెడలల్లే
గోపకిశోరుడు గోముగా చూసే
గోముగా చూసి మురళి గానము చేసే
మురళీగానమ్ము నిదివనమును జేర
నిదివనములోని చెట్లు గోపికలాయెను
గోపికలు కృష్ణునితో పాటలు పాడెను 
 వయ్యారా లొలకంగా నాట్యమాడెను
తెల్లవారంగా గోపికలు చెట్లాయే
రాదమ్మవొడిలో నిద్రించే కృష్ణుడు
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
వనములో తిరిగిరి వానల్లో ఆడిరి
పుట్ట సేళ్ళాడిరి రాధా కృష్ణులు
సెట్ల సుట్టూ తిరిగిరి పాటాలు పాడిరి.
**********************************************************
ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు  Version 2.0

ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
వానల్లో నానిరి వనములో ఆడిరి

పచ్చ  పావడ పై   , తెల్ల పైట జుట్టి
నల్లని కాటుక కళ్ళకి దిద్ది
త్రాఛంటి  జెడతో , కాళ్ళ కడియాలతో
ఘల్లు ఘల్లు మంటూ కదిలొచ్చే రాధ

శిరమున  పింఛము, మెళ్లోన   విరిసరము
కరమున మురళి తో కదిలే కృష్ణుడు

ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
పుప్పొడి ఛిన్దగా పూలతో ఆడిరి

చల్ల గాలికి క్రిష్నయ్య  పింఛము
పడగా ఇప్పిన త్రాచల్లే ఆడే  
పంతము పూని  నెమళ్ళు జేరి
 పింఛముతోని  ఆటలు ఆడే

నెమళ్ళ ఆటకు పరవశించి
క్రిష్నయ్య  చేసే మురళీ రవము
మురళీ గానము విన్నపికిలిపిట్ట
పిలవక  వచ్చే  మాల పై వాలే  
కృష్ణయ్య మెళ్ళో మాలపై వాలి
మురళి తో  పోటీగా పాట  పాడే
పికిలిపిట్ట పాటను వింటూ
పర్వాసముగా రాధమ్మ నవ్వే

ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
పుప్పొడి ఛిన్దగా పూలతో ఆడిరి

సూరీడు సన్నంగా సూదులు గుచ్చినా
కారు మబ్బులు ముసిరి అరిసి కురిసినా
ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
పుప్పొడి ఛిన్దగా పూలతో ఆడిరి

కుర్రబుగ్గలపైనా ఎర్ర పుప్పొడి చింది
మారులుగొలిపేరాధ మరువము తోడి
మంచి ముత్యాల్లాంటి మంచుబిందువులు
నల్లనయ్యాను తాకి మెల్లగా మెల్లగా మెరవ

జుమ్మంటూ వీయంగా చల్ల చల్లని గాలి
పచ్చ పచ్చని పూలు పులకరించంగా
యమునాతటిమీద సాధుజనమంతా
క్రిష్నయ్య కొరకు ఎదురే చూడంగా

ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
వానల్లో నానిరి వనములో ఆడిరి


నిల్వటద్దము ముందు నిల్చోగా రాధ
గోపా కిశోరుడు గోముగా జూసే
గోముగా జూసి  గానము జేసే
మురళీ గానము నిధివనము జెర
నిధివనములో చెట్లాయే గోపికలు

గోపికలందరూ కృష్ణునితోడి పర్వాసముతో పాటలు  పాడిరి
గోపికలందరూ కృష్ణుని గూడి వయ్యారాలొలకంగా నాట్యమాడిరి
తెల తెల్ల వారంగా గోపికలందరూ అట్లే నిలిచిరి  చెట్లే ఆయిరి
రంగమాలులో రాధమ్మ వొడిలో ఆదమరిచి నిదురించే కృష్ణుడు

ఆదమరసి ఆడిరి రాధాకృష్ణులు
వానల్లో నానిరి వనములో ఆడిరి



Version 2.0 Added on 27th Feb 2020

5 comments:

  1. Replies
    1. Lalitambika you have ascended. Congratulations and thanks.

      Delete
  2. చక్కని జానపద గుబాలింపులు మేళవించి రచన చేశారు.రాధాకృష్ణుల రాసలీల జానపధంలో చెంచులచేత చెప్పించినతీరు కడురమ్యం.రాధాకృష్ణల రాసలీలలు జానపదంలో చెప్పిన విధానం కృష్ణుడు తన మురళీగానంతో యమునా నది ఒడ్డున బృందావనంలో చల్లని గాలులతో ఒలలాడించినట్లుంది.ఈ సాహిత్యం దృశ్యాన్నీ ఆవిష్కరిస్తుంది, మరీ ముఖ్యంగా ఆదివాసీల ప్రేమ, భక్తీ రాధాకృష్ణలపై ఇంతకు ముందు ఏకవీ చూపనిది, రాయనిది, రాసి జానపదంను అజరామంచేశారు కవి తన జానపద సృజనతో నిజంగా అమరుడుగా నిలిచాడు జానపదుల గుండెల్లో.చాలా కాలం తరువాత ఓ.... చక్కని, చిక్కని జానపద గీతం పుట్టిందనిపించింది. ఆశ కలుగుతున్నది తెలుగు భాష మనుగడప, జానపద సృజనపై. కవి సర్వదా అధీనందనీయులు. అంకమరావు పిల్లా.

    ReplyDelete
  3. అభినందనీయులు.

    ReplyDelete