Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, October 26, 2019

కొండపల్లి కోట - జానపదగీతం - పూలబాల

కొండపల్లి కోట కాడ సుక్కలాంటి లాంటి పిల్లని చూసాను
బిత్తరి కళ్ళతో మత్తుగా నవ్వితె సిత్తరువై నే బిత్తరబోయాను

లక్కపల్లి వాగు కాడ మెరకలో అరకలు దున్నివీరుడు
కోరమీసం దువ్విన సూరుడు సిన్నగ నవ్వితే సిత్తయిపోయాడే
సిగ్గరి పిల్ల దగ్గరికొత్తే అగ్గే దగిలి భగ భగ మండేనే
ఉత్తదిక్కున హత్తుకుపోయి కత్తెర దొంగల మనసే దోచాడే.
కొండపల్లి కోట కాడ సుక్కలాంటి  పిల్లని చూసాను
బిత్తరి కళ్ళతో మత్తుగా నవ్వితె సిత్తరువై నే బిత్తరబోయాను
లక్కపల్లి వాగు కాడ మెరకలో అరకలు దున్నివీరుడు
కోరమీసం దువ్విన సూరుడు నాటు సరసం మోటుగా చూపి
నాజూకైన నడుముని గిల్లి గడ్డి మేటు చాటుకి లాగాడే
వాడి వాడి చూపుల ఊపులో వంపులు సొంపులు 
ఊయలలూగె అందాలనీ విలవిలలాడెనె II
లక్కపిడత ఊపుల దాన చికిచికి నడకల చిన్నదాన
సిగ్గే విడిచి దగ్గరకొస్తే చిక్కుడుబిళ్ల ఆడిస్తానే, పుత్తడి ఇత్తడి చేసేస్తానే. 
సుక్కలాంటి పిల్లని లక్కలాగ కరగేసి , అయ్యకి తెలిసి మాటేసి
భరతం పడతానంటేనే,  భయపడి సక్కగా పక్కకి తప్పుకున్నావా
పక్కకి తప్పుకోలేదే పక్కపిన్నులు తెచ్చేనే చేమంతులు నీ సిగలో పెడతా
రవ్వాడ గా, నే రంగంపోయి సైనికుడై తిరిగొచ్చానే రవ్వల గొలుసు పట్టుకొచ్చానే
అయ్యో మా యయ్య నువ్వెళ్లిపోయా వనుకొని   పొటుకరించి పొటుకొచ్చే, పోటుగాడు భద్రాన్ని !
భద్రం మావతో లగ్గం పెట్టె మనువాడా లని శాసనమెట్టెడు తప్పితే నాకే శాపంపెట్టేడు
భద్రం గాడు ఆడేవాడే శాసనమెట్ట అయ్య ఎవడె శాపం గీపం తెల్వదు నాకు
వలచిన సిలకని మనువాడాలని సైనికుడై నే తిరిగివచ్చాను, సెప్పకు ఒప్పను శాపాలేవీ!!
చూపులు చురచుర చూడొద్దు వంకర మాటలు విసరొద్దు
మసలం, మరిసి కుసలం చూడు భద్రం మావకి సెప్పిసూడు, అయ్యాయితే ఒప్పుకోడు...
అయ్యేవడే మంచంకోడు మామేవడే ముచ్చుగాడు
అంగ అంగడి నే దిరిగి అచ్చు బెల్లం నె తెత్తే పొడిబెల్లమునే వడిగట్టివే ,
దోసాపాదులో దోసాలెతికి దడిబియ్యమునే వడిగట్టితివె, ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నావే.
లక్కపల్లి వాగు కాడ మెరకలో అరకలు దున్నివీరుడు
కోరమీసం దువ్విన సూరుడు ఊపిరిలో నా ఊపిరివాడు
భద్రం గాడు వాడెవడు  శాసనమెట్ట అయ్య ఎవడు 
లగ్గం పెట్టుకు నువ్వొస్తే కొంగుకిగట్టుకు సూసుకుంటాలే.

No comments:

Post a Comment