Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, June 21, 2020

Anveshana 2020 Scene 15

షూ . . షూ షూ షూ  అని షార్ప్ ట్రిల్ల్స్  వినిపించడం తో కళ్లుతెరిచి చూసింది  రెజీనా. బాగా మత్తుగా పడుకున్నావనుకుంటాను , మత్తుగా అనే పదాన్ని వత్తి పలికింది. అనసూయ.  అవును రాత్రి రూమ్ లోకి వెళ్ళగానే  మంచం మీద పడిపోయింది. అలా నిద్రలోకి నిద్రలోకి జారుకుంది.  నవ్వి అవును అంది . వెంటనే మాటమార్చి నిన్నరాత్రి వాన పడలేదు కదా అంది కాఫి కప్పు తీసుకుంటూ. ఇద్దరూ కిటికీ దగ్గరికి వెళ్లి నించున్నారు. పడుతుంది అనుకున్నాము , కానీ పడలేదు అంది అనసూయ.  వాన పడకపోతేనే అందరు హాయిగా పడుకుంటారు. ఎక్కడ రాత్రంతా సత్య పడుకోలేదు , స్టమక్ అప్సెట్ అంటూ. అంది అనసూయ కాఫీ కప్ తీసుకుంటూ. సరే నేను తయారయ్యి వస్తాను బాత్రూం లోకి దూరింది రెజీనా. అనసూయ కాఫీకప్ తీసుకుని మేడ దిగివెళ్ళిపోయింది.

  రెజీనా మేడ దిగి కిందకి వచ్చేసరికి అప్పుడే తెల్లవారుతోంద. హాల్లో గిరి ఒక్కడే ఉన్నాడు కబోర్డ్ లు తుడుస్తూ. రెజీనాని చూసి ఇది సత్తిగాడి పని కానీ నేను చేస్తున్నాను. అయ్యో , ఎంత పని అయిపొయింది అన్నట్టు మొహం పెట్టి , ఇంతకీ  సత్య ఏడి  ? అంది వాంతులు అవుతున్నాయి. రాత్రి ఏం తిన్నాడో చెప్పడు , మీరు వచ్చిన తరువాత వచ్చాడు బంగళాకి. చూడండి ఇప్పుడు కూరలు తేడం  నుంచి  నుంచి , మొక్కలకి నీళ్లు పెట్టడం , సోఫాలు తుడవడం  దాకా అన్నీ నేనే చెయ్యాలి.అన్నాడు గిరి. ఇక్కడ డాక్టర్ ఎవరూ లేరా ?  విలేజ్ లో ఉన్నారండి. మంచి డాక్టరే , కాకపోతే ముసలాయన. మంచి డాక్టరే  అంటే ? అంది రెజీనా. అంటే ఆర్ ఎం పీ కాదు అని అర్ధం.

నువ్వు సత్యని జాగ్రత్తగా చూసుకో నేను ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ ని రికార్డ్ చెయ్యాలి.  అంటుండగానే సత్య వచ్చాడు " ఏంటి మేడమ్ , చెంచులగూడెం దగ్గరకా ? గిరి నువ్వెళ్లు. నాపని నేను చేసుకుంటాను అన్నాడు. అన్నట్టు అనూ .. అనూ  మేడమ్ వెళుతున్నారు, బ్రేక్ఫాస్ట్ రెడీచేయ్యవా ? అని అరిచాడు.  మేడం రెండు నిమిషాలు బ్రేక్ఫాస్ట్ రెడీ  అంది.  ఏం  అక్కరలేదు , నేను ఒక్కత్తినే వెళ్ళగలను. గిరి సత్యాని  డాక్టర్ కి ....  ఓకే  అంటూ  జీప్ ఎక్కేసింది . నాకు  అజీర్తికి ఆ మందు పనిచేయదు , దీనికి వేరే మందు ఉంది  అది గూడెంలో దొరుకుతుంది. మీరు త్వరగా వస్తే అక్కడ ... జీపు కదిలిపోతోంది .. పండగ ఉంది , అంటే లోకల్ కార్నివాల్. కార్నివాల్ అనేమాటని జీప్ దగ్గరగా వెళ్లి వినపడేలా సత్య అరుస్తుండగా "ఒకే" అంది రెజినా.  జీప్ వేగం పుంజుకుంది.  జీప్ అడవిలోంచి దూసుకుపోతోంది. కొంచెం అడవి పరిచయం అయ్యింది. మనస్సు తేలికగా ఉంది. జీప్ చీతా వాటర్ స్పాట్ దాటింది   డయాగ్నల్ గా కనిపిస్తున్న బాటలో  జేమ్స్ క్యాంపు హౌస్ , జీప్ ముందుకి వెళ్ళిపోయింది. నెమలిని చూసి ఈర్ష్య కలిగింది. జంకు గొంకు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తప్పు అనిపించినా  చాలా రొమాంటిక్ అని కూడా అనిపించింది. కార్తిక్ కూడా చాలా  రొమాంటిక్ , కానీ తానే గిరిగీసుకుని కూర్చుని జీవితాన్ని కెరియర్ బాటలోకి నెట్టింది.  కార్తీక్ తో కార్లో తిరిగిన రోజులు గుర్తువచ్చాయి.  అవి చాలా జాలీ డేస్ .

 అవి కార్తిక్ మద్రాస్ యూనివర్సిటీ లో క్రిమినాలజీ  చదువుతున్న     రోజులలో పరిచయం అయ్యాడు.  కార్తీక్ ని మొదటిసారి లైబ్రెరీలో చూసినప్పుడే , ఈ అబ్బాయి కావాలి అనుకుంది. తనది  అన్ బీటబుల్ ఫిజికల్ చార్మ్.  తాను తీసుకెళ్లిన పుస్తకాలే ఆమె కూడా చదువుతూ చాలా సులభంగా పరిచయం చేసుకుంది.  వాటి గురించే ఇద్దరూ చర్చించేవారు. క్రిమినాలజీ తో పాటుగా హారర్ ఫిలిమ్స్ చూడడం డిటెక్టీవ్ బుక్స్ చదవడం ఇద్దరికీ కామన్ హాబీస్. ఒకరోజు మెరీనా బీచ్ లో కార్తీక్ అడిగాడు " నేనంటే క్రిమినాలజీ స్టూడెంట్ని నాకు ఈ హాబీస్ సూట్ అవుతాయి మీరు సోషల్ వర్క్ స్టూడెంట్ కదా మీకు ఇలాంటి హాబీస్ ఏంటి ? హాబీస్ కూడా కెరీర్ కి సంమంధించినవే ఉండాలా , ఇదేం లాజిక్కు ? అని తిరిగి అడిగింది. అదే కదా లాజిక్కు అన్నాడు. "లైఫ్ లో లాజిక్ లేనివి చాలా ఉంటాయి.  నిజం చెప్పాలంటే  నాకు చదువు కూడా హాబీ లాంటిదే. సరదాకి చదువుకుంటున్నాను." అంది.  "తర్వాత ఎం చదువుతావు ? జాబ్ ఏంచేయాలి అనుకుంటున్నావు? ఏం ఉద్యోగం చేయక్కరలేదా? అన్నాడు.  "నేను ఆర్నిథాలజీ చదువుదామనుకుంటున్నాను."అంది. " ఏంటి పక్షులగురించి చదువుతావా?   నేను చదివే చదువుకి మంచి అవకాశాలు ఉన్నా  నన్ను ఈ కోర్స్ తీసుకున్నందుకు  మా ఇంట్లో వాళ్ళు వాయించేస్తున్నారు . ఈ చదువుకి ఎం ఉజ్జోగాలు వస్తాయి అని . మీ ఇంట్లోవాళ్ళు నీకు ఇంత స్వేచ్ఛ ఇచ్చి చదువుకోమన్నారంటే  వాళ్ళు చాలా గ్రేట్ , ఒక్క సారి మీ ఇంటికి తీసికెళితే వాళ్లకి రెండు చేతులు ఎత్తి  నమస్కరించాలి ఉంది. అన్నాడు . మరుసటి ఆదివారం మా ఇంటికి తీసికెళ్ళాను. మా నాన్న గారికి కార్తిక్ గురించి చెప్పెను.  మా ఇంట్లో అడుగు పెట్టాక మాది బాగా సంపన్న కుటుంబం అని అర్ధం అయ్యింది.  ఆ తర్వాత కార్తీక్ నాతో మాట్లాడడం తగ్గించేసేడు , కనపడడం కూడా అరుదే. కార్తీక్ కి లాంగ్వేజెస్  అన్నా , రీడింగ్ అన్నాపిచ్చి . రేజీనాకి కార్తీక్ అంటే పిచ్చి.  చదువు కుంటున్నంతసేపు కార్తీక్కి ఎప్పుడూ కెరీర్ మీద ధ్యాస ఉండేది. పైగా రెజీనా పట్ల గౌరవంతో మర్యాదగా నడుచుకునేవాడు. కార్తీక్ బాహ్య సౌదర్యంతో అంతః సౌదర్యం పోటీ  పడుతుంటుంది.

కోర్సు పూర్తయిపోయే సమయానికి , కార్తీక్ కార్ల మీద చాలా ఆసక్తి కలిగింది. ఎప్పుడూ పుస్తకాలు , పుస్తకాలు,  పుస్తకాలు అనేవాడు కార్లమీద మోజు పెంచుకున్నాడు. మద్రాస్ వదిలి వెళ్లిపోయేలోపు మెరీనా బీచ్ కి కార్లో రావాలని కోరిక. నాదగ్గ ఉన్నవి కార్తీక్ దగ్గర లేనివి కార్లే. ఒక రోజు  యూనివర్సిటీ కి కారు తీసుకెళ్ళేను. మెరీనా బీచ్ కి వెళ్ళేం , కోరిక తీరిపోయింది కదా అంది రెజీనా. నవ్వి ఊరుకున్నాడు.  కొన్ని  సార్లు కార్లో తిరిగారు, ఎప్పుడు కారుతీసినా వర్షం గ్యారంటీ "  అందుకే ఎప్పుడు  వర్షం చూసినా మనసు పూవై పులకరిస్తుంది.  వచ్చేసింది చెంచుగూడెం బర్డ్స్ స్పాట్ . గిరి సత్య పాతిన బోర్డు కనిపిస్తోది. హడావుడిగా జీప్ దిగి  డయూర్నల్ బర్డ్స్ - వేకువ జాము పక్షులను రికార్డ్ చేయడానికి పేరాబోలిక్   మైక్రోఫోన్ సిద్ధం చేసి , హెడ్ ఫోన్స్ లో వింటూ ముందుకు సాగుతున్నది . పక్షులు రోడ్డు దగ్గరలో ఉన్న  చెట్లమీద లేవు.  చెట్లవంక చూస్తూ అడవిలోపలకి ప్రవేశించింది. ఒక అరగంట నడిచిన తరువాత హెడ్ఫోన్ కి మొదటి సిగ్నల్ అందింది. తర్వాత కొత్త బర్డ్ కాల్స్ వినిపిస్తున్నాయి. రికార్డింగ్ ముగించి చూస్తే అన్ని దిక్కులు  ఒకే మాదిరిగా ఉన్నాయి. నాలుగు దిక్కులు పరిగెడుతోంది, రోడ్డు కావాలి తనకి . జీప్ కనిపించాలి అప్పటికిగానే తన మనసు కుదుటపడదు . ఇక్కడ ఒక్క చెంచు లేడే. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తోంది. సడన్గా  ఒక జత నల్ల బూట్లు ఒక పొదలచాటుకి పరిగెట్టేయి. బో గన్ లో ఏరో  ఫిక్స్ చేసి తలఎత్తి  పొదవైపు చూసింది. ఎవ్వరూ లేరు. గట్టిగా అరిచింది " హెల్ప్ " దూరంగా పెద్ద చెట్లమాటున ఎవరో కదులుతున్నట్టుంది .

జీప్ ఆపినవైపు సౌత్ , దిగి తాను నడిచిన ది  తూర్పువైపు , మల్లె తూర్పుకు తిరిగింది . తనవెనక భాగం పడమ. కుడిచేతివైపు దక్షిణం , ఎడమచేతి వైపు ఉత్తరం. మెల్లగా నడిచింది పావుగంట తర్వాత జీప్ కనిపించింది.  ఆశ్చర్య బర్డ్ స్పాట్ బోర్డు ఎవరో పీకేశారు. ఇందాక వచ్చే తప్ప్పుడు కనిపించింది ఇప్పుడు లేదు.  ఇంకా నయం జీప్ ఉంది. పరిగెత్తుకుంటూ జీప్ ఎక్కి స్టార్ట్ చేసింది. ఈ ఆగంతకుడి సంగతి తేల్చాలి. అని గట్టిగా నిశ్చయించుకుంది. ఈరోజు కార్తీక్ వస్తాడు కానీ ఉదయమే వస్తాడా? సాయంత్రం వస్తాడా తెలియదు. జీప్ జేమ్స్ క్యాంపుహౌస్  వైపు పోనిచ్చింది. కొంచెం దూరంలో జీప్ ఆపి దగ్గరికి వెళ్ళాక ఏవో మాటలు వినిపిస్తున్నాయి. తన దగ్గరున్న ఏరోతో  కన్ను చూడడానికి వీలయ్యే చిన్న కన్నం చేసింది.  అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తగిలింది.  ఒక పొడవాటి నల్లని అమ్మాయి జేమ్స్ కౌగిలిలో ఉంది . ఆ అమ్మాయి దాదాపు 6 అడుగులు ఉండొచ్చు. బలిష్టంగా సాము గరిడీలు చేసేవారికుండే శరీరం ఉంది. ఆ అమ్మాయి మొఖం రెజీనాకేసి తిరిగి ఉంది. జేమ్స్ బేక్ వ్యూ కనిపిస్తున్నది. ఇద్దరికీ ఒంటిమీద బట్టలు లేవు.   ఆ అమ్మాయిని  రెండు  చేతులతో ఎత్తుకుని మంచం మీద పడేసాడు. ఇంక బాగుండదని కన్నం దగ్గరనుండి మొహం తీసేయబోతుంటే , ఆ మగ వ్యక్తి మొఖం కనిపించి రెండవ షాక్ తగిలింది.  అతడు జేమ్స్ కాదు , పట్టాభి. అంటే జేమ్స్ ఎక్కడుండచ్చు ?  బుర్ర లో మిక్సీ తిరుగుతున్న అనుభూతి , జీప్ దగ్గరకి వెళ్లే వరకు ఉండుండి  మిక్సీ స్పీడ్ పెరిగిపోతోంది.  జీప్ బంగాళా చేరింది.  జీప్ నిలిపి లోపాలకి అడుగు పెట్టగానే మరో షాక్.    గిరి , సత్య,  అనసూయ లతో నెమలి కూడా కనిపించింది.

మొత్తం ఎన్ని స్పాట్స్  మేడమ్ ?  అన్నాడు గిరి. అనసూయకి మొత్తం ఎన్ని షాక్స్  మేడమ్ ? అన్నట్టు వినిపించింది. మెల్లగా వేళ్ళు తీసి మనసులో అనుకుంటూ లెక్కపెట్టింది  1. తోవ మర్చిపోడం 2. నల్ల బూట్లు వేసుకున్న ఆగంతకుడు 3. బోర్డు పీకేయడం 4. జేమ్స్ అనుకుని ఒక షాక్ తినడం , 5 పట్టాభి అని చూసి మరో షాక్ తినడం 6. నెమలి గురించి ఎదో ఊహించుకుని  ఇక్కడ ఉండడంవల్ల షాక్ తినడం.  మొత్తం ఆరు షాక్స్. అంది.

 సరిగ్గా లంచ్ టైం కి వచ్చేసావు కాబట్టి బాధలేదు , ఏమైనా తిని వెళ్ళు రెజీనా. అంది అనసూయ. బైటికెళ్లే మనిషికి ఏం పెట్టకుండా పంపించడం నాతరం కాదు అంది అనసూయ మొహం మాడ్చుకుని. అలాగే తప్పకుండా నువ్వు మొహం గంటుపెట్టుకోకు తల్లీ అని ఓదార్చింది రెజీనా.    మేడమ్,  మీజాబ్ లో ఉన్న ఫ్రీడమ్ ని వాడుకోండి మేడమ్, ఎప్పడెళితే ఏముంది మేడం , పక్షులు ఏమైనా అడుగుతాయా ? అన్నాడు సత్య .   సత్యా! ఇది జాబ్ కాదు రీసెర్చ్. పక్షులు మనని ఏమీ  అడగవు , కానీ లేటయితే పక్షులు ఉండవు. అంది రెజీనా చిరు కోపం నటిస్తూ.  అందరు నవ్వుకున్నారు.  అందుకే వీడు చాలా అవసరం అని జగపతి గారు అంటుంటారు. అన్నాడు గిరి.   " మీ అందరికీ అడవి పులుసు తీసుకొచ్చాను. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు." అంది  నెమలి. మాతోపాటు నువ్వు తినాలి అంది రెజీనా. అందరు కలిసి భోజనం చేశారు. సత్య  నేను భోజనం చేయనని తెగేసి చెప్పేడు.  భోజనాలు అయ్యిన తర్వాత  అడవి పులుసు చాలా బాగుంది , ఈరోజు ఏంటి స్పెషల్ అంది రెజీనా.  అసలు ఈరోజు ప్రోగ్రాం ఏంటో తెలుసా , అందరం గూడెం పండగ కి వెళుతున్నాము. అన్నాడు గిరి. అవును నేను చెప్పెను కదా అన్నాడు సత్య . అసలు వీడు భోజనం మానేసినది అందుకే అన్నాడు గిరి. అర్ధం కాలేదు అంది రెజీనా.  అక్కడికి వెళితే అన్నీ అవే అర్ధం అవుతాయి అంది నెమలి . కాసేపు విశ్రాంతి తీసుకున్నతర్వాత అందరూ బయలుదేరారు.

కార్తీక్ వస్తే ఎలాగ అనుకుంది? అయినా ఎక్కడికి వస్తాడు ఎలావస్తాడు?  బంగళాకి వస్తాడా ?  బంగళాకి వస్తే  అనసూయ ఉంది  కదా అనుకుంది. సర్లే తన సంగతి తాను చూసుకుంటాడు. " మనం ఎంత సేపట్లో వస్తాం " అంది నెమలితో. జేమ్స్ లేదా అని అడుగుదామనుకుంది. నీకెలా తెలుసు అని అడిగితే ఎం సమాధానం చెప్పాలి ? అనుకుని ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఊరుకుంది.   ఇప్పుడు 3 గంటలు అయ్యింది కదా 5 గంటలకి వచ్చేసి ఉంటాము. అంది నెమలి. అందరూ జీప్ ఎక్కారు. జీప్ చీతా స్పాట్ దాటి పావుగంట తర్వాతా జేమ్స్ జీప్ ఎదురయ్యింది, గిరి జీప్ స్లో చేసాడు.  ఇల్లీగల్ పోచర్స్ ని  అరెస్ట్ చేసి  పోలీస్ స్టేషన్ కి అప్పజెప్పి వస్తున్నాను అని చెప్పేడు.  రెండు జీపులు కదిలి పోయాయి. ఓహో అంటే గురుడు పొద్దున్ననుంచి అడవిలోనీ, గ్రామంలోని లేదన్నమాట.  అనవసరంగా నెమలిని అనుమానించాను. నెమలి మంచిదే అయ్యుండచ్చుగా అనుకుంటుండగానే  జీప్ ఒక గూడెం చేరింది.

                                                         End of Scene 15

6 comments:

  1. One side sweet memories and another side tension in the forest. Waiting to see the meeting of Regina and Karthik sir

    ReplyDelete
  2. My god! Shocks are not only for Regina sir. For readers also

    ReplyDelete
  3. Sahitya Priya I am glad that you enjoy reading. your joy of reading is the strength of my writing. please keep your feedback clear like this.

    ReplyDelete
  4. Quite exciting and lots of curiosity engulfed me

    ReplyDelete