Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, June 4, 2020

Anveshana 2020 - scene 8


ట్రింగ్ ట్రింగ్. టెలిఫోన్ మోగింది. ఒక వైపు నుంచి   మసక వెలుతురు లో నల్లని ఆకారం  ముతక స్వరం తో " హలొ , జగపతి కొద్దీ సేపట్లో అడవిలో అడుగు పెడుతున్నాడు జాగ్రత్తగా ఉండు."

 " అప్పుడప్పుడు వచ్చి పోతు ఉంటాడుకదా ఇది ఏమైనా కొత్తా ? అయినా అక్కడెక్కడో ఉంటూ నీడలా అనుసరిస్తున్నట్లు ఎలా చెప్పగలుగుతున్నావు ?" వచ్చింది సమాధానం.

"అధిక ప్రసంగం వద్దు, చెప్పినది చేయడమే నీ పని,  ఈ సారి చాలా ఎక్విప్మెంట్ తో వస్తున్నాడు. అసలు ఈసారి జగపతిని లేపేయడానికి సిద్ధంగా ఉండు. "

"జగపతి ని చంపడమా , ఈ అడవంతా మన కంట్రోల్ లో ఉంది , చంపడం మనకే ప్రమాదం, పక్షులమీద రీసర్చ్ కి కొత్త అమ్మాయిని రప్పించాడు. నెలకి లక్ష ఇస్తానన్నాడుట. ఆ అమ్మాయి రెండు నెలలు లో పని పూర్తి చేసి వెళ్ళిపోతుందిట "

 "వాడు ఎంతిస్తే మనకెందుకు.  మనది  కొట్లమీద వ్యవహారం   ఏమాత్రం డౌట్ వచ్చినా "

"సుజాతకి పట్టిన గతే రెజీనాకి పడుతుంది ,  పులి నోటికి ఆహారం అవుతుంది. "

రెజీనా సంగతి సరే , ఈ సారి జగపతి ని కూడా .. అని నల్లని ఆకారం అంటుండగానే

"సరే సరే ఇంక నేను ఉంటాను ఎక్కువసేపు మాట్లాడడం మంచిదికాదు. నీ స్కెచ్ ఏదైనా ఉంటె మన పద్దతిలో పంపించు." అంటూ కట్ చేసింది మరో స్వరం.
సత్య,  సప్తగిరి,  అనసూయ జగపతి కోసం ఎదురుచూస్తూ 
రెండుకార్లు బంగాళా లోకి వచ్చి ఆగాయి. ముందు తెల్లకార వెనక నల్ల స్కార్పియో తెల్లకారులోంచి జగపతి దిగగానే సత్య,  సప్తగిరి,  అనసూయ మొఖాలు  ఆనందంతో వెలిగిపోయాయి. జగపతి చేతులో ఒక బేగ్ ని గిరి తీసుకున్నాడు  మరో బేగ్ ని సత్య తీసుకున్నాడు. అనసూయ పరుగుపరుగున వంటగదిలోకి వెళ్ళిపోయింది.  వెనక నల్ల స్కార్పియో లో సెక్యూరిటీ స్టాఫ్ దిగి వస్తున్నారు.  వారి చేతిలో ఒక కుక్క కూడా ఉంది. అంతా లోపలికి వచ్చిహాల్లో  కూర్చున్నారు. అడవి అందానికి అందరూ ముగ్దులవుతుండగా ,  పక్షుల కిలకిలా రావాలు వినిపించాయి. "అబ్బా ఏమి పక్షులు ! ఏమి ధ్వనులు !! " ఈ బంగాళా లో పక్షులు పెంచుతున్నారా?"  అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ . అంతలోనే చేతిలో ట్రే తో 6 కప్పుల కాఫీ తో వచ్చింది అనసూయ. జగపతి, నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్లకు కాఫీ కప్పులు అందించింది" పక్కనే నిలబడి ఉన్న సత్య , గిరి  సెక్యూరిటీ వాళ్ళని చూసి నవ్వారు.  గిరి "   ఈ బంగాళా లో పక్షులు పెంచుతున్నారా? అని అడిగారు కదా , అదుగో ఆ పక్షి " అన్నాడు .  నిజమా ?  అన్నాడు ఆఫీసర్. " నీ టేలంట్ చూబించు బేబీ అన్నాడు" సత్య . అనసూయ నవ్వి ఊరుకుంది . జగపతి నవ్వాడు . "  సత్య అన్నాడు "అవును, ఆరు కప్పులు ఎందుకు తెచ్చావు ఇక్కడ ఉన్నది 8 గురు అయితే"   ఇక్కడున్నది 6 గురు కదా 8 గురు ఏంటి ? అంది అనసూయ . " అంటే మేము మనుషులం కాదా " అన్నారు గిరి సత్య . "ఏడిసారు , వెళ్లి పైన డ్రైవర్ ఉన్నారు ఆయనకి ఇవ్వండి . అని గట్టిగా అని  గిరి దగ్గరగా వెళ్లి " మీ ఇద్దరు  వంటగదిలోకి తెగలడండి" అంది. "మరి రేజీనాకి ఇవ్వవా కాఫీ ?" అన్నాడు సత్య. "హెడ్ మేన్  ఇంట్లో తాగింది కదా  ఇప్పుడే తాగలేదు" అన్నాది అనసూయ. ఒరేయ్ సత్తిగా ఈ అనసూయ మీద నాకు అసూయా వచ్చేస్తోందిరా డ్రైవర్ కి కాఫీ ఇచ్చి వస్తూ అన్నాడు  గిరి. "టెన్త్ క్లాస్ చదివిన నీకే అంత బాధ గా ఉంటె ఇక్కడ  బీ  టెక్ ఇక్కడ.." అన్నాడు సత్య. నెత్తి  బాదుకున్నాడు గిరి.  అనసూయ వంటగదిలోకి వెళుతుండగా " కి, కి, కి,  కిచ కిచ , కూ, కూ " అనే పక్షికూతలు వినిపించాయి. మళ్లీ సెక్యూరిటీ ఆఫీసర్స్ మొఖాల్లో అదే ఆశ్చర్యం. కాస్సేపుతర్వాత జేమ్స్ వచ్చాడు. జగపతి అన్నాడు"జేమ్స్ ఏంటి లేటు అందరం నీకోసం ఎదురు చూడాలా ?"  అందరూ కలిసి లంచ్ చేశారు. మద్యానం 3 గంటలు అవుతుండగా ఇంక మేము బయలు దేరతాము అన్నారు సెక్యూరిటీ ఆఫీసర్స్. అదే సమయంలో ఆకాశంలో  నల్ల మబ్బులు కమ్ముతున్నాయి " అరెరే .. పెద్ద వాన పడేలా ఉందే , రాత్రికి ఉంది రేపు బయలుదేరండి అన్నాడు గిరి నవ్వుతాలుగా. జేమ్స్ నవ్వుతు అన్నాడు " వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్స్"   సెక్యూరిటీ ఆఫిసర్స్ కూడా నవ్వి   స్కార్పియో లో వెళ్లిపోయారు.  బో బో అరిచింది కుక్క. అనసూయ కుక్క వైపు  భయం భయంగా చూసింది. జగపతి నవ్వి  " కూపర్!!! అనుని చూసి అరవచ్చా?"          " అను కూపర్ని చాలా జాగ్రత్త గా చూసుకోవాలి"  జగపతి.   "అంటే గిరి సత్య లు ఎంతో కూపర్ కూడా అంతే కదా జగ్గీ " జేమ్స్ అన్నాడు  జగపతి వైపు చూస్తూ . మమ్మల్ని బాగా పోల్చారు.  తరువాత జగపతి  రెజీనాని జేమ్స్ ని ఒకరినొకరికి పరిచయం చేసాడు.  రెజీనా  యితడు జేమ్స్ నా హైస్కూల్ క్లాస్ మేట్, ఈ ఫారెస్ట్ రేంజర్ . నీకు ఏమైనా సహాయం కావలిస్తే జేమ్స్ ని అడగొచ్చు. జేమ్స్ ఈమె రెజీనా అమెరికాలో UNO p2  గా పని చేస్తున్నది ,  NEERI లో Environmental Engineering  చదివి  తరువాత  లండన్ యూనివర్సిటీ లో  సోషల్ వర్క్ లో పీ జీ చేసింది అమెరికాలో UNO p2 గా పని చేస్తున్నది. ఆర్నిథాలజి అంటే చాలా ఇష్టం. సలీమ్ అలీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆర్నిథాలజీ అండ్ నాచురల్ హిస్టరీలో ఆర్నిథాలజీ చేద్దామనుకుంది కానీ చేయలేకపోయింది అయితే B I B O Level-5 చేసింది.  ఎంథూజియాస్టిక్ గర్ల్"  అని చెప్పుకొచ్చాడు  జగపతి.   సప్తగిరి , సత్య కిందపడి గిల గిల తన్నుకుంటున్నారు. ఈ డిగ్రీ లు ఏంది? ఈ చదువులు ఏంది? ఈ జాబులు ఏందిరా సత్తి ? అన్నాడు గిరి .నోరుముయ్యిరా నత్తి , ఈ బంగాళ లో అందరికంటే ఎక్కువచదువుకున్నది నేనే అని చెప్పుకుని తిరిగే వాడిని.   నాపరిస్థితి ఏంది రా ?  అంటూ ఏడుస్తూ మధ్యలో ఆపి నా అను వినేసిందా ? అన్నాడు. "ఆ వంటగదిలోంచి అంతా వింది" అన్నాడు గిరి. 

"ఊ.. ఇన్స్ట్రస్టింగ్ , కానీ  p2 ఏంటి? B I B O   ఏంటి ?" ఎం అర్ధం కాలే అన్నాడు జేమ్స్.  " ఇన్ఫర్మేషన్  ప్రొఫెషనల్స్ అనేది UNO  లో   జాబ్ . p2 తరువాత లెవెల్స్ p5 , p7. నేను సోషల్ వర్క్ లో  p2 level అంటే  బిగినర్స్ లెవెల్ జాబ్ చేస్తున్నాను.  p5 అనేది మిడిల్ లెవెల్ జాబ్ .  p7 అనేది  సీనియర్ లెవెల్ జాబ్.   ఇంక బిబో అంటే " Bird Identification and Basic Ornithology”    under the Green Skill Development Programme of the Ministry of Environment, Forest and Climate Change, Government of India ఈ కోర్స్ ని నిర్వహిస్తున్నారు. " అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.  వావ్!!!  చప్పట్లు కొట్టాడు జేమ్స్.  వంటగది లోంచి కి, కి, కి,  కిచ కిచ , కూ, కూ " అనే పక్షికూతలు వినిపించాయి. 




10 comments:

  1. Oh! The villain entered and all characters reached the forest

    ReplyDelete

  2. చాలా బాగా రాస్తున్నారు.గిరి, సత్యల హాస్యం బాగుంది.చదువుతుంటే ప్రతీ పాత్ర యొక్క హావభావాలు చూస్తున్నట్టే అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. There are unthinkable twists from this scene on wards. However the mystery continues but deepens with each scene. Thanks for your clear feedback. I enjoyed reading your feedback as much as you enjoyed reading the story.

      Delete
  3. Replies
    1. Thanks Dr. Pavan Kumar. You can expect more detail of the forest with unimaginable twists. please keep reading and posting your feedback.

      Delete
  4. 8 scene is enter new characters,given to the some cues and information. The script highlights the Jagapathi and razina, I have doubt Anasuya she is something else. Thank you sir

    ReplyDelete
  5. Sir it is unknown degrees for my knowledge.. good writing

    ReplyDelete
    Replies
    1. Rao garu Thank you Very much for your feedback. There are better thrills ahead please don't miss.

      Delete