Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, October 19, 2020

Bharatavarsha -54

 ఇన్నోవా  శంషాబాద్ విమానాశ్రయము నుండి నాంపల్లి  క్రిమినల్  కోర్టు కాంప్లెక్స్ కు దూసుకొని పోవుచున్నది.  మధ్య వరుసలో   అగస్త్య మరియు న్యాయవాది శరభ లింగముగారు కూరుకొని యుండిరి. లకుమ  అరుణతార వెనుక వరసలో కూర్చొని యుండిరి. హై కోర్టుకు పోవుటలేదా ? అని అగస్త్యుడడిగెను. " హైకోర్టుకు పోవలెనని ఎవరుచెప్పినారు?" అని లింగముగారు అగస్త్యను అడిగిరి. " చలన చిత్రములలో ఎక్కువగా హైకోర్టు చూపుచుందురు. హహ్హ హహ్హ అని అతడు బిగ్గరగా వాహన చోదకుడు నివ్వెరపోవునట్టు నవ్వెను. వాహనము నిదానించెను. " నువ్వు పోవోయి"  అని లింగముగారు  అనగా  చోదకుడు ముందుకి సాగెను. వాహనము నుంచి లకుమ రంగుల బొమ్మలు గోడలపైన కనిపించ సాగెను. 

అగస్త్యుని కి  మిక్కిలి సంతోషమాయెను. “కొంచెము నెమ్మదిగా పొమ్ము” అని వాహన చాలకునితో అనెను.  మరల కొద్ది  దూరము పోయిన పిదప  లకుమ బొమ్మలు గోడలపై  కనిపించెను. " నెమ్మది " అగస్త్యుడు అనెను.  మరల కొద్ది  దూరము పోయిన పిదప ఒక పెద్ద భవంతిపై లకుమ నృత్యభంగిమలో సౌందర్యమంతయూ చూపు బొమ్మ కనిపించెను. అగస్త్యుడు నోరుతెరచి చూచుచుండ " ఆపమందురా ?" అని చోదకుడడుగగా  “శంషాబాద్ నుండి నాంపల్లి మార్గము 30 కి. మీ  దారి పొడవునా  ఈ  బొమ్మలు ఉండును ఇట్లాగుచూ పోయిన యెడల దీని బైలు విచారణ రద్దయి శాశ్వతముగా జైలునందు కూర్చొనవలెను " అని అరుణతార గదుము చుండగా " అబ్బే చట్టప్రకారం  ఈ కేసు నిలువదు, కేసును  కొట్టివేయుట ఖాయము " అనుచూ శరభ లింగముగారు కూడా  ఆరు పదులు వయసు మరిచి ఆ బొమ్మలు చూచుచుండెను. 

"అరుణతార తలవిరపనగా తోచి  ఆ పెద్ద వయసు వకీలు గారిని ఏమీయూ అనజాలక వాహన చాలకుని అదిలించుటతో  వాహనము వేగము పెరిగెను. 11 కి. మీ  పొడవుగల పీ వీ  నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే  మీదుగా వాహనము ఝంఝామారుతముగా సాగుచుండెను. చిరు బాలుడు బల్లపై మెడ బెట్టి నెగబ్రాకుచున్నట్లు యా సమున్నత వారధి పైకి ప్రకటనలు ఫలకములు తలలెత్తి చూచుచున్నవి.  ఇరుదారుల మధ్య గల విశాల  విభాగిని  పై నిడిన  పూల కుండీలు ఆమధ్య గల విద్యుత్ స్తంభములు దూరముగా కనిపించు నగర ఆకాశ భవనక్రమము ఒక అద్భుతమునావిష్కరించుచుండెను.    “ఫిలింనగర్ లో నేరము జరిగిన అది హైకోర్టునకు బోక మరెచ్చటికి పోవును? “ అని అగస్త్యుడు కాలహరణమునకు ఒక తుచ్చ ప్రశ్న వేసెను " నేరపరిధి ఒక పోలీసు స్టేషనుకు లోబడి యుండును, కొన్ని పోలీసుస్టేషను కేసులు  ఒక న్యాయమూర్తిగారి పరిధిలోకి వచ్చును.  అనగా ఫిలింనగరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చును.  ఆకేసులన్నీ    మూడవ అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి గారు చూచెదరు.  మనకేసు వారి పరిధిలోనిదే. అనుచూ “నిదానము నిదానము”  అని కేకలు వేసి వాహనమును నిలిపించెను. అచ్చట లకుమ  అతిపెద్ద పతాకము కనిపించెను.  ఏమి  ఈ  శృంగార లావణ్యము, అత్యంత మనోహరముగా నున్నది! అప్సరసవలే యున్నావు” అని తన మనోగతమును బైటపెట్టి. “రేపు విడుదలగు నని వ్రాసి యున్న ఈ సినిమా తప్పక చూడవలెను” 

అని అనుచుండగా ముందు  కేసు సంగతి చూడండి బాబూ అని మెల్లగా వాహనాచాలకుడు గోణిగి , అతడి దృష్టి మరల్చుటకు రేడియోను ప్రారంభించెను. రేడియోలో  బట్టల సబ్బు, నవరత్న తలనూనె  ప్రకటనలు వచ్చిన పిదప ఒక పాఠశాల ప్రకటన వెలువడెను. తరువాత   " ఐ యాం రెడీ "  అంటూ అందాలు ఆరబోసిన నూతన తార లకుమ , హరీష్ ల  కొత్త ప్రేమ కథా చిత్రం  సునీల్ కుమార్ దర్శకత్వంలో రేపే విడుదల  ఆర్ యు రెడీ? అంటూ  వాచకురాలు వాక్ప్రవాహము నిలవగానే ఐ యాం రెడీ  చిత్రం నుంచి ఒక పాట  అనుచూ  వెలురించెను. 

కొద్దీ క్షణములు నిశ్శబ్దము ఆవహించెను తరువాత అంతకంతకూ పెరుగు మద్దెల ధ్వని వాహనమంతయూ ఆలుముకొనెను.  మంద్ర స్వరమున అపరలయా స్వనమున,  నాడుల వేడెక్కించు  శృంగార సాహిత్య  వినినంతనే దేహము రగులుకొనుచున్నది. చక్కిలిగింతలిడు  ఆ కామగీతమును   చిత్రీకరించు సమయములో   అగస్త్య,  లకుమ  పక్కనే ఉండటంతో అతడికి  ఆ పాట దృశ్యరూపమున  మనో నేత్రము పై కదిలాడుచుండెను.  అతడి మనసు కృష్ణ బిలమున పడి చీకటి లోయలోకి జారుకొనెను.

వాహనము ఒక్క కుదుపుతో నాయస్థానమందు ఆగెను. పాత్రికేయుల సమూహమచ్చట నేర వార్తలను చిత్రించుటకు సిద్ధముగా యున్నది. వారిని నెట్టుకొని లకుమ, వకీలుగారు,  అరుణతార  లోపలకి బోయిరి.   వాహన చాలకుడు అగస్త్య వాహనమందు మిగిలిరి. మూడవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గారు కేసును కొట్టి  వేస్తూ తీర్పు నిచ్చుటవలన లకుమకు విడుదల లభించెను.

                                                                           ***

 రమదా హోటల్ మనోహర్: కన్నె, రోమి, డయానా అద్దెకారు దిగి  వియత్తలమునేలు శిరముగల హోటల్ భవంతి ముంగిట నిలిచిరి “ పెరేడ్ గ్రౌండ్స్ కు దగ్గరలో ఇంతకంటే దగ్గరలో ఇంతకంటే మంచి వేరొక హోటల్ లేదు” అని అద్దె కారు చాలకుడు తన పైకమును కొనిపోయెను. మువ్వురూ ఇంద్రభవనమును తలపించు హోటల్లోకి ప్రవేశించిరి. వారిని సిబ్బంది గారమున ఆహ్వానస్థలి వద్దకు తోడ్కొనిపోయిరి. 


  గుడ్ ఈవినింగ్ , వెల్కమ్ సర్ !  వెల్కమ్ లేడి!!

 సింగల్ రూమ్ ఫర్ దట్ లేడి ఇన్ ద  సోఫా అండ్ స్వీట్ ఫర్ కపుల్.

8, 900/- ప్లస్, జీ ఎస్ టీ,  ప్లస్ సర్వీస్. స్వీట్ ఫర్ న్యూలీ  వెడ్ కపుల్ ?!!

కుతూహలంతో ఎగసిపడు స్వరమును దాచజూసి దాచలేక. యప్ , యా.. ఉమ్ అని మెలికలు తిరుగుచున్న అతడి ఉత్సాహమును చూచి , కంఠ లంగోటా ధరించిన డాబుసరి  జేష్టుడు “కంగ్రాట్స్ ఆన్ యువర్ వెడ్డింగ్. వుయ్ విష్ యు ఆ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ వెడ్డింగ్ నైట్ ఐ రెకమెండ్  ప్రెసిడెంట్ స్వీట్  విత్  కింగ్ బెడ్ సర్” అంగయారు కన్నె గుండె గుభిళ్లు మన “ ఎన్నంగే , ఒరుతడవు ఇంగ వాంగే” అని సోఫా వద్దకు భర్తను పిలిచెను. డయానా అక్కడే యుండెను “వుంగళకు  పణం  విషయం తెరియాదు” అని డబ్బు మంచినీళ్లవలె ఖర్చు చేయుచున్న  భర్తను “ఇట్లెవరైనా  చేతురా అని హితవు చెప్పుచుండగా “ఎనక్కు ముతల్ ఇరవు , అతి తవిర ఎనక్కు  ఎదుం తెరియాదు.” అనుచూ విసవిసా బోయి పాతికవేలు చెల్లించి  పేర్లు నమోదు చేయించి  గదులు గైకొనెను.   "హరిహరా కళాభవన్ కు ఎట్లు రావలెనో తెలుపు దారి వివరములను  చరవాణి సందేశముగా  అగస్త్యుడు ఇపుడే పంపెనని" కన్నెకు డయానా చూపెను." నిన్ను( డయానా ను)  బుట్టలో వేసుకొనుటకు  గుడ్మార్ణింగ్ , గుడ్ నైట్ లు పంప వలెనని తెలిసిన వానికి తల్లి యోగ క్షేమములు విచారించుట తెలియదా " అని కన్నె అనుచుండగా అంతలోనే మరొక సందేశము " వలసినచో కారు పంపుదు"నని   "అబ్బో! డబ్బులు విరివిగా జల్లుచున్నాడు యువకుడు గ్రంథ సాంగుడే "  కనులను చక్రములవలె త్రిప్పుచూ డయానా అనుచుండగా అగస్త్య సంగతి చూచుట నావంతు  ఆ అడవన్  సంగతి చూచుట నీవంతు. అనగా డయానా తల పట్టుకొని " తల్లీ ముందు శోభనమో శోభనమో యని అల్లాడుచున్న నీ మొగుడు సంగతి చూడుము ఇటే  వచ్చుచున్నాడు." అనెను. 

2 comments: