సందర్భము : తులాభారం నాటికకు విదిష ను పిల్లవడు ( మంజూష ఆమెను కొనివచ్చును) సరికదా పని వత్తిడి లో, కళారాధనలో ఆమె జన్మదినమని కూడా మరిచిన భారతవర్షను అలంకార గృహమందు ( గ్రీన్ రూమ్ ) భేటీ అగును. సత్య భామ వేషములో నున్న స్త్రీ పాత్రధారి , భారతవర్షతో చనువుగా నుండుట , కాలితో తన్నుట నాటకమునందు భాగములే అయినప్పటికీ విదిష కు ఆగ్రహమగును. వేరొక దృశ్యము జరుగుచున్నప్పుడు పాత్రధారులు అందరు అలంకార గృహమందు వేచియుందురు . కృష్ణుని వేషమున ఉన్న భారతవర్ష అలంకార గృహమందు ఉండగా కసితో చెలరేగుచున్న అలంకార గృహ మునకేగుచున్న విదిషను అనుసరించుచు మంజూష చెప్పిన మాటలకు ఉత్పలమాల పద్యరూపమిది.
ఉ. పొచ్చెము లెన్నడే యతడు వీగియు కోపము చూపడె ప్పుడూ
ముచ్చట దాచిలో కమున భాసము పంచుచు ధర్మబు ద్ధితో
పచ్చగ
లోక మే
వెలుగు మార్గము కోరుచు సాగుసూ
రిన్
వెచ్చగ బేటము తొలగ ముద్దిడు నచ్చిన మెచ్చులా డివే
పొచ్చెము - దోషము లెన్నడే ; వీగియు - ఓడిననూ, కోపము చూపడె ప్పుడూ
ముచ్చట - కోరిక దాచి లోకమున, భాసము - వెలుగు (అనగా జ్ఞానము) పంచుచు
ధర్మబుద్ధితో, పచ్చగ లోక మే వెలుగు మార్గము కోరుచు సాగు సూరిన్ - పండితుని
వెచ్చగ బేటము -శృంగార కోరిక , తొలగ - తొలగిపోవునట్లు ముద్దిడు - ఒక ముద్దు ఇమ్ము
నచ్చిన మెచ్చులా డివే - ( a woman to be admired) మెచ్చుకొనదగిన స్త్రీ వే కదా!
రంగస్థలమందు సత్య భామ నటీమణి మాత్రమే. నిత్య జీవితములో సత్యభామ విదిషే కదా. సత్యభామ కోపము చవి చూచిన కృష్ణుడు ఎంత మురిసెనో కదా ! కడకు ఆగ్రహించి తన్న వచ్చిన విదిష ముద్దిచ్చి పోయెను.
ఎక్కడా దొరకడుగా వర్ష! ఆగ్రహమునకు అవకాశము ఇవ్వడుగా!
ReplyDeleteచెప్పుకోలేడు కానీ విదిష అనిన వర్షకు ప్రాణము కదా!
DeleteMenypunaynni ela chakka therichi diddadm badunnaee kadalu
DeleteSir nice
ReplyDelete