Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 18, 2020

Bharatavarsha 53

 వారట్లు నడుచుచూ వంతెన వద్దనున్న షవర్లి  క్రూజ్ వాహనమును సమీపించుచుండిరి. " నీ మనసిప్పుడు శాంతి పొందినదా? మీనాక్షిని చూడవలెనను ఆరాటం తీరెను కదా ?" యని అన్న మగని  మాటలువిన్న కన్నె “ఇతడి తీరు చూచిన, అవునన్నచో నీ ఆరాటం తీరెను కానీ నా ఆరాటము తీరినది కాదు అనుట ఖాయమని తలచి అంగయారు కన్నె " ఎచ్చట  తీరెను  ఆమెకు ఎంతన్యాయము  జరిగెను, ఒకడి నడ్డి విరచవలె  , మరొకడి పళ్ళు రాలగొట్టవలె అంతవరకూ నాకు శాంతి లేదు ." అనుచూ విసవిస ముందుకి సాగుచుండ , వెనుక గా నడుచుచున్న అతడు ఒక్క క్షణము ఆగి  బుచ్చిపారి జూచుచుండగా మకమక లాడు అతడి ముఖమున ఆశాభంగము ప్రస్ఫుటమగు చుండ ఆమె అడుగు మందగించెను.  కన్నె  చుబుకమును బుజసంధికి చేర్చి క్రీగంట చూపును తూపు వలె విసరగా అతడు ఆ వలపు సంకేతమునంది  తటాలున ఆమెను జంట గూడి  అంటకాగుచూ కళ్యాణమను మెరుగు పెట్టిన   కన్నె బంగారమును చూచి చెలరుచు    కర్ణ భేరికి పెదవు లాన్చి “హోటల్ కు పోయెదమా” అనెను 


తే. కర్ణ ద్రోణి యందు గాడుపు  తాకెను  

 మగని వెచ్చటి ఊపిరి పాకి కంఠ                  

 మెల్ల, సన్నగ  వణికె  మేను, మొగ్గతొ          

 డిగెసిగ్గు, వాలె కన్నె కన్ను  రెప్పలు

మగని మెచ్చని ఊపిరి చెవి పైనుండి కంఠము పైకి  ప్రాకుతుండగా కన్నె శరీరము    కంపించెను, సిగ్గు మొగ్గ తొడిగెను. కను రెప్పలు బరువెక్కి వాలెను. ఈ అనుభవము కొరకు ఎంత వేగిననూ  నిగ్రహించుకొని  మీనాక్షి కి జరిగిన  అన్యాయమును తలుచుకొని రగులుచూ “అడవన్,  అగస్త్యల తగిన గుణపాఠము చెప్పవలెనని తలఁచెను. కానీ మీద మీదకు వచ్చు భర్త మొఖమున ఆశాభంగము ప్రస్ఫుటమగు చుండెను. మగవారిట్లుందురని  కన్నెకు ఇప్పుడే తెలియు చున్నది.  

తే. బుచ్చి  పారిన  మగని  దనము  తేరి

     జూడ  మకమక  కళల జా  కానవచ్చె    

     భికుని  నిలుప  రికైన  నలవి కాదు    

     ఇంకట బాపుట  అం  ఇంతి  వంతు 

 బుచ్చిపారిన  (చిన్నబోయిన) మగని మొఖము కాంతి అంతరించి (మకమక) కళా హీనమయ్యెను. కోరికతో ఉన్న కాముకుని  ఆపట  ఆ చక్రి కైననూ అలవి కాదు. ఇంకట ( విరహము) బాపుట ఇంతికి పని. అది శ్రీ హరి పని కాదు కదా!  

ఇదియునూ ఒకందుకు మంచిదే అయినది. అందుచే  అత్తగారి మాట పక్కన పెట్టి  ఉభయతారకంగా నుండునట్లు హోటల్ కు పోవుటకు అంగీకరించి  ఈ రాత్రికే శోభనము. డయానాతో మాట్లాడిన పిదప హోటల్ కు పోయెదము “ఆ మహేంద్రుడు  కోరిన  అమరపురిన అప్సరసలాడ రా,   నా  మనుజేంద్రుఁడు కోరిన అలక తీర్చి సరసకొచ్చి ఆడనా!” రోమి రస ప్రపంచములో విహరించుచుండెను. ఆ జంట  వాహనమును సమీపించెను.   

పింగళ రాగ ప్రకాశిత షవర్లి  క్రూజ్ తన రెక్కలను విప్పి (vertical doors) నవదంపతుల నాహ్వానించెను. ఆ దంపతులు వాహనమందు ప్రవేశించిరి. వాహనము కదిలెను.   కొద్ది క్షణములలో వాహనము వేగము  పుంజుకొనెను. అంగయారు కన్నె వొదిగి  మగని హత్తుకొని కూర్చొనెను. అడవన్ పై బ్రహ్మాస్త్రం ప్రయోగించవలెను.  “డయానా వద్దకు పోనిమ్మ”నెను.

షవర్లి క్రూజ్  టైడల్ పార్క్ ప్రాంతమందలి కన్నె నివసించు గృహ సముదాయమునకు పోయెను.  తన పొరుగునే నివసించుచున్న డయానా గృహమునకేగి మూసి ఉన్న తలుపు వద్దకు పోయి  కన్నె  నిలవగా ఆంగ్ల సంగీతము వినిపించుచుండెను.  లూవెల్లర్ మండువా గదిలో విరుపు లాస్య (break dance)మందు  మునిగి యుండెను. కన్నె గంట మ్రోగించగా లులు తలుపు తీసి “కమానిన్” అనుచూ జంటనాహ్వానించెను. “లాంగ్ టైమ్ నో సీ” అనుచూ  వెల్లువెత్తి పారుచున్న సంగీత తరంగిణిని నిలిపివేసెను. “ప్లీజ్ సిడౌన్” వారివారి సోఫాలో కూర్చొనిరి. “వేర్ ఐస్ డయానా?”     

అట్లామె  డయానా చెల్లి  లులు (లూవెల్లర్)  తో సంభాషించుచుండగా.  డయానా తండ్రి బాత్విక్ , తల్లి మగ్దలీనా తేనీరు తెచ్చి నూతన దంపతులకిచ్చిరి.  పరిచయములు జరిగినవి. బాత్విక్ " కంగ్రాట్యులేషన్స్ ఆన్ యువర్ మేరేజ్ "  మగ్దలీనా కూడా అభినందించి “ఐ సింక్ ( థింక్) యు డిడ్ అ  గుడ్ జాబ్. నటూర్లీష్, వెన్ ద వెడ్డింగ్ ఫేయిల్స్  యు మస్ట్ క్విట్ అండ్ చూస్ అనదర్ మేన్”   ఆమె మాట్లాడు చుండెను. కన్నె  "మిస్టర్ బాత్విక్, వై మిసెస్ బాత్విక్   

కన్నె : సౌండ్స్ డిఫరెంట్  వెన్ షీ  స్పీక్స్ ?" అడిగెను " బికాజ్ షీ ఐస్  జర్మన్. అండ్ నెవెర్ మైండ్ షీ కమ్స్  ఫ్రమ్   డిఫెరెంట్ కల్చర్  షీ డజన్ట్ నో" బాత్విక్ బదులు పలికెను.

మగ్ద : ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ , ఈఫ్ ఇండియన్స్ సింక్ దట్ దెయిర్ కల్చర్ ఈజ్ గ్రేట్ దే మస్ట్ ప్రాక్టీస్ ఫస్ట్ దెన్ ప్రీచ్. మోర్ దే న్ హాఫ్ అఫ్  తెలుగు పీపుల్ హావ్  లెఫ్ట్ తెలుగు.  దే టూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ అఫ్ తెలుగు. బట్ ఐ అం నాట్ రెడీ.

బాత్విక్:  కమాన్ యు డోన్'ట్ నో ద ఇండియన్ కల్చర్.

మగ్ద : ఐ నో ద కల్చర్ అండ్ హిస్టరీ టూ, నాట్ ఆ సింగిల్ టౌన్ ఇన్ రాజస్థాన్ హాస్ ముస్లిం నేమ్ బికాజ్ అఫ్ రాజపుట్ కింగ్స్, నైంటీ పరిసెంట్ అఫ్ నాగాలాండ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్.  ఇట్ ఐస్ ద బిగ్గెస్ట్ బాప్టిస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ , ది బ్రిటిష్ కన్వెర్టడ్ అల్ నాగా ట్రైబ్స్ ఇంటూ క్రిస్టియానిటీ. సాధుస్ అండ్  హిందూ సెయింట్స్ ఆర్ నాట్ అల్లవ్డ్ టు ఎంటర్ నాగాలాండ్ యాజ్  పెర్  ద అగ్రిమెంట్ బిట్వీన్  నెహ్రు అండ్ ఎల్విన్. ఎక్సప్ట్ గోవా ఇన్ అల్ స్టేట్స్ ఇన్ ఇండియా  పీపుల్ ఆర్ గవర్నడ్  సెపరేట్లీ బై రిలీజియన్  స్పెసిఫిక్ లా. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ గవర్నస్ అల్ పీపుల్ ఇన్ సింగల్ సెక్యూలర్ లా.

బాత్విక్ వారించుచున్ననూ జర్మనీ గొప్పతనమును జేబులో చేతులు పెట్టుకుని నడుచుట ,  సైకిళ్ళు  పోవు మార్గమున నడుచుట చేయనే జేయరు.  నిశ్శబ్ద సమయములందు  వాయురేచక యంత్రములను ( వాక్యూమ్ క్లీనర్స్ ) వాడరు. సమయ పాలన ఖచ్చితముగా అమలు జేయుచూ జర్మనీ శ్రమను సృజనాత్మకతను ఎన్నడూ వీడక   నిర్మించిన  శ్రమ సౌందర్య  సౌధమే  జర్మనీ.    

“డోయిచ్ లాండ్ కు జేజేలు,  శ్రామిక శక్తికి జేజేలు, ఆ రైను ,  డెన్యూబ్ , ఎల్బులు పారే జీవధాత్రికి జేజేలు” అని పాడుచూ త్రిభాషి  డయానా అరుదెంచెను. పాట  అయిన పిదప “ఓం శాంతి  ఓం శాంతి”  అని తల్లి కి చేతులు జోడించి నమస్కరించి తండ్రి వైపుచూచుచూ కన్ను గీటెను. అటు పిమ్మట బాత్విక్ భార్యను లోనికి గొనిపోయెను. సుడిగాలి మరణించెను  " స్టుపిడ్ ,  యూ ... మరణించెను అనరాదు మరలెను అనవలెను ,    ఉచ్ఛరణాలోపములతో ఇట్టి  హత్యలు  చేయుటకంటె నీవు ఆంగ్లముననే సంభాషించుము అదియే ఉత్తమము" అని లులు కి డయానా బుద్ధిచెప్పెను.  స్టుపిడ్ యూ అన్నందుకుచిన్నదానికి అరికాలి మంట నెత్తికెక్కెను "ఐష్ బిన్ ఫెల్ట్జ్.  డు బిస్ట్ ష్లేష్ట్ " అనుచూ లోపలి పోయెను. 

డయా : మా అమ్మకి  కొంచెము దేశభక్తి ఎక్కువ ఆవేశపూరితముగా మాట్లాడుట ఆమెకు అలవాటు  ఇదంతయూ జూచి మీరు కలవరపడరాదు

కన్నె:దేశభక్తి ఎన్నడూ ఆక్షేపణీయము కాదు , ఆమె సత్యమునే వచించెను.  నేను  నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకొంటిని   

  రోమి: నేను ఆమె మాటలు విని చాలా ఆనందించితిని  మీ అమ్మగారి జ్ఞానమును  నిజాయతీని మెచ్చుకొనవలెను. మీ చెల్లి అలిగిపోవుచూ ఏదో  మాట్లాడినది . అది  ఇంగ్లిష్ వలె లేదే ?

డయా : అది జర్మన్ భాష  , ఆ భాష నాకు రాదు , అది అమ్మ వొడిలో కూర్చొని నేర్చుకొనెను. 

కన్నె: నీవు కూడా అమ్మ వొడిలో కూర్చుని నేర్వలేక పోయినావా ?

డయా :  పెద్ద దానినైన పిదప కూర్చుండుట బాగుండదు (అని నవ్వుచూ)  , ఆమె మా నాన్న మూడవ భార్య  

కన్నె: కానీ మీ ప్రేమానురాగములు చిక్కగా నున్నవి. చెప్పిన గాని ఆమె నీ సవతి తల్లి అని ఎవరికీ అనుమానమైన నూ కలుగదు. అని కన్నె డయానాని మెచ్చుకొని పిదప నీతో మాట్లాడు పనున్నదని  పక్క గదిలోకి కొనిపోయి 5 నిమిషములలో మాట్లాడుట పూర్తి చేసి,  16.00  గంటలకు  హైద్రాబాద్ పోవు  ఇండిగో   విమానంలో  డయానాను కూడా తీసుకోపోయెను.  

3 comments:

  1. మీనాక్షి పరిస్తితి భాధ కలిగించిన నూ కన్నె ఆమెకు సహాయం చేయుటకు నిశచయించుకొనుట ఊరట కలిగించింది.తేటగీతి పద్యములు బాగున్నవి.కథలో, భాషలో, కథా గమనంలో, విజ్ఞానాన్ని జోడించే విషయంలో, పాత్రల మధ్య బంధాలు! ఎక్కడా తగ్గరుగా! కన్నె మీనాక్షి కి ఏ విధంగా సహాయం చేయునో అని ఉత్కంఠగా ఉంది.

    ReplyDelete
  2. Your feedback back is more scholarly than my work. It's touching all the dimensions of my work and leaving me in heaven.

    ReplyDelete
  3. Wow superb sir the way of menakshi situation. And was amazing writing skills. Your one of the best writer in this generation.

    ReplyDelete