Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, October 9, 2020

Bharatavarsha - 48

వర్షుడు వెడలిన పిదప శయనాగారమునకు పోయి కుప్పించి తల్పముపై లంఘించి బ్రియోద్వృత్త విశాలవక్షమున తలగడనాలింగనము జేసుకొని పొర్లాడుచూ తల్పమునావరించియున్న దర్పణ శ్రేణి యందు తన రూప లావణ్యమును చూచుకొనుచూ త్రిపురారి ఖంఠమందు భుజగమువలెనులపలు జుట్టుకొని మురియుచుండ రతి కౌతుకము  ఉదంచనమ గుచుండెను. ఇంతలో తటాలు నొక్క లేటి దుముకున దర్పణము ముంగిట నిలిచి యెదపై జీరాడు  పైటను తొలగించి వక్షోరుహముపై  వర్షుడి నఖక్షతమును  గాంచి  " క్రిక్కటిల్లు ఓలమునోదార్చ జలకములాడక తప్పునే!” యనుకొనుచూ 


కురిపించదె గుంపగొని కాదంబిని పర్జన్యుడానతిన్  

నర్తించదె చెలగి  కేకిలము మలయానిలము తాకగన్

 

తంత్రులు తాకిన  పలకదె జుమ్మని  జంత్రము

 కులకదె యామిని  చిలకదె  అమృతము


పర్జన్యుడు (ఇంద్రుడు) ఆనతి ఇచ్చిన  మేఘములు గుంపుగా నొక చోట చేరి వర్షించవా చల్లగాలి తాకగా నెమలి నర్తించి ఆడదా?  తీగలు మీటిన  జంత్ర వాద్యము జుమ్మను నాదము జేయునట్లుగా, పురుష స్పర్శ  తగిలిన  స్త్రీ  జుమ్మనును. యామిని ( స్త్రీ లేదా రాత్రి)  అమృతము ధారలందు పులకరించును.

“భోజన శాలలో అంతా మీకొరకు వేచి యున్నారు భోజననమునకు రావలెను.” పరిచారిక  వచ్చి చెప్పి పోవుచూ “ఈవిడ తిన్నచో  అందరూ తిందురు కదా! ఈవిడ రాణివాసము ఇట్లు సాగుచున్నది” అన్న మాటలు విదిష చెవిన బడగా, "మనసు నిండి ఆనంద పారవశ్యమునోలలాడుచుండగా ఆకలి ఎట్లు వేయును. వర్షునికి నాపై ఎంత ప్రేమ యున్నదో  ఇంతవరకూ ఊహా మాత్రముగా మాత్రముగానే యున్నది. అతడి రాకతో అది నిరూపితము అయినది.   అది చాలు. నేనతడి  హృదయరాణి నైనఁజాలు." అనుకొనెను.  

బల బాహు, దృఢ ద్విశిర గాఢ కౌగిలింత  

దేహము చూపె తమకపు పాలపుంత


లోహోరుసిల పాలిత ప్రాజ్ఞ పాలించు ప్రియుని

అంబుద మంబర  రీతిన్ ప్రాజ్య పారవశ్యమునన్                                                                              

శారీరక శ్రమ వలన వర్షునికి బలమైన బాహువులు, దృఢమైన ద్విశిరములు ( కండలు) రమణిలు గాంచి  రమించు వజ్ర దేహము  ఏర్పడినవి. అతడి గాఢ కౌగిలింత విదిష కు  పాలపుంత అయ్యెను. 

లోహోరుసిల (ఉక్కువంటి ఛాతి చే) పాలిత (పాలించబడే)ప్రాజ్ఞ (స్త్రీ) అంబుదము అంబరమును కమ్మినట్టు తన కురులతో  ప్రియుని కమ్మి ప్రియుని పాలించును. మరియు ప్రాజ్య (గొప్పదైన) పారవశ్యమును పొందును. వజ్ర దేహము గల పురుషుడి తొలిసారి తన పృష్ఠ భాగమును తాకి నంతనే  అతని పట్టును చూచి కవన యుద్ధవిశారదుఁడైన  అతడు శయనకేళీ విలాస ప్రాజ్ఞ యని వూహించుట  (శృంగారమునకు చిత్తమే మూలము కావున ) సులభమే కదా. 

తలచినార్తి పొంది తనువు కంపించుచుండ   

తపము జేసైన భర్త గ బొంది రమించ లేనా                            

ఆమె ఉల్లము ఆమని యందు పికమువలె జావళిలు పాడుచున్నది అదే సమయమునకు శేషాచలముగారు  ప్రవేశించి “నీవు వడలు మరచి యాడుట మన కెంత అప్రతిష్ఠో గమనించితివా ? సామాన్యులు నిన్ను సులభముగా చేరుచున్నారు” అనుచుండగా “అతడు సామాన్యుడ యినచో మనమంతకన్నా ఎక్కువవారమేమియునూకాదు.  వర్షుడు మనకు హితుడు నా మానమును కాచిన మగధీరుడు."   అని కుండ బ్రద్దలగొట్టగా శేషాచలముగారు దీన వదనమున “అయ్యో నాఉద్దేశ్యము అది కాదమ్మా అందరిచే పూజ లందుకొను నీవు ఈ గ్రామ దేవతవు. నీకు వలపు పంకిలమున దిగినచో  నీకీ లోకము ఏ మసి అంటించునో నని నేను ఎంత తల్లిడిల్లుచున్నానో” అని ఇంకా తెగేవరకు లాగకుండుట మంచిదని   "వచ్చిన వారి మత్తులో పడి నిన్ను నీవే మరచినచో జనులకెట్లు మొఖం చూబింతును."  నేనేనుయ్యోగొయ్యో చూచుకొన్నచో  తల్లిలేని నీవు తండ్రి లేనిదానవగుదువు ఆ వర్షుడు సాయము చేసినట్టే చేసి నా బిడ్డను నాకు కాకుండా చేయుచున్నాడు అని రోదన స్వరముతో పల్కుచుండ, ఇంకనూ ఉపేక్షించిన మంచిదికాదని " నాన్న, వర్షనాడిపోసు 

కొనుటెందులకు అతడితో ఊర్లపైబడి తిరుగుచూ మీ ప్రతిష్ట కు భంగము కల్గించితినా అతడు చిన్ననాటి నుండి ఇచ్చటికి వచ్చుచున్నాడు అతడికహక్కు గలదు. " సరే అతడి వచ్చిన చొ నేనాక్షేపించను అతడికా హక్కున్నది కానీ " నీపై హక్కు నాకే ఉన్నది నీ పై హక్కు నాకే ఉన్నది" అనుచూ బోవుచున్న అతడిని చూచి విదిష కు మొదట వెగటు కల్గెను పిదప జాలికల్గెను.  

"అయ్యో పాలకడవవంటి మనసులో ఉప్పు కల్లు వేసిపోవుచున్నాడే “అనుచూ  వలతి  పానీయము పట్టుకొని వచ్చెను “పాలు తెచ్చితివా?” అని అడుగుగా దీనిని ఎనర్జీ డ్రింక్ అందురు అనగా సత్తువనిచ్చు పానీయము”  మీ అంతరంగమున  మదనుని మరల పురిగొల్పును  మీరు నర్తకివలె నర్తింతురు”  అయ్యో నాకు నాట్యము రాదే యని విదిష అనగా వలతి  “అయినచో గాయని వలె పాడెదరు” అనెను. అటులనా యని పానీయము ఒక్క  గుక్కన సేవించి…

కళింగ నాలింగనా  పారంగత  సార్వభౌమ 

రాజ  రసరాజ  సుఖ భోగ  పరంధామా

అనుచూ పాడుచూ కొద్దీ క్షణములలోనే “ఎదో తెలియని కొత్త హాయి” అనుచూ వలతిని  చూచుచూ చిత్తరువు వలె  నిలిచెను. “కొత్తగా మత్తుగా నే కాక  గమ్మత్తుగా నున్నదికదూ  

యని నవ్వుచూ దీనినే ఆంగ్లమున కిక్ తెలుగున మైకమని  అందురు” యని వలతి కిలకిల రవములు చేయుచుండెను. 

విదిష: పోయిన సంతోషమును తిరిగి దక్కించితివి నాకర్ధముకాని లోక జ్ఞానమును తత్వజ్ఞానమును కలిగి యుండి నాకు సేవలు జేయుచున్నావు ఎందులకు?  

వలతి: నాపేరు వలతి అనగా స్త్రీ, నేర్పరి , తెలివైనది, అని అర్ధము. ఇంకనూ చెప్పమందురా? అన్నీ ఉన్ననూ నావద్ద డబ్బులేదుకదా , అది మీవద్ద తగినంత ఉన్నది. ఇంకనూ చెప్పమందురా? 

విదిష: చెప్పుటకు ఇంకనూ ఏమైనా యున్నదా?

వలతి: వలతి అను మాటకు మరొక అర్ధము కలదు. నేను ఇచ్చటుండుటకు కారణము ఆ పదమున దాగి యున్నది.   అది కనుగొనుము.   

విదిష:  ఆ మరొక అర్ధము  అనుకూలము. అనగా నాకు అనుకూలముగా యుండుదానవు. 

వలతి: ఇంకనూ ఉన్నదన్నచో  

విదిష: చెప్పుటకు ఇంకనూ ఏమైనా యున్నదా?

వలతి: చాలా ఉన్నవి,  చెప్పిన మూర్ఛ గిల్ల వుకదా ?

విదిష: ఈ ఉత్కంఠ తో  శృంగార భావములను చంపుచున్నావు కదా!

వలతి: నీ వెనుక  అద్భుతమైన ఆత్మ శక్తి కలద ని  వర్షుడు చెప్పెను.

 కానీ దానినెట్లు ఉపయోగించుకొనవలెనో నీకు తెలియదు, నాకునూ తెలియదు

విదిష: వచ్చిన నష్టమేమియునూ లేదు మానాన్నకితెలియును. నీకువర్షుడెట్లు తెలియును?

వలతి: కానీ నేను ఆకల్ట్   అనగా  క్షద్రవిద్య యని  సందేహించితిని.  నేను ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు టెలీపతి, పెరనార్మల్ సైన్స్ చదివితిని. సాహిత్యాభిలాషగల నన్ను వర్షుడు ఆకర్షించెను. యని పరుగు పరుగున పోయి ఒక పరికరమును తీసుకువచ్చి, ఇది ఉష్ణో గ్రతను  కొలుచు పరికరము.   ఇచ్చట చూడుము  ఇచ్చట ఉష్ణో గ్రతా గదియంతయూ 40 డిగ్రీలు ఉండగా ఇచ్చట 30 డిగ్రీలు చూపుచున్నది . 

విదిష: అయోమయముగా చూచుచుండెను

వలతి:  అనగా ఇచ్చట ఆత్మ యున్నది.

విదిష: ఇది నిరూపించుటకా ఇంత షష్టాష్టకము. అచ్చట ఆ అమ్మ నాకు కనిపించుచున్నది అదటుండనిమ్ము , వర్షుడు నిన్నెట్లాకర్షించెను?

 వలతి: అ.. హ.. హ.. అపార్థము చేసుకొనవలదు. నేను నా రచనా వ్యాసంగమును మెరుగు పరుచుకొనుటకు అతడి శిష్యురాలిగాచేరినాను, అతడి  శిష్యరికమున నా కవనము స్నిగ్ధ మై మధురమైనది. నా రచనలు మొగ్గతొడిగి ముద్రితమైనవి. 

విదిష: అచ్చటఇంకెన్ని మొగ్గలు తొడుగుచున్నవి?

వలతి: పుష్పమునాఘ్రాణించిన అతడు మొగ్గలకై వంగునా? ఆత్మను చూడవలెనని నా మనసు ఉవ్విళ్లూరు చున్నది. చూపినచో  నీకింకనూ  అతిముఖ్యమైన విషయమొకటి చెప్పెదను.

విద్యత్ పోయి చిమ్మ చీకటలిమినది. కొద్ది నిమిషముల తరువాత గది విద్యత్ ప్రద్యోత మైనది. దర్పణము పై  కాటుకతో గీచిన ఒక ఆశ్రమము చిత్రము కానవచ్చెను.

విదిష:  ఇదిచ్చటికెట్లవచ్చెను ? 

వలతి:  మీ అమ్మే గీచినది లేనిచో ఎట్లు వచ్చును. మీ అమ్మ ఇచ్చట ఉన్నట్లు నాకు తెలియజేయుటకు సంకేత మీ చిత్రము.  నాకు మాత్రము ఆత్మ కానరాలేదు కదా!

విదిష:  తనకేమీ అభ్యంతరము లేదని ఆ అమ్మ తెలుపుచున్నది. 

వలతి:  నేను చెప్ప బోయెడిది ఇదే.  చలముగారు త్వరలో   ఒక ఆశ్రమమును నిర్మించబోవుచున్నారు. నిన్ను రాధాబాయివలె పెద్దమ్మను జేయవలెనని అతడి యోచన.

నీవు లోకజ్ఞాన మెరుగని బేలవని  కొద్ది  కాలము నిన్ను కనిపెట్టి యుండవలెనని అతడి మనోరథమునెఱిగి అతడు పంపగా నేనిచ్చటికి వచ్చితిని. నీలో ఎదో శక్తి  యున్నది. 

విదిష:  నాకేశక్తులు లేవు. నాకివేమియునూ తెలియని ఉత్త బేలను.

“ఔనే జాణకత్తెవు అన్నిటా నీవు, యేనిగె గుజ్జౌఁగదే యెక్కినవానికిని” అని వలతి పాడుచుండ

విదిష: అయ్యో ఏమీ భాషా ప్రయోగము!!!
వలతి:  అన్నమయ్య కీర్తన కే  వంకలు పెట్టుచున్నావే. నీవెంత జాణ వో నేను చూచితిని గానా వర్షుని పైబడి వర్ణింపరాని వారవనితా కౌసల్యమును చూపి హవ్వ!!!

విదిష: వర్షుడు నా  విరలి దోహలమును  తప్పుగా అర్ధము చేసుకొనునేమో? ఈ శృంగార కౌతుకము నా దోషమా, అనర్థమా ? అర్థనిమీలిత నేత్రాలతో
వలతి:  కావ్యకర్త  అట్లర్ధము జేసుకొనుటసంభవము. కావ్య రసాస్వాదనమున జీవితము  వికసించును

జీవితము  రసభరితము, రసము అనగా ఆనందము. నవ రసాల్లో మొదటిది సర్వోత్కృష్ట మైనది  శృంగారము. అందుకే శృంగారాన్ని రసరాజమన్నారు. అంటే జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది శృంగారం.  సృష్టికి  ఆధారమైనది, సుకుమారమైనది శృంగారమే. అంచెలంచెలుగా మోక్ష ధామానికి చేర్చేదే శృంగారము.

చేతులకు తొడవు దానము  
తరుణి కి తొడవు శృంగారము..
చిలుకపలుకుల నొలకు నయగారము
మంజుమంజీరము చెలికారము
శృంగారము, మోక్ష మార్గము.

స్త్రీ పురుషుల సంయోగ కోరికను రతి అంటారు. ఆ కోరికను తొలుత నాయిక ప్రకటించిన  అది ఆకర్షణీయంగా ఉండునని అలంకారికులు చెప్పుచుందురు. శృంగారము రెండు విధాలుగా ఉంటుంది సంయోగము, విప్రలంబము . విదేశీ కవులు విప్రలంబమునకు మొగ్గుచూపగా , మన దేశమున కవులు సంయోగమునకే పట్టం కట్టిరి
  
పూర్వ ప్రబంధాలైన మను చరిత్ర , పారిజాతాపహరణం , వసుచరిత్రలలో నాయికా నాయకుల సంయోగ వర్ణనలున్నవి. ఆంగ్ల , పారసీ, హిందీ,  ఉర్దూ గ్రంధాలలో సంయోగ వర్ణనలు చాలా  తక్కువ, ప్రేమ అనిన సయోగమే కాదు విప్రలంబము కూడా. కారణాంతరాలవల్ల నాయికా నాయకుల  విడిపోవడమే విప్రలంబము. సంయోగానికి బలం చేకూర్చేది విప్రలంబమే   

శృంగార, కరుణ  రసాలని  పోషక రసాలు అంటారు. కావ్యభాషలో వీటిని అనుషంగికాలు అంటారు. రచన సంప్రదాయ బద్దంగా ఉండి భావాలు నవీనంగా ఉంటాయి. వీటిని కొత్త కావ్యాలలో కూడా చూడవచ్చు . పురాతన కావ్యాలన్నీ మంచివి కావు  అధునాతన కావ్యాలన్నీ చెడ్డవి కావు.  రచనా శైలి రస పోషణ  బట్టి తెలుసుకొనవలెను. మూఢులు మంచి చెడ్డలను విచారించ జాలరని మాళవికాగ్నిమిత్రంలో కాళిదాసు చెప్పెను.   

కామః ,తత్ అగ్రే , సమ్ అవర్త॒త, అధి మనసః ,రేతః ప్రథమం యత్ ,ఆసీత్ ।
సతః బన్ధుమ్ , అసతి నిః, అవిన్దన్, హృది ప్రతి ఇష్య కవయః మనీషా 

కామం అంటే భవత్ కామం . కామము లేకపొతే సృష్టి లేదు. అందువలన జీవులకు   ఈశ్వరుడు సృష్టి చేయు అవకాశమునొసగినాడు.సృష్టికి కారణం కోరిక  అదే  బీజం.  అలాటి కామము ప్రాచీనులు ఋషులకు  పూజ్యనీయమైనది. దాని  ఔన్నత్త్యాన్ని నేడు ఆధునికులు వెకిలిగా చూపుచూ పలుచన చేయుచున్నారు . 

తమసోమా హృష్టిర్గమయ!  హృష్టోర్మా అమృతంగమయ!! 

2 comments:

  1. చాలా కొత్త విషయాలు వ్రాస్తున్నారు. విదిష జీవితం ఏ మలుపు తిరుగునో!!

    ReplyDelete
  2. Chala baga vivarincharu ..okkapudu unna srungara rachana bavalu malli me blogs lo chadavadam naku labinchinda bhayagam ga anukuntunanu ..

    ReplyDelete