Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 25, 2020

Bharatavarsha -57

బారామతి: గోల్ఫ్ క్షేత్ర పరిమాణమున హరిత కాంతులీను సువిశాల  పచ్చిక మైదానము  మందు వైమానిక శిక్షణా కేంద్ర భవనము నింగినందు  నీలభము వలె , చేట యందావగింజ వలె కనిపించుచుండెను. ఆ పచ్చిక మైదానమునం దనేక దారులు, అవిచ్ఛిన్నముగా ఆరేసిన చీరలువలె కనిపించుచుండెను.   ఆవైమానిక పథములందు రెక్కలు జాచి లోహ విహంగములు  రయమున పరుగిడి నింగికెగ యుచుండును. అందొక పథమున కాస్సేన యను చిన్ని విమాన మొకటి చిన్నకృష్ణుని వలె చూడమురిపెముగా నుండి నీటియందు బాతువలె సాగుచుండెను. అట్లు కొలది  దూరము పోయిన పిదప తన  వాలమును సవరించుకొని సునాయాసముగ చులకన ఓలమున  మలుపు తిరిగి పరుగు మొదలిడెను. ఆ వ్యోమయానమందు సుందరి  తన చెలిమి నందినితో కాకిపిట్ లో కూర్చొని యుండెను.



సుందరి :  డీర్ వేలీ గ్రౌండ్ ,   కస్సేన  756,  రన్వే 7 లెఫ్ట్ ,   హోల్డింగ్ షార్ట్ !

గ్రౌండ్ కంట్రోల్:    స్సేన  756   రన్వే 7 లెఫ్ట్ , ఆల్ఫా  హోల్డింగ్ షార్ట్లైన్ అప్.

సుందరి తన విమానమును నొక పక్క దారికి మళ్లించి నిలిపెను.

నందిని: యంత్రమునకేమొచ్చెను? ఏల నిలిచిపోయెను? ఆ భాష కర్ధమేమి?

సుందరి: యంత్రము నిలిచి పోవుటకాదు , యానమును నేనే నిలిపితిని.  ప్రక్కకు తొలగి నిలపమని తరంగ  సందేశము ( రేడియో మెసేజ్ ).  తరంగ సందేశ భాష ( రేడియో కమ్యూనికేషన్ ) అట్లే సంక్షిప్తముగా   యుండును.

నందిని: కానీ నాకు బహు సంక్లిష్టముగా యున్నది

సుందరి: నావలే  నీవునూ 18 నెలల  శిక్షణ పూర్తి జేసుకొన్నచో అన్నీ చక్కగా వివరించెదను.  ఎగురుటకింకనూ సమయమున్నది  అనుమతి లభించలేదు. నేను వివరించెదను వినుము.

డీర్ వేలీ  , మన స్థలనామము.  గ్రౌండ్, అనగా గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థ ; కస్సేన  అనగా మన విమాన నామము;  756  అనునది మన వాల సంఖ్య ( tail number) .

తరంగ సందేశ విధానమందు ముందు మనము ఎవరితో మాట్లాడుచున్నామో వారి పేరు తెలిపి పిదప మన పేరు (విమాన నామము, వాల సంఖ్య నందలి చివరి మూడు సంఖ్యలు ) చెప్పవలెను , ఆపై చివరిగా మన సందేశమును చెప్పవలెను.

డీర్ వేలీ గ్రౌండ్ ,( to address)   కస్సేన  756( from address) చెప్పిన పిదప, నా సందేశము  

రన్వే 7 లెఫ్ట్ ,   హోల్డింగ్ షార్ట్  అని జెప్పితిని అనగా ఏడవ వైమానిక పథము (రన్వే)ని దాటి తిని,  త్రోవ ముగియుచున్నది అని చెప్పితిని.  

అప్పుడు భూతల నియంత్రణ అధికారి : కస్సేన  756   రన్వే , ఆల్ఫా , 7 లెఫ్ట్హోల్డింగ్ షార్ట్(మనము చెప్పిన సందేశమును విన్నట్టు రుజువు పరచుటకు  తిరిగి చెప్పి పిదప వారి సందేశమును చెప్పెదరు)లైన్ అప్” అని చెప్పెను అనగా  వాలవలిసిన (landing)  విమానములుండుటచే ప్రక్కన వేచి యుండవలెను. సుందరి వివరణ  ముగించగానే మరు లిప్తలో ఒక విమానము చెంతనే వాలి పరిగెడుచుండెను.   

నందిని : ఓం భూర్భు తతః   తత్ సరణ్యు వరేణ్యం భర్గో దేవస్య గామిహి   వ్యోమయాన ప్రత్యోదయాత్

గాయత్రి మంత్రమువలె నున్న ఈ భాషాకర్థమేమి?

3500  సంవత్సరాల క్రితం  రుగ్వేదం లో రచించబడిన గాయత్రీ మంత్రం యొక్క సారాంశం : ఓం భూర్భువ సువః  తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధిమహి ధియో యోనః ప్రచోదయాత్

భూ (భూలోకము) భువః (భూస్వర్గములకు మధ్య నున్న జగత్తు  అనగా తార సూర్య చంద్రులతో నిండిన ఆకాశము ) సువ (స్వర్గ లోకము) తత్ (ఆ యొక్క) సవితుర్ (సూర్య కాంతి) వరేణ్యం (శ్రేష్టమైన ) భర్గో (జ్ఞాన తేజస్సు) దేవస్య ( ప్రార్ధిస్తాను) దీయో (బుద్దిని) ప్రత్యోదయాత్ (ప్రేరేపించుగాక).

 నందిని : ఓం భూర్భువనాంతర   సరణ్యు వరేణ్యం భర్గో దేవస్య గామిహి   వ్యోమయాన ప్రత్యోదయాత్

బూర్భువనాం తర -భూమ్యాకాశములలో నున్న ;  తతః  -(తతము అనగా గాలి)

సరణ్యు (సరణ్యువు – గాలి) ;  గామిహి ( సర్వత్రగామి - గాలి ) దేవస్య (ప్రార్ధిస్తాను)

వ్యోమయాన ప్రత్యోదయాత్ – (విమానమును ప్రేరేపించమని)

వర్షుని కొరకు తపమే చేయుచున్నావు. సంస్కృతము నేర్చుకొనుచున్నావు. అనుచూ వివరణ  ముగియు గానే లిప్తకాలమందు సుందరి  పరికరముల ఫలకము పై కరనర్తన మొనర్చెను.  మరు లిప్తలో విమానము రివ్వున వాయువేగముతో దూసుకు పోయెను.   

. రము  లాయవి  మాద్రినం దన  డ్గముల్ ని, రా!

    చురక    బెట్టగ    రేగిరి వ్వని ఘా  టమున్ లపించుచూ

    రలి  పాశుప   తమైమే   ఘప  మునన్     దిలాడు చూ

    మెరయు  చున్నద   దేతుషా  నగమో  మరాక యామో

విమానమును ప్రారంభించుటకు అనేక పనులను(తాళమును త్రిప్పుట , ప్రధాన మీటను(మాస్టర్ స్విచ్ ) నొక్కుట, ఇంధన పంప్ను ప్రారంభించుట, మిక్సర్ కాడను లోపలి నొక్కుట, త్రొటల్ ను పైకి లాగుట , ఏవియానిక్స్ బస్ 1,2 మీటలను నొక్కుట) ఏక కాలమున జేయవలెను. 

కరము   లాయవి  (అవి చేతులా )   కనినపరిశీలించిన;   మాద్రినం దన ఖడ్గముల్ =  నకుల సహదేవులు చేత  ఖడ్గములు వలెనున్నవి;    రా! ;  చురక బెట్టగ = ఇగ్నిషన్ లేదా అగ్ని రాజెయ్యగారేగి  = వేగము పెరిగిరివ్వని లఘాటమున్ తలపించుచూ = రివ్వని  గాలిలా దూసుకుపోయి;  తరలి  = ప్రయాణమై  పాశుపతమై ; మేఘ పథమునన్ మెరయుచున్నది అదే తుషానగమో? = హిమ వత్ప ర్వతమోమరి  ఆకాశయానమో? = లేక విమానమో!

 కాస్సేన 756,  18, 000 అడుగుల ఎత్తులో ఎగురు చున్నది నందిని సుందరిని  హత్తుకొని కేరింతలు కొట్టుచున్నది. భూమిపై  కొండలు బొమ్మలువలే  చెట్లు గుండు సూదులవలె కనిపించుచున్నవి. “విమానంలో ప్రయాణించుటవేరు కాకిపిట్ నందు కూర్చుని ప్రయాణించుట వేరు. తన బాల్యస్నేహితురాలు పైలట్ అయినచో, ఆ ఆనందము వర్ణనాతీతము. కాకినాడ వద్ద పల్లెటూరిలో వ్యవసాయకుటుంబమందు జన్మించి, నాతొ చదువుకొన్న సుందరేనా పైలట్ గా మారుచున్నది.”    

సుందరి: ఈజీవితమును ప్రసాదించింన దేవత అరుణతార గారికి నేను రుణపడి యున్నాను.

నందిని : ఆ నువ్వు కష్టపడితివి. పైకి వచ్చితివి. అని వేళాకోళముగా అనుచూ సుందరిని రెచ్చగొట్టెను

సుందరి: ఆమె ను పల్లెత్తి మాట అనిన విమానము నుండి దిగిపొమ్ము.

నందిని : ఆ …మీ శిక్షకుడే అనుమతిచ్చెను కదా    

సుందరి: ఎవ్వరనుమతిచ్చిననూ పైలట్కు దింపి వేయుటకధికారము గలదు. (ఇవువరూ నవ్వుకొనిరి)

విమానము మలుపు తిరుగుచున్నదిమనము 50 మైళ్ళ దూరము దాటివెళ్ళరాదు, క్లాస్ లో మాత్రమే ఎగరవలెను బి క్లాస్ నందు ఎగర రాదు ప్రయాణ విమానములు నడుపు (కమర్షియల్ పైలట్ లైసెన్స్) అనుమతి వచ్చినవారు మాత్రమే స్వఛ్చగా 45,000 అడుగుల ఎత్తు ఎగరగలరు. ఎంతదూరమైననూ పోగలరు.


నందిని: అనగా నీవింక పర్యవేక్షణలోనే యుంటివా ?

అవును, మా శిక్షణ ఇట్లుండును. మొత్తము 30 గంటలు 

(25 గంటలు బేసిక్ మానువర్స్,  5 గంటలు క్రాస్ కంట్రీ ఫ్లైయింగ్) శిక్షకుడి తో  కూడి నేర్చుకోవలెను

10 గంటలు ( సోలో ఫ్లైట్)  యుండవలెను. 

అందు ఐదు గంటలు గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణలో మిగితా 5 గంటలు సొంతగా ( క్రాస్ కంట్రీ) దూరప్రయాణము. రెండు విమానాశ్రయముల వద్ద దింపి తిరిగి రావలెను . ఆ పరీక్ష రేపు గలదు.  నేనిప్పుడు గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణలో యున్నాను.  

నందిని : అదియైన పిదప పైలట్ అనుమతి లభించునన్నమాట

అంతే  కాదు , తరువాత చెక్ రైడ్ ఒక గంట  విమాన ఆచరణీయ పరీక్ష ( ప్రాక్టికల్ ఫ్లైయింగ్ టెస్ట్ ) కలదు .

నందిని : పోనిలే ఇవియే కదా పరీక్షలు తప్పక  గెలుపొందెదువులే.

అంతే  కాదు , చెక్ రైడ్ కు ముందు మరిక పరీక్ష కలదు . అదే అత్యంత కీలకము

నందిని : ఇంకనూ పరీక్ష?

అవును,  వ్రాత పరీక్ష , అందు గణితము , భౌతిక శాస్త్రము, తర్కశాస్త్రము, ఆంగ్లము  చాలా కఠినముగా నుండును

నందిని :  పది రోజుల నుండి బాగుగానే చదువు యున్నావు కదే , అయినా అవన్నీ కిందకి దిగిన తర్వాత మాట్లాడుకొనవచ్చు,  ఈ విమానము చూడుము.అబ్బా ఎంత ము ద్దు గాయున్నదో, కొత్త ఆవకాయ జాడీ లా మెరియుచున్నవిమాన మునందు కుంకుమ భరణి  లాంటి కాకిపిట్ చూడముచ్చటగా నున్నది!

సుందరి :  అమ్మా నందిని ఇచ్చట  ఏమియునూ తాకకుండా కూర్చొన్నచో మనం క్షేమంగా ఇల్లు చేరగలము 

నందిని : ముట్టుకొనుటలేదు  ముద్దాడుచున్నాను అనుచూ  ఆల్టీ మీటరును ముద్దాడెను.

మనుషుల కే  ముద్దుల  లనుకొంటిని విమానములకుకూడా ముద్దులిచ్చువారుందురా ?

నందిని : ఇదియ  దియనిజూ  డక  వస్తు తలము లన్ని ప్రియుడి

 చెంపలని తలచుచు ముదముగ ముద్దా డిన తొలగు నిర్వేదము

 కలుగు నుత్సాహము వలపు వెగటైన  వగల మారి.

సుందరి : వలపు వెగటైన  వగల మారి అని ఎవరినే  అను చున్నావు , నన్నే కదూ, నాజీవితమున  కర్తవ్యమునకు , కృతజ్ఞతకు తప్ప ప్రేమకు స్థానము లేదు. పద్యము బాగున్నది యతుల  జతులం  గూడి   ప్రాసవిరాజిత పద్యము ము కాకున్ననూ మనోరంజకంగా మలచినావు. వర్షుని బుట్టలో వేయుటకు పెద్ద ప్రయత్నమే చేయుచున్నావు. యతి ప్రాసలున్నచో …

 నందిని :  ఆ ఉన్నచో… ఏమగును యతి ప్రాసలన్నకవుల కెందుకంత శ్రద్ధ?

  తే. ఈశుడు గిరిజ కుపదేశ  మివ్వ  బుట్టె

  పింగ  ళుండు విరచించ వచంద శాస్త్ర          

  మయ్యె  కావ్య  కంఠ  మందు పసిడిగా

  వ్యోమ  మందు  రవిసోమ భాసము గాదె 

పరమ శివుడు  పార్వతికి ఛందస్సునుపదే శించుచుండ పింగళుడు విని  రచించగా  ఛందోశాస్త్రము పుట్టెను. వ్యోమము ను  సూర్య చంద్రులు  స్త్రీలకు  కంఠములను స్వర్ణా భరణములు  అలంకరించును,  కావ్యముల కంఠములను వేద ఛందము అలంకరించును.

అవి యున్నచో వర్షుడు మరింత దగ్గరగును, అతగాడనినా ఎందుకె నీకంత మోజు? ఏమున్నదతడిలో?

నందిని : ఏమియూ లేకున్నా తులాభారమును దూరదర్శము  నీవెందుకు దుకు చూచితివి?

ఛ  ఛ అతడు నాకు అన్నగారు , అతడిలో కళను చూచితిని.  నీవలె అతడిని ఛాతీని , భుజములను  చూడలేదు.

నందిని : అవును చూచితిని తప్పేముంది , అతడిని ప్రేమించుచున్నాను.  అతడి వద్ద పడుకొనుటకు సిద్దమే.

సుందరి :   ఛీ ఛీ ఆమాటనుటకు సిగ్గులేదూ , ఎవరైనా విన్నచో , ఏమనుకొందురు !

నందిని : అమ్మ పైలట్ సుందరిగారు , ఇరవై వేల అడుగుల ఎత్తున ఆమాటనుటకు  బుద్ధి ఉండవలెను.

సుందరి :   ఆహా! మరి నిన్న రాత్రి ఎందుకు  వార్తాపత్రికల్లో అచ్చయిన  వర్షుడి చిత్రము పై బడి ముద్దులిడినావు అప్పుడెక్కడికిపోయెనే సిగ్గు, బుద్ధి  అప్పుడు ఎంత ఎత్తులో ఉన్నావే  , మంచము పైనే ఉంటివి కదా !  

నందిని : అట్లు చేసితినా ? నిద్రలో చేసుంటినేమో  అర్ధము చేసుకొనవలెనుకదా!

సుందరి :   నేనెట్లర్ధము జేసుకొన్ననూ పెంచలయ్యగారు ఎట్లు అర్ధము జేసుకొందురో ?

నందిని :  ఛీ  ఛీ , మా నాన్న ఊసెత్తవలదు , నేను ఆయన మాట ఇక వినను , ఒకసారి  విని పొరపాటు చేసితిని.

సుందరి :   అదిపొరపాటా , ఒక  గురువుపై అట్టి  అభియోగములు మోపుట నీకే చెల్లెను.

నందిని :  నీకిది తగునా ? ఇంత నిర్దయగా మాటాడుచున్నావు. నేను దుర్భుద్ధితో చేసినది కాదు. మానాన్న నాపేరుతో  ఆడిన నాటకము.  నేను వర్షతో చనువు గా నుండుటతో అందరూ నమ్మినారు.  భారతవర్ష  అంత  భాదపడిననూ నాకు చెప్పలేదు. కళాశాలకు వర్ష ఎందుకురాలేదో  అందరికీ తెలిసిననూ వారు నన్నడుగుటకు సాహసించలేదు. చివరకు కొద్దీ కాలము పిదప నాకు తెలియరాగా చనిపోవలెనని నిర్ణయించుకొని ఆయనను క్షమాపణ వేడుటకు ఒకరాత్రి అతడింటికి ఇంటికి పోయినాను. వర్షడు " ఇందు  ఒక రాజకీయ కోణమున్నది , నాకు జరిగినదంతయూ  తెలియును  ఇందు నీదోషమేమియూ లేదు అని ఆశీర్వదించి పంపెను.

సుందరి : అమ్మ పాతకీ  నావద్ద ఇదంతయూ ఇప్పటివరకూ ఎందుకు దాచితివి. అయిననూ అన్నగారు నీకు గురువు. ఆయను ప్రేమించుటయే కాక, పేరుపెట్టి పిలుచుచున్నావే ? అతడు నీ స్నేహితుడుకాదు మర్యాదగా నడుచుకొనుము నిన్ను ఆశీర్వదించిన వానినెట్లు ప్రేమింతువే ?

నందిని :  ఓసి దుర్మార్గురాలా , నీ స్నేహితురాలి పట్ల తప్పులేకున్ననూ ఇంకనూ నెపములెన్ను చున్నావు.  గురువుని ప్రేమించరాదా ? గోదాదేవి సాక్షాతూ వెంకటేశ్వర స్వామినే ప్రేమించెను కదా!   ఇంక ఆశీర్వదించుట అందువా భర్త భార్యను ఆశీర్వదించుట సహజమే కదా !

సుందరి : భార్య అనుచున్నావు  విదిష యను పేరు వినలేదా.

నందిని :  తెలుసు , అయిననూ నా ఎత్తులు  నాకున్నవి

సుందరి : ఎత్తులతో జిత్తులతో వర్షను సాధిం చుట అసంభవము

నందిని :  నేను తలచుకొన్నచో సంభవమే. నేను చేయవలసిన పని ఒక వారము క్రిందటే జరిగిపోయెను.

సుందరి : మరి ఎందులకే  చదువు మానివేసి ఇంటినుండి పారిపోయి అజ్ఞాతవాసము చేయుచున్నావు.

‘పెంచలయ్యని సాధించుటకు” నందిని అట్లను చుండగా విమానము భూతలమును సమీపించుచుండెను. 

5 comments:

  1. Sir విమానాలకు సంబంధించిన సమాచారం అంతా బాగానే ఉంది కానీ వర్షునికి మరో కథానాయికా!!!
    🤔

    ReplyDelete
    Replies
    1. భిన్న పాత్రల, భిన్న సరసాల రసాల
      అసురసా అసుర, సుర శూర గణములు
      కల్గి వెలిగి వెల్గించెడి కావ్యమందుండదా
      యొక్క రక్కసి ? పన్నగము పన్నదా
      పన్నాగము ? ఎత్తుకు పైఎత్తు వేసిననూ
      ఎత్తులు చూపి ఎత్తుకుపోవు కామిని
      లుండరా ? ధర్మ సంఘర్షణ మే కావ్యసంకర్షణము
      విజ్ఞుడే విజేత కదా!

      Delete
  2. గాయత్రి మంత్ర వర్ణన
    వ్యోమయాన ప్రచోదయత్ వంటి ప్రయోగాల
    అద్భుతం

    ReplyDelete
    Replies
    1. Thank you very much Hemanth. Very happy to see you here

      Delete
  3. Hey Sir You Write A Blog. Keep it up...
    I also Make For Every One Check It

    ReplyDelete