త.వనము నందున సత్యతి య్యగపా డిచేడి యగూడి వా
దనము చేసిము రారినే చెఱదె చ్చుమార్గ ముకోరు చూ
మనము నందున నందుని తలబో యుచూవి రిబోడి యా
వినుతు నేకని సంతసం బునము ద్దుగావ లపించె నే.
తెర తీయగానే ఒక పెద్ద ఉద్యానవనము కనిపించుచుండును . ఆ సుందర వనము పచ్చనిచెట్లు పూలమొక్కలతో నిండియుండి వసంత ఋతుకళలను చూపుచుండెను. సత్యభామ పాత్రధారిణి వనమున అప్సరస వలె కని పించుచుండెను. సత్యభామ, హారికంఠ, కోకిల,వలే ఆమనియందు తన ఆమును, కోర్కె, తియ్యగా పాడుచున్నది. ఆమె చేడియ నళిని ఆ గానమాధుర్యమున విని పులకరించుచున్నది.
ఇటురాడేలఈవేళ గోపాలుడూ!ఇక జాగేల ననుజేర గోపాలుడూ ఇటురాడేల నే వేగ గోపాలుడూ ఇక జాగేల కౌగిలిచేర గోపాలుడూ
అని విరహముతో గానము చేయుచూ చేడియతో నర్తించుచుండును. ఒకరి చేతులొకరు పట్టుకొని తిరుగుచుండిరి. సత్యభామలో మదనోత్సాహము తొంగిచూచుచుండును.
రెండవ వరుసలో కూర్చొన్న వృద్ధు లిద్దరు “ఈమె కన్నాంబ వలె మంచి సొగసరి పొడుగరి. మరి కృష్ణ వేషధారి ఎట్లుండునో?”
“అవును ఈమె మత్తజగమువలె నున్నది,
కానీ సామాన్యముగా కృష్ణ వేషధారి ఏ మధ్యవయస్కుడో , ముదుసలో అయి ఉండును” అని అనుకొనుచుండగా ఈ మాటలు విదిష మంజూష, మాలిని అరుణతారల
చెవిన బడెను.
రంగస్థలమున రాగమతిశయించిన సత్యభామ నర్తించుచుండ గా “సత్య
ఒయ్యారామెల్ల ఆమె నాట్యమంద గుపించు చుండెను. ఈమె మంచి నర్తకి వలే నున్నది “అబ్బ! ఏమి శృంగారభావములను చూపుచున్నది” అని అరుణతార అనెను. “మీరే ఇట్లనిన కొత్తగా పెళ్లయినవారు ఏమనుకొనుచున్నారో!” యని మాలిని అనెను. మంజూషవిదిశలకిది వినిపించగా ముసిముసినవ్వులు నవ్వుకొనిరి. వారు ప్రక్కకు తల త్రిప్పగా
మసకచీకటోలో కన్నె చేతిని రాముడు పరిగ్రహించెను. అప్పుడు కన్నె
పక్కనున్నది పిల్ల వాండ్రని, గమనింపుము నవ్వులు
అయ్యో సరిగాదీ నడత తొలగింపుము చేతిని రామా
గమనించితి
నా కర్మను బాగుగ భామా,
చీకటింట
చేతిన చేయిడ నేరమా రంగస్థలమున చూడుమా!
కన్నె తలయెత్తి రంగస్థలమును కాంచగా కృష్ణుడ గుదెంచు చున్నాడు.
త. కదిలె
వర్షుడు
కాంతులీనుచు గట్టి ఛాతి యు, కాయమున్
ముదము గొల్పగ, పాడుచూ అసముడై నిల్వగ
ఎల్లెడ
పొదలె హర్షము వాడి చూపుల భామ వర్షుని తాక గా
విదిష ఉల్లము జిల్లనెన్ మదమత్సరంబును మూర్కొ నెన్
ఆజానుబాహుడరవింద నేత్రుడు, వర్షుడరుదెంచెను రంగస్థలం పైకి.
దృఢమైన ఛాతి యవ్వన కాంతులీను దేహముతో చూచువారికి ముదము గొల్పుచూ, ఎదురుచూచుచున్న సత్యను వెనుకనుంచి
మెల్లగా గజగమనముతో సమీపించి ఆమె కళ్ళు మూసి కొద్దీ క్షణములలో వదిలివేసి శ్రావ్యముగా పద్యమునాల పించి, చివరిలో ఉచ్చ స్వరమున కంఠమును నిలిపి
రెండు నిమిషములట్లే యుంచగా కళాభవనము చప్పట్లతో మారు మ్రోగెను. అసముడై (అసమానుడై) పొడగరియైన వర్షుడు సత్యభామ వద్ద నిల్వగా, ఆమెకంటే ఎత్తుగా నున్న అతడిని (కృషుని) భామ వాడిగా వేడిగా చూసెను.
ఆపై శ్రీకృష్ణ సత్యభామలు కలసి రసరమ్యముగా నాట్యమా డెదరు.
అది చూచి విదిష ఉల్లము ఈర్ష్యతో చలించెను.
అందరు వారిని మంచి జోడి యని కొనియాడు చుండగా ఆమె మాత్రము ఎగ్గుగొని నేను సరిజోడుకానేమో యని న్యూనతనొందెను.
ఆపై సత్యభామ ఇచ్ఛను వెల్లడించ సత్య చాలా కొంటెపిల్లవలె అల్లరిచేయుచూ దుముకు స్వరము వసంత కాలమహిమను చాటు పద్యమునాలపించి, ప్రేమ కంటే గొప్పదేమియునూ లేదని జెప్పగా అంతకంటే
భక్తి భావము గొప్పదని కృష్ణుడు సూచించు గానమును జేయును.
ఇంతలో కృష్ణుని మిత్రుడు వసంతుడరుదెంచి ఆకలి ఆకలి యని ఘోషించుచుండ కృష్ణుడు అతడిని భోజనమునకు గొనిపోవుచుండును. అప్పుడు రుక్మిణి గోపాలుని నామము గానము చేయుచూ ప్రవేశించును. ఆమె అచ్చటకు వచ్చుటతో వసంతుడు ఖంగుతినును. ఆమెను చూడగానే సత్య కన్నులెరుపెక్కును. కృష్ణుడు తికమక పడి సత్యకి సర్ది చెప్పి పంపుటకు యత్నించుచుండగా అతడిని సత్య విదిలించును.
త. తనకు కావలె నాటబొ మ్మవిధ మ్ము గాన డి చేటి సా
మి,నర హరైన నామె కడ్డుగ మాటజెప్పగ నొప్పు నే
దినదినమ్ము రివాజుగా మరితామరంబు నొసంగు చూ
అనువు గామణి ఇంటనుం డగ నేమితక్కు వభామకున్.
ఎనమండ్రు భార్యలందు సత్యభామ ప్రత్యేకం. వైదర్భి కూడా ఆమె వలే కృష్ణుని ప్రేమించిననూ ఆమెది భక్తి ప్రేమ. భామది విలాస ప్రేమ. అనుదిన మెనిమిది బారువుల బంగారమునిచ్చు శ్యమంతకమామె సొంతం, మురారి సతతము తనమందిరమందే యుండవలెనని పంతం. అందము, ధనము ఉన్నచో ఒక రవ్వ అహంకారము సహజమే కానీ భామ అహంకారము పరిధిదాటి పతినే ఆజ్ఞాపించుచున్నది.
కళామందిరములో ఎవరో ఇద్దరు ప్రేక్షకులు మాట్లాడు కొనుచున్నారు.
“కృష్ణుడామెను ఇంకనూ సముదాయించుచుండెను. ఆమె ఒడ్డు, పొడవు హావ భావములు అద్భుతముగా నున్నవి. సత్యభామ పాత్రకీమె అతికినట్లున్నది. సత్యభామ యనిన పోతపోసిన జాణతన మేకదా.” “పాత్రధారిణి పేరేమోకానీ ఈ పాత్రకు ఖచ్చితముగా సరిపోయినది. “ఆమె ప్రక్క యితడు తప్ప ఎవరు నిలువ జాలరు. ఇప్పు దర్దమైనది కృష్ణునిగా ఎందుకు ఇతడిని ఎంపిక జేసుకొనిరో”
మరునాడు తన పుట్టిన దినమని, రావలెనని కృష్ణుని ఆహ్వానించగా, సత్య కూడా అదే దినమున తన మెట్టిన దినమని రుక్మిణిని పరిహాసము జేయును. ఆ దృశ్యము అంతమగును. సత్య, నళిని కృష్ణుడు , వసంతుడు ఉద్యానవనం నుండి నిష్క్రమించెదరు. రుక్మిణి వెడలును.
ఇప్పుడు తెరనొకపరి దింపి లేపిరి వెనుకభాగమున ఆకాశము మబ్బులు కనిపించుచుడెను నారదుడు చక్కని గానము చేయుచూ కనిపించకుండా ఏర్పాటు చేసిన తాళ్ల సాయముతో ఒక మబ్బుపై దిగి గానము చేయుచుండెను. ఇటువంటి అధునాతన సాంకేతిక ఏర్పాట్లున్న నాటకములు చలన చిత్రములకేమియో తీసి పోవు అని లకుమ అనెను.
అచ్చట నారదుడు పాడుచుండగా రుక్మిణి(రంజని) తెరపక్కనుండి చూచుచుండెను. వర్షుడు అలంకార గృహమందు కూర్చెనేను. కొద్దిసేపటిలో వచ్చి తరువాత దృశ్యము ఐదు నిమిషములలో నుండునని అది మీదే యని సిద్ధముగా యుండుమని , సత్యకు వర్షకు చెప్పెను.
కేశవుడు మొదటిసారైననూ చక్కగా గానము చేయుచున్నాడు. ఇతడికి కళాశక్తి యున్నచో హైద్రాబాదునందే యుంచుకొనవలెను అని రంజిని ( రుక్మిణి ) అలంకార గృహము వద్దున్న భానోజీరావుగారితో అనెను.
కోపముగా వనము నుండి వైదొలగిన సత్యభామ లికత్తెతో గృహమున కృష్ణునెట్లైననూ తన చెప్పుచేతలలో ఉంచుకొనవలెనని తపించుచూ అన్ని సౌఖ్యములూ సంపదలూ ఉన్ననూ మగడు లేక స్త్రీ జన్మకు అర్ధములేదని వాపోవుచుండును.
నారదుడు గానముచేయుచూ ప్రవేశించును. పెద్దసంవాదము జరిగిన పిమ్మట నారదుడు వ్రతోపదేశము చేయుట తరువాత సత్యభామ ఆనందముతో రెచ్చిపోయి " మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధాన మహిమన్ " అని పాడుటచూసి మాలినిగారు ముచ్చటపడి ఆమెతో గొంతు (మెల్లగా) కలపగా , అరుణతారకూడా పాడుచుండెను. అది జూచి మంజూష “పాతతరంవారికి శృంగారభావములె”ట్లు కలుగునో అర్ధమయ్యి ముసిముసిగా నవ్వుచుండెను. విదిశకు మాత్రము ఇదంతయూ కంటగింపుగా యున్నది. “నన్ను ఇచ్చటికిపిలుచుటకు కూడా ఇష్టములేని మీ అన్నకు ఆమె అనిన ఎంత విదేయతో” యని మంజూషతో అని వాపోవుచుండగా “రంగస్థలంపై కృష్ణుడు సత్య భామ సంభాషణ రసవత్తరం గా నున్నది.
ఈ కృష్ణ పాత్రధారి ఏ ఢిల్లీ కో చెందిన యువకుడు వలే నున్నాడు. ఆర్యుని వలే వర్చస్సు కల్గి , రాజపుత్ వలె దేహదారుఢ్యమును కల్గి యున్నాడు. “మన తెలుగువారి కళలు ఇట్లుండవు వీరిద్దరూ ఒకరికొకరు చక్కగా పొసఁగి యున్నారు. నాటకములలో చాలామందికి స్త్రీ పురుషులకు సంబంధములు ఏర్పడును అటులనా అయ్యేయి యుండవచ్చును వీరిరువురూ కలసి సంభాషణలను అభ్యసింతురు కదా అప్పుడు ..”
విదిష ముఖ ము జేగురించెను” నన్ను పిలవనైనా పిలిచి నాడు కాదు కదా పిలవని పేరంటమునకు వచ్చితిని. ఇప్పుడు అందరు వారి జంట బాగుందని అనుచున్నారు నాకు తగిన శాస్తి జరిగెను” అది విని మంజూష
అమ్మా చిన్ననాటి స్నేహితుడిని ఇదేనా నువ్వు అర్ధము చేసుకొన్నది అని విదిష అడిగెను. "నిన్ను ఏమని పిలవగలడు నాటిక విశాఖపట్నమున జరుగుటలేదుకదా పొరుగూరులో జరుగుచున్నది, వాడు నీ మొగుడు కాదు నిన్ను తనతో పొరుగూరు పంపమని నీ తండ్రినడుగుటకు.” అని సర్ది చెప్పెను. అయిననూ సత్యభామ పై ఆమె కోపము తగ్గలేదు . మరియొక అందగత్తె వచ్చిన వర్ష తనను పట్టించుకొనడేమో యను అబద్రతాభావమున కు గురిఅయ్యి విదిష ప్రాణముసూరనుచున్నది “సత్యభామపై చాలాకోపముగా యున్నది” అనెను. “చాలించు మమ్మా! ఆమె నాటకము లో పాత్రధారిణి , నీకంత అపనమ్మకమైనచో రంగస్థలం దిగినంతనే ముడిపెట్టమందును, నీవునూ అసత్యవలే మా అన్నను కొంగున కట్టుకు తిరగవచ్చు అని మంజూష హాస్యమాడెను.
సత్య పేరెత్తు వరకూ సంతోషముతో వెలిగి ఆమె పేరు వినగానే విదిష మొఖ మొక్కసారి మాడిపోయెను. “ఆమె పై నీకెందులకు కోపము?” “ఎందులకా ఆమె మనసున చెడ్డ తలపులున్నవి, అవి నాకవగతమగుచున్నవి” హూ సరే , అయిననూ ఏమిచేయగలవు ? అని అడిగెను. “నేను తలుచుకొన్నచో ఆమెకు మెదడుకు సంకేతములు పంపి ఆమెను ఆపగలను. ఆమెను ఇప్పుడే రంగస్థలం దిగమని ఆదేశించనా?” అని అడిగెను. మంజూష "నీవట్లు జేయగలిగిననూ చిక్కే యగును కదా” అని మంజూష అనెను. అయినచో చూడుము అని " ఆమెను రెండు నిమిషములు పొర్ల వలసినదిగా ' సంకేతము పంపినాను” అని విదిష అనెను.
అప్పటికి “మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి” అను పాట ముగియుచుండెను. రంగస్థలంపై కేవలము సత్యభామ మాత్రమే యున్నది. పాట ముగియగానే సత్య భామ రంగస్తలము పై రెండు నిమిషములట్లే పొరలుచుండెను. సంతోష మతిశయించిన సందర్భమున అట్లు చేయుట ప్రేక్షకులకు సహజమే అనిపించెను. ఇంతలో ఆమె మరల లేచెను మంజూష నిర్ఘాంతపోవుచూ తన ప్రక్కన ఎదో మహాశక్తి కూర్చుని ఉన్నట్టుగా అనుభూతి చెంది వణికెను.
ఇంతలో వర్షుడు రంగస్థలమున ప్రవేశించెను. అతడిని చూచి సత్యభామ నారదుడు ఉపదేశించిన వ్రతము జేయుటకు అతడిని ఒప్పించవలెనని అలక నటించుచుండెను కృష్ణుడు సత్యను ఓదార్చు పద్యము నందుకొనెను. మరల నాటకము ఊపందుకొనెను.
కృష్ణుడు ఓదార్చుచున్ననూ మెత్తబడక సత్య పెద్ద జగడమే సృష్టించెను.
సీ. మోసము జేసినా వునెరన మ్మితినిను
గొంతుకో సినావుర గీత దాట
నంచుగీ తేదాటి నావు నిన్న
ఆడినే డుమరచి రుక్మిణి తోకూడి
నన్నెన్ని మార్లువం చించ నెంచి
తివి ప్రేమమోసము తలపుల దోషము
చాలు చాలు జాలము వీడుము
పొమ్ముపొ మ్మునాశన మయి పొమ్మిక పోరా!
పాట పూర్తి అయిన పిదప పానుపు పై పడుకొన్న సత్యను కృష్ణుడు కాళ్ళు నొక్కు చుండగా సత్య ఒక్క తన్నుతన్నెను. కృష్ణుడి కిరీటము ఊడిపోయెను. “ఇటువంటి నాటకము నెందుకెన్చుకొంటివిరా వర్షా!” యని విదిష పరితపిన్చుచుండెను.
తల్పముపై సత్యభామ నొక్కవుదుటున ఉరగాంగన వలే లేచి విస్ఫులింగములను కురిపించుచుండెను ఆమె తళ తళలాడు వస్త్రములందు రజిత కాంతులీనుచూ తలక్రింద చేయి పెట్టి చూచు చుండ, వక్ష, నాభీ రమ్భోరువుల అందము వర్షమై కురియుచున్నది. ఇంతలో అయ్యో శిల వంటి నా శిరమును తాకి నీపాదము కందెనేమోయని వర్షుడు ఆమె పాదములొత్తు చుండెను ప్రముఖ వార్తాపత్రికల పాత్రికేయుల సమూహము అచ్చట మోహరించి ఛాయా చిత్రములు గ్రహించుచుండిరి.
కృష్ణుని గాన మాధుర్యము సత్యభామ సౌందర్యమున రసహృదయములు తడిసి ముద్దయినవి కదా! అని ఒక పాత్రికేయుడు ప్రశంసించ బసవడు లేచి తన ఆశుకవితా ప్రతిభను చూపి గట్టిగా పద్యమును పాడెను.
రంగస్థల మంతయూ బహుళ కాంతులు
భాసిల్లు చుండ గా నొక్క కాంతయే కాంతి
నంతయూ గొని కుందన చందము తుల
కరించ కన్నార్ప మరిచె కళామందిరము
అదిచూచి అగస్త్య కూడా సత్య అందమును పొగిడెను బసవడు ఒంటిగాడు అతడెట్లు పాడిననూ పట్టిం చుకొనువాడు లేడు. సత్యభామ అందమును పొగిడిన అగస్త్యకు తగిన బహుమతి లభించెను. లకుమ అతడి పాదమును తన కాలితో గట్టిగా అడిచెను. అది గమనించిన రాఘవుడు బసవడితో “పచ్చడైపోయి ఉంటాది నాకొడుక్కి కామన్ సెన్స్ లేకపోతే ఇలాగే ఉంటాది మరి. అని నాలిక కరుచుకొని " ప్రియురాలివద్ద పరస్త్రీని పొగడరాదని ఇంగితముండవలెను " అని భాషాప్రక్షాళ న గావించెను.
కన్నె తన రాముడితో గుసగుసలాడు చున్నది. అని అరుణతార కనిపెట్టి మాలినిగారికి జెప్పిరి. " వారు శోభనం మధ్యలో వచ్చినారు. వారికి ఒక విరామము నడుచుచున్నది అని మాలినిగారు అనిరి. డయానాకు ఇదంతయూ చోద్యము వలె ఉన్నది.
మాలినిగారు అనేకమందిని రంజింపజేయు తనకొడుకు నటనని చూసి , శృంగార రసమును ఆస్వాదించుచున్నారు " ఇది చూసిన నా పెళ్లి అయినా కొత్త రోజులు గుర్తుకొచ్చుచున్నవి. వారు చాలా మెత్తన. చిన్న తప్పు జేసినా దండించువరకూ ఊరుకొనువారు కాదు వారిని నేనునూ ఇట్లే దండించితిని " యని సిగ్గుపడుతూ చెప్పెను. మా వారిదంతయూ మోటు సరసము , మీ ఆయన వాలే మెత్తని మనిషి కాదు . మూడు రాత్రులు మాత్రము నాదే పైచేయి గానుండెను.
విదిషకు అస్థిమితముగా నున్నది " ఇట్లాటి నాటకములుతప్ప ఇంకేవీయూ లేవా ?" అనెను " మంజూష నవ్వుచుండెను. అప్పుడు కృషుని నారదుడు విపణికి కొనిపోవు దృశ్యము నడుచుచున్నది.
“భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు త్వరన్ గొనుడు సుజనులార” యను పద్యమునఆలాపించుచూ కేశవుడు (నారదుడు) వర్షను (కృష్ట్నుని) సంతలో అమ్ముటకు కొనిపోవుచుండెను. మాలినిగారికి అది జూడకన్నుల పండుగగాయున్నది. “ఈ పద్యములన్నీ వర్షుడు ఒక్కనెలలో వ్రాసెను” అనిరి. అప్పుడు అరుణతార “ఈ నాటికను కేశవదాసు గారు నాలుగు సంవత్సరములు వ్రాసినారు. వర్షుడు ఒక నెలలో వ్రాయుట అద్భుతము. ఎంత కమ్మని పద్యమో కదా! గానము కూడా అద్భుతముగా నున్నది. కేశవుడికి లభించిన శిక్షణ అత్యద్భుతముగానున్నది. వర్షుడు కేశవునిశిల్పమువలె తీర్చి దిద్దెను. నాతొ గొనిపోవలెనని యోచించుచున్నాను” అని మాలినితో అనెను. అతడికేమైననూ చేయవలెనని .. అని అరుణతార అనుచుండగా మాలిని వలదని సైగ చేసిరి “అనేక మంది జీవితములకు పూల బాట వేసిన అతడికి ఏమీ చేయలేకున్నాము.” “అతడు తన కాళ్లపై నిలబడువాడే కానీ ఇతరుల సాయము తో తన జీవితమును నిలబెట్టుకొనుటకు ఇష్టపడడు.”
అట్లు నారదుడు కృష్ణుని తరలించుకు పోయిన పిదప సత్య భామ చింతించూ విలపించుచుండును. చూడుము రంగ స్థలమున సత్యభామా విలాపము. ఈ దృశ్యము ఐదు నిమిషములుండును. పిదప రుక్మిణిని పిలుచుకొచ్చు దృశ్యము అనగా పది నిమిషములు వర్షుడు అలాకారాగృహమందుండును. అని మంజూష విదిష తో అనెను. ఆ మాటలు కన్నె చెవిన పడినవి.
రంగస్థలమున జరుగు దృశ్యములకు సమాంతరంగా తెరవెనుక రెండు దృశ్యములు జరిగినవి
అగస్త్యునకు గుద్దులు , వర్షునికి ముద్దులు
డయానా అగస్త్యుని కవ్వించి అలంకార గృహమువద్దకు కొనిపోయెను. అచ్చట ఒక గదిలో వర్షుడుండెను మరియొక గాడి ఖాళీగా యున్నది. అందు డయానా ప్రవేశించెను. అంతక ముందే గదిలో రోమి కన్నె ఉండిరి. కన్నె తలుపులుమూ యగా అగస్త్య డయానా వైపు అయోమయముగా చూచు చుండెను " ఇటు చూడుము అనుచూ కన్నె " నీ తల్లి రోయపురము మురికివాడనందు కడు దయనీయ పరిస్థితులలో నుండగా నీవు విలాసజీవితము గడుపుచున్నావు.” అనెను. “అటులనా? అది చెప్పుటకు ఇంత దూరము రావలెనా ?” అని ఇంకనూ పని యున్నది అని చెప్పుచూ కన్నె సివంగివలె పైబడి పిడిగుద్దులు గుద్దెను. ఆ శబ్దములు బైటికి వినిపించుచున్నవి.
పక్కనే వున్న వర్షుని గదిలోకి విదిష ప్రవేశించుచుండగా మంజూష “కసితో చెలరేగుచున్నట్లున్నావు ప్రక్కగది నుండి గుద్దులు వినిపించు చుండగా అటు చేయి చూపుచూ అటువంటి పని ఏమైనా చేతువేమో ..
ఉ. పొచ్చెము లెన్నడే యతడు వీగియు కోపము చూపడె ప్పుడూ
ముచ్చట దాచిలో కమున భాసము పంచుచు ధర్మబు ద్ధితో
పచ్చగ లోకమే వెలుగు మార్గము కోరుచు సాగుసూ రిన్
వెచ్చగ బేటము తొలగ ముద్దిడు నచ్చిన మెచ్చులా డివే!
బయట నిలచిన మంజూషకి రెండు గదుల నుండి వచ్చు శబ్దములు వినిపించుచున్నవి. ఒక గదినుండి ముద్దుల శబ్దములు మరొక గది నుండి గుద్దుల శబ్దములు వినిపించుచున్న మంజూషకు ప్రేమానురాగములు ముప్పిరిగొన్నవి. ఇంతలో రెండు దృఢ హస్తములు ఆమె నడుము పై వాలినవి. ఉలిక్కపడిన మంజూష వెనక్కితిరిగి అది తన ప్రియుని చూసి అతడి కౌగిట వొదిగెను. అతడు మంజూష కుసుమ లావణ్యములను తడుముచుండ ఆమె సిగ్గిల్లి అతడి నల్లుకొనెను. ఆమెను బిగి కౌగిట బంధించి ఆమె ఆధార సుధలను గ్రోలెను. కొలది సమయము తర్వాత విదిష బైటకు రాగా వారిద్దరూ తిరిగి తమ స్థానములు జేరుకొనిరి.
అగస్త్యుడు క్రింద పడిపోగా రోమి కూడా రెండు తగిలించెను. వారు తిరిగి పోవుచుండిరి " నేను అగస్యుని కొట్టుటకు కారణముంది మరి నీవెందులకు కొట్టినావు అని కన్నె రోమినడిగెను " నా శోభనం సర్వనాశనము జేసినతడిని కొట్టక ముద్దాడ మందువా?"
అనెను " నామనసిప్పుడు ప్రశాంతత నొందెను, హోటల్కి పోయెదము పదము." అని కన్నె అనగా దంపతులిరువురూ నిష్క్రమించిరి. డయానా మాత్రము వెనుదిరిగి వచ్చి తన స్థానమందు కూర్చొని అడిగిన వారికి " వారు అత్యవసర మైన పనిబడుటతో హోటల్కు బోయినారు" అని చెప్పగా వారు అర్ధము చేసుకొని నవ్వుకొనిరి.
ముఖ్య పాత్రలన్నీ ఒక చోట చేరడం కనులవిందుంగ ఉంది. విదిష దైవజ్ఞురాలు అయి కూడా వర్ష విషయంలో పసి పిల్ల లాగా మారుతుంది.పద్యములు మీ విద్వత్తుకు నిదర్శనం.
ReplyDelete♥ filled. You are messenger of sanatini. 🚁
ReplyDelete.Description of stage movements of actors and 2. their feelings, 3. reaction of all characters with their characteristic features 4.vidisha'power of Telepathy 5. Angayar 's pledge (to punish Agastya) 6. Kesava 's new friend Ranjini 7. Have you noticed Manjusha ? These are the seven hues of the episode.
ReplyDeleteStage movements of actors are amazing.Description of satyabhama and varsha as krishna is superb.I could not guess vidisha has such type of power.Manjusha's love, introduction of Ranjini , punishment to Agastya by Angayaar every thing unexpected.
ReplyDelete