విదిష లతిక లలంతికా భూషిత స్ఫార వైభవ భవంతిలో బ్రాందా (బాల్కనీ) నుండి వూరును చూచుచుండెను. సబ్బవరం ఊరంతయూ నారగుడ్డ పై గీచి తైలవర్ణ చిత్రము వలె కనిపిం చుచుండగా ఆమె గతమోహ చింతాశీలతలు గాలి వానలవలె ఆమె మనసును ముసురు కొన్నవి. ఒకనాడు తన తండ్రి నుంచిన ఆసుపత్రి దూరముగా కనిపించుచున్నది. ఆనాడు బైరెడ్డి తరుముకొచ్చినప్పుడు తానే భవనమందు దాగి తప్పించు కొన్నదో, అదేభవన మందు నేడు నివసించు చున్నది.
సన్న మరియు లావు గా ఉన్న ఇద్దరు ఆ భవనంలోకి వచ్చుచు చున్నారు.
సన్నవాడు : శేషాచలముగారు ఈ భవనమును చక్కగా ఎంపిక చేసుకొని వచ్చిన వారిని విచారించి , వివరములు, విషయము (డబ్బ) సేకరించి విదిష వద్దకు పంపుటకు పెద్ద యంత్రాగము నిర్వహిచుచున్నారు. ఆ పాత ఇంట నుండిన చో వచ్చువారికి సౌకర్యము కల్గించుట డంబమును జూపుట కష్టమని ఊరిలో కెల్ల అతి పెద్ద భవంతిని అద్దె కు తీసుకొని పెద్ద మొత్తమును చెల్లించుచున్నా రు. పెక్కురనుచర గణమును కూడా పోగుజేసినా రు. ఇంటికి అంతః బాహ్య అలంకరణలతో సౌందర్యమును , వాహనములతో , నౌకర్లతో అంతస్థు ను పెంచుకొని ఒక జమీందారు వలె వెలుగుచున్నా రు. ఇటువంటి వారిని ఆంగ్లమున బిగ్ షాట్స్ అందురు. లావు వాడు : బిగ్ షాట్స్ అనిన నేమి ?
ఈ లోగా శేషాచలముగారి ఇన్నోవా వీరిని దాటుకొని భవనములోనికి పోవుచూ లావు వాడిని రాసుకొని పోయెను కారు ఆగి శేషాచలము గారు దిగిన పిమ్మట లావు వాడు అతడి వద్దకు ఉదుటున బోయి నమస్కరించెను
సన్నవాడు: ఇదే వేరొకరి సైకిల్ రాసుకొని పోయిననూ ఊరుకొనక యాగీ చేతువుకదా ఇప్పుడేమి జరిగెను. బిగ్ షాట్స్ అనగా ఇప్పుడు అర్ధమయినదా వారేమి జేసిననూ మనము మిన్నకుండవలెను .
మెడపై నుండి విదిష పల్లె సౌందర్యమును తిలకించుచున్నది. ప్రకృతికాలవాలమైన పల్లెలందు జనావాసములు పెరిగి మెడలు దిప్పిన మేడలు దప్ప వృక్షములు కానరాకున్నవి. కటకటా! కొబ్బరి తురిమినట్టు కొండలను తురుము యంత్రములు వచ్చినవి పాశ్చాత్య నాగరికతా విడంబమున పల్లెలు ఎంతగా మారిపోయెనో! చూచు చుండగా పల్లెమాయమాయె తెల్లవాడిమాయ తెలుసుకొను లోగా, కట్టుబట్ట మారి బొట్టు కూడ చెరిగె. ఇట్లు విదిష తాత్విక తలపులకు తలుపులు తెరిచి తత్వ, భౌతికలోక వలమాన చిత్త శీలతనొంది యోచించుచుండ..
తే. సొబగులు గాంచి సంత సింతు రుపిల్ల
బుద్దులు గాంతురు బుదులు బోసొ బగుల
మూలము లుమరి బోధింతు రుగురు తుకొన
గురుతులు వారే గురువు లమర కోవిదుల్
ఆ. ముఖము నకోతలు వాతలు గాట్లు కుట్లు
పెట్ట మనుచు పట్టు పట్టి నటీ
మణులు శస్త్ర వైద్యము నొంది మార్తురు
ముఖము, మారు మిద్దె మేడ లట్లే
ఈ పల్లెమేలి సొబగులు గాంచిన బుదులెవ్వరైననూ పూర్వామరమయినదని(తూర్పు పడమర అయినదని) ఇట్టే గ్రహింతురు. బుద్ధి వికాసము లేనివారు మాత్రము పైన కనబడు దృశ్యములు మాత్రము జూచి యానందింతురు. అనూహ్యమైన మార్పులు గాంచి కోవిదులు పల్లెలు పడమర నాగరికతా గుర్విణ్యుదర (గర్భిణీ ఉదర) వాసములాయె నుడివెదరు.
నటీమణులు ముఖ సౌందర్యోద్దారణకు శస్త్రచికిత్స జేయించుకొన్నట్లు పల్లెలు యందున్న పెక్కు ఇళ్ళు భవనములు, ముఖములు మార్చుకొని, వేష గాళ్ళవలె కొత్త రంగులు పూసుకొన్నవి.
రెండు వర్షము లాయెనే టికీవూ
రెంత మారిపో యెనోమరి ఇంతలో.
కొండల నడుమ కోనల మధ్య
కుటీర మందు గీసితి బొమ్మలు
చెట్లు గొట్టిరి చాలదా రులుపెంచి
అట్లే జేసిరి అభివృద్ధ నితలఁచి
ఈదరి కొచ్చి అమ్మగ మారితి
మరిచి తినాకళ వీడెగో మాత
నగ్న నర్తకి నర్తన జేయుచూ
పట్టప గలుడు పులుజార్చి వేసె
అహల్యగారు పోయిన రెండేళ్లలో వూరు చాలా మారిపోయెను. వూరంచున కొండల్లో కోనలో చిత్రకళా సాధనలో నుండెడి జీవితము నేడెంత మారిపోయెను , నేనెంత మారి పోతిని. అమ్మలేదు, బొమ్మలు లేవు , బొమ్మలపై ధ్యాసలేదు. ఇచ్చటికి వచ్చిన పిదప గోమాత కూడా వెడలిపోయినది. బొమ్మలు గీయు నేను అమ్మ ను పోగొట్టుకొని అమ్మ (గ్రామదేవత) గా మారితిని
రహదారులు విశాలమైనవి మనసులు మాత్రము ఇరుకైనవి. ధామములు, వసతులు, వాసములు, కొంపలు అన్నియునూ ముఖ చ్ఛేదనము బొందినవి గృహములు తొలగి కూటపు గృహములు( apartments) ఇబ్బడి ముబ్బిడిగా వెలసినవి. నటీమణులు సౌందర్యోద్దరణకు శత్రవైద్యము జేయించుకొన్నట్లు పల్లెలు యందున్న పెక్కు ఇళ్ళు భవనములు, ముఖములు మార్చుకొని, వేష గాళ్ళవలె కొత్త రంగులు పూసుకొన్నవి. ధర్మ సంకరమొనర్చి నొసట తిలకము నున్మూలించినట్టు ఆధునికత నక్కున జేర్చుకొని జనులు “ మసకచీకటి నర్తన శాలలో నగ్ననర్తకి (కేబరే డాన్సర్) ఉడుపులు క్రమ క్రమముగా జారవిడిచి నట్లు” సంప్రదాయములను ఉన్మూలించిరి.
పచారులు జేయుచున్న విదిష వద్దకు ఒక పరిచారిక వచ్చి సత్తిరాజు గారు వచ్చుచున్నారని తెలిపి బోయెను. విశాల విలాస భవంతిలో విదిష తయారగుటకు తన శయన మందిరమునకు బోయెను. పావుగంట వరకు రావలదని మరొక చెలికత్తె ఆమెకు వర్తమానము నిచ్చెను. వేచి యుండినచో మనకు గౌరవము కాదు కదా యని తండ్రితో అన్న మాటలు గుర్తుకు వచ్చినవి " గౌరవము కాదు గాని ప్రతిష్ట అగునుకదా !" అని అతడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి విదిష దైవ ప్రార్ధన జేసుకొనుచూ గడుపుచుండెను
వేచియుండు గదిలో కాఫీ సేవించుచూ కొద్ది మంది సంవాదము నెరుపుచుండిరి.
కొత్తగా యొకడు వేచుండు గదిలోకి ప్రవేశించు చుండగా శేషాచలముగారి అతడి కెదురేగి తన గదికి లోకి గొనిపోయినారు. అతడిని చూపుచూ ఒకడు…
“అతడు అనేక అక్రమాలు జేసి అక్రమాస్తులు కూడబెట్టిన అక్రమార్కుడు ఆర్థికశాఖా మంత్రి బంధువు. ఇప్పుడు అనేక వ్యాజ్యములు మెడకు చుట్టుకొనగా అతడు యజ్ఞ యాగాదులను పరిష్కారంగా ఎంచుకొని సాదు యోగి పుంగవులను, మహిమాన్వితులను కలిసి రహస్య మంతనములు జరుపుచూ తనను గట్టెక్కించమని వేడుకొను చుండును.”
రెండవవాడు: అటువంటి వారిని చేరుకురసము పిండినట్లు పిండుచూ శేషాచలముగారు ఆర్ధిక ప్రగతినంది. కూతురిని కూడా అట్లే పిండు చున్నాడు. అది మిక్కిలి బాధాకరగా నున్నది
ఒకటవ వాడు: “ఏమి చేయగలరు తప్పినది కాదు ఎవరైనా ఇట్లే చేతురు. నీకేమి నొప్పి కలిగెను? అతడు తన కూతురి మంచి కొరకే కదా ఇంత జేయుచున్నది , తానేమైనా నెత్తిన గట్టుకొని పోవునా?
మూడవ వాడు : నాకూతురికి ఏ నెల లో వివాహమగునని చెప్పె నో అదే నెలలో వివాహామాయెను. చాలా మహిమ గల తల్లి అందుకే పెక్కు మంది ఇచ్చటికి వచ్చు చున్నారు నా బిడ్డ ఉద్యోగ విషయమై ఇచ్చటికి వచ్చి యున్నను. వారి స్వంత విషయములు మనకేల మన పని మనము చూచుకొన వలెను అని చెప్పుచుండగా శేషాచలముగారు వచ్చి (అతడు ముఖ్యడు కానందున) శని వారము రావలెనని సూచించిరి.
శేషాచలముగారు వెడలిన పిదప అతడు కొద్దీ నిమిషములట్లే ఉండి
మూడవ వాడు: నేను ముఖ్యుడిని అయియున్నచో వీడు నా కాళ్ళు పిసుకువాడే , నేను మొన్న తెచ్చిన సంబంధము వలదని తన బిడ్డకు ఇప్పుడే పెళ్లి చేయనని చెప్పినాడు, తన విదిషమ్మ బాల్య స్నేహితుడు ఒక పండితుడు గలడు అతడిని అడ్డు పెట్టుకునే ఈమెను బందించి నట పబ్బము గడుపుకొనుచున్నాడు .
నాల్గవ వాడు : అటులనా ? వాడు నాకు తెలుసును కానీ వాడింత దొంగని తెలియదు
ఒకటవ వాడు: రామ, రామ! అతడు ధర్మాత్ముడండీ ఈమె తండ్రి వలదన్నచో అతడు గడపైన తొక్కడు. అతడిని నిరోధించ వలెనన్న చలంగారికొక్క మాట చాలును. కానీ పాపము ఈ యమ్మ తండ్రి ని ఆ మాట అనకుండునట్లు చూచుకొన వలెను.
రెండవవాడు: అతడు వచ్చిన ఈ శేషాచలం లేచి నిలబడి నమస్కరించును
మూడవ వాడు: చాల్లేవయ్యా వీడిదంతా కపట భక్తి , అని అతడు బయటకు బోయినాడు.
Sir, telugu padalu chusi chala సంతోషం కలిగించే. ఇట్స్ really awesome
ReplyDelete