Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, October 12, 2020

Bharatavarsha 49

  విరులు ధరించి    పల్లవి   వొడల్వి    రవంగ     పిసాళి    సొంపులే   

        లు,   విలాసి   నిప్రవ   చంద    ముగాంచి  దరత్తు దూఁకొను న్

        రుణ   వసంత  భావము  రాన    సరాగ      ముప్రభ   విల్ల గా

        కురియ  దెయామి నొయ్యన టాక్ష    సుమాల   హరిద్ర    పండగా.  





 చ.   విరులు ధరించి మాలతు లువిందు లుజేయ  చుగుప్పె  తావులన్    

        అరలు,   విలాసి   నిప్రవ   రహాస    ముజేయ   దరత్తు దూఁకొను న్

         మెరియు  చుకౌము  దికాంతు  లవిచ్చి  సుమాల సుగంధ  మొల్కగన్  

        తరుణ   వసంత  భావము  లుతాక   నరాలు   నుబుట్టు  రాగముల్      

 సబ్బవరం నుండి స్వగృహమునకు వచ్చిన వర్షుడు ప్రవేశద్వారం వద్ద నిలిచి వీధి దీపపు కాంతిలో రాధామనోహర లలిత సౌందర్యమును జూచి పరవసించుచూ  “నేడీ విరులేల మరులుగొలుపుచున్నవి? మరుని శరముల బోలి అడరుచూ మోహరించి (చెలరేగుచూ చుట్టుముట్టి)  యామినికే మోహమునొసగుచున్నవి.  "విరులు ధరించిన పల్లవములు   విందులు చేయుచు తావులు గుప్పగా పూలు ధరించిన చెట్లు విలాసిని వలె నవ్వు చుండగా  చూచి (దరత్తు దూఁకొను) అంతఃకరణము  ఆస్వాదించును.    మెరియుచున్న కౌముది కాంతులలో  పూలు      విచ్చిన  సుగంధాలొలకగా ,  (తరుణ భావములు ) యవ్వన భావాములు నరాలను తాక నరాలు రాగాలు పాడును.  



యామిని జ్వాలలో కాగిన ఆర్యుడు యామిని రుచిర ధారలందు తడిసి లోపలకు బోయెను. ఇదంతా కిటికీనుండి చూచుచున్న కేశవునకు అబ్బురంగా నున్నది. వర్షుడు స్నానమునకు బోగా కేశవునకు మంజూషకు మధ్య గుసగుసలు, కిస కిసలు  నడిచినవి. ప్రక్కగదిలో నున్న మాలిని గారికి కిస కిసలు  మాత్రమే వినబడి వారిని మందలించగా వారి గొంతులు సద్దు మడిగినవి. వర్షుడు స్నానమాచరించి  వచ్చెను మాలినిగారు వడ్డించుచూ “ఈ కావ్యము ఎప్పటికి ముగియునో , అహోరాత్రములిట్లు పనిజేసిన నీ ఆరోగ్యమేమగును ? 

వర్ష: ఈ రాత్రికి కావ్యరచన ముగియును. రెండు దినములు  నేను కాలేజీకి బోవలసిన పనిలేదు , రేపే భాగ్యనగరమున భానోదయ నాటక పరిషత్ వారు నిర్వహించు తులాభార నాటకమును ప్రదర్శించబోవుచున్నాము.  కాలేజీకి అని మాటనుచున్నప్పుడు అతడి గొంతు వణికెను

మాలి:నేటి సాయంత్రము భానోజీరావు గారు విశాఖ పట్నము వచ్చి తిరిగి భాగ్యనగరమునకు బోవుచూ అరుణతారగారిని  ఆహ్వానించగా ఆమె అంగీకరించిరి. ఆమె రేపు  ప్రదర్శన చూడ వచ్చు చున్నారని చెప్పెను. 

మంజు:  అరుణతారగారిని నీవే ఆహ్వానించక పోయినావా?

వర్ష: బహుచక్కగా చెప్పినావు , పద్దతనున దుండవద్దూ! నాటక పరిషత్ స్థాపకుడు భానోజీ , ఆహ్వానముల సంగతి అతడే చక్కబెట్టుచున్నాడు. 

మంజు: అందరినీ ఆహ్వానించులో  లేదో ..  

కేశవ: ఆ సంగతి నీకెందుకమ్మా అతడు చూచుకొనును , మేము మా పాత్రలువరకు జూసుకొనెదము , ఇంకా నయము ఆహ్వానితులకు ఏర్పాట్లు కూడా చూడమనేదవేమో ఆచార్యుని స్థాయి నెరిగి చెప్పవలెను.

మం జు:  శివాలెత్తకయ్యా కేశవా, నీ మట్టి బుర్రకు అర్ధముకాకున్ననూ వర్షకు అర్ధము కాకుండునా ?  కొందరు  ముఖ్యులని  మరచిన వారికి ఎగ్గగునేమోయని…

మాలి: నీవు ఎందులకిట్లు మాట్లాడుచున్నావో నాకేమీ అర్ధముకాకున్నది.  వర్ష కృష్ట్నుని పాత్ర   వేయుచున్నాడు , కేశవుడు నారదుని పాత్ర వేయుచున్నాడు నీవు కూడా ఏదైనా పాత్రవేసినచో బాగుండెడిది.

మంజు:  నీకర్థము కాకున్ననూ అర్ధమవ్వ వలసిన వారికి  అర్ధమయినచో అదియే పదివేలు. అని అన్నవైపు బేల చూపులు చూచుచుండ 

కేశవుడు : నాకు స్ఫురించెను అని గట్టిగా అరవగా 

భారతవర్ష " నారదు వేషధారికి ఆ బుద్దులుకూడా అబ్బినవి. నేను కావ్యమును ముగించి నా పాత్ర నొకసారి సరిచూచుకొనవలెను అని  వర్షుడు భోజనము ముగించి తన మందిరము నకేగెను. 

మాలి: నీకేమి స్ఫురించెను చెప్పారా కేశవా నాదగ్గరా నీ దాపరికాలు?

కేశవ : నాకు స్ఫురించినవి నాటక మందు నా పద్యములు " బలే మంచి చౌక  బేరము  అని పాత్రోచిత గానము చేయుచూ  వర్షునికడకు బోయెను.

మాలి: ఎప్పుడు విధి అనుకూలించునో  వీడికి ఎప్పుడు మంచి రోజులువచ్చునో కదా!

మంజు:  ఆచార్యునకు  మంచిరోజులని, చెడ్డరోజులని ఎంచవలసిన పనిలేదు , అన్ని రోజులూ ఆయనకు మంచిరోజులే చేరవలసిన  గమ్యమునే కాక మార్గమును కూడా వీడ నొజ్జ  గూర్చి విచారింప పనిలేదు” అనెను. 

 మాలి:  వాడికి రాత్రి నిద్రకరువాయెను ఈ కావ్యము పూర్తి అయినచో కొంత ఊరట" 

మంజు:  ఈ కావ్య రచనారంభించి  నేటికీ ఆరు నెలలు అయినది, దినమంతయూ  శారీరక శ్రమ పథమున అలసి  రాత్రి యందు బౌద్ధిక శ్రమ పథమున నడుచు వర్షుడు కావ్య రచనను ఒక దీక్షగా తీసుకొనెను. 

మాలి:  (అశృనేత్రములతో) అయ్యో వర్షుడు చేయు పని నీకెట్లు తెలియును?

మంజు:  పిచ్చి తల్లి నాకు తెలిసినందుకా  ఏడ్చుచున్నావు  , నేను నీ రక్తము పంచుకుని పుట్టిన బిడ్డను కానా, నావద్ద దాపరికమెందులకు నాడు నీవు గంట్యాడ పోయిన నాడు నీవెనుకనే నేను వచ్చితిని. నీవు కూర్చున్న గుడారమునకు కొద్దీ దూరములో, నిర్మాణ సామాగ్రీ కలదు. అచ్చట  మండుటెండలో  కూర్చొని నేనునూ చూచితిని. 

మంజూష: తల్లి కన్నీరు తుడిచి ఓదార్చి నాకంతయూ  తెలియును. నాగిరెడ్డి చుట్టము పెంచలయ్య వర్షుడు ఈ వూరొదిలి దేశములు పట్టిపోవునని , పోవలెనని పన్నాగము పన్నగా వర్షుడు వాడి ముందే వాడికి చెంపపెట్టువలె ఎదుగుటకు ఇచ్చట యున్నాడు. 

వర్షుడు ఏనుగు కుంభ స్థనమును కొట్టుటకు సమాయుత్తమగుచున్నాడు పాలనాధికారి పదవికి పోటీపరీక్షలుకు చదువుచున్నాడు.  వాడు అజేయుడు అనుకొన్నది సాధించక మానడు. నీవు వాడి చింత వీడి కోడలునుంచి కట్నము ఎంత వలయునో , ఎట్లు వసూలు చేయవలెనో యోచింపుము.

నీవు ఇంత గడుగ్గాయివి అని నేనెరుగను. అయిననూ కట్నము పేరుతో వారిని దోచుటెందులకు ?

మంజు: ఎందులకా , ఆ శేషాచలం ప్రజలను దోచుచున్నాడు కనుక 

మాలి:  తండ్రి అట్లు యు చుండెను గానీ,  పిల్ల బంగారం   పాపం వట్టి అమాయకురాలు

మంజు: అయ్యూ పిచ్చి తల్లి , ఆవిడ ఎంత జాణో  నీకు  ఎట్లు చెప్పవలెను అని అనుచుండగా భారతవర్ష కావ్యము పూర్తి అయ్యెనని తల్లి పాదములకు నమస్కరించెను. 


 

1 comment:

  1. పద్యము చాలా బాగుంది. ఆచార్యునికి మంచి రోజులు చెడ్డ రోజులని ఉండవు.అన్నీ రోజులు మంచివే.అన్నీ రోజులను ఒకేలా చూడగలగడం, తాను కష్ట పడుతూ కూడా నమ్ముకొన్న వారిని జాగ్రత్తగా చూసుకోవడం కొందరికే సాధ్యమవుతుంది.

    ReplyDelete