సమయము నాలుగు గంటలు అగు చుండగా విదిష ముక్కంటి దర్శనమునకు శివాలయమునకేగుచుడెను. పసిఁడి కెంజాయలు పశ్చిమాకాశాన పారాడుచుండ మలయ మారుత సంకాశ తెమ్మెరలల్లన వీయుచుండ, పూసొమ్ములు, పల్లవాదులు సిగన తురుముకొ న్నొక ముద్దబంతి, బంగారు చేలముల, చింగారివలె దూర దేవళము దర్శించ కాలినడకన బోవుచుండెను. దారిన బోవు ఇద్దరు వేద పండితులు, ఒక కోడె పండితుడు ఒక వృద్ధ పండితుడు, విదిషను చూచుచూ ఇట్లు సంభాషించుకొను చుండిరి.
వృద్ధ పండితుడు: “మాతా మరకత శ్యామా మాతంగీ మధు శ్యాలినీ కుర్వాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వాసినీ” అని కాళిదాసు శ్లోకం లో చెప్పినా, జయదేవుడు అష్టపదిలో “రాసే హరిమిహ విహిత విలాసం ..విషాద కదంబతలే మిళితం కలి కలుషిత భయం సమయంతం అని చెప్పినా, శ్రీరంగ కవి గా పేరు గాంచిన బాతులా పేరయ్య శాస్త్రి త్రిపురాంబిక చూర్ణిక లో “కంబవన చారిణీం ముని కదంబ కాదంబినీం. అని చెప్పినా దీనంతటికీ అర్ధం ఒకటే. అది ఏవిటోయ్ శాస్త్రి ?కోడె పండితుడు: అదేంటో నాకు అర్ధం కాలేదు గానీ గురువు గారు, మరాళ శృంగార కేళీ విహారం అని విన్నారా ? అన్నాడు విదిష వంక కామ దృష్టి తో చూస్తూ
వృద్ధ పండితుడు: నేచెప్పేది వింటే దేవతలకు ఇష్టమైనది వన విహారం అని తేలుతుంది.
కోడె : నేను హెప్పీది వింటే ములుగుతుంది , ఆ నత నాభి చూడండి , ఆ చిందులేసే జఘనం చూడండి
వృద్ధ పండితుడు: ఓరి దరిద్రుడా, ఆమె అమ్మరా !
కోడె పండితుడు: ఛ ఊరు కోండి గురువుగారు, ఆమె అమ్మలా ఉందా ? లడ్డులా ఉంది
బహిరంగపథమున జనసందోహమును దాటి శకటయానములంతరించి, జన సమ్మర్దములడిగిన వీధుల పోవుచుండగా ఒప్పుకుప్పలాడు బాలికలు గువ్వకొని ఎడారివాసులు హిమానిని చూచునట్లు అబ్బురపాటున చూచుచుండిరి. అట్లు ముందుకి పోవుచున్న గజగామినిని గాంచి దృష్టిదోషమునకు అగ్గమగునని కొంద రింతులు దృష్టి తీయగా మరికొందరు సీమంతులు త్రోవలోనే హారతినొసగిరి, కొలది దూరమున కూర్చొని యున్న పెద్దలు కొందరు లేచి హస్తార్పణము జేసిరి. అట్లు ముందుకి వెడలిన విదిష తోపులు దాటి మాపటివేళకు శివాలయము జేరి ప్రక్కనున్న కోనేరును మందస్మిత వదనముతో గాంచి కోవెలలోనికి బోయెను. గుడి గంట మ్రోగించి బయల్వెడలి మనో క్లేశమును దింపుకొనుటకు ఆ ప్రశాంత వాతావరణమున, చెంతనున్న కలువ కొలనొడ్డుకి బోయి విశాల రాతి సోపానములపై కూర్చొని, కొలనందు భాసిల్లు ఎఱ్ఱ తామరలను చూచుచుండ ఆమె తామరలందు తామరవలె కానరాగా గండు తుమ్మెదలామెను జుట్టుకొనెను.
కొలనులో ఈదు మీనములను సరసీరుహములను చూచుచూ ఆ సరసిజాక్షి జడత సడలించుచూ విశ్రాంతి పొందుచుండెను. దూరముగా కాలిబాటన సాగుచున్న స్త్రీ పురుషుల లను చూచుచూ గులకరాళ్ళ నేరి నీట విసురు చుండెను. సూర్యకాంతి బడి మెరియుచున్న నీటి అలలను ఎర్రతామర్లను చూచిన ఆమెలో శృంగార భావనలు చెలరేగుచున్నవి, కోవెల ప్రక్కనున్న చెట్ల సమూహములో దుద్దుగ చెట్టుపై పక్షుల జంటను జూడగానే తన జోడు గుర్తుకొచ్చి బుగ్గలు ఎరుపెక్కెను. అంతలో రెండు హస్తములు ఆమె కళ్ళను వెనుకనుండి మూసివెసినవి. విదిషకు వెన్నులొ చలిప్రాకి మేను జలదరించెను.
ఎవ్వరీ నారి ఎవ్వరీ నవవధువు వసివారని పొంకము పసిడి వలె మెరియుచున్నది కలువ సొగసులు కాంచుచున్న ఈ కలువ చెలువము కాంచినచో కలువరేడు దశగ్రీవుఁడు సీతాపహరణము జేసినట్లు విదిషాపహరణము జేయునెమో? విదిష నవ్వుచూ మంజూష తలపై చిన్నగా మెట్టెను. “అబ్బా యని బుర్ర రాసుకొనుచూ కోనేరు మెట్లపై మంజూష విదిష ప్రక్కనే కూర్చుని మెల్లగా చెవిలో “ఇంత శృంగార మొలక బోయుచున్నావు ఈరోజు పెండ్లి చూపులున్నవా?” యని మంజూష అడిగెను. పెండ్లి మొన్ననే మీఇంట జరిగెను కదా వర్షుడు చేసినాడు. అని విదిష సంతులిత స్వరముతో జెప్పుటకు ప్రత్నించిననూ డగ్గుత్తిక పడిన స్వరము సంక్రందనను దాచ విఫలమయ్యెను. రెండురోజులనుండి ఈ చిన్నది అన్నము తిన్నడో లేదో అడుగువారెవ్వరు, ఇంట తండ్రి ఉండెనో లేదో యని విచారించదల్చి సంభాషణ ఉగ్రరూపము దాల్చునని విరమించుకొని “అయినచో నేడు శోభనమన్నమాట , కోనేరు వొడ్డున ప్రకృతి రతి!! హా .. మరీ బహిరంగమగునేమో?” యనుచు మనసును తేలికబరుచు మంజూష హాస్య సంవాదమునకు అనూహ్య విఘాతము కల్గించుచూ విదిష రోదించసాగెను. మంజూష విదిష ననునయించి పోయెదము లెమ్ము అనెను. ఇద్దరూ లేచి ఇంటి వైపు నడవ సాగిరి. “మొఖం చూపవలదని చెప్పిన వర్షుని చూచుటెట్లు మీ గడప తొక్కుటట్లు” యని రోదించుచున్న విదిషనోదార్చ సక్యము కాకుండెను.
దినేషుడు నింగివడు ( అస్తమించు ) చుండ బంగారు కెంజాయలు దిగంతములనలిమినవి. నిర్మలంగా ప్రకాశించుచున్న జీమూత రహిత నీలాకాశము సింధూరమద్దినట్టు బంగారు కెంజాయల పడి మనోజ్ఞముగా. కనుచూపు మేర సువిశాల వ్యవసాయ క్షేత్రముల చుట్టూ కొండలు పచ్చని ప్రకృతి కానరాగా విదిష మంజూషలు అక్కడే యున్న తరగ చెట్టు పై నుండి కూయుచున్న పికమును వినుచు అక్కడ నిలిచిరి. ఈ మనోహర దృశ్యమును చూచుటకు ప్రభంజనుడు (గాలి) పరుగునాపి చూచుచుండెను. నిసంకుడు (నిశ్శబ్దం)రాజ్యమేలుచుండెను
విదిష ప్రకృతి సౌందర్యానికి పులకరించి అనిమేషము ( చేప) వలె చూచుచుండ మంజూష విదిషను తేరిపార చూచి ఈ తీగబోడి మత్తకాశినిని ఎట్లయినది? పిదపమోహినిగా ఎట్లు మారెను ?" అని అనెను. విదిష కు సిగ్గుతో కన్నులు వాలెను. “ఈమనసు వర్షునకులేకుండెను కదా యని వగచుచూ విదిష తన మనసు లోనున్న భావగీతమును బైట పెట్టినది
సీ. ఎఱుగడే చెలికాడు ఈడైన వలకాడు
ఈప్సిత మెరిగి యూ ఈడు మరచి
ఈడైన జోడుని ఎకరంగి పరుపుపై
ఎదురుజూ చుబేలను అదను జూచ
దమరాడె, తోరంపు ధాటితో ఎగఁజిమ్ము
తపనలు, గోముగా దీర్చ రాడె
చెలికాని చెంతకు చేడియ నంపనా?
పూని
మదన వ్రతమే జేయనా?
ఆ. ప్రవరు డేజూడ రూప మందు అధిపుడే
జూడ విద్య యందు, చెలిమి యందు
చక్కని వాడు, చూపుకి చిక్క నివాడు
వలచి నచెలి బిలివ రాని వాడు
వారు ఇంటికిపోవుసరికి చీకటి ముసురుకొనెను. నీకు భవనము వాహనమూ సమకూ రెను కదా ఇట్లు నడుచుటేలా ? తలుచుకొన్నచో నిన్ను పల్లకిపై మోయువారు కలరు కదా! సూర్యుని చూసి స్వేచ్ఛగా నడిచి పది దినములాయెను, ఎక్కడికి పోవలెనన్న కార్లు , ఈ రోజు నా అదృష్టము పండి నాతండ్రి ఇంట లేకుండెను. ఇంక తోట పనులు అప్పగింతలు పెట్ట పోయినాడు. ఇకపై వ్యవసాయము చేయవలదని నిశ్చయించుకున్నాడు.
మంచిదే కదా హాయిగా సౌఖ్యములు అనుభవించుము. నాకే సౌఖ్యములకంటే వర్షుని తోడే సౌఖ్యము నాకు, వర్ష నన్ను వలదు పొమ్మన్న పిదప ఆకలి దప్పికలు నశించినవి
నీకంత విషాదమున మునిగి యున్నచో ఈ అలంకరణ లో ఆంతర్యమేమి ?
ఈ రోజు వర్షుడు వచ్చునని ఆ అమ్మ చెప్పినది.
మంజూష మౌనము వహించెను. విదిషయందు మాలినిగారికి కొండంత నమ్మకముంది ఆ ప్రభావము మంజూషపై యున్నది. అందువలన విదిషను సుతరామూ అనుమానించజాలకుండెను. కానీ నేటి రాత్రి వర్షుడు రానిచో ?"
నేను చెప్పినది అసత్యమని తేలిపోవును లేదా మా అమ్మ అసత్యమని తేలిపోవును. "
ఇంతలో తలుపు చప్పుడు అగుచుండెను. "వర్షునివలె నున్నాడు , పానకంలో పుడకవలె నేను ఇచ్ఛటుండిన మీకు మిక్కిలి కంటకముగా ఆటంకముగానుండును." యని మంజూష తెరచాటున నెక్కెను.
“కోమలాంగీ! కీరవాణి రాగమున పలుకు నీ లావణ్య వీణియా రమణీయ స్వర మందార మాధుర్య మాస్వాదనము చందన చర్చనమే గదా. నేడా చందనచర్చసలిత చిత్తము అచల విచలమై వికలమై విషాదభరితమైనది. నీవు వనమధ్యమున విహరించు నపుడు రాయంచ వలె, పల్లవములు దాల్చి వెల్వడివచ్చినపుడు వనదేవత వలెనొప్పుచుందువు. ధూళిధూసరితభాసిత కుంతలమై సరోరుహోద్దీపితమైన నీ వదనమును రుచిర హాసమేలవలె. అట్టి మధురస్మిత వదనము నేడు విషణ్ణ మైనదన్న అందులకు కారణము నేనే. నిన్ను గాయపరిచితిని అందులకు… వర్షుడు ఇంకనూ మాట్లాడబోవుచుండగా ఆ బింబాదరి అతడి పెదవులను తన మధురాధరముల తో చప్పున మూసివేసి అట్లే యుంచెను. క్రమముగా తనువులు రాజుకొనగా నాడుల విరలీ ఘృత మేరులై పారుచుండ వారు పరస్పర రసనసంజాతామృతమునుగ్రోలుచూ కొద్దీ క్షణములు అట్లే విగ్రహములవలె యుండిరి.
నీవు ధన సహాయాము చేయుచున్న సంగతి మీనాన్నకితెలిసినచో మన రెండిళ్ళ మధ్య ఉన్న సంభందము పూర్తిగా చెదిరిపోవును. అందులకే నీవానాడు చేసిన సహాయాము తిరస్కరించితిని. అను సందేశమతడి గుండెను తాకినామె గుండెకు తెలియ వచ్చెను.గడియలువేసిన గృహమున కొద్ది ఘడియలు ఇరుహృదయములట్లే కొట్టుకొనుచుండెను . చెవులు రిక్కించి వినుచున్ననూ ఏమియునూ వినరాక మంజూష కలవర పడి తొంగి చూచెను.
సరసీరుహములతో సరసమాడు సరసిజాక్షి తన ప్రియునితో సరసమాడుచున్నది. ఆ బింబాదరి తన మధురాధర ములను నవవధువు వలె అతడి పెదవులకప్పనము జేయ అతడు మధుపమువలె నామె అధరామృతమును గ్రోలుచుండెను. అంత యా గుబ్బలాఁడి తన బంగారు కలశములను వర్షుడి ఉక్కు చాతి కదిమి యాతడి కుత్తుక చుంబించుచుండెను. అంత మితభాషి యని పేరుగాంచిన వర్షుడు నోరువిప్పి “ నీ ద్రాఘిష్ఠ కేశములు ప్రవహించు జలపాతముల”ని మెచ్చు కొనుచూ ఆమె కురులనాఘ్రాణించుచుండ లిప్తపాటునా జాణకత్తె కురులు విప్పి అతడి చేతికందించెను. జలపాతముల క్రింద స్నానము చేయునట్టు వాటిని మొఖంపై పడవేసుకొని ముద్దాడి కురులవెంబడి చివరలు దాకా చేతిని జార్చుచుండ యాతడి చేయి యా నితంబి జఘన సీమన జీరాడు కుంతలముల స్పృశించి బిగువారు స్పార నితంబములను పరిగొన యా నీలోత్పల (నల్ల కలువ) శతశకట యాన సంకాశ విద్యుల్లతా ప్రవాహానుభూతి తనువెల్ల కుదపగా సొక్కి అతడి తోరపు బాహువుల పల్లవము వలె కంపించుచూ, ఆ మరుని బిగికౌగిట రతికూజితముములు పల్కుచుండెను. పొంగుచున్న పయోధరములు ఆమె పైటను నెట్టివేయ ఆ బంగారు గుబ్బల అందము అతడి ముఖమంతయు ప్రసరించెను. అతడి ఓష్ఠములు ఆమె నతనాభి సౌందర్యమును చుంబించినవి. ఆ చుంబన స్వనము విని తెరచాటునున్న మంజూషకు శృంగార రసానుభూతి అతిశయించ స్వల్ప అసంకల్పిత కిలకించిత మొనర్చెను. మంజూష చేసిన స్వల్ప అసంకల్పిత శృంగారస్వనము కర్ణభేరికి తాకినంతనే క్షణ కాలము లాహిరిగొని పట్టు తప్పిన వర్షుడు చేతనాహారక ఔషధ(sedative) ప్రభావము నుండి బయటపడినట్లు బాహ్యస్మృతిని పొంది ఆమె కౌగిలి వైదొలగుచుండగా ఆచ్చదనా రహిత వక్షోజము నకక్షత మాయెను. నీ దుర్వార శృంగార స్వైరము ఉదంచనమగు చున్నది నేను బొయివత్తును నాగురించి విచారించవలదు. యని ద్వారము వరకు వెడలిన అతడిని విదిష అనుసరించెను.
కుంకుమ వ్యాపించిన యున్న ఆమె పాలభాగముతో జారిన కురులను ముడవక, చెదరిన పైటను చక్కదిద్దక, వెంట నడిచిన మోహిని పైయెదను తేరిపార జూచి “నిండైన రూపముతో నింపెసలారుచున్నవవి కుచములా, అగములా? సన్నని కౌనుచూడ మదిలో కింజల్కమే మెరియు, నతనాభి(లోతైన నాభి) చెన్నలు జూడ కన్నులే చెదరు, సైకతముల సవాలు జేయు ...? ఆపై వినలేక మంజూష చెవులు మూసుకొనెను.
తలుపు మాసిన విదిష ను మంజూష " ఆరడుగుల మనిషిని వంచివేసినావు ఎంత జాణవే నీవు " ఇందు నాజాణతనమేమున్నది "ఎంతవారులైనా వేదాంతులైన గాని ".. యన్న నానుడి వినలేదా యనుచూ మంజూషను కవ్వించెను " "అయినా ఇంతక తెగింతురా ఏమామాటలు ఏమాచేష్టలు? నాది కాదన్నట్టు శరీరమంతయూ అప్పగించుటయేనా?"యని మంజూష దాడి చేసెను. “అప్పగించవలసి వాడు దొరికినచో తప్పదు కదా, పడకగదిలోకి తొంగిచూచుట ఎందులకు పిదప వగచుటెందులకు ? ఆయ్యూ పాపము! ఊష్టమొచ్చినట్లు వొళ్ళు ఎట్లు కాలిపోవుచున్నదో ? ఈ రాత్రికి నిద్ర పట్టునా ?” “నాసంగతి అటుంచుము నీవంటి ఆడది కోడలుగా ఇంట అడుగిడినచో నీ రతి కూజములకు నీ అత్తకు నిత్యమూ శివరాత్రే.”
అట్లు వారు సరస జగడ వినోదమునాస్వాదించుచుండ " ఇంత చిచ్చర పిడుగుకు తండ్రి వద్ద భయమెందులకు ? అని మంజూష అడుగగా "నా తండ్రి వలదన్నచో వర్షుడిటు చూచుటకు కూడా ఇష్టపడడు." అని నా వర్షుడు కుర్రవానివలె దుడుకుగాచేయందుకొనక ఒడుపుగా నన్ను గ్రహించును. అంతవరకూ నేను వేచియుందును. యని వాహన చాలకుని సందేశమిచ్చి రప్పించి మరదలినింటివద్ద దింపమని వాహనమిచ్చి పంపెను
No words.43 వ భాగంలో బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి.ఈ భాగంలో ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. కథ ఊహించని మలుపులు తిరుగుతోంది
ReplyDeleteప్రబంధ కావ్య శైలి
ReplyDeleteఅద్బుతము