Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, October 27, 2020

Bharatavarsha 58

మెర్సిడెస్ బెంజ్ విలాసశ్రేణీ రథము పదునాఱవ జాతీయ రహదారి  (విశాఖ - శ్రీకాకుళం) మీదుగా పోవుచున్నది. వేయి కిలో మీటర్లు పైబడి సాగుచున్న ఆ  పదునాఱవ జాతీయ రహదారిని కవిహృదయంతో తిలకించిన...... 

తే. దునారు వర్షము లనక  బెండ్లి జేయ   

   మిళ నాట వధువు  దారిచూ చువెడలె         

   ఆంధ్ర  గడప  దాటి  డిసాను ముద్దిడి 

   కొత్త   కోడలు చేరె కొలకత్త  పురికి

పదునారు సంవత్సరముల పిన్న వయసులో తండ్రి పెండ్లి జేయగా  చెన్నపట్టణము  నుండి బయలు దేరిన వధువు  మధ్యలో నున్న  ఆంధ్ర  ఒడిస్సాలను దాటి  కలకత్తా లో నున్న తన అత్తవారింటికి బోవుచున్నట్లు అగుపించును.  ఆంధ్ర దేశము తన గడప, ఆ గడపదాటి, ఒడిస్సాయను  ముద్దాడి  సుదూర ప్రయాణము జెసి తన అత్తవారింటికి చేరిన వదువువలె (పదునాఱవ జాతీయ రహదారి) కనిపించును,  అనగా  

"సొగసు చూడ  వలెనన్న కనులున్న  చాలదన్న 

కనులకు దొరకని అందము కవితకు దొరుకునన్న

 కవితా హృదయ మున్న  తిన్న పెంపారునన్న     

  అన్నన్న! అన్నుకు  పొన్ను కూరునన్న!     

జంతుప్రదర్శన శాల, కంబాలకొండను దాటి తూర్పుకనుమల సౌందర్యమును ఆస్వాదించుచూ  సాగుచున్న ఆ మేరు తేరు మధురవాడ  దాటి కొలది  దూరము పోయిన పిదప  ఎడమకి తిరిగి సన్నని పల్లె బాట పట్టినది. అచ్చట కొమ్మాది యనొక చిన్న పల్లె కలదు. ఆపల్లె యందొక చిన్న చర్చి గట్టి, విదేశీ నిధులను ఒడుపుగ బట్టి, ఇంద్రభవనమును తలపించు  ఐదు అంతస్తుల పాలరాతి భవనము గట్టి, అందు బైబిల్  కళాశాల నడుపుచుండెను.  బైబిల్  కళాశాల ముందు మెర్సిడెస్ బెంజ్ నిలిచినది. పెంచలయ్య మెల్లగా బయట కాలిడి, చుట్టూ కలియజూడ సాగెను.  అతడి ధనగర్వమును చాటు ఆ వాహనమును చూచిన జనులత్యంత భక్తి శ్రద్ధలు కనపరుచుచూ అతడిని చుట్టు  ముట్టిరి.

అతడు వాహనము అవరోహించగా  వాహనము వాహనశాలకేగెను. పెంచలయ్య  పుస్తక విక్రయశాల కేగెను. ఎన్నిపనులున్ననూ అతడు మొదట బోవునది అచటికే. మేరీ అరలనుండి పుస్తకములను తీయుచున్నది. ఎత్తునన్న పుస్తకముల కొరకు ఎగురుచున్న ఆమె పడుచు అందాలను వెనకనుంచి  చూసి "గోదావరి తుళ్లుతున్నట్టుంది " అన్నాడు 

ఆ. డుచు గుండెలూ గుచున్నవి  యిట జారి 

    పార్శ్వ దర్శ  నమగు పాల  పొంగు

    నుజూడ ఎగురుపి రుదులు రగిలించ   

    కాంక్ష రేగి  తట్టె గన సీమ

అట్లతడు మేరీ ని  పిరుదులపై తట్టగా  ఉలిక్కిపడిన మేరి పట్టు తప్పి అతడిపై పడెను.  "నీ అందాలను చూసిన పొంగు మీదున్న గోదారి గుర్తు కొచ్చుచున్నది."  "ఆ పొంగులలో  స్నానము చేయవలెనని ఆశ" అనుచూ మేరీ కిలకిలా నవ్వెను. అట్లు కొలది సేపు మాట్లాడి, కోశాధికారి  గదికిబోయి , పిదప తన గదికి పోయెను. కొద్దీ సేపటిలో  గౌరీ  వచ్చి అల్పాహారము ఇచ్చెను. రంగడు  వచ్చి కాఫీ ఇచ్చెను. అల్పాహారం పూర్తి చేయగానే కోశాధికారి వచ్చి జమాఖర్చుల వివరించి  నగదు ఇవ్వబోగా బాంక్ కు పంపమని జెప్పెను.  ఇంతలో పాలనాధికారి క్రిస్టోఫర్ వచ్చి 

" అమెరికా నుంచి   లూథరన్ పాల్ గారు వచ్చి అతిధి గృహమున యున్నారు." 

పెంచలయ్య : ధియోలజీ విద్యార్థులందరరినీ మూడవ అంతస్థు లోనున్న దృశ్య శ్రవణ  సమావేశ శాల యందు సమావేశపరిచి సిద్ధముగా నుంచవలెను. పాల్ గారికి వారిని పరిచయము జేసెదము. అటుపై వారికి చర్చి చూపించెదము. 
క్రిస్టోఫర్: అంతకంటే ముఖ్యముగా ఇతడికి మన మురికి వాడలు చూపవలెను, మనము చేసిన  ఉదారాసేవల చిత్రములు  చూపవలెను. అమెరికాలో అత్యుత్తమ క్రిష్టియన్ దాతృత్వ సంస్థ లలో నొకటైన మిషన్ జీసస్  నుండి వచ్చిన యితడిని  వప్పించినచో మన కంతయూ మంచి కాలమే. ఇంతక మునుపెన్నడూ రానంత  పెద్ద మొత్తము పొందవచ్చు.  

నాకవన్నియూ  తెలియవు అవినీవే చూసుకొనుము , నేను నిన్ను చూసు కొందును. " హి హి హి. విద్యార్థులందరూ  రుసుములు  చెల్లించిరా ? 
క్రిస్టోఫర్ : చెల్లించిరి, కానీ మనము ఉపన్యాసకులు జీతములే చెల్లించలేదు. 
పెంచ: ఇది  మొదటి  వారమే కదా , పదవ తారీకు రానిమ్ము " హి హి హి. 
గౌరీ నీవు అతిధి గృహమునకు పోయి పాలుగారికి ఏమి కావలెనో  చూడుము. 
రంగడు : అచ్చట అప్పలనర్సి ఉన్నది బాబు. 
హి హి హి, ముసలిది అది ఏమిచేయునురా ?
నన్ను బొమ్మన  నేను పోయెదను , పొమ్మందురా ?
హి హి హి, నీకు తొందర ఎక్కువగుచున్నదిరా రంగా . నీవు కోశాధికారి వద్దకు పోయి నీకు రావలసిన పైకము తీసుకొని ఇంటికి పొమ్ము. ఇంకరావలదు. గౌరి నీవు అచ్చటికి  పోవే అని చెప్పి పోయెను.
రంగడు : ఒక చిన్న చర్చ్  తో ప్రారంభించి ఇంతింతై వటుడింతై యని పెరుగుచూ అతిపెద్ద చర్చ్ ని నిర్మించుటయే కాక బైబిల్  కళాశాలను నెలకొల్పి  ప్రభువు పేరుతో ఈ పల్లెకే  ప్రభువు వలె  వెలుగుచున్నాడు.  వీడు పొమ్మన కున్ననూ నేనే పోదలిచితిని అందుకే ఇట్లు మాటలాడితిని.
గౌరీ: ఓరి నీ అసాజ్జం కూలా, ఇప్పుడేటిసేత్తావ్ ?
రంగడు : నేనేమి జేసినను నీవలె ఒక్క జీతమునకు రెడిళ్ల పని చేయలేను.
 
                                                               ***
సబ్బవరం : పెంచలయ్య గృహము : బంగళా పెంకులతో నిర్మితమైన సువిశాల ప్రాచీన గృహము.  దాని  చుట్టుకొలత నానుకొని యున్న ఎర్రని ఎత్తరుగులు.  ఆటస్థలమువలె ముచ్చటగొలుపుచు ముంగిటనున్న  సైకత ప్రాంగణము. ఆ ప్రాంగణమందు మామిడి చెట్లు. వాటి క్రిందనే తిరిగాడు బాతులు.

 

పైడమ్మ:  ఎండాడ నించి దాసొచ్చేడు . 
దాసు: ఎరా నమ్మడికొడకా బాగున్నావా! 
పెంచలయ్య: ఓరి నంజ కొడక ఎప్పుడొచ్చినావురా!
పైడమ్మ:  ఎక్కడికైనా (పెంచలయ్య) ఎల్తే మా సెడ్డ ఇదిగా మాట్లాడతాడు ఇంటికొత్తే ఇదే బాస.
దాసు:  ఇక్కడ దీన్ని ఇల్లంతారు , అదే హైద్రాబాద్లో ఉంతే బంగలా అంతారు అని పైడమ్మ తో అని 
పెంచలయ్యతో  "ఏట్రా ఉసారెక్కువయిపోనాది ఇయాల నందినమ్మొత్తంది కదా బాగానే ఉంటావులే!"   
పెంచలయ్య:  మనోల్ల  కాడ ఆపీసర్లాగ మాటడమంటావేటే  పైడమ్మా!
పెంచ: ఊ కూకోరాదాసు , అదే మల్లీ  గెలుత్తా దంతావా ?
దాసు: సూత్తం తలగే ఉంది, అదిగో మీ బామ్మర్ది ఆది గాడొత్తన్నాడు, ఆడినడుగు
పెంచలయ్య : ఆది నువ్వేతంతవురా ? రత్నకుమారి మల్లొత్త దంతావా?
ఆది: ఆలు లేదు సూలు లేదు ఊర్కోహే, ఇప్పుడేటి ఎలచ్చన్లొచ్చీ సేయేటి?
పైడమ్మ: ఆ ఎలచ్చన్ల ఊసెత్తితే నాను బిగిలి పోతాను. ఆ సివాసలాన్ని ఆ ఇంగిలీసు గుంట సంపీసిన కాంచి, నాకెలచ్చన్లంటే బెంగడిపోనాది.  మాయదా రెలచ్చన్లు మనకెందుకయ్యా?  
పెంచలయ్య : పెంచలయ్య అంతే ఏతనుకొంతన్నావే! 
ఆది: మాయక్కింక నువ్వు కోడిపెట్టలేపారం సేసుకొంతనవనుకొంతన్నాది. దాసు నువ్వేట్ర  పల్లకున్నావు.  
దాసు: మొగుడు పెల్లాల  మద్దిన దూరినానేటి సెపుతాన్రా, శివాచలం పెల్లామ్ ఉంది కదా? మొన్నీ  మద్దిన  గెలిసింది? అదికోడా సచ్చి పోనాదేటి? 
ఆది: అది పార్టీ మారిపోయిందికదా ఉప్పుడా గెలుపు సెల్లదు అంటన్నాడు బావ.
దాసు: ఎవుడు సెప్పేడు? పార్టీ మారితే గెలుపు సెల్లదని ఎక్కడైనా రాసుందా?
పైడమ్మ: లాయరు శంకర్రావు గారొచ్చారు, లోపాలకి రమ్మంటారా?
పెంచలయ్య : ఓస్ మన లాయరుగారే కదా బైరెడ్డి కేసు వాదించారు. నాకు తెల్వదేటీ

శంకర్రావు: ఆడుట్టి సన్నాసెదవండీ, సాక్షాలను మాయ జేయలేకపోయాడు. అన్ని సాక్షాలతో దిరికిపోతే లాయరేంచేస్తాడండీ?
పెంచలయ్య : అబ్బే  ఇప్పుడా విషయం కాదు లాయరుగారు. రత్నకుమారి పార్టీ మారిపోయింది కదా , మరిప్పుడేటండి  పరిచ్చితి. ఆ ఎన్నిక చెల్లదంటున్నారు. 
శంకర్రావు: అవునండి చెల్లదు, 1985 లో రాజీవగాంధీ ఏంటి డెఫెక్షన్ ( పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం) తెచ్చాడు , దాని ప్రకారం ఒక పార్ట్ లో గెలిచి మరో పార్టీ లోకి మారితే, మారిన ఎం ఎల్ ఏ లు అనర్హులౌతారు.   
పైడమ్మ: అంటే రత్నకుమారి ఎం ఎల్ ఏ పదవూడిపోనాదా?
పెంచలయ్య: పదవూడి పోనాదా అంటే ఊడిపోద్దేటి? అసంబ్లీలోన స్పీకర్ ఊడబీకేఎత్తే ఊడిపోతాది , కానీ ఆయన ఫైలు కిందెట్టుకొని కూకుంటే మనమేటి సేత్తామ్  
శంకర్రావు: అలా కిందపెట్టుకుని కూచోడానికి చట్టం ఒప్పుకోదండి. 2017 లో మణిపూర్లో కాంగ్రెస్కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు ఇట్లే పార్టీ మారి బిజెపిలో చేరిన తరువాత బిజెపి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడుగురిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను కోరినప్పటికీ, పిటిషన్లు పెండింగ్లో పెట్టి పట్టించుకోలేదు. అప్పుడు సుప్రీంకోర్టు మూడు నెలల్లో అనర్హతపై తీర్పు చెప్పాలని మణిపూర్ స్పీకర్ను ఆదేశించి, లేని యెడల ఉన్నత న్యాయ స్తానం జోక్యం చేసుకోవలసి వచ్చునని హెచ్చరించగా స్పీకర్ పార్టీ మారిన ఎం ఎల్ ఏ ల పై  అనర్హత వేటు వేసెను.
2019 లో కర్ణాటక లో  కూడా ఇట్లే జరిగెను. 14 మంది ఎం ఎల్ ఏ లు  కాగ్రెస్, మరియు జే డీ  పార్టీలనుండి మారగా వారిని సభాపతి అనర్హులుగా ప్రకటించెను. 
ఆది: ఇంకది  ఇంట్లో కూకోడమే, మంచి పనే అయ్యింది, ఆ కిట్ట పరమాత్మ ఉన్నాడు
పెంచలయ్య : ఒర్ర్ ఆది మరిసిపోనావేట్రా, కిట్ట పరమాత్మ కాదురా  పెబువు  పెబువు  అనాల్రా
ఊరుకో బావ నేనేంటి నీనాగ మతం మారనేదు , చర్చి ఎట్టనేదు 
పైడమ్మ: లాయరుగారు మన మడిసే, ఆయనకన్నీ తెలుసు నువ్వేటి నాటకాలాడక్కల్లెద్దు
మావు గొల్లోల్లమి బాబూ , మొదట్లో ఈడు  పాలు అమ్మేవాడు , నాను కూడా పాలమ్మేదాన్ని, ఈడు పాలేపారం ఒగ్గేసి కోడిపెట్టల యాపారం మొదలెట్టేడు. గొల్లోల్లవని సెప్పుకోడాని  సలుపు పుట్టి  చౌదరీ లని సెప్పుకున్నాడు బావు. ఇప్పుడు పెబువు పెబువు అని ఇంటికాడున్న నా కిట్టయ్య బొమ్మలన్నీ తీయించేశాడు. అందుకే కూతురెల్లి పోనాది.   
పెంచలయ్య: (పైడమ్మతో) ఎహే,యెల్లెస్, ఎదవగోల, ఏదేవుడైతేటి నాలుగు డొబ్బులు  సంపాదించుకోవాలి. సెబాస్ అనిపించుకోవాలి. పెబువుని ప్రాద్దించేను. దానంతటదే వచ్చేతాన్నది. ఇంకొక గంటలో మనం ఎయిర్ పోర్ట్ కెళ్ళాలి, ఏడుపుమొక మెట్టుకొని కూకొక తయారవ్వు. 
పెంచలయ్య: (లాయర్ శంకర్రావుతో)  పెబువు దయ ఎంతగొప్పదో సూడండి రత్నకుమారి ఎల్లిపోతంది నా కూతురొచ్చేత్తన్నాది.  
శంకర్రావు: కానీఅనర్హత వేటు పడిన వారికి   ఎన్నికలలో పోటీచేసే అర్హతుంది.  
దాసు: అయితే మనకేటి తోవ , ఎలచ్చన్లలో పోటీసేస్తే అదే నెగ్గెత్తాది
పెంచలయ్య: ఓస్, అదొట్టుకొని  నువ్వింక ఒగ్గవేట్రా? అప్పుడు దాని మొగుడు సచ్చిపోయాడు కాబట్టి పెజలు దానిగ్గుద్దేసేరు, మొగుడు సచ్చిపోతే పెళ్ళానికి, తండ్రి సచ్చిపోతే కొడుక్కి గుద్దేయడం, ఆళ్ళు నెగ్గేయడం మామూలేకదా. ఇప్పుడైతే మనకే ఓట్లు.
దాసు: అప్పట్నుంచి మనమేటిసేసి నామేటి పెజలకి, మన కోట్లేసీ డానికి? 
హి హిహి  ఏటి సేయ్యక్కరలేదురా, మనమీద  ఎవ్వుడినీ నిలబడకుండా సూసుకుంటే సాలు.
శంకర్రావు: అంటే రత్నకుమారిని…
సంపేయక్కల్లా  బెదిరించి తప్పిత్తే సాలు
పెంచలయ్య: బెదిరించడాలు తప్పించడాలు  మా బావ తర్వాతే ఎవ్వుడైన , 
కూతురు అని కూడా సూడకుంట నందినమ్మని ఇరికించి , పాఠాలు సెప్పే పంతులయ్యని  తప్పించేడు, బైర్రెడ్డి  కేసులో సాచ్చులని తప్పించడానికి సాయం సేతున్నట్టు  నాటకమాడాడు కానీ నిజంగా ఏటీసేయ్యనేదు. దాంతో బైరిగాడికి కారాగారం అయిపోనాది. కొడుకుపోయి  నాగిరెడ్డిని ఈగిపోనాడు.  మాబావ ఎం ఎల్ ఏ అవ్వకుంటెవ్వుడు ఆపలేదు.


10 comments:

  1. బైరెడ్డి కధ ముగిసింది అనుకుంటే ఈ పెంచలయ్య, నందిని కలిసి కథను ఎటు తీసుకెళ్తారో! రాజకీయ కోణం, మత మార్పిడి వ్యాపారం (నగ్న సత్యాలు)శ్రీకాకుళం భాషను చక్కగా ప్రయోగించారు.

    ReplyDelete
  2. కనులకు దొరకని అందము కవితకు దొరుకును.నిజమే.ఒక రహదారిని కూడా ఇంత అందంగా వర్ణించడం మీకే సాధ్యము

    ReplyDelete
  3. కనులకు దొరకని అందము కవితకు దొరుకును.నిజమే.ఒక రహదారిని కూడా ఇంత అందంగా వర్ణించడం మీకే సాధ్యము

    ReplyDelete
  4. సాహిత్య ప్రియ గారు, ఆనందో బ్రహ్మ. బ్రహ్మ ఆనంద స్వరూపము, బ్రహ్మ జ్ఞాన స్వరూపము. ఆనంద స్వరూపులై జ్ఞాన స్వరూపానికి తెరతీస్తున్నదెవరు?

    ReplyDelete
  5. కళ్లకు అర్దం కనీ బావలు కవీత్వ మనస్సుకు అర్దం
    అవుతాయి చిన్న కవిత్వంలో ఎన్నో బావలు అర్థలు ఉన్నయి

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. కొత్తగా ఉంది ఈ ఎపిసోడ్
    రహదారి నుండి విదేశీ ఫండ్స్ వరకు నిజానికి దగ్గరగా

    ReplyDelete
  8. మధ్యలో చక్కని అందాల వర్ణికలు

    ReplyDelete
  9. Zanetey@gmail.com +1.2393005552 12393005552. Emofswfl.com. Alvaro Villagomez Alvaro Villagomez 574 Wedgewood Way Naples Fl 34119. United States

    ReplyDelete