అగస్త్యని బీరు మృగణ - నిష్ఫలా న్వేషణ
చూచెద పోయి చెన్నపు రికిప్పుడు
వేచెద నెంత వెక్కమ యినగాని
వెనుతిర గలేను మొఖము చూడక
కనుమూయ నళినాక్షి కనపడు చుండె.
గుండె ఆగె నో క్షణము నిజము దెల్వగ
ఎండె గొంతుక ఎటుబోయి వెతికెద
(తల్లి ఆ బడుగు వాడను వీడేనని తెలిసి అవాక్కయ్యెను
గొంతు తడారిపోగా అయోమయములో పడి అలమటించెను)
అయ్యో మూడునా ళ్లాలస్య మునకే
కుయ్యో మనినేడ్వ కష్టము కలిగిను
ఎచటికి పోయెనో ఈవాడ నొదిలి (ఈ మురికివాడ నొదిలి ఎక్కడికి పోయెనో )
అచల మానస ఔదార్య రమణి (గొప్ప ఉదార మనసున్న అందమైన స్త్రీ )
విచల విమలాత్మ వాకిలి వీడె (అస్థిరమైపోయి, స్వచ్ఛమైనమనస్సుగలఆమె ఇంటిని వీడి పోయెను )
విచకిల విభ్రమ ప్రోయాలు వోడె (విప్పారిన శృంగార భావములు గల ఇల్లాలు)
ధనమెంత బోసిన దొరకదే నేడు
ఘనము గాచెప్పి గొలుచు కొందు
పనికి మాలిన పుత్రుని కన్నపా
పానికి బడుగు వాడలో వడిలేవు
పాణిగ్ర హణమున వంచింప బడిన (వివాహమందు మోసపోయిన స్త్రీ)
రాణిమీ నాక్షిగా రాలబి డ్డడికి (సంపన్న కుటుంబమునుంచి వచ్చిన మహారాణి వంటి స్త్రీ )
ముడుపు గట్టుచు మురికి వాడలో
కడుపు గట్టుకు కాలమే గడిపెనో
రాజక న్యవుగాదె రాజీవ నేత్రి (రాజసము కలిగి కమలములవంటి కన్నులున్న స్త్రీ )
రాజగు ణములతో రాజిల్లు ధాత్రి (గొప్ప గుణములతో వెలుగు భూమి తో సమాన మైన స్త్రీ )
మూడవ వారము మురికి వాడల
మూఢము గవెదకి విసిగి నాను
తిరిగ తిరిగతా తతార సిల్లె
వొరుగుచు నాదేహ మేనీర సిల్లె
మిత్రుడని వేడగా వర్షుడు మెదలడే
శత్రువే మెరుగురా సారంగ పాణి
తొగరాజ కలువను దయజూడ వయ్య (చంద్రమా కలువలాంటి సుకుమారమైన మగువను దయతో చూడు )
ఖగరాజ విష్ణుప్రియ గావరా వయ్య (విష్ణువాహన , గరుడా నీ సూక్ష్మ దృష్టి తో నా తల్లిని కనిపెట్టు )
కన్నెడ యానాల కెరిగించి బోయి
వన్నెల లోకాన వాలిన హాయి
***
అరుణతా రనుపోలి అవధాన మయ్యె
లకుమ తారపే రుసువిది తమాయే
అవధానమైన అనగా ఉత్కృష్ట మైన స్థితిని, సువిదితమైన పేరు సంపాదించుకొని లకుమరాణివలె వెలుగుచుండెను.తల్లి వలె ఆనతికాలములోనే నగరంలో అందరి ఆదరణ చూరగొనెను.
అంబర ముకెగసె అందాల తారగా
సంబర మునజేరి జనులు వెలగా
తండ్రితో తగువాడి తెచ్చె ధనము
మండ్రాడి తెగువతో మగువ నెత్తె
చిత్రధా రలకుర్వ ఘనస్థా యినిజేరె
ఛత్రధా రియై జాలము నకదులు
రాణివా సముకూరి రాజిల్లు పూబోడి
పాణికు డుసతత ముప్రక్క నుండు
అన్ని హంగులతో ఉన్న పెద్ద సొంత భవనము సమకూరి అందు ఆమె పాణికుడు అనగా వ్యవహారములు చూచు మంత్రి ఆమెను ఎప్పుడూ అనుసరించుచుండగా ఆమె రాణి వలే కనిపించే చుండును. అదృష్టముండవలెను!
బుధవర్గ తాకిడి పెరుగుచూ పోగ
మదవర్గ సంసర్గ మధువులు పొందె
కొత్త దుస్తుల కొత్తభం గిమల
గిత్త వలెకన గిలిపెరి గెచెలి కాడికి
ప్రహ్లాద మేచూడ ప్రియురాలి మేను
ఆహ్లాద మేతాక అందాల నడుము
అర్ధరా తిరివే ళతిలోక సుందరి
అర్ధన గ్నతకని ఆర్ద్రత పొందెనే
సఖ్యత తోసర సనస ఖుడుజేర
ముఖ్యుడ డనికోర్కె ముదముగ తీర్చె
అటువంటి సమయములో ఆమె ఫాణికుడు, అనగా వ్యవహారములుచూచు అగస్త్య రిమ్మకొని ఆమెను సమీపించెను. అర్ధరాత్రి ఆమె ధరించు పొట్టి వస్త్రములు ఆమె అర్ధనగ్నసౌందరమును చూపుచుండగా చలించి ఆమెతో సరసములు లాడుచుండగా ఆ నిశి ఆమెకు మత్తె క్కించుచుండ ఆమె అతడికి చేరువాయెను.
ధనమున్న మాటలు ధాటిగా వచ్చు
ఘనతున్న వేదాంత చతుర తబ్బు
తప్ప తాగుచు తప్పదం దురు
విప్పి చూపుక నొప్పదం దురు
ఇహప రంబులు ఇచ్చట నెకలుగు
మహిలోని మధిరతో భాదలే తొలగు
వేల్పులే ఇలకొచ్చి భక్తుల బ్రోవ
గాల్పులే బాప గట్టిరీ మధుశాల.
నిత్యభో గాలుతో నీలవే ణిరాణి
ముత్యరో చిస్సుతో మెరియు మదిరాక్షి.
చివరకు తారాపథములో దూసుకుపోతున్న లకుమ నైతికతను పట్టించుకొనక సర్వ భోగములను అనుభవిస్తూ ఉచ్ఛ దశకు చేరి వెలుగుచుండెను. అగస్త్య లకుమలు తమకు ఒక చిరునామా సంపాదించుకొని విలాస జీవితమును గడుపు చుండిరి .
ద్విపద లో వ్రాసిన ఈ భాగం అద్భుతంగా హృద్యంగా ఉంది
ReplyDeleteభావాలకు భాషను జోడిస్తూ, భాషకు భావాలను జోడిస్తూ సాగుతున్న కథా గమనం అద్భుతం.లకుమ, అగస్త్య కోరుకున్న జీవితాన్ని పొందితిరి.కానీ మీనాక్షి జీవితం ప్రశ్నార్థకం 😢
ReplyDelete