Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, October 30, 2020

Bharatavarsha -59

అగస్త్యని  బీరు మృగణ - నిష్ఫలా న్వేషణ 



చూచెద  పోయి చెన్నపు రికిప్పుడు

వేచెద నెంత వెక్కమ  యినగాని  


వెనుతిర గలేను మొఖము చూడక

నుమూయ నళినాక్షి నపడు చుండె.


గుండె ఆగె నో  క్షణము నిజము దెల్వగ   

ఎండె  గొంతుక టుబోయి  వెతికెద        

(తల్లి  ఆ బడుగు వాడను వీడేనని తెలిసి అవాక్కయ్యెను 

 గొంతు  తడారిపోగా అయోమయములో పడి అలమటించెను)


అయ్యో మూడునా ళ్లాలస్య మునకే 

కుయ్యో మనినేడ్వ  కష్టము  కలిగిను


ఎచటికి పోయెనో వాడ నొదిలి  (ఈ మురికివాడ నొదిలి ఎక్కడికి పోయెనో )

అచ మానస దార్య రమణి     (గొప్ప ఉదార మనసున్న అందమైన స్త్రీ ) 


విచ విమలాత్మ వాకిలి వీడె    (అస్థిరమైపోయి, స్వచ్ఛమైనమనస్సుగలఆమె ఇంటిని వీడి పోయెను ) 

విచకిల విభ్రమ ప్రోయాలు వోడె   (విప్పారిన శృంగార భావములు గల   ఇల్లాలు) 


ధనమెంత బోసిన దొరకదే నేడు

ఘనము గాచెప్పి గొలుచు  కొందు


నికి మాలిన పుత్రుని కన్నపా 

పానికి  బడుగు వాడలో వడిలేవు 


పాణిగ్ర  హణమున వంచింప బడిన    (వివాహమందు మోసపోయిన స్త్రీ)

రాణిమీ నాక్షిగా రాలబి  డ్డడికి          (సంపన్న కుటుంబమునుంచి వచ్చిన  మహారాణి వంటి స్త్రీ  )


ముడుపు గట్టుచు  మురికి  వాడలో

డుపు గట్టుకు కాలమే గడిపెనో


రాజక  న్యవుగాదె   రాజీవ నేత్రి       (రాజసము కలిగి కమలములవంటి కన్నులున్న స్త్రీ )

రాజగు  ణములతో  రాజిల్లు ధాత్రి   (గొప్ప గుణములతో వెలుగు భూమి తో సమాన మైన స్త్రీ )


మూడవ వారము మురికి వాడల

మూఢము గవెదకి  విసిగి నాను


తిరిగ తిరిగతా  తార సిల్లె

వొరుగుచు నాదేహ మేనీర సిల్లె


మిత్రుడని వేడగా ర్షుడు మెదలడే     

త్రువే మెరుగురా సారంగ పాణి 


తొగరాజ కలువను యజూడ వయ్య    (చంద్రమా కలువలాంటి సుకుమారమైన మగువను దయతో చూడు )

గరాజ విష్ణుప్రియ గావరా వయ్య         (విష్ణువాహన , గరుడా నీ సూక్ష్మ దృష్టి తో నా తల్లిని కనిపెట్టు )


న్నెడ  యానాల కెరిగించి బోయి

న్నెల  లోకాన వాలిన హాయి  

                                                                  ***


రుణతా  రనుపోలి  వధాన మయ్యె   

కుమ  తారపే  రుసువిది  తమాయే 

అవధానమైన అనగా ఉత్కృష్ట మైన స్థితిని, సువిదితమైన పేరు సంపాదించుకొని లకుమరాణివలె వెలుగుచుండెను.తల్లి వలె  ఆనతికాలములోనే  నగరంలో అందరి ఆదరణ చూరగొనెను. 

అంబర   ముకెగసె  అందాల    తారగా

సంబర   మునజేరి   నులు   వెలగా  

వానలు కురిసిన చెరువులు నిండును , చెరువులు నిండిన కప్పలు వచ్చునో రావో తెలియదు కానీ పేరు ఉన్న తారల వద్దకు అందరూ  ఆశలతో  వచ్చి చేరి తేనే పలుకులు పల్కుచుండుట  సహజమే కదా.  

తండ్రితో  తగువాడి  తెచ్చె ధనము

మండ్రాడి తెగువతో గువ నెత్తె 

అందమైన అతివ యున్నచో మగవారు విడుతురా, ఎవరెట్లు జేసిననూ అగస్త్య ఎట్టిపరిస్థితులలోనూ విడువడు. లకుమ చలన చిత్రములకు నిర్మాతగా మారి అగస్త్య ఆమెను అల్లుకొనెను. 

చిత్రధా   రలకుర్వ ఘనస్థా యినిజేరె  

ఛత్రధా   రియై   జాలము  నకదులు

 చిత్రాలు  వరుసగా ధారా వాలే ఆమె పై కురవగా ఆమె ఉన్నస్థాయికి చేరుకొనెను.  ఆమెకు ఛత్రమును పట్టి ఎల్లప్పుడూ ఒకదామె వెంట తిరుగుచుండును అందుచే ఆమె  ఛత్రధారి అయినది ఆమె ను అనుమతిలేనిదే ఎవరూ కలుసుకొనకుండా , బైటకు పోవునప్పుడు ఆటంక పరచకుండా రక్షక వలయములోనే ఎల్లప్పుడూ తిరుగుచుండెను 

రాణివా  సముకూరి రాజిల్లు పూబోడి

పాణికు  డుసతత ముప్రక్క నుండు

 అన్ని హంగులతో ఉన్న పెద్ద సొంత భవనము సమకూరి అందు ఆమె పాణికుడు  అనగా వ్యవహారములు చూచు మంత్రి ఆమెను ఎప్పుడూ అనుసరించుచుండగా ఆమె రాణి వలే కనిపించే చుండును. అదృష్టముండవలెను!  

బుధవర్గ తాకిడి  పెరుగుచూ  పోగ

మదవర్గ సంసర్గ ధువులు పొందె

బుధవర్గము అనగా పలుకుబడి గల పెద్దలు తరుచుగా ఆమెను కలిసుకొను వారి సంఖ్య పెరుగుచుండెను . బుధవర్గము అనగా మదవర్గము కూడా , అనగా క్రొవ్వు హెచ్చుగా గల వర్గము , లకుమ  వారి సంసర్గము అనగా రాపిడి పొందుచుడెను. సిగ్గు, నీతి మానము కొరకు చలనచిత్ర పరిశ్రమనందు వెదకరాదు, వలసినచో పరిశ్రమనందుండరాదు. ఆ సత్యమును గ్రహించి లకుమ ఉదారముగా నడుచుకొనుచున్నది .

కొత్త  దుస్తుల  కొత్తభం  గిమల

గిత్త  వలెకన   గిలిపెరి  గెచెలి కాడికి 

ఫోటో షూట్స్ గా వ్యవహరించబడు చున్న ఒక వ్యవహారమును అందములు ఒలక బోయుట అని చెప్పవచ్చు. ఆధునిక తారలందరూ శృంగార భంగిమలలో  వందలాది చిత్రములనుంచుచూ యువకులన్నాకర్షించు వృత్తాంత మిట్లుండును 

ప్రహ్లా మేచూడ  ప్రియురాలి మేను      

ఆహ్లా  మేతాక   అందాల నడుము

 

ర్ధరా  తిరివే   తిలోక  సుందరి

ర్ధన గ్నతకని   ర్ద్రత పొందెనే

 

ఖ్యత  తోసర  నస ఖుడుజేర

ముఖ్యుడ  డనికోర్కె ముదముగ తీర్చె

అటువంటి సమయములో ఆమె ఫాణికుడు, అనగా వ్యవహారములుచూచు అగస్త్య రిమ్మకొని ఆమెను సమీపించెను. అర్ధరాత్రి ఆమె ధరించు పొట్టి వస్త్రములు ఆమె అర్ధనగ్నసౌందరమును చూపుచుండగా చలించి  ఆమెతో సరసములు లాడుచుండగా  ఆ నిశి ఆమెకు మత్తె క్కించుచుండ ఆమె అతడికి చేరువాయెను.   

 నమున్న మాటలు  ధాటిగా  వచ్చు

 నతున్న వేదాంత తుర  తబ్బు 

వాక్ స్వాతంత్రాన్ని పొందవలెనన్న ధనము కావలెను.  పేరు  ఉన్నచో  స్వతంత్ర భావజాలమును కలిగి యుండుటకాక దానిని గొప్పగా ప్రచారము చేతురు . లకుమకు,తాగుటకు ఇంటిలోనే పాన శాల కలదు. ఆమె అట్లు తాగుట ను సమర్ధించుకొనును 

 ప్ప  తాగుచు  ప్పదం దురు      

 విప్పి చూపుక  నొప్పదం దురు 

 

హప  రంబులు చ్చట నెకలుగు   

హిలోని  మధిరతో భాదలే  తొలగు


వేల్పులే  ఇలకొచ్చి  క్తుల బ్రోవ  

గాల్పులే  బాప ట్టిరీ  మధుశాల.

 

నిత్యభో  గాలుతో నీలవే  ణిరాణి

ముత్యరో  చిస్సుతో మెరియు మదిరాక్షి.


చివరకు తారాపథములో దూసుకుపోతున్న లకుమ నైతికతను పట్టించుకొనక  సర్వ భోగములను అనుభవిస్తూ ఉచ్ఛ దశకు చేరి  వెలుగుచుండెను.   అగస్త్య లకుమలు తమకు ఒక చిరునామా సంపాదించుకొని విలాస జీవితమును గడుపు చుండిరి .


2 comments:

  1. ద్విపద లో వ్రాసిన ఈ భాగం అద్భుతంగా హృద్యంగా ఉంది

    ReplyDelete
  2. భావాలకు భాషను జోడిస్తూ, భాషకు భావాలను జోడిస్తూ సాగుతున్న కథా గమనం అద్భుతం.లకుమ, అగస్త్య కోరుకున్న జీవితాన్ని పొందితిరి.కానీ మీనాక్షి జీవితం ప్రశ్నార్థకం ‌😢

    ReplyDelete