న్యూఢిల్లీ నార్తవెన్యూ నందు రాజ నగరులు, శ్వేత నగముల వలె ఉత్తుంగమై, అమాత్యుల కాలావాలమై, పాలిత ప్రవేశ దుర్భేద్యములై యొప్పుచుండెను. పార్లమెంట్ చెంగట నున్న ఆ రాజగృహములు భారత రాష్ట్రపతి భవన పార్శ్వావలోకనమునొప్పుచూ రాజచక్ర సురక్షితమై, రాజయోగ్య సంపన్నమై ఉండును. అందొక విలాస ప్రాసాదమున నివసించు విలాసిని మొదటి అంతస్తు లో నున్న నాట్య మందిరమందు నాట్యమును ముగించి స్వేద పరివృత కృష్ణనీలివర్ణ పావడ, చెంగావి చేలములతో ఉన్నత ప్రాకారమున ధిరోహించి, అంబరమున పసిడి కాంతులీనుచున్న జగల్లోచనానంద సంధాయకుని గాంచి, మలయానిలయ ప్రవాహమున పరవశించి ముడివెట్టిన కేశములను సడలించి విదుల్చుచుండ ఉబ్బిన వట్రు పయోధరములు కదులుచూ మరులుగొలుపుచుండెను. రాజగంభీర, వికీర్ణకేశ, కువలయాక్షి ఉన్నత ప్రాకారమున సూర్యాభిముఖమై కూర్చొని వాయులీన వాదన జేయుచుండెను. ఆ అంగన పసిమి దేహ సౌందర్యము ఉదయ భానుడి పసిఁడి కిరణ రాజితమై నయనానందము గొల్పుచుండెను.
చెంగట జంత్రి తో నిలచిన సచిపున (సెక్రటరీ) కొక కంట రాష్ట్రపతి అంగరక్షక దళ విన్యాసములు మరియొక కంట మత్తకాశిని ప్రౌఢ పొంకములు కనిపించుచుండ సౌవర్గ భోగానుభూతినొం డుచుండెను.
ప్రత్యూషాస్వాదనమున, వాయులీన శ్రావ్యనాదమున తన్మయమొందుచూ మైమరచిన ఆ ప్రౌఢ కొలది సేపటికి బాహ్య స్మృతినొంది " మిస్టర్ పచాకో ! " అనగా ఎస్ మేడమ్ టుడేస్ ప్రోగ్రాం ఈస్ : మార్నింగ్ అడ్రెసింగ్ ఉమెన్స్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ఎట్ పూణే , ఆఫ్టర్నూన్ లంచ్ ఇన్ పూణే , దెన్ ఫ్లయ్ టు హైదరాబాద్. అరుణతార స్నానమునకు పోయిన పిదప పచాకో వాహనాచాలకునివద్దకుపోయేను.
ఉ.8:40 నిమిషములకు ఢిల్లీ నుంచి పూణే పోవుటకు స్పైస్ జెట్ విమానము కలదు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమునకు పోయి అచ్చటనుంచి అరుణతార
కార్యదర్శి తో కూడి పూణేకి వాయు మార్గమున ఎగిరి 10:50 నిమిషములకు చేరెను.
కొత్తగా వాహన చాలకునిగా చేరిన మాణిక్యాలరావు బారామతి నుండి బి ఎం డబ్ల్యు ఎం 8 వాహనమును తీసుకొని పూనా విమానాశ్రయము నిష్రమణ మార్గము వద్ద ఎదురు చూచుచున్నాడు. ఆ ప్రక్కనే పూణే పోలీస్ కమీషనర్, రక్షకదళం వారి వాహన శ్రేణి తో ఎదురు చూచుచున్నారు. నిష్రమణ మార్గము వద్దకు రాగానే కమీషనర్ వందనమొనర్చి ప్రభుత్వ వాహనమును చూపగా వలదని అరుణతార తన వాహనమందు వెనుక కూర్చొనగా కార్యదర్శి పచాకో ముందుకూర్చొనెను. వాహనము లన్నీ కదిలినవి. అరుణతార రెండు పెట్టెలు సుందరికి ఇవ్వవలెనని చెప్పి వాహన హాలకునికి ఇచ్చెను. నేను హైదరాబాదులో ఉంది పని ముగిసిన పిదప వచ్చెదను. వలసినచో విశాఖ పోయెదను. సుందరి కి ఈ సామాలు అందజేయవలెను అని పెట్టెలు ఇచ్చెను.
పూణే పట్టణమున తిలక్ రోడ్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో మహిళా భద్రతా సమావేశం జరుగుచుండెను . అరుణతార వాహనము నిర్ణీత సమయమునకు సమావేశ ప్రదేశమునకు చేరుకొనగా నగర పోలీసు కమీషనర్ తలుపు తీసి ఆమెకు వందనమొనర్చెను. పలువురు అధికారులు వెంటనడవగా ఆమె సభా భవనంలోకి ప్రవేశించి రంగ స్థలము నధిరోహించెను. నేటి కాలమున అనునిత్యము పెరిగిపోవుచున్న సామూహిక అత్యాచార సంఘటనలను దృష్టిలో నుంచుకొని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుటకు చట్టాల పట్ల అవగాహనను పెంచుటకు, స్త్రీలలో ధైర్యాన్ని నింపుటకు మహిళల భద్రతపై సమావేశం నిర్వహించుచున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మరియు పూణే కు చెందిన స్ఫుర్తి మహిళా మండలివారిని, కలిసి వచ్చిన తల్లిదండ్రులను , పాత్రికేయులను , న్యాయవాదులను అభినందించుచున్నాను. మహిళలను గౌరవిం చుట కొడుకులకు తల్లి తండ్రులు నేర్పవలెనని, అనుచూ కొంత సేపు అరుణతార మాట్లాడిన పిదప
సమావేశంలో పాల్గొన్న నిపుణుల బృందం సభ్యులు, పూణే మేయర్ గారు కూడా అదే విషయమును చెప్పినారు. ఒక సామాజిక కార్యకర్త మాట్లాడుతూ “నేటి మహిళలకు చట్టముల గూర్చి గానీ వారి హక్కుల గూర్చి గానీ తెలియదు. ప్రస్తుతం, నేను మహిళల భద్రతపై కార్యగోష్ఠి ( workshop) హాజరవుతున్నాను.” అని చెప్పెను.
భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 100 ప్రకారం మహిళలపై అత్యాచారం విషయంలో ఆత్మరక్షణకు రేపిస్టులను చంపుటకు కూడా హక్కు కలదని తెలియజేయ వలెను. మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించ వలెను ”అని అదనపు పోలీసు కమిషనర్ గారు చెప్పిరి.
సభ ముగిసిన పిదప అరుణతార తన వాహనంలో కూర్చొనగా వాహనము బయలుదేరెను. ముందు పైలట్ వెనుక రక్షక దళములు అనుసరించుచుండ మాణిక్యాలరావు వాహనమును పోనిచ్చు చుండెను.
మాణి: పూణేలో విమానాశ్రయము కొత్తగా గట్టినారా ? ఇచ్చట విమానాశ్రయమున్నట్లు పెక్కుమందికి తెలియదు. విమానాశ్రయ మెచ్చటున్నదని అడుగుచూ మా చెడ్డ తిరిగినాను. బారామతినుండి పూణే పలు మార్లు అమ్మగారితో వచ్చినాను ఇంతగా ఎప్పుడునూ తిరగలేదు.
పచాకో: పూణేకు 10 కి మీ దూరమున విమానాశ్రయము లోహగావ్ లో విశ్రాన్తవాడి విమాన నగర్ మధ్యలో ఉన్నది.
ఈ నగరము చాలా సుందరముగానే కాక ప్రత్యేకముగానున్నది. ఇచ్చట ఎదో తెలియని ప్రశాంతత కలదు. అని మాణిక్యాలరావు చెప్పగా
అరుణతార: మహా రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరు గాంచిన పూణె లో ఎన్నో చారిత్రాత్మక కట్టడములు స్మృతి చిహ్నములు, చిత్ర ప్రదర్శన శాలలు, ఉద్యానవనములు కలవు. జాపనీస్ ఒకయామా ఉద్యానవనమును జపనీయులు కళాత్మకంగా , నైనానంద కరముగా తీర్చిదిద్దిరి. ఇచ్చట ఉద్యానవనముల కిదొక మచ్చుతునక . అచ్చటకు బోయిన ఎవరికైననూ స్నేహితులు దొరికెదరని ఒక నమ్మిక గలదు. సంవత్సరము పొడవునా ఇచ్చట అనేక సాంస్కృతిక కార్యక్రమములు జరుగుచుండును. పూణే పండుగ, ఓషో పండుగ , గంధర్వ సంగీత ఉత్సవాలు చూడదగ్గవి. ఈ సారి సుందరిని నిన్ను తప్పక తీసుకు వచ్చెదను.
అని అనుచుండగా నాబోటి పనివాడితో ఇట్లు మాట్లాడు ఈమె మనసెంత అందమైనది , ఇంత ప్రేమగా... కొడుకుతో మాట్లాడినట్టున్నది అనుకొనుచున్న మాణిక్యాలరావు కన్నులు చెమర్చుచుండ పచాకో గారు చెప్పిన " వన్ డే యు విల్ క్రై " అన్న మాటలు గుర్తుకొచ్చినవి, నేనింతవరకు ఆమె శరీర సౌందర్యమునే చూచితిని.
జాప నీయులు చక్కటి నేరిమి
జాపి కూరిమి సానువు గట్టిరి
వినియుంటి ముచ్చట వివరించి నావు
కనియుంటి నిప్పుడే కామాక్షి మనసు
డాబొ కింతయు లేదువె న్న మనిషి
జాబిలి చల్లని మనసు న్న మనిషి
కామాక్షి అనగా గాడెస్ ఆఫ్ లవ్ కనులు చెదురు అందము. ఆ అందమును చూచు మనసు రంజిపబడవలెను కానీ చలించరాదు. కామకోర్కె కలగకుండా ఆ అందమును ఆస్వాదించవలెను . దీనినే ఆంగ్లమున ఈస్థటిక్స్ అందురు. అని కళాశాలలో గురువుగారు చెప్పిన మాటలకు అర్ధమిప్పుడు తెలిసినది. మాణిక్యాలరావుకు ఆమె గురువు వలె దైవమువలె దోచినది. దైవమనిన అమ్మే కదా ! అమ్మ అనిన మంచితనమే కదా!
విమానాశ్రయము వద్ద వేచి యున్న హెలికాఫ్టర్ లో అరుణతార కూర్చొనెను. దూరంనుంచి అధికారులు , పురజనులు చేతులు ఊపుతూ వీడ్కోలు పలుకుచున్నారు. విమానాశ్రయ అధికారి హెలి పైలెట్ తో మాటలాడుచుండెను. అందుకే పైలెట్ హెలికాఫ్టర్ ను లేపలేదు. హెలికాఫ్టర్ కు కొద్దీ దూరములు ఆగి యున్న బి ఎం డబ్ల్యు ఎం 8 వద్ద నిలబడి చూచుచున్న
మణి : పక్కనే వున్న పచాకోతో అయ్యా ఒక గంట వేచి యున్నచో హైదరాబాదు విమానమున బోవచ్చునుకదా?
పచాకో : నీ నిమ్న ద్రుష్టి న జూచి పెద్దలను ప్రశ్నించరాదు.
మణి : నిమ్నద్రుష్టి అనగా సెలవివ్వండి తెలుసుకుంటాను.
పచాకో : నువ్వు నడుపుతున్న కారు గరిష్ట వేగము గంటకు 250 కిలోమీటర్లు
పూనాకు హైద్రాబాద్ దూరము 450 కిలోమీటర్లు కారులోనే పోవచ్చుకదా ?
మణి : అవును 2 గంటల్లో చేరిపోగలము
పచాకో : మూర్ఖుడా! 5 గంటలు పట్టును 100 కిమీ వేగము దాటినడుపుటకు అవకాశము లేదు. హెలికాఫ్టర్ వేగము ఎంతో తెలియునా ?
మణి : తెలియదు
పచాకో : విమానము కొరకు వేచి యుండు సమయములో సగము వెచ్చించిన హైదరాబాదు చేరవచ్చు .
మణి : అర్ధము కాలేదు
పచాకో : అనగా హెలికాఫ్టర్ అరగంటలో పోవు దూరము 450 కి మీ బి ఎం డబ్ల్యు ఎం 8 కారు ఖరీదు ఎంతో తెలియునా ? హెలికాప్టర్ ఖరీదు ఎంతో తెలియునా?
మణి : తెలియదు
పచాకో : ఎం 8 ఖరీదు 2. 5 కోట్లు , హెలికాఫ్టర్ ఖరీదు 1. 5 కోట్లు ,
మణి : మరి ఈ కారుకు బదులు హెలికాఫ్టర్ కొనవచ్చును కదా ?
పచాకో : హెలికాఫ్టర్ అద్దె ఎంతో తెలియునా ? నిమిషమునకు 1200 వందలు. ఈ లెక్కన హైదరాబాదు బోవుటకు ఎంతగును ?
మణి : అయ్యా నాకిప్పుడు అర్థమైనది , నిమ్న ద్రుష్టి అనిన.
పచాకో : సెక్రెటరీ పదవి ఆమె ఎప్పుడో తప్పించి సోదరభావం కలుగ జేసినది. ఇందాక ఆమె మరాఠీ లో నాతో అన్న మాటలకు అర్ధము "మీరు ఎప్పటినుంచో నాలుగు రోజులు సెలవు అడుగుచున్నారు ఒక వారము రోజులు మీరు పోయి రండని " నేను వాస్కోడగామ పోవుచున్నాను.
మణి : ఆయనికా ఎక్కడున్నాడండి ? ఎప్పుడో చచ్చి పోయాడుకదా !
పచాకో : ఆంద్రులకు నమూనా వలే నున్నవే! అది గోవా వద్ద నున్న ఒక వూరు అది మావూరు.
విమానాశ్రయ అధికారి వెనుకకు మరలుచున్నాడు పైలెట్ యంత్రమును ప్రేరేపించెను కొద్దీ క్షణములోనే యంత్రము ఉద్యమించెను. చూచువారికి అది కన్నుల పండుగగా యున్నది.
సీ. ఘనముగ రెక్కలు గ్రక్కున ద్రిప్పుచు
ఉర్రని యంత్రఘో షుగ్గ డించ
గళ్ళువ డచెవులు క్వణము హెచ్చగ
త్రుళ్ళివ డజనులు తకథక హోరు
ధూళిదూ సరంబులు దెగరేగు చుండ లే
చె నల్లన తేలుచు జాల మెల్ల
అల్లాడ మొక్కలు, అగములు బిక్కఛా
వంగనిం గినచుక్క వోలె సాగె.
సగము తెరచి పేటికనున్న స్వర్ణా భరణమా! సముద్ర వర్ణ చేలమునున్న అరుణకిరణమా!!
సరస తత్వసార శృంగార సంసృష్టి (కలయిక)కెరటము నింగికెగిసెను. అదే సమయంలో చెన్న పట్నమున అంగయారు కన్నె వాహనము పోవుచుండెను.
చూతురు జనులు దినమంతా రకరకాల దృశ్యాలు, దర్శించును జీవిత కాలంలో భిన్నమైన ప్రాంతాలు.కానీ కళా హృదయంతో చూచుట, చూసిన దాన్ని చక్కగా వర్ణించుట మీకే సాధ్యము. అందము, వ్యక్తిత్వము కలిసిన వ్యక్తిగా అరుణ తారను చక్కగా వర్ణించారు.
ReplyDeleteకావ్యము లస్పృశించు కరములు కరములు
Deleteరచనలకు స్పందించు మనసు మనసు
పాండిత్యము ను మెచ్చు మెప్పు మెప్పు
సాహిత్యము కూరుచు పొత్తు పొత్తు
నమస్కారమండీ
ReplyDeleteభాషా సౌందర్యం,
కథన చాతుర్యం
సమపాళ్లలో రంగరించి
అక్షర సేద్యం చేస్తూ,
సాహిత్య వనాన్ని
నిత్య శోభాయమానం చేస్తూ,
మీరు అందిస్తున్న
భారత వర్ష
మీ బహుముఖ ప్రజ్ఞకు
సునిశిత పరిశీలనా శక్తికి
నిదర్శనం అన్నది
అక్షర సత్యం.
విలక్షణ శైలితో,
విశేష కృషి సల్పుతూ
మీరు కొనసాగిస్తున్న
ఈ అక్షరయజ్ఞం
శుభదాయకమై
అచిరకాలంలోనే
అశేషాంధ్రులకు
చేరువ కావాలని
మనః స్ఫూర్తిగా
ఆకాంక్షిస్తూ,
అభినందనలతో
నమస్సుమాంజలి.
నాలుగు రోజులు కాకముందే 50 ఎపిసోడ్స్ చదవటం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురిఅయ్యాను. కోటికొక్కరు మీలాంటివారుండచ్చు (లక్షకి ఒకరుండడం కూడా అసంభవం ) కడుపు నింపేది అన్నం మనసు నింపేదిమాట. మీ మాట ఈ కావ్యంపై శ్రీ గంధంలా చల్లని పరిమళాన్నిగుప్పించింది. Anil garu మీ విద్యా తేజస్సుకు నా వినమ్ర ప్రణామాలు.
Delete