బసవడికి చెన్న పట్నమున పెద్ద సంస్థ నందు ఉద్యోగమాయెను.. బసవడు త్వరలో విశాఖపట్నమును వీడిపోవుచున్నాడు. కావున అతడింటఒక చిన్న విందు ఏర్పాటు చేయబడెను. సర్రాజు బుచ్చమ్మ గార్లు ఆనందడోలికల్లో తెలియాడుచుండిరి. విశాలమైన వసారా గదిలో సోఫాలు వేయబడినవి. మిత్ర బృందంతమంతయూ మరల కలుసుకొనెను.
సర్రాజుగారికి ఆనందమతిశయించి అందరూ స్థిరపడిపోయినట్లు ఊహించేసుకొని : అందరి చదువులు ముగిసెను , బసవడికి ఉజ్జోగమొచ్చెను. విదిష దైవజ్ఞురాలు అయ్యెను. లకుమ నటి అయ్యెను. అగస్త్య లకుమ డైరెకర్ అయ్యెను , వర్షుడవధాని ఆయెను.
మాలినిగారు: లకుమ ఇంకా కోర్స్ చేయుచున్నది, అవధానం వృత్తి కాదు
అగస్త్య : నేను డైరెక్టర్ ని కాను. లకుమ కి డైరక్ట్ గా కూడా ఏమీ కాను .
బుచ్చెమ్మ గారు: ఎందుకుకావు పెళ్లి చేసుకుని మొగుడివి అవుతావు
బుచ్చెమ్మ గారు : ఏవమ్మా చేసుకుంటావా ?
లకుమ : ముందు వృత్తిలో స్థిరపడాలికదా .
రాఘవుడు: నేను అమెరికా మరలబోను రెండవమారు కూడా వెళ్లి మోసపోయి తిరిగి వచ్చినాను. ఇక్కడే సొంత సంస్థ ప్రారంభింతును.
మాలిని గారు: మీరు చెప్పినది ఒకటి నిజం అందరి చదువులు ముగిసాయి
బసవడికి సిద్ధాంతి గారు వచ్చి వేదాశీర్వచనమును ఇచ్చినారు.
విదిషను పిలిచినారా? మరచినారా? అని లకుమ బసవడిని అడుగగా “ఆమె ఇప్పుడు పెద్దమ్మ అయినది. ఆమెను చూచుటకు రోజుకి అనేకులు వచ్చుచుందురు ఇప్పుడు వారి ఆస్తి అంతస్తు మారి పోయెను ఆమె వచ్చునని ఆశించుట తప్పు.” అని బసవడనెను “ఇంకా నయము పిలుచుటయే తప్పు అని అనలేదు ఆమెకి సమస్య లేనిచో ఆమె తప్పక వచ్చును. ఎవరేమనినారో ఏ ఆటంకమున్నదో” అని వర్ష వైపు లకుమ చూచెను. "మీ అమ్మగారు ఎట్లు ఉన్నారు అని అరుణతార గూర్చి అడిగి మాట దాట వేసెను. బుచ్చమ్మ గారు అందరికి విందు భక్ష్యములను అందించిరి.
తరువాత విందారగించుచూ గుంపులు గుంపులుగా విడిపోయి అందరు ఆంతరంగిక చర్చలకు తెర తీసిరి. బసవడు అగస్త్య రాఘవ ఒక చోట చేరి పళ్ళెములు పట్టుకొని తినుచుండగా మంజూష వచ్చి బసవడు పై విరుచుకు పడెను " ఏమి నాయనా విదిశపైన చతుర్లు ఆమె గురించి నీకేమి తెలియును. అని ఆమె ఎంతమంచిదో చెప్పుచూ బసవడి పై దండకమును చదవనారంభించెనుఇంతలో లకుమ" నీ వదిన అనిన ఎంత గారమమ్మా" సన్నాయి నొక్కులు నొక్కెను.
"కొద్దిరోజులక్రితమూ ఆమె వచ్చి ధనము ఇవ్వజాపగా వర్షుడామెను మొఖంచూ పవలదని కసిరి నాడు " అని చెప్పుచూ నేనునూ అట్లే ఇవ్వబోగా అదృష్టమేమో గానే కేశవుడు వద్దని కళ్ళతో సైగ చేయగా నేను విరమించుకొని నాను” అని అగస్త్యుడు చెప్పెను.
భారతవర్ష కు అంత కష్టము ఏమి వచ్చెను ? అని అప్పుడే వారివద్దకు వచ్చిన సందీపుడు అడిగెను. అసలు ఆరు నెలల నుంచి నువ్వు కనబడుటలేదు ఎచ్చటకు పోయినావు? అప్పుడే బుచ్చెమ్మగారు మైసూర్ పాకులు పళ్ళెము లందు పెట్టుటకు వచ్చిరి. బైరెడ్డి పుణ్యమా అని పారెళ్లి , ఎచ్చటో దూరినాడు అని రాఘవుడు జెప్పెను అప్పుడు అగస్త్యుడు “భారతవర్ష పుణ్యమా అని వెళ్ళుపొచ్చినాడా?” యని అదే యాసలో అడిగెను.
భారతవర్ష ఒక కావ్యమును వ్రాయుచున్నాడు అందులకే కనిపించుటలేదు అని నాకు తెలియును ఇది చెప్పుటకు ఇంత బెట్టు చేయుచున్నారు నేను కూడా కావ్యమును వ్రాసెదను అని రాఘవుడు అనగా, రాఘవా నీవు ఎదో పద్యము వ్రాసినావని చెప్పితివి కదా అని అగస్త్యుడు గుర్తు చేసెను. " అవునవును నేను ప్రతిన బూనిన విధముగా తెలుగు భాషను అభివృద్ధి చేసితిని.” అనెను “నీ తెలుగును అభివృద్ధి చేసినావా లేకా తెలుగు భాషనే అభి వృద్ధి చేసినావా?” అని కేశవుడు అడుగగా అతడి వైపు రాఘవ మిర్రి చూసెను.
రాఘవుడు తాను వ్రాసిన పద్యము చదవ ప్రారంభించెను “ఆయ్యో ఎంత త్వరగా గడిచిపోయెను బాల్యము , యవ్వనము అని అర్ధమొచ్చు ఉత్పల మాల పద్యమును రాఘవు డు చదవగా, అగస్త్యుడు “ ఓరీ! నీ తెలుగు తెగలడా. అందు గణములు ఎచ్చ టేడ్చెనురా? కేశవుడు “బాల్యము గడిచింది యవ్వనమింకనూ ఉన్నదికదా!” అనెను. రాఘవుడి మోహము మాడెను అందరూ నవ్వుకొనిరి. “భావమెట్లుండినా పద్యము పద్యమే కదా ఇదిగో ఇంద్ర చంద్ర గణములతో వ్రాసిన పద్యము అని కాగితమును. చూపెను. ఇంద్రగణములు అనిన తెలుసుగానీ చంద్ర గణములు తెలియవని కేశవుడనగా. చంద్రగణములు అసలు గలవా ? అని లకుమ వర్షుని ప్రశ్నించెను. ఏమో చంద్రమండలమునకు పోయి తెచ్చి నాడేమో? అని వర్షుడు అనెను. ఈ సారి పిన్నలూ పెద్దలూ అందరూ నవ్వుకొనిరి.
No comments:
Post a Comment