Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, October 10, 2020

పెద్దలు చూడని పిల్లల భాద

మోటు సినిమాలు చూసి నాటు పద్దతులలో జీవిస్తూ సమాజం చెడిపోయింది అని ఇతరులని  దూషించినాద్వేషించినా లాభమేముంది, నీ తీరు మారందే!  నీతీరు మారాలంటే నీ ఆలోచనలు మారాలి అంటే ఎవరో నిన్ను ప్రభావితం చేయాలి.  


 

ఎవరు చేస్తారు ? నీ భాషానీ చదువా  ?

స్టేరిఫికేట్స్  కోసం చదువుకొన్న చదువేజ్ఞానం కోసం చేసిన పుస్తకపఠనం ఏమీలేదు.

పరీక్షలముందు  చదివి గుర్తు పెట్టుకొన్న భాషే నాలుగు ముక్కలే కదా

 నీ భాష తేనెలూరు భాషా ? జీవితంలో వాడేది సినిమా భాషే కదా !

సినిమావాళ్లు భాషా దుర్గంధాన్ని వాళ్ళ మానసిక వైకల్యాన్ని నీకు అంటించారు , భాషాద్వారా అది నీలోకి  ఇంకింది. హీరో లో రౌడీని చూపుతూ , పోకిరి తనాన్ని చూపుతూ అవే  సినిమా పేర్లుగా వాడుకుంటూ  పోకిరీ వాడే మహానుభావుడు అన్నట్టు చూపి పోకిరీ తనం అనే మాటకి అర్ధాన్ని మార్చేస్తూ , కుటుంబ గొప్పలు భారత రామాయణాలుగా మధ్య మధ్యలో  వినిపిస్తూ  మీచేత చప్పట్లు కొట్టించుకుంటూ. హింస, మోసం , వెకిలి హాస్యం చూపి అసభ్య బూతు చేష్టలను  శృంగారం గా చూపి నిన్ను రంజింపచేస్తున్నారు.  

హీరోయిన్ చిన్న బట్టలు వేసుకోవాలిబట్టలు కనిపించకూడదు  ఆమె  తెలివి తక్కువ తనమే కనిపించాలి , బూతులు మాట్లాడాలి, హీరో ఆమెను ఏడిపించాలి  ఇవన్నీ లేకపోతే నువ్వు రంజించబడవు అని పబ్లిక్ గా సినిమావాళ్లు  చెపుతున్నారంటే మనం స్థితి లో ఉన్నామో?   వాళ్లు  చేసే ఒకటీ అరా మంచిపనులు  చూసి వాళ్ళను మెచ్చే  కూలిపోయామో, ఒక్క కావ్యం చదివేదాకా తెలిసిరాదు.

మంచి సాహిత్యాన్ని మనసులోకి ఎక్కించలేవుగానీ 

జగన్, పవన్ , మోడీ లను అందలం ఎక్కిస్తావు.

 వాళ్ళను కాపాడుతుంటావు ఇతరులను తిడతావు 

 తాత్కాలికంగా ఎవరినో తిట్టినా ఎవరినో పొగిడినా  లాభంలేదు

 అందలమెక్కిస్తే వారు అందరినీ మారుస్తారా

మార్చగలరామార్పు అంటే  తాయిలాలా? చదువంటే మార్కులా ?

మనం  ఎలాటి సాహిత్యాన్ని ఆదరిస్తే అలాటి సమాజాం మన కళ్లముందుంటుంది

పాకిస్తాన్ జిందాబాద్ అని  బెంగుళూరు లో అమూల్య అరిచి దేశద్రోహం కేసులో జైల్లో కూర్చున్నా , కన్నయ్య  కుమార్ , అనిర్బన్ భట్టాచార్య , ఉమర్ ఖలీద్ లాంటి దేశద్రోహులు  జైళ్ల పాలయ్యినా , దాని వెనక అగోచరంగా ఉండే శక్తి సాహిత్యం

ఒక కావ్య జ్ఞానం తో చూస్తే తప్ప  సినిమా నిన్నేం చేస్తునాదో  నీకు తెలియదు 

నువ్వు నీ పిల్లలని నువ్వు  ఏంచేస్తున్నావో కూడా నీకు  తెలియదు

4 comments:

  1. నిజాలు లేవు సొంత జ్ఞానం మృగ్యం
    సోషల్ మీడియా ద్వారానే జనాల ఆలోచన
    ఇంకెటు పోతుంది సాహిత్యం

    ReplyDelete
  2. సొంత జ్ఞానం మృగ్యం
    సోషల్ మీడియా ద్వారానే జ్ఞానం
    కొత్త మేధావులు తయారు
    ఇంకెటు పోతుంది సాహిత్యం

    ReplyDelete