Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 4, 2020

Bharatavarsha 46

 ఆరోజు విదిషను కలుకొనిన సత్తి రాజు (మంత్రి బంధువు)  కొన్ని గంటలు తన గోడు చెప్పుకొననెను.  విదిష ఓర్పుగా విని “ నావద్ద  మహిమలే మియూలేవు అమ్మను వేడి జెప్పవీలున్నచో చెప్పదను” అతడిని  మరుసటి వారము రమ్మని చెప్పెను. 

అతడు వెడలు సరికి మధ్యాహ్నం అయింది భోజనవేళాయెను భోజనమునకు రావలసినదిగా వంటవాడు వచ్చి పిలి చెను. నాకు ఆకలి అయినచో వత్తును మరల రావలదని చెప్పి గట్టిగా తలుపు విసిరి కొట్టెను. అతడు మరల తలుపు కొట్ట  బోవుచుండగా చలం గారు "అమ్మ ను ఇబ్బంది పెట్టకుండా మనము పని నడిపించవలెను " అని చెప్పి, “నేను ఈ రోజు రాత్రికి రాను పనిపై బోవు చున్నాను విదిష కు వినిపించునట్లు చెప్పి  సత్తిరాజుగారితో కలిసి భోజనము చేసి అతడితో కలిసి బయటకు వెళ్లిపో యిరి. 

ఎవరో తలుపు కొట్టుచున్నారు  విదిషకు నిద్రాభంగమాయి పట్టరాని  కోపము వచ్చెను. పోయి విసురున తలుపు తీసిన ఆమె ఆ వచ్చిన వ్యక్తి కా ళ్ళకు నమస్కరించెను

పరిమళ బాబా అని ఏడుపు అందుకున్న విదిషను పైకి లేవనెత్తి అన్నం తిన్నావా ? అని వణుకుతున్న స్వరం తో అడిగారు . మీరు తిన్నారా బాబా ? అని విదిష అనగా 

నేనడిన ప్రశ్నకి సమాధానం ఇచ్చి  ఎదురు ప్రశ్నలు వేసి అల్లరి చేయనని చెప్పావు కదా 

అయితే నేను అన్నం తినలేదు బాబా మీరు తింటే నేను తింటాను 

ఈ రోజు నేను అన్న తినమ్మా ఉపవాసం 

అయితే కనీసం పళ్ళు అయినా  తినాలి. అప్పుడే నేను అన్నం తింటాను 

 పళ్ళు లేని వాడు పళ్ళు ఎలా తింటాడు  పండు ముదుసలి ని కదా అని బోసి నోరు చూబించాడు

రాజన్నా రసం చేసి పట్రా బాబాగారి అని చెప్పగా  " రాజన్న వంటగదిలో తింటన్నాడండి " అని చెప్పుచూ పనామె మారెమ్మ  తెచ్చి రసం ఇచ్చెను.  పరిమళ బాబా తో కలిసి  తానూ కూడా రసం త్రాగి తన పూజా మందిరం లోకి బాబాగారిని తీసుకుని పోయెను.  

రాజన్న: మారెమ్మ ఈయన నిజంగా పరిమళ బాబా అంటావా ? అంటే .. ఈయన ఎక్కడుంటే అక్కడ సువాసన ఉంటాది అంటారు, నిజమేనా ?

మారెమ్మ: నీ మంగళవారం బుద్దులు చూబించేవనుకో చెంబెట్టి మొట్టేస్తాను , ఎరా ముక్కు పనిచేస్తున్నది కదా , చక్కటి మొగలి పువ్వుల వాసన వస్తంటే మొక్కు పోయిందా ?

రాజన్న: అదికాదె మారి అంటే  బజార్లో కొనుక్కొని ఏదైనా రాసుకోంచ్చేస్తన్నాడేమో ?

రాజన్న: అమ్మా! అయితే తెలీకడిగితే మొట్టేస్తావా ?

మారెమ్మ: మొట్టేయాలా చీరేయాలా , ఎదవ బుద్ధి  బాబాగారి కడ డబ్బే వుండదు అసలు , డబ్బు  ఎవరిచ్చినా పుచ్చుకోడు , ఆ దేవుడు తిండి తినడు. 

మిగితా పనివాళ్ళు కూడా నేలమీద కూర్చొని తింటున్న రాజన్న ని మొట్టి కాయలు వేస్తున్నారు " తినే వాడిని కొట్టకూడదు తెలుసా ? తినేవాడు దేవుడితో సమానం అన్నాడు  

                                             ***

బాబాగారు కుర్చీలో కూర్చోండగా విదిష అతడి కాళ్ళ దగ్గర కూర్చొన్నది

బాబా గారు నన్నూ మీతో తీసుకుపోండి నేనూ వచ్చేస్తాను ?

హ.. హ.. హ. ఎక్కడి తీసుకెళ్లానమ్మా.  నేను అలా ఊర్లు తిరుగుతుంటాను . ఎక్కడికని వస్తావు. చక్కగా ఇక్కడే ఉండి 

ఉండి  అందరినీ మోసం చేయనా ? ఇక్కడ నాకు  ఉండాలని లేదు. 

నువ్వు ఎవ్వరినీ మోసం చేయడం లేదు, నీకు తెలిస్తే చెప్తున్నావు లేకుంటే పంపించేస్తున్నావు. నువ్వు మంచిదానివి కనుకనే నేను రాగలుగుతున్నాను. 

బాబాగారి కాళ్లకు  ప్రణమిల్లింది విదిష. 

నీవల్ల ఎవరికైనా అపకారం జరగకూడదని ఇంత తపిస్తున్నదానివి ఇతరులను ఎలా మోసగించగలవు ? యోగ సాధన చేయుచున్నావా ? లింగాంగి సాధన  చేసిన మంచిది.

యోగసాధ  చేయుచున్నాను  లింగాంగి సాధన  ఉపదేశించండి అని విదిష అడుగగా

కుండలినీ యోగము జేయవలెనని యున్నది. కుండలినీ యోగము కడు  సంక్లిష్టమైన దే  కాక దుర్లభము  కోటికొక్కడు కృతకృత్యుడగును. అయిననూ జెప్పెదను వినుము , కానీ లింగాంగా సాధన నీకు సరియయినది.  నీకింకనూ కోరికలు న్నవి అవి తీరిన పిదప  కుండలిని జేయవచ్చు యని ఇట్లు చెప్ప దొడగెను

వెన్నుపాములో యున్న  మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ.   కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు. 

మూలాధార చక్రము అనిన నేమి ? అది  ఎచ్చటుండును ?

 ఆసన  స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమల మిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొని యున్న దనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్థూల దేహం మెడలో ధరించి ఆరాధించేది ఇష్టలింగం. దీనిని ఆరాధించడమే ఇష్టలింగా రాధన.  స్థూల దేహం ఇష్ట లింగాన్ని అర్చించినట్లు సూక్ష్మదేహం ప్రాణ లింగాన్ని, కారణ దేహం భావలింగాన్ని ఆరాధించడం సాధన. స్థూల దేహం లింగానికీ అభేద భావన కలిగే విధంగా లింగార్చన చేయడం లింగాంగి సాధన. అర్ధమయినట్లే యున్నది కానీ అర్ధము కానున్నది 

అర్ధము అయి ప్రయోజనము లేదు సాధనతోనే ప్రయోజనము సిద్దిన్చును. 

పరిమళ బాబా వెడలెను. కానీ పూజా మందిరమున మొగలిరేకుల పరిమళము అట్లే యుండెను. 

No comments:

Post a Comment