Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, March 9, 2021

THE END _ BHARATAVARSHA

జగములేలు ఖగపతి సెగలు రేపుచుండ, కింజల్కమందు ఖగము వలె హేర్లి డేవిడ్సన్ రహదారిపై  నెగురుగుచుండెను. మరిగిన రహదారుల లెక్కచేయక వాహన చక్రములు విష్ణు చక్రములవలె తిరుగుచు వాయువేగమునసాగుచుండెను.

తుమ్మెదరెక్కలవలె నల్లని కోర  మీసములుకోటేరు ముక్కుదృఢ దేహమునుగప్పిన ధవళ ధోతి, అప్పుడప్పుడు విచ్చుకొను గులాబీపెదవుల మధ్య దాగిన మంచిముత్యముల వంటి పళ్ళులోచన మోహనముగ వర్షుడు చిరునగ వుల సరిగమలు పలికించుచూ మదన గోపాల మహిమను  గానము చేయుచూ  సాగుచుండెను

                                                                                ***

కత్తిపూడి కూడలివద్ద ధోతి దారి యైన ఒక  యువకుడు చేయి చూపి  సైగ చేయగా వర్షుడు వాహనమును నిలిపి అతడినెక్కించుకొని “ఎం దాక పోవలెను?” అని వెనుకకు తిరిగి అడిగెను అన్నవరం దేవస్థానమునకు పోవుచున్నాను అని ఆ యువకుడు చెప్పగా. వర్షుని మదిలో కోకిల స్వరము వినిపించెను వెనుకకు తిరిగి అయ్యవారా అని నవ్వి  ముందుకి సాగుచుండగా అయ్యవారు “మిమ్మల్ని ఎచ్చట చూసినానో గుర్తురాకున్నది,  బాగా సుపరిచితమైన మొఖము. అనుచూ  కొలదిసేపు తత్తర పడి అతనెవరో స్ఫురించి “ మీరు భారతవర్ష కదూ “అని  మిక్కిలి కుదుపుకు లోనైన అతడిని ప్రక్కనే ఉన్న ధాబా వద్ద వాహనమును నిలిపి దింపి అతడి పక్కన నులక మంచము పై కూర్చొని తే నీరు సేవిం చుండగా 

 అయ్యవారు మరల “మీరు విశాఖ కలెక్టర్ భారతవర్ష ఐ ఏ ఎస్  కదూ ? మీరు  ఎచ్చటినుండి వచ్చుచున్నారు?” మీరు ఈ ద్విచక్రిక పై ఏల  పోవుచున్నారు? నాకంతయూ అయోమయముగా నున్నది.” అని అడగగా వర్షుడు  నేను భారత వర్ష ఐ ఏ ఎస్ అనునది నిజము కానీ కలెక్టర్ను కాను, రాజీనామా చేసిన స్వేచ్చాజీవిని.” ఆమాటలు విన్న అతడు మరింత దిగ్బ్రాంతి ని పొంది ఆయూ రాజీనామా చేసినారా?  కలెక్టర్  ఎంపికగుట ఎంతకష్టమో నాకు తెలుసు ఎందు కనగా నేను నెత్తురోడ్చిననూ  కాలేకపోతిని." " అదేమంత కష్టముకాదు మరొక సారి ప్రయత్నించినచో తప్పక గెలు పొందెదరు ."   " అయ్యా మీ ఉదారబుద్ధికి మంచి మనసుకి నమస్కరించవలెను.  ఐ .ఏ ఎస్  కి కూర్చొను పది  లక్షల అభ్యర్థులలో గెలుపొందువారు 180 మంది అనగా 0 . 01 శాతము కంటే తక్కువ” 

మీరు ఒక సంవత్సరకాలం కంటే తక్కువ ప్రజా  సేవలో ఉన్నట్లు తోచుచున్నది. ఉద్యోగములో చేరిన ఎంతకాలమునకు రాజీనామా చేయవచ్చు?'

రాష్ట్ర పతికి ఇచ్చు ఒప్పందం లో  ఇంత కాలముద్యోగమందుండవలెనని కనీస కాలపరిమితి విదింప బడలేదు. నచ్చని యెడల ఎప్పుడైనా రాజీనామ చేయవచ్చు. 

ఇంకొక్క సందేహము అని అయ్యవారు అనుచుండగా వర్షుడు “ మీరు నాకు ఎక్కువ గౌరవమును చూపుచున్నారు . నేనిప్పుడు కలక్టర్ను కాను అని అనగా " అయ్యా మీరు కలెక్టర్ కాకున్ననేమి  ప్రజాసేవకులే , కవులే. సుకవి కలెక్టర్ కంటే గొప్పవాడు." 

మరల వారు  యంత్ర చక్రిక నధిరో హించిరి దేవస్థానము చేరువరకూ వర్షుని స్తబ్దు ఆవహించెను. గానం చేసిన కోయిల స్థానములో మువ్వకట్టి మయూరము ఆడుచుండెను. సత్యన్నారాయణ స్వామి వారి  దేవస్థానమువద్ద బండిని నిలిపి వర్షుడు అయ్యవారి పాదములకు నమస్కరించి అయ్యవారు నా తరుపున దేవునికొక విన్నపము " సతీ సమేతుడనై నేను స్వామిని దర్శించవలెను. అయ్యవారు " తథాస్తు "

ఆకాశము చెగావిరంగు నలుముకొనెను.  విదిష  కావ్యకన్య వలె కమ్మని కవితవలె  వర్షుని గుండెలలో రంగులద్దు చుండెను. తీపి పెదవుల విదిష తేనె నిండిన కుసుమమే  అతడు చిలిపి మధుపమే. చూచుచుండగానే ఆకాశము తన  చీర మార్చుకొన్నది. ప్రకృతి అంతా రవి కిరణాల సెగలో కాగి శశి కిరణాల  నిశి కౌగిలిలో ఒదిగి విశ్రమించుచున్నది.   ప్రక్రుతి అందాలు తన కావ్య నాయికను  తలపింప జేయుచుండగా వర్షుడు వేగనియంత్రణిని ఆత్రముగాలాగెను.

                                                                        ***

వాహనము సబ్బవరము సమీపించుచుండెను. వాహన కాంతిలో  ఆమె కన్నులు నిశ్చల నిర్మల యామినీ తారకలవోలె మెఱిసినవి. వాహనము దగ్గరకి పోవుచుండగా నామె వివిధాంగములు ప్రస్పుటమగుచూ  తెల్లని మేల్పట్టు బనారసులో వసంతమునాటి మల్లికాలతవలె మిలమిలలాడినది. ఏవరీ సుందరి ఇంత మరులు గొలుపుచున్నది. ఆమె చేతిని ఊపగా వర్షుడు వాహనమును నిలిపెను. “విదిషా నీవా?”

“మదన గోపాల మహిమ” కావ్యమును  బల్లిపాడు మదన గోపాల స్వామికి అంకితమొనరించి అన్న సంతర్పణ గావించి వచ్చుచున్నావు.” వర్షుడు " నీకెట్లు తెలియునని అడుగుటకు సాహసము చేయలేక  “ఈ చీకటిలో ఇచ్చట ఏల వేచియు న్నావు?” అని అడిగెను.  అప్పుడే చెప్పితిని ఈ వాహనముపై నితో వచ్చుటకు సమయము పట్టునని, మాట ఇచ్చినాక తప్పునా! అనుచూ “నీవాహనము పని తనమును చూపుము అని వాహనమెక్కి వర్షుని హత్తు కొనగా వర్షుడు ఆరవ వేగ చక్రముపైకి క్రమక్రమముగా యంత్రమును మార్చి  విరబూసిన వెన్నెలలో విహారము చేసెను. అట్లు అల్లిబిల్లిగా ప్రయాణము చేసి” వెన్నెలలో విహారమెట్లున్నది?” అని అడుగగా విదిష ముప్పిరిగొనుచు “జాబిలిపై విహరించినట్లున్నది!”  హ్రుదయము మిక్కిలి రంజితమయ్యెను  ఇంక చాలించి ఆశ్రమమునకు పోవలెను”  అనుచూ వర్షుని ఆశ్రమమునకు తీసుకొని పోయెను. 

పూదోటలో విదిషవెనుక వర్షుడు నడుచుచుండెను. విదిష వెన్నెలలో ఆడుచూ పొదలమాటున దాగి దాగుడు మూత లాడుచుండెను. చెట్టు చాటున నక్కి ఒకసారి,  గుడివెనుక దాగి మరొక సారి వర్షునికి చిక్కెను. మూడవసారి కిలకిలా నవ్వుచూ పరిగెత్తి పోయి పొదలమాటున నక్కెను. వర్షుడు ఎంత వెతికిననూ ఆమె జాడ కనిపించ కుండెను. 

వెతికి వెతికి వర్షుడు వేసారెను  “శేషాచలము గారెచ్చట?” ఆ ఆలోచనే వర్షుని విద్యుత్ ఘాతమువలె తాకెను. అతడు పరుగు పరుగున భవంతిలోనికి పోయి చూడగా గబ్బిలములు ఎగురుచుండుట చూచి మనసు చలించి మరల తోటలొకి వచ్చి  భ్రమరములు వాలలేనిచో పుష్ప ములేల! ప్రక్రుతే లేనిచో ప్రపంచ మేల! వెన్నెలే లేనిచో చంద్రమేల!  అని వగచి పెద్దగా విదిషా విదిషా చాలించుము నీ ఆటలు అని రంకెలు వెయుచుండగా అటుగాపోవువారు అతడికి శేషాచలము సవభేతాళము చేయుచూగ్రామస్తుల కంటపడుటచే పలాయనము చిత్తగించెను. విదిష శరీరమును వదిలి పది రోజులు అయినదని తెలగపగా వర్షుడు అచ్చటే కుప్ప కూలెను.

                                                                           ***

సంక్రాంతి పండుగ ఆనందనిలయము:   మంజూష, వడిలో నున్న పిల్లవాడితోనాడుకొను చుండగా, పైడమ్మగారు ఆమె నుండి పిల్లవాడిని తీసుకొని “అంతా మేనమామ పోలిక!”  అని ఎత్తుకొని ముద్దడినారు. బాబు ఏడ్చుచుండగా ఆమెనుండి సందీపుడు  పిల్లవాడిని తీసుకొని ఊరడిన్చుచుండెను.  

లకుమ వడిలో పాపను ఊపలేక ఊపుచూ ఆడించుచుండగా,  అరుణ, క్రిష్ణ, వివేకులు చూచి నవ్వుచుండిరి. పిల్ల మంచి కళగా యున్నది తల్లివలె అందగత్తె అగును సినిమాలలో చేర్చిన ఎట్లుండును? అని వివేకుడు లకుమను ఆటపట్టిన్చుటకు అనగా లకుమ పక్కనున్న ఆటవస్తువును కోపముగా అతడిపైకి విసిరివేసెను. ఇంకొక్కసారి ఆమాట అన్నచోఅని భర్తను హెచ్చరిచుచుండగా అరుణతార “ఇప్పుడర్ధమైనదా కన్నతల్లిబాధ”అని లకుమ చెవినందుకొనెను . 

పార్వతి కూతురు పాలకొరకు ఏడ్చుచుండగా పార్వతి స్తన్యమిచ్చుచుండెను. బసవడు పార్వతిపై ఆసుకవిత లల్లుచుండగా పార్వతి సిగ్గుతో ముకుళితమగుచుండెను.  సుందరి కూతురుని మీనాక్షి తన వడిలో వేసుకొని ఊపుచుండగా సుందరి " అత్తమ్మా నీకెందుకు శ్రమ? సంగీతము చూసుకొనక” అని పిల్లను తీసుకొన బోవుచుండగా మీనాక్షి సుందరిని ఒక్క కసురు కసిరి “వలసినచో సంగీతము నీవు చూసుకొనుము.” అనెను. సుందరి అగస్త్యునితో “ఏమండీ పిల్లని తీసుకురండి! “ అని ఆజ్ఞాపించగా, అగస్త్యుడు తల్లివద్దకు పోయి  “అమ్మా!!!” అని పెద్దగా రంకెవేసి మీనాక్షి తీవ్రముగా చూడగా వేడుకోలు స్వరముతో  “అమ్మా! నన్నర్ధము చేసుకొనవే చెప్పిన పని చేయకున్నచో అది జీతమిచ్చునా?  దానిక్రింద పనిచేయుటకు నీవే ఏర్పాటు చేసినావు కదా!”  అని అగస్త్యుడు తల్లిని బ్రతిమాలుచుండగా యమున మీనాక్షి  గలగల నవ్వుచుండిరి.  మాలిని పైడమ్మగారిమొఖలు తప్ప అందరి మొఖములూ కళకళ లాడుచుండెను. 
మాలిని : వర్షుడు ఎటుబోయినాడో ఆరు మాసములైననూ జాడలేకుండె ను. నాఇంటి దీపము నా కంటి వెలుగు ఎచ్చటుండెనో! నిరర్ధకమై జీవితమును భరించుట దర్భరముగా నున్నది.” 
పైడి తల్లి : నా కూతురెలిపోనాది, అయినా నీను  దైర్నంగా ఉంటన్నాను. ఎందుకు దిగులడిపోతన్నావు,  నీకొడుకుని ఎలాగైనా ఎతికి ఒట్టుకొత్తాది అది సామాన్నమైన గుంటనుకొంటన్నవేటి!  నీ కొడుక్కంటే రెండాకులెక్కువే నాకూతురు . ఏటనుకొంతన్నావు!

ఆమె అట్లను చుండగా ఏదేవతల వరమో నందిని వర్షుని తో  ఆనందనిలయము లో అడుగు పెట్టెను. వర్షుడు మాసిన గెడ్డముతో పాత దుస్తులలో యోగివలె నగుపించెను మాలినిగారు పోయి వర్షుని హత్తుకొని విలపించుచుండిరి ఆమె కన్నీటికి భాష ఉన్నచో అది కావ్యమే అగును. వర్షుని వైరాగ్యమును చూచి అందరూ దుఖించినారు. అందరూ నందినిని ఎంతో మెచ్చుకొనిరి. మాలినిగారు పైడమ్మగారిని కౌగలించుకొని “నీబిడ్డ రుణమెట్లుతీర్చుకొనగలను?” అని విలపించగా పైడమ్మ”  ఓలమ్మ నాను సేసినదేటున్నది, ఏంసేసినా ఆ గుంటే సేసింది,  దాన్నే అడుగు ఏటికావాలో!” అని అనగా మాలిని గారు నందిని వైపు తిరిగి నీ శ్రమ పట్టుదల అనితర సాధ్యము ఆరునెలలు ఎచ్చటకి పొయినావు? ఎట్లు సాధించినావోకదా! 
నందిని: ఆరునెలలు తిరిగి తిరిగి చివరకు వారణాసి లో వర్షుని ఒక వారము క్రితమే కనుగొంటిని.  మొండి ఘటము  ఎంత చెప్పిననూ నామాట వినకుండెను . నా అదృష్టము,  పరిమళబాబా  అచ్చటకు వచ్చుట మాకు కనబడుట జరిగి నవి. పరిమళ బాబా దయవల్ల  నీకొడుకు నీకు దక్కినాడు.   
అరుణ మీన  ”అది మా అదృష్టము, ఏమయ్యా భారతవర్షా! ఇంతమంది తల్లుల ముద్దుబిడ్డవుకదా మాకెవరికీ అందక ఇట్లు కాశీ  పోయి కూర్చొందువా ? మర్త్యుల మర్త్యులనంద లేరు అన్న విషయమును నీకు మేము చెప్పవలసి వచ్చు చున్నదే! మానవులు మానవు లను వివాహమాడుట సమంజసము  దేవతని వివాహమాడుట అ సమంజసము.  దేవతని పూజించవలెను కానీ ఆశించరాదు.”
మాలినిగారు: దేముడే  నీకొరకు ఈ చక్కని చుక్కని పంపెను. విదిష ఆశీర్వాదముతో నీవు గొప్ప కవి కాగలవు. ఆమెను ఆశించుట మానుకొనుము అది నీ స్తాయికి మించిన పని అని తెలుసుకొనుము. వర్షుడు మౌనము వీడకుండుటచే నందిని మనసువికలమాయెను, నైరాశ్యముతో ఆమె వదనము  చిన్నబోయి వెడలుచుండగా 
వర్షుడు : నందినీ!  అని వడివడిగా పోయి ఆమె చేతినందు కొనెను. 

                                                                 -0-

భారత వర్షం సారంగం పద తారంగం 
భారత వర్షం పద రంగం పద చదరంగం 
వినువీధి కెగసిన వీరతురంగం విశ్వమానవుని వీరంగం 
భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *
కౌముది లో కమ్మదనం కౌగిలిలో వెచ్చదనం
అనురాగముతో నీ మెడకి  పూసిన శ్రీ గంధం
రాగాలల్లిన ప్రణయ మారుతం , నీ మనసు కట్టిన  మంగళ సూత్రం
భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *
భారత వర్షం సారంగం పద తారంగం - 
భారత వర్షం పద రంగం పద చదరంగం -
కృతకర్మ కూర్చిన  ద్రుతవిలంబితం  
స్రుతి స్మృతి సంగమ రాగ చోదితం 
శ్రుత్యంత శోభిత కౌస్తుభం 
భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *
భారత వర్షం సారంగం పద తారంగం - 
భారత వర్షం పద రంగం పద చదరంగం -
అంబరమంటిన కవితా సంబరం 
నీలో నాలో కురిసిన వర్షం, ఒకరికి ఒకరు  అంకితం
భారత వర్షం భారత వర్షం  భారత వర్షం 

11 comments:

  1. I got goosebumps. I couldn't digest death of Vidisha Any way my blessings to Varsha and Nandini I can say only one thing I miss Bharata varsha. I hope Vidisha can meet Varsha in her next birth😢😢😢

    ReplyDelete
  2. Once again I am telling I miss Bharata varsha. 😢😢😢

    ReplyDelete
  3. కధ విషాదాంతం అయితేనే మనస్సును ఎక్కువ కదిలిస్తుంది అనిపిస్తుంది.

    ReplyDelete
  4. అడుగడుగునా విజ్ఞానాన్ని పంచుతూ, ఉత్కంఠను రేపుతూ సాగిన కధాగమనంలో, సాహిత్య ప్రయాణంలో ప్రతీ భాగము ఒక మైలురాయిగా మిగిలింది.రాధా మనోహర వర్ణనతో మొదలైన కధ రాధా మనోహరంతోనే ముగింపును అనుకొన్నాను.కానీ విరిసే మరణంతో ముగిసెను.విదిష దైవజ్ఞురాలు కనుక ఆమె నందినికి, వర్షునికి తన ఆశీర్వాదములు అందించగలదు.




    ReplyDelete
  5. ముగింపు బాధ కలిగించిననూ ఈ కథ ఒక అవార్డుకు అర్హత కల కథగా అనిపించెను.🙏🙏🙏

    ReplyDelete
  6. Vidisha is immortal, she left her body. She never died. She ascended to total divinity. Bharatavarsha is much lower than vidisha he is only mortal. With such powers as Durga she can't marry and live like house wife. It's laughable to give such a conclusion.

    ReplyDelete
  7. మీరు చెప్పినట్లు కథ విషాదాంతం అయితేనే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది శంకరాభరణం చలన చిత్రం ఒక ఉదాహరణ

    ReplyDelete
  8. భారత వర్షం సారంగం పద తారంగం.This is the last song.How's it? It's a play with words, it's our game that we rejoice dancing. It is a dance in the rain of happiness. We as mortals flow together until death

    ReplyDelete
  9. I deeply involved in the story. But I missed the logic. Thank you for conclusion. Song is nice sir.

    ReplyDelete
  10. Nice work sir.. This is the testimony of your hard work

    ReplyDelete
  11. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


    శ్రీకారం సుమనోహరమ్ముగ
    శుభాశీర్వాదమందించగా,
    ప్రాకారంబున సంస్కృతీ ఘనత
    సోపానమ్ముగా నుండగా,
    సాకారంబయి పూలబాలకలలే
    సారంగసౌధంబుగా
    ఆకారం గొనె కావ్య కన్యక భళా
    ఆంధ్రావనే మెచ్చగా

    జయహో ! భారత వర్ష!
    జయహో ! భారత వర్ష!!
    జయహో ! భారత వర్ష!!!

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete