Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 30, 2021

ఆన్లైన్ క్లాసులు - online corporatism

మొదలయిపోయాయి ఆన్లైన్ క్లాసులు.

కరోనా కదలికలను ఆపేసింది కదలికలను ఆపేసినా క్లాసులు నడపగల తోపులు కార్పరేటులు
ప్రత్యక్ష తరగతి లేని గతి , సాధిస్తాడా విద్యార్థి ప్రగతి? కొర్పో రేటు మాయలో పడ్డాక అద్భుతాలు ఆర్డర్ ఇచ్చి పార్సిల్ కట్టించుకున్నట్టే . అసలు కొర్పోరేటు ఎందుకు ? దానికి అంత రేటు ఎందుకు?

అసలు పిల్లలకి మంచి మార్కులు వొస్తాయనే కార్పోరేటు స్కూల్ లో జేరుస్తారు తల్లిదండ్రులు. అందుకే అక్కడ తెలివి తక్కువ పిల్లలకి కూడా మంచి మార్కులు ఎలా వస్తాయి?

ఒక్కొక్క స్కూల్ ది ఒక్కొక్క స్టైల్ . ఒక్కొక్కడిది ఒక్కొక్క దందా.
కొన్ని కార్పోరేటు స్కూళ్ల లో పరీక్ష పేపర్లు ముందుగానే విద్యార్థులకు సప్ప్లై చేస్తారు కొన్ని కార్పోరేటు స్కూళ్ల లో పరీక్ష పేపర్లు ముందుగానే అమ్ముతారు. మరికొన్ని కార్పోరేటు స్కూళ్ల లో టీచర్లు ఒక చేత్తో బ్లు పెన్ మరో చేత్తో రెడ్ పెన్ పట్టుకుని పరీక్ష పేపర్లు దిద్దుతారు. బ్లు పెన్ తో విద్యార్థి తప్పుని సరి చేసి, రెడ్ పెన్ తో మార్కులు వేసేస్తే తల్లితండ్రులకి చమ్మగా ఉంటుంది.
డబ్బిచ్చి మార్కులు కొనుక్కునే మూర్ఖుల సంత నేటి విద్యావ్యాపారం. ఈ కడుపు కక్కుర్తి వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతూ నీఛాతినీచంగా జాతిఛాతి పై గజ్జి కురుపులా, తొడలమధ్య కడ్రాయర్ ఒరుపులా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతా మంటూ సాగిస్తున్నారు చీకటి వ్యాపారం. ఇక్కడ జ్ఞానము అనే మాట వినిపిస్తే వొట్టు, మెమొరీ కోసం పడతారు కుస్తీ పట్టు.

నాయాల్ది , విమానం ఎక్కిస్తే దొంగ పోలీసులముందు నిజం కక్కేసినట్టు , వీపు విమానం మోతెక్కిస్తే ముక్కున పెట్టినదంతా స్టూడెంట్ పరీక్షల్లో కక్కేస్తాడు. చదువు అనే పదానికి అర్ధం తీసేసి, అర్థమే (డబ్బు) పరమార్ధం అని, తమ స్వార్ధం చూసుకోగలిగే కోర్పరేటు విద్యా వ్యాపారులు.

ఆలోచన , తార్కిక శక్తి లేని , దేశచరిత్ర, సంస్కృతి తెలియని మనోవికాశంలేని ఒక వ్యాపకాన్ని వాళ్ళ నెత్తిన పెట్టి రోజంతా రుద్ది రుద్ది , కరుడుగట్టిన భట్టీ పద్దతులలో నెట్టి నెట్టి, చివరాఖరకు కాయితాలు చేతుల్లో పెట్టి వాళ్ళను కాయితం పువ్వులను చేసి తల్లి తండ్రులను వెర్రి పువ్వులను చేస్తున్నంత కాలం మన పిల్లలకి జపాన్లో పిల్లలాగా, క్రియేటివిటీ ,క్రమశిక్షణ , కామన్ సెన్స్ ఎప్పుడు అబ్బుతాయి? దేశానికీ పనికొచ్చే పౌరులని తయారు చేయగలరా ఈ దళారులు?
కరోనా కుచ్ కరోనా .

2 comments:

  1. The present corporate schools has become very dangerous.Every word you say is true sir.As far as I know only two can solve this problem.
    1. Parents
    2. Government.
    If the situation continues like this, education will be worthless. However,can we get out of this situation??

    ReplyDelete