Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, September 3, 2021

Among the World's Best Books

When she had ankle pain doctors advised her rest. She started writing something. She never thought it would be a novel of immense popularity. She never thought of publishing it. 

I am talking about Margaret Michelle's Pulitzer prize winning novel - Gone with the Wind.  Margaret wrote 1047 page novel for 10 years. She never thought of publishing it. 


Victor Hugo planned his novel Les Miserbles in 1830. It took 17 years for him to write 1462 pages novel Les Miserables. It is the epic novel of France.  Scholars and writers said that more than a quarter of the novel—by one count 955 of 1462  pages—is devoted to essays that argue a moral point or display Hugo's encyclopedic knowledge but do not advance the plot, nor even a subplot. 

 

Michael Crichton started writing the 448 page Science fiction novel in 1980. It took 10 yrs  for him to finish his novel Jurassic Park.  In 1990 he published his novel.  ​In 1993 Steven Spielberg adapted the book into the blockbuster film Jurassic Park.



I started writing Bharatavarsha just to spend Corona home stay meaningfully.  I never knew that one day it would be such a big Novel and makes a niche in Telugu Literature. Bharatavarsha is now making ripples. Soon Bharatavarsha will reach its rightful place in world literature and stands tall among world's best books.   Big books or epics take years for completion but Bharatavarsha is written in just 8 months. 


                                                 Prologue of Bharatavarsha

పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని  సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి  తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధ కావ్యం భారతవర్ష.   స్నేహ ధర్మానికి ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడు తుంది ఈ  ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  

ఆద్యంతం ఉత్కంఠతో సాగే పండిత కుటుంబాల కథ. ప్రేమ, శృంగారాలను   పాండిత్యం తో రంగరించి  సాహిత్య సరదాలు అద్దిన ఈ కథ ఆధ్యాత్మిక, వైద్య,   వైమానిక, సాంకేతిక రంగాల్లో అత్యంత కీలక విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష. 

దక్షిణ మూర్తి  పాత్ర  క్రోధము కామము క్షణికావేశములు, ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము అని తెలియజెపితే పాత్ర అట్టి ధర్మమునకు మూలము సంస్కృతి అని, ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజెప్పేపాత్ర,  కథా నాయకుడు భారతవర్ష పాత్ర. మాతృ మూర్తికి మాతృభాషకు బేధము చూపని పాత్ర,  ప్రేమ స్నేహ సౌరభాలను పరిమళించే    భారతవర్ష పాత్ర. 

కాయ కష్టం చేసే నిరుపేద స్థితినుంచి  కోటీశ్వరుని స్థితికి చేరిన సాహితీ కెరటం భారతవర్ష.  కటిక పేద స్థితిలో, కుబేర స్థితిలో తొణకని నిండు హృదయం భారతవర్ష. డబ్బు సంపాదించడం ఒక్కటే గొప్ప కాదు దాన్ని  ఖర్చు పెట్టె మార్గం కూడా ఉన్నతంగా ఉన్నప్పుడే మనిషి ఉన్నతుడవుతాడు. చిత్ర సీమలో వెలిగి, నేలరాలిన కథానాయిక లకుమ ని, అద్భుత సాహస వైమానికురాలు సుందరిని , తన మిత్రుడు ప్రేమించిన పల్లెటూరి పిల్ల పార్వతిని తన సొంత చెల్లెళ్ళవలె భావించుకుని వారి పెళ్ళిళ్ళకి మార్గం సుగమం చేసి,  సొంతచెల్లి మంజూష తో పాటుగా వారికి కట్నకానుకలు  ఇచ్చి ఉప్పొంగే హృదయంతో పెళ్లిళ్లు చేసిన అన్న మనసు భారతవర్ష.  అతడే అతడే వర్షుడు రా విలక్షణ అక్షర యోధుడు రా , సాహిత్య ప్రియధీరుడు రా అని   రడగప్రాస పద్యంలో రచయిత చెప్పిన మాటలు అతడికి సరిగ్గా సరిపోతాయి. 

ధనం పుష్కలంగా ఉండి భోగలాలస తతో అందాల వెంట పడి తల్లిని నిర్లక్ష్యం చేసిన అగస్త్య కు బుద్ధివచ్చేలా చేసి, డబ్బులేక తల్లితండ్రులు ఫోను , బైకు కొనివ్వలేకపోడంతో వారిపేదరికాన్ని నిస్సహాయతను అర్ధం చేసుకోకుండా వారిని దుర్భాషలాడిన బసవడికి మంచి భాషతో స్ఫూర్తి నిచ్చి, అతడిలో కవితా జ్యోతి వెలిగించి సన్మార్గంలో కి నడిపించిన భారతవర్ష  అనాధ మార్దంగికుడు కేశవుడి అక్కున జేర్చుకుంటాడు. మిత్రులని ప్రేమతో సన్మార్గం లో నడిపిస్తే అతడిని ప్రేమించిన నందిని అనే పాత్ర  అతడిని దక్కించుకోవాలని సంస్కృత  కవయిత్రిగా మారుతుంది.   సాహిత్య మార్గంలో కవితా గంధం వెదజల్లుతూ వర్షుడిని అల్లుకుపోవాలని ప్రయత్నిస్తుంటుంది.  అతడి పద్యాలని , గ్రాంధిక భాషని ఇష్టపడిన    మరీదు అనే చోరుడు కూడా సన్మార్గంలో పడతాడు.  ఇలా అనేక  పాత్రలకి  మార్గదర్శకుడయిన  భారతవర్ష   పాత్ర  కథకి  సెంట్రల్ కంబస్టన్ పోయింట్ అని స్పష్టంగా కనిపిస్తుంది.  

ఈ కథలో  భాషా స్థాయి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.  కథా నాయకుడు భారతవర్ష  గొప్ప పండితుడు. అతడి భాషా స్థాయి వేరు.  శార్దూల  మత్తేభ ఛందస్సు పద్యాలు అతడి స్థాయి.  బసవడు కేవలం ఆశుకవితా పండితుడు. ఛందస్సు లేని మనోరంజకమైన ప్రాస పద్యాలు  అతడి స్థాయి.  కేశవుడు  కళా కారుడు.  ఒక మాదిరి పండితుడు. ఆటవెలది తేటగీతి లతో పాటు ఉత్పలమాల చంపకమాల పద్యాలు  అతడి స్థాయి.   నందిని కథా నాయకుడి ప్రేమ పొందడం కోసం సంస్కృతం నేర్చుకుంటుంది.  ఆమె సంస్కృతంలో గాయత్రి మంత్రం నుంచి , భజగోవిందం , జయ దేవుని అష్టపదులను ముమ్మూర్తులా పోలిన సంస్కృత గీతాలను పాడుతుంది. ఈ అన్ని ఛందస్సులలో  రచయిత వ్రాసి తీరాలి రాసాడు. కానీ ఎలా? ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు. ఒక్క సరస్వతికే  తెలుసు.  

మానవ విలువలకు భారతీయ సంస్కృతికి అద్దంపట్టే  భారతవర్ష  శృంగారంతో మనసునుమెలిపెట్టే   మన్మథ శరం. మనోరంజనం పొందిన పాఠకుల మనోఫలకంపై శాశ్వత ముద్ర గానిలిచిపోయే  ప్రబంధ కావ్యం    


1 comment:

  1. Sweeya rachananu cheta battukuni chaduvutunna rachayita mukhamulo aanandam sphastamga kanipistundi.
    Bharatavarsha is never before ever after.

    ReplyDelete