Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, September 10, 2021

అరుణతార - దేవదాసి చారుమతి

 ప్రౌఢ స్త్రీల పాత్రలలో ఘనమైన పాత్రలు అరుణతార, మీనాక్షి.

అరుణతార ఔదార్యానికి  మీనాక్షి ఉదాత్తతకి మారుపేర్లగా నిలిచే పాత్రలు. ఇద్దరు భర్తలకి దూరమైన స్త్రీలు. తంజావూరు  ఉన్నత పండిత  కుటుంబంలో  పుట్టిన ఆగర్భ శ్రీమంతురాలు మీనాక్షి. ఆమె  భర్త దక్షిణామూర్తి యవ్వనస్తురాలి మోజులోపడి మీనాక్షిలాంటి పద్మాన్ని గచ్ఛపిక్కలాంటి గ్రేస్ కోసం వదులుకుంటాడు. మంచి గంధం చెట్టు తనని నరికేస్తున్నా సువాసనని వెదజల్లుతుంది మీనాక్షి కూడా అలాగే విడాకుల తో పాటు తన ఆస్తి కూడా భర్తకి ఇచ్చేస్తుంది.  ఉదాత్తత వల్ల సంక్రమించిన పేదరికంతో  మురికివాడలో  పంకంలో పద్మంలా ఉన్నా  అసమాన సంగీత ప్రతిభతో సూర్యుడిలా సినీ ప్రపంచంలో  ఉదయిస్తుంది. టట్ట.. టాడా వంటి  సంగీతంతో కుర్రకారు నరాలను మీటే జేను స్వరరాణి బిరుదాంకిత, నాద బ్రహ్మ.కోటీశ్వరురాలైనా ధనాన్ని కాక గుణాలని అంటిపెట్టుకుని బ్రతుకుతుంది ఈ మంచి గంధం చెట్టు. అహంకారంతో అరుణతారని వీడిన ఆమె భర్తని సక్రమ మార్గంలో  పెట్టే పద్దతి, అందుకు ఆమె పడిన శ్రమ పాఠకుడి గుండెల్లో నిరంతరం నిలిచిపోతుంది. మీనాక్షి - స్నేహధర్మం, మానవతా ధర్మం, మమకారం  కలసి  ప్రవహించే త్రివేణి సంగమం భారతవర్ష కోవెలలో  మీనాక్షి కాంతులీనే దీపం.



చారుమతి - అరుణతార 

దేవదాసి చారుమతి ఇంటిలో ఆపద ధర్మంగా ఒక రాత్రి  తలదాచుకున్న అరుణతారకు ఆమె కుటుంబంతో  శాశ్వత సంబంధం ఏర్పడుతుంది.  ఆ దేవదాసి ఆ రాత్రే  కన్ను మూయడం  ఒక  కారణం గా కనిపించినా అది బాహ్యం మాత్రమే. అంతర్లీనం గా ఉండే  మరో కారణం అరుణతార ఔదార్యం . 

గొప్ప వితరణ శీలి సంఘ సేవకురాలు అయినా చారుమతి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చితనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా  చనిపోతుంది.  అంత ఉత్తమురాలి  ఇంట చనిపోయే నాటి రాత్రి  అరుణ తార అతిధి.  మీరు దేవుడిని నమ్మితే ఇది విధి అని చెప్పచ్చు.  ఒక నాట్య ప్రదర్శన ఇవ్వడానికి ఆ మారుమూల పల్లెకి  వెళ్లి  ఆమె గుడిసెకి చేరడం దైవికం.   చని పోయే టప్పుడు కూడా  కర్ణుడు తన పన్ను దానం చేసినట్టు, ఇవ్వడానికి ఆమె వద్ద ఏమీ లేకపోయినా, తన గుడిసెలో తలదాచుకునే చోటిచ్చి చనిపోతుంది.  ఆమె ఒక అనాధ బాలుడిని చేరదీస్తుంది. అరుణతార చారుమతి అంత్య క్రియలు నిర్వహించి . ఆ పిల్లవాడు  కేశవుడుని తన కొడుకులా చూసుకుంటుంది. తన కూతురు చదువుకోకపోయినా పేదరాలయిన సుందరిని లక్షలు ఖర్చు చేసి పైలెట్ ని చేస్తుంది .  ఎం పీ గా ఉన్నా  కేంద్రమంత్రిణి  అయినా సీదా సాదాగానే బ్రతుకుతుంది, మధ్యతరగతి వారితోనే తిరుగుతుంది.  

గ్రామీణ శాఖా మంత్రిగా బేంకాక్ సమావేశానికి వెళుతున్నప్పుడు, సహాయమంత్రి, సెక్రటరీ బేంకాక్ చాలా రొమాంటిక్గా  ఉంటుంది  మీరు అక్కడ అన్నీ సందర్శించుటకు  ఏర్పాట్లు చేస్తున్నాము అని చెపుతారు అప్పుడు అరుణతార   There is nothing romantic about underdevelopment and rural poverty అంటుంది ఈ మాటలు   వృత్తి పట్ల ఆమెకు గల అంకితభావాన్ని సూచిస్తాయి. మంత్రిగా , మనిషిగా , అయోగ్యుడైనా భర్త కి (దూరమైన) భార్యగా తనగురించి  కలత చెందకుండా  ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది.  పెడదారిపట్టిన కూతురి తల్లిగా కూతురిగురించి ఆలోచిస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ వయసు అమ్మాయి సుందరి ని కూతురు గా భావించి ధర్మ బుద్ధితో బ్రతుకుతుంది . ధర్మో  రక్షతి రక్షితః అన్నట్టు  ఆమె జీవితం లో వెన్నెల కాస్తుంది. గంగా నది కాశీ పట్టణాన్ని పునీతం చేసినట్టు అరుణతార భారతవర్ష గ్రంధాన్ని పునీతం చేసే పాత్ర.   అందుకే పుస్తకం విప్పగానే మనోఫలకం పై కదలాడుతుంది  భారతవర్ష 

3 comments:

  1. Anatikalamlo inni udattamaina paatralanu srustinchina rachayitaku namo namah. Anitara sadhyamina prayogam Bharatavarsha. Ardham chesukunte jeevita paramardham teliyachese grandham Bharatavarsha

    ReplyDelete
    Replies
    1. The goddess of inspiration must be worshipped through endless saga of poesy

      Delete
  2. It takes more than a human to face and move forward with dignity and self-esteem. Nice presentation

    ReplyDelete