పాండిత్య మనే మడుగులో కవులు కలువలయితే వారి వికసింపజేసే నింగిలో జాబిల్లి కృష్ణ్ణరాజుగారు.
జ్ఞానానికి విజ్ఞానానికి తేడాలున్నట్లే పాడిత్యానికి ప్రతిభ కి తేడా ఉంది. పండితు లంతా ప్రతిభావంతులు కాదు ప్రతిభ అంటే అప్పటికప్పుడు వికసించే బుద్ధి. అలాగే పాండిత్యం వేఱు వివేకం వేఱు , పండితులం దరికీ వివేకముండాలని లేదు చివరిగా మనిషివేఱు మనీషి వేఱు. జీవమున్న ఎవరైనా మనిషే కానీ మనీషము గలవాడే మనీషి మనీష అంటే వివేకము (విజ్డం).
జ్ఞానము, ప్రతిభ, వివేకము కలిగిన చందమామ రాజుగారు. నెల మీద కలువ వికసించాలంటే నింగిలో జాబిలి ఉండాలి. ఆ జాబిలి ప్రకాశంలో మాత్రమే కలువ మిలమిల మెరుస్తుంది. పాడిత్యం వికసించాలంటే కృష్ణంరాజు గారు లాంటి జాబిలి అవసరం. అందుకే అన్నాను పాండిత్య మనే మడుగులో ఉన్న కవులు కలువలయితే వారి వికసింపజేసే నింగిలో జాబిల్లి కృష్ణ్ణరాజుగారు.
నేనెంత శ్రమించినా ఎంత శోధించినా ఆయనలా ఒక శీర్షిక పెట్టలేను. ఇది యదార్ధం బుద్ధి కుశలత లేని నాలో ప్రగడ కవితా ప్రతిభకు ప్రగాఢ సానుభూతి తెలియ జేసు కుంటూ ఆ నీలోత్పల విభునకు ఉత్పలమాలతో ప్రణమిల్లుతున్నాను.
రాతిరి భాతి(ప్రకాశము) నివ్వగ తొగరాజు (చందమామ)ముదంబున కల్వలెల్ల యా కాంతిని పొంది రాజు (తొగరాజు)నటు (అట్లు) కాంచుచు అందముగా హసించిరి. ఆ రీతిన చూచి రాజు (కృష్ణంరాజు) అటులే చిఱునవ్వులు గుప్ప, లేఖకు ల్ ఖ్యాతిని పొంద కేలొసగిరి (ప్రణమిల్లిరి) గారము మించగ గొప్పబుద్దికిన్.
No comments:
Post a Comment